"ఉపయోగిస్తున్నాం , కానీ 'లీక్' వుండడం వల్ల....."
"నిజమే! ఇలా చాలా కంప్లయింట్స్ వస్తున్నాయి........లీక్ ప్రూఫ్ తయారుచేయాలి."
"ఎస్ డాక్టర్! దిసీజ్ హై టైం. లేకపోతె లీక్ పాప్యులేషన్ ఎక్కువయిపోతుంది."
"కమ్ విత్ మీ"
నటాషాను కర్టెన్ వెనుకకు తీసుకెళ్ళిందామె.
రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చారు.
"ఎల్లుండి ఉదయం సుష్మా నర్శింగ్ హోం కి రండి. చార్జ్ తెలుసుగా వన్ దౌజేండ్"
"మేటిరియల్ మంచిది కానందుకు పైన మాకు" నవ్వుతూ అన్నాడు.
"దటీజ్ హౌ దీ వరల్డ్ ఈజ్-"
"ఎస్ దటీజ్ హౌ మేటిరియాల్ ఈజ్-"
ఇద్దరూ హోటల్ కొచ్చేశారు.
"మనల్ని భార్య భర్తకనుకుంటోంది" నవ్వాపుకుంటూ చెప్పింది నటాషా.
:కాదని తెలిస్తే ఫీజ్ ఎక్కువ లాగేస్తుంది. అసలెలా జరిగిందది?"
"నేను చాలా కేర్ పుల్ గానే వుంటాను. అయినా ఒకోసారి డ్రింక్స్ మత్తులో......"
"పాజిబుల్"
"ఎస్!" నటాషా హటాత్తుగా అతని పెదాల మీద ముద్దు పెట్టుకుంది. రాజ్యలక్ష్మి తలుపు తెరచుకుని లోపలకొస్తూ ఇద్దరినీ చూచి "సారీ" అంది.
"నెవర్ మైండ్ అయ్ లైక్ ఆడియన్స్" అన్నాడు అతను. రాజ్యలక్ష్మి నవ్వేసింది.
"మీరూ ప్రాబ్లం తో వచ్చారా?' అడిగాడు.
"నో ప్రాబ్లమ్స్! నేనిక్కడే వుండాలి కొంతకాలం కాంట్రాక్ట్."
"ఏ హోటల్?"
"హరి ఇంటర్నేషనల్"
"ఓసారి మీ షో చూడాలి"
"వెల్ కమ్"
"అన్నిటికీనా?"
ఆమె చిలిపిగా చూసి నవ్వింది.
"నో - ఓన్లీ క్యాబరే షో"
అతను లేచి నిలబడ్డాడు.
"ఎల్లుండి వస్తాను. ఎనిమిది కల్లా రడీగా వుండు" చెప్పాడు నటాషాతో. బయటికి వస్తుంటే రాజ్యలక్ష్మి అతని వెనుకే వచ్చింది.
"నటాషా లేకపోయినా రావచ్చు ఇక్కడికి"
"ఓ! ది డోర్ ఈజ్ ఓపెన్?"
"ఫర్ యూ ఓన్లీ"
* * * *
తులసి కిటికీ దగ్గర కూర్చుని చదువుకుంటోంది.
అమాంతం ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తుకున్నాడతను.
"ఏమిటది?"
"లవ్ విత్ స్త్రెంజస్ . కొత్త పిక్చర్"
ఆమె పెనుగులాదసాగింది.
"తలుపు తెరిచే వుంది. యూ ఇడియట్"
అతను వినిపించుకోవటం లేదు.
"అయ్యో చెబుతుంటే వినిపించుకోవెం?"
మరికొద్ది సేపట్లో ఆమె పెనుగులాట ఆగిపోయింది.
ఇద్దరూ స్వర్గ సుఖాల్లో కేల్తూన్నప్పుడూ కాపలావాడు అడ్డు పడ్డాడు.
"ఓ!" నమ్మలేని నిజాల్లో ఎవరిదో గొంతు.
అతను అయిష్టంగానే కళ్ళు తెరచి చూశాడు.
కాపలావాడు కాదు.
గంగాభవాని!
మొహం ఎర్రగా అయి, కళ్ళు సిగ్గుతో నిండిపోయి వెనక్కు తిరిగి పరిగెడుతూ.
తులసి ఒక్క తోపు తోసి లేచి కూర్చుంది.
"హలో మేడమ్! రండి టూ బై త్రీ చేసుకుందాం ........అదే టీ" తలుపు దగ్గర కెళ్ళి గంగాభవానిని పిలిచాడు.
ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసేసుకుంది.
"యూ ఆర్ రియల్లీ మాడ్" అంది తులసి కోపంగా.
"మాడ్ ఆప్టర్ యూ"
"సెక్స్ మానియాక్"
"బికాజ్ ఆఫ్ యూ"
కొద్ది సేపు నిశ్శబ్దంగా గడిచింది.
"వచ్చే ఫస్ట్ నుంచి నా ఉద్యోగం పోతోంది"
ప్రక్కనే బాంబ్ పడినట్లు అదిరిపడ్డాడు.
"పోతోందా?"
"అవును"
"ఎందుకని?"
"చెప్పాను కదా! మనం సంసారం చేస్తున్నట్లు తెలిసిపోయింది మా బాస్ కి.
"మనం విడివిడిగా పడుకుంటున్న ఫోటో తెచ్చిస్తానని చెప్పక పోయావా?"
"వాళ్ళందరూ కలసి కోర్టులో వేస్తున్నారు. అంతవరకూ యింకో ఉద్యోగం చూసుకోక తప్పదు."
సురేష్ నీరస పడిపోయాడు.
డార్క్ డెవిల్ గది తలుపు తెరిచే వుంది. సురేష్ ని చూడగానే అతని మోహంలో అనందం నాట్యం చేసింది.
"కమాన్! .......కమాన్!........కమాన్ డియర్! లాంగ్ లాంగ్ టైమ్"
డార్క్ డెవిల్ ఎదురుగ్గా టీపాయ్ మీద రెండు విస్కీ బాటిళ్ళు, సోడాలు, చికెను, రొట్టెలు, సిద్దంగా వున్నాయి. రెండు గ్లాసులు తీసుకొచ్చి టీపాయ్ కేడురుగ్గా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
"ఇన్ టైమ్ ఫెలో! యూ ఆర్ ఇన్ టైమ్! కమాన౧ లెటజ్ ఎటాక్! వన్- టూ- త్రీ......."
'ఆగాగు" విస్కీ గ్లాసుల్లోకి వంచకుండా ఆపాడు సురేష్. "ఏమిటిదంతా? చికెన్, రొట్టెలు నువ్ తిండి తింటుండగా చూసి చాలా సంవత్సారాలయింది."
"సెలబ్రేషన్! కమాన్ లెటజ్ సెలబ్రేట్! క్విక్! ముహూర్తం దాటి పోతుంది" రెండు గ్లాసుల్లో సగానికి విస్కీ వంచేశాడు.
"ప్లీజ్! నాకొద్దు"
"షటప్! డార్క్ డెవిల్ గాడు ఎవరికి డ్రింక్ ఆఫర్ చేయదు. ఒకవేళ చేస్తే ఎవడూ వద్దనడానికి వీల్లేదు. కాలేజ్ హాస్టల్లో మందు రేవ్యుజ్ చేసినందుకు విశ్వనాధ రెడ్డిని ఏం చేశాను? స్మాష్! ఒక పన్ను విరిగి పోయింది, గుర్తు లేదూ?"
"ఉంది"
"అయితే నోర్ముసుకుని తాగు' అంటూ ఓ గ్లాస్ బలవంతంగా అతని చేతిలో వుంచాడు.
"కానీ సంగతేమిటో చెప్పలేదు. సెలబ్రేషన్ ఎందుకు?"
డార్క్ డెవిల్ కళ్ళలో అనందం మెరిసిపోయింది.
"ఇవాళ సగం యుద్ధం గెలిచాన్రా! హాఫ్ ది బ్యాటిల్ ఈజ్ వోన్"
'అంటే?"
డార్క్ డెవిల్ సగం గ్లాస్ ఖాళీ చేసి లేచి తూలుకుంటూ వెళ్ళి అల్మారాలోంచి ఆ రోజు న్యూస్ పేపర్ తెచ్చి సురేష్ కిచ్చాడు.
"ఇదిగో! ఈ ఫోటో చూడు"
ఓ ముసలతని ఫోటో అది. సూటూ, టై ఖరీదయిన వేషంలో వున్నాడు. సురేష్ దాని కింద వున్న న్యూస్ ఐటమ్ చదివాడు త్వరత్వరగా.
"కారు ప్రమాదంలో నగర ప్రముఖుని మృతి" అని వుంది హెడ్డింగ్.
"కోటీశ్వరుడు , ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ మార్కేండేయులు నేటి రాత్రి నగరం శివార్ల నుంచి తమ కారులో వస్తుండగా లారీ డీ కొనడం వల్ల అక్కడికక్కడే మరణించాడు. కారు డ్రైవర్ పరిస్థితి ప్రమాదకరముగా వుంది. లారీ తాకిడికి కారు పూర్తిగా ధ్వంసమై పోయింది. లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. శ్రీ మార్కేండయులు గారికి ఒక కొడుకున్నాడు."
సురేష్ కేమీ అర్ధం కాలేదు.
"ఈ ఫోటోలో అతను ఎవరు?"
"మా పెద్దనాన్న"
సురేష్ ఉలిక్కిపడ్డాడు.
"మీ పెద్దన్నాన్న....."
"ఎస్ సేమ్ బాస్టర్డ్! మా ఆస్తి కాజేసి సుఖంగా జీవితం గడుపుదామనుకున్నాడు.
సురేష్ కేదో చటుక్కున గుర్తుకొచ్చింది.
"అంటే....."
"అవును బాంబే గ్యాంగ్ లక్ష రూపాయలు ఇచ్చిన వారం రోజుల్లో వాడిని స్మాష్ చేసేశారు. బాడ్ లక్ ఏమిటంటే వాడి కొడుకు కార్లో లేకపోవటం . అందుకే సగం యుద్ధం గెలిచానన్నాను. ఇప్పుడు ఆ సగం మిగిలి వుంది."
'అతన్ని కూడా చంపేస్తారా?"
"ష్! చంపటం అనేది వాళ్ళ డిక్షనరీలో లేదు. జస్ట్ యాక్సిడెంట్. అంతే! ఇంకో లారీ యాక్సిడెంట్, లేదా కారు లోయలోకి పడిపోవటం, లేదా పొరపాటున ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడటం. అంతే! నెవర్ ఏ మర్డర్. కమాన్ డ్రింక్ ఫర్ ది హెల్త్ ఆఫ్ ఓల్డ్ బాస్టర్డ్" మిగతా గ్లాసు ఖాళీ చేశాడు.
"ఒరేయ్! నువ్వు నిజంగా డెవిల్ వేరా"
డార్క్ డెవిల్ చేతిలోని గ్లాసు విసిరి గోడకేసి కొట్టాడు. అది ముక్కలు ముక్కలై పోయింది. "యస్ మా ప్యామిలిని అన్యాయం చేసిన ఆ డాగ్స్ కి నేను నిజంగా డెవిల్ నే" ఆవేశంగా అరిచాడతను.