Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 20

 

    హనుమంతు మొఖంలో హారర్ కనిపించింది.
    "సార్ - అలాంటి సీరియల్స్ చూపిస్తే రోజా మేడమ్ చెప్పు తీసుక్కోడుతుంది-"
    "చూపించలేదనుకో ! ఆ పని నేను చేస్తా-"
    హనుమంతు నోటమాట రాలేదు -
    వెంటనే భవానీ టేబుల్ మీదున్న ఓ కాగితం తీసి అతని ముందుంచాడు.
    అతని భుజం తట్టి చిరునవ్వు నవ్వాడు.
    "అర్ధమయింది కామ్రేడ్! అలాంటి బూతు సీరియల్స్ తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి నీ అంతరాత్మ వప్పుకోవడం లేదు. అందుకే దీని మీద రాజీనామా రాసి సంతకం పెట్టు -- ఎందుకంటే నువ్ జీతం కోసం రాజీపడే టైప్ కాదనీ నాకు తెలుసు -'
    హనుమంతు పూర్తిగా కంగారు పడ్డాడు.
    "సార్ - నో సర్ - అయ్ మీన్ ఎస్సార్ - చేస్తాను సార్-"
    "అలాగే రెండో సీరియల్ సినిమా బేస్ డ్ అన్నమాట-"
    "కామెడీ సీన్లు ఎలాగూ వేస్తున్నాం కద్సార్?"
    "ఓరేయ్! నాకో మేటర్ చెప్పు! నువ్వు మాంచి వయ్యవనంలో ఉన్నప్పుడు నీ పెళ్ళాం పక్కలో పడుకునే వాడివా -- పెళ్ళాన్నోదిలేసి టీవీలో కామెడీ సీరియల్స్ చూసే వాడివా?"
    హనుమంతుకి నోట మాట రాలేదు-
    "మన యూత్ రాత్రి రెండింటికి వరకూ మేలుకుని టీవీ చూసేది కామెడీ కోసం కాదురా! సెక్స్ కోసం-"
    "అయితే ఇప్పుడెం చేయమంటారు సార్?"
    "సినిమాల్లో సెన్సార్ కట్ చేసినా కూడా , తర్వాత సాంగ్స్ లో బూతు సీన్లు యాడ్ చేస్తారన్న విషయం నీకు తెలుసు కదా! అలాంటి బూతు సాంగ్స్ అన్నీ ఏరి మిడ్ నైట్ చికెన్ బిరియానీ ' అనే పేరుతొ టెలికాస్ట్ చేసేయ్-"
    "మన మీదేవడయినా కేస్ పెడతాడేమో సార్?"
    "అవన్నీ ఆ సినిమాల్లో అందరూ చూసినవే కదురా! ఇంకా కేసేంటి?"
    "ఓకె సార్-"
    అయిష్టంగానే తన రూమ్ కెళ్ళి వెంటనే రోజాకి ఫోన్ చేశాడు.
    "గుడ్ మాణింగ్ మేడమ్! ఈ రాకేష్ గారు మొత్తం మన చానెల్ ప్రిస్టేజ్ ని నాశనం చేసేస్తున్నారు మేడమ్-"
    "ఏమంటున్నాడు?"
    "రాత్రుళ్ళు పది నుంచి పన్నెండు వరకూ పెద్దలకు మాత్రమే టైప్ ప్రోగ్రామ్స్ వేయమంతున్నాడు మేడమ్-"
    రోజా కోపంతో వణికిపోయింది.
    వెంటనే తండ్రికి ఫోన్ కొట్టింది.
    క్లబ్ లో పెకాడుతున్న జైరాజ్ ఫోన్ తీశాడు.
    "ఏం బిడ్డా?"
    "డాడీ! ఆ రాకేష్ ఏం చేస్తున్నాడో చూశావా? రాత్రి పది నుంచి పన్నెండు వరకూ బూతు ప్రోగ్రామ్స్ వేస్తున్నాడంట-'
    జైరాజ్ బుర్ర గోక్కున్నాడు.
    "వేస్తె వేసుకోనీ అమ్మా! చానెల్ అతనికి హండోవర్ చేశాంగా?"
    "అయినా మన పరువు పోతుంది కదా!"
    జైరాజ్ కి టక్కున గుర్తుకొచ్చింది.
    "ఎలా పోతుందమ్మా! ఆ పని అన్ని చానెల్సూ చేస్తున్నాయ్ కదా! అదీగాక మనం చానెల్ ని రాకేష్ కి లీజ్ కిచ్చామని చెప్తాం కదా!"
    రోజాకి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు -
    "కానీ మన చానెల్ వేరు ........."
    "నీతి, పరువూ, మర్యాద, ప్రేక్షకుల బాగోగులు అంటూ నానా తంటాలూ పడ్డావ్ నువ్వు! అవునా? మరి చానెల్ గతేమయింది. అందుకని ఆరు నెలలు మూసుకుందాం! తరవాతేలాగూ మూతపడేదేగా?"
    రోజాకి తండ్రి మీద కూడా కోపం వచ్చి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
    హనుమంతు ఫోన్ పెట్టి పక్కకు తిరిగి చూసేసరికి భవానీశంకర్ కనపడ్డాడు.
    "రోజా ఏమందిరా!"
    హనుమంతు మొఖంలో భయం కనిపించింది.
    "అది కాద్సార్! అది పాలసీ మేటర్ కదా! ఒకసారి మేడమ్ కి చెప్తే మంచిదని ......'  గొణిగాడు.
    "ఒరేయ్ ! మన రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి బూతు ప్రోగ్రామ్స్ విషయంలో మొత్తం మూసుక్కుచుంది కదా! మధ్యలో నీ హడావుడెంట్రా?"
    "సారీ సార్ - పొరబాటయింది. కానీ బూతు ప్రోగ్రామ్స్ కి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ ఒక లేటర్రాశారు సార్-"
    "తిక్క నాయాలా- మనం టెలికాస్ట్ చేయబోయేది బూతుకాదురా! వాటిని ఎవేర్ నెస్ ప్రోగ్రాం అంటాం! ఇంకా గట్టిగా మాట్లాడితే ఎయిడ్స్ ఏవెర్ నెస్ ప్రోగ్రాం అంటాం! ప్రోగ్రాం మధ్యలో నువ్ కనబడి మన దేశంలో ఎంతమంది ఎయిడ్స్ వ్యాధితో చనిపోతుందీ స్టాటిస్టిక్స్ చదువుతుంటావ్! ఈ ప్రోగ్రామ్స్ చూసి పోలీస్ కమీషనరే తప్పట్లు కోడతాడ్రా!"
    హనుమంతు మొఖం కాంతితో వెలిగిపోయింది.
    "ఆఫ్ కోర్స్ -- మీరు ఆ రూట్లో వస్తారని తెలీక అలా మాట్లాడాను సార్!"
    "కదా! ఇంక మూసుకుని నేను చెప్పిన పని చెయ్"
    "కానీ ఇక్కడింకో ప్రాబ్లం ఉంది సార్'-"
    "ఏంటది?"
    "అలా వళ్ళంతా చూపించడానికీ - హీరోతో కిందా మీదా పడి డొల్లడానికీ లేడీ ఆర్టిస్ట్ లు వప్పుకోరు సార్-"
    "టీవీ ఆర్టిస్ట్ లు వప్పుకోకపోతే - ముక్కు మొఖం బాగున్న సెక్స్ వర్కర్స్ ని తీసుకు రారా! వాళ్ళు హాపీగా వప్పుకుంటారు -"
    అతను అయోమయంగా చూస్తూ బయటికెళ్ళి పోయాడు.
    భవానీ కెమెరా ఇన్ చార్జ్ భాస్కర్ దగ్గర కొచ్చేసరికి సెల్ మోగటం మొదలు పెట్టింది -
    "హలో -"
    "సార్! నేను మార్కెటింగ్ ఇన్ చార్జ్ ని మాట్లాడుతున్నా సార్-"
    "యస్ నారాయణ! వాటీజ్ ది మేటర్?"
    "మీరు రేపట్నుంచీ ఇంట్రడ్యూస్ చేయబోతున్న రెండు బూతు ప్రోగ్రామ్స్ కీ నలుగురు స్పాన్సర్స్ దొరికారు. ఇంకో ఇద్దరూ బ్రాండింగ్ చేయడానికి వప్పుకున్నారు సార్ - ఇంత లేట్ అవర్స్ లో ప్రోగ్రామ్స్ కి స్పాన్సరర్స్ దొరకటం ఇదే ఫస్ట్ టైం సర్-"
    "గుడ్! ఏం కంపెనీలవి? నిరోద్ కంపెనీలేనా?"
    "రెండు నిరోద్ కంపెనీలు, నాలుగు వయాగ్రా టైప్ టాబ్ లేట్ కంపెనీలు, రెండు సెక్స్ హోస్పిటల్సూ సార్! అన్నట్లు మన బూతు ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేయడానికి వప్పుకుంది సార్-"   

 Previous Page Next Page