"సర్..."
"ఇన్ని లక్షలమంది ఈ నగరంలో ఉండగా పనికట్టుకుని ఆ వ్యక్తినే ఎందుకు నిర్భంధించాలనుకున్నావు?"
"మరేదో చెప్పబోయాడు రాజారెడ్డి.
"మరోసారి మహేంద్ర పేరు చెప్పకు మిస్టర్ రాజారెడ్డి... ఏ గ్రౌండ్ పై అతడ్ని హింసించావు? ఐ వాంట్ ఆన్సర్."
కంపించిపోతున్నాడు.
"కమాన్." ఓ పేపరు అందించాడు శమంత్ "నా ప్రశ్నకు నువ్వెలాగూ జవాబు చెప్పలేవు కాబట్టి రాజ్యంశవం కనిపించిందని మహేంద్ర నీకు ఫోన్ చేయడం మొదలుకొని నువ్వు పాటించిన థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ దాకా మొత్తం ఓ స్టేట్ మెంట్ రాసివ్వు. క్విక్!"
శమంత్ మొండితనం తెలిసిన రాజారెడ్డి తప్పించుకోలేకపోయాడు. అసలు ఏ విషయం సాధించాలని శమంత్ ఆ స్టేట్ మెంట్ అడుగుతున్నదీ అతడి వూహకందడం లేదు. అయినా రాసాడు.
ఒక్కటే. మహేంద్ర అండ ఉండగా తనను శమంత్ ఏమీ చెయ్యలేడన్న బలమైన నమ్మకం.
ఆ కాగితాన్ని స్టేషన్ లోని ఫైల్లో భద్రపరచలేదు శమంత్.
మడిచి జేబులో వుంచుకున్నాడు.
"అయిదు నిమిషాలపాటు నువ్విక్కడ కూర్చో" హెచ్చరికలా అని పక్కగదిలోకి వెళ్ళిన శమంత్ సరిగ్గా ఆరు నిమిషాల్లో తిరిగి రాజారెడ్డి వున్న గదిలోకి వచ్చాడు.
"టేక్ దిస్."
శమంత్ స్వదస్తూరీతో వున్న కాగితం అందించాడు. "ఇది అందుకుని డూప్లికేట్ పై సంతకం చేసివ్వు."
"ఇది... ..." బెదురుగొడ్డులా చూస్తున్నాడు రాజారెడ్డి.
"నన్ను... మీరు..."
"సస్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే, నీ వ్యక్తిగతమైన లాభంకోసం సరయిన కారణం లేకుండా ఓ పౌరుడ్ని హింసించావు కాబట్టి. నాకు సరయిన సంజాయిషీ యివ్వలేకపోయావు కాబట్టి. టేకిట్... తొందరచేసి మరీ సంతకం పెట్టించుకున్నాడు.
"యూ ఆర్ సస్పెండెడ్ పెండింగ్ ఎంక్వయిరీ... గో... గెట్ లాస్ట్" ఉక్రోషంగా రెండడుగులు ముందుకేసిన శమంత్ విష్పరింగ్ లా అన్నాడు "వెళ్ళు. నీ గ్రాండ్ ఫాదర్ మహేంద్రకి చెప్పు. వాడి ఫాదర్ ఎంత గొప్పవాడయినా కానీ వాడ్నిక ఏ దేవుడూ రక్షించలేడని నా మాటగా చెప్పు. యూగాడ్ డామ్ డ్ సన్న ఫెబిచ్...వెళ్ళి వాడింటిలో బొచ్చుకుక్కలా అక్కడే పడివుండు."
శమంత్ వేగంగా బయటికి నడిచాడు.
* * *
"అంతమాటన్నాడా..." గెస్టుహవుస్ లో కూర్చొని లిక్కర్ సిప్ చేస్తున్న మహేంద్ర రాజారెడ్డిని చూస్తూ సాలోచనగా అన్నాడు "ఏం చూసుకొని వాడికంత పొగరు?"
"ఏముందిసర్... ఆ ఐపియస్ ఒకటుందిగా. మహా అయితే ట్రాన్స్ ఫర్ చేయించగలడు తప్ప ఆ మహేంద్రగాని వాడి బాబుగాని నన్నేం చేయలేరు అంటాడు" రాజారెడ్డి రెచ్చగొడుతున్నట్టుగా అన్నాడు. "రాజ్యంచావుకి మీరే కారణమని నిరూపిస్తానని చాలెంజ్ చేశాడు."
"వాడు బ్రతికివుంటే అంతపని ఎలాగూ చేస్తాడు రాజారెడ్డి."
"బ్రహ్మాండమైన అవకాశం చేజార్చుకున్నారుగా."
"అంతకంటే పటిష్టమైన మరో పథకం చేస్తాను రాజారెడ్డి... నీలాంటి శమంత్ సబార్డినేట్స్ తో బాటు శమంత్ పైఅధికారులు సైతం నా మనుష్యులుగా వున్నంతకాలం నేనిలా అవకాశం తీసుకొంటూనే ఉంటాను."
ఉత్సాహంగా పచార్లు చేస్తున్నాడు మహేంద్ర.
"కాని ఈలోగా మిమ్మల్ని లోపలికి నెట్టేస్తాడు."
"రాజారెడ్డీ" అరిచాడు మహేంద్ర.
"విషయం చెబుతున్నాను." వినయంగా తన భక్తిని ప్రకటించాడు రాజారెడ్డి. "సామాన్యంగా ఒక స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ని డబ్బుతోగాని, పలుకుబడితోగాని లొంగదీసుకోలేనప్పుడు అతడికి మరేమన్నా బలహీనతలుంటే ట్రాప్ చేద్దామనుకుంటారు ప్రత్యర్థులు. కాని శమంత్ ని ఇవేమీ చేయలేవు. అయితే ఒక్క విషయంలో మాత్రం శమంత్ లాంటి అధికార్లు చాలా మెత్తబడుతుంటారు. అదేమిటి అని మీరడక్కముందే చెప్పడం నా రికార్డుకి మంచిదనుకుంటాను. శమంత్ కి ఒక్కగానొక్క కూతురు. ఆరేళ్ళపాప... అదీ గాకుండా శమంత్ కిక పిల్లరు పుట్టారు. ఆ మధ్య తెలిసింది..."
మృదువుగా నవ్వాడు మహేంద్ర "పాప వయసు ఆరేళ్ళేనా."
"అవునుసర్. పాపం చాలా చిన్నపిల్ల."
"అందుకే గొప్ప అవకాశం పోగొట్టుకుంది" కానిబాల్లా అన్నాడు.
పెదవుల్ని నాలుకతో తడుపుకుంటూ "లేకపోతే బ్లూఫిలింలో ఈపాటికే నటించేసేది."
"చిన్నపిల్లలతో ప్రయోగంచేస్తే ఎలా వుంటుందో తమరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది."
హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
"ముగ్గురు ఆడపిల్లల తండ్రివైనా నువ్వింత రాక్షసంగా ఆలోచించ గలుగుతున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను రాజారెడ్డీ... అవునూ..." ఆలోచిస్తున్నట్టుగా చూసాడు "శమంత్ పూర్వం తీవ్రవాదుల్ని టేకిల్ చేసే పోలీస్ వింగ్ లో వుండేవాడు కదూ."
"అవును సర్. ఆర్నెల్లున్నాడు."
"అలాని... అంటే చాలామందికి అతడు శత్రువేనన్న మాట..."
"మొండిఘటం... శత్రువు కాకుండా యెలా వుంటాడు" రాజారెడ్డి ఉత్సుకతగా అడిగాడు. అదేమిటిసర్ ఆ పసిపిల్లని పాడుచేసి చంపింది తీవ్రవాదులని నిరూపించేస్తారా."
జవాబు చెప్పలేదు మహేంద్ర.
ఏదన్నా కాని చాలా త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలి. శమంత్ లాంటి తీవ్రమైన వ్యక్తిత్వం గల మనిషి ఏ క్షణంలో అయినా తనకు ముప్పుతీసుకొస్తాడు.