రెండు ఫ్రిన్స్__5
మూడు గ్వాలియర్__6
నాలుగు రాబిన్ సన్ క్రూసో__7
ఐదు స్నైల్__3
ఆరు లెండర్డ్సు__4
ఏడు కింగ్స్ గార్డు__1
ఈ వరుసక్రమంలో దూసుకుపోతున్నాయి. నెంబర్ వన్ వేసున్న కింగ్స్ గార్డు ఆఖరున ఉంది.
సాడిల్స్ (జాకీలు కూర్చుండే జీను) మీద గేలరీల సైడ్ వేసున్న గుర్రాల నెంబర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అన్నిటికంటే ఆఖరుగా పరుగెత్తే తను ఎంచుకున్న కింగ్స్ గార్డుని చూసి నిరుత్సాహపడ్డాడు ఆనందరావు.
అదే ఫీలింగ్ లో ఉన్నారు శశాంక, పక్కనున్న యువతి.
కాని శుక్రాచార్యకు భరత్ పథకం తెలిసిపోయింది. పొడవాటి గడ్డాన్ని నిమురుకుంటూ తాపీగా కూర్చున్నాడు. అంత తాపీగా ఎలా కూర్చోగలిగాడని అక్కడున్న ఏ ఒక్క పంటర్ కి ఆలోచించి, ఆశ్చర్యపడే టైమ్ లేదు.
ముందు పరుగెత్తుతున్న రెండో నెంబర్ గుర్రం వెనకబడింది. నాలుగు ముందుకొచ్చింది.
నాలుగో నెంబర్ మీద కాసిన పంటర్స్ కేకలు మార్మోగిపోయాయి.
చూస్తుండగానే నాలుగు దాటి ఆరు ముందుకొచ్చింది.
అంతలోనే ఐదు
మరో క్షణంలోనే రెండు....
ఇలా క్షణాల్లో స్థానాలు మారిపోతున్నాయి.
పంటర్స్ లో అయోమయం_జుట్టు పీక్కున్నంత పనిచేస్తున్నారు.
కొందరయితే అప్పటికే ఏడుపు మొఖాలు పెట్టేసారు.
మూడో నెంబర్ 1000 మీటర్స్ స్టాండ్ ని ముందుగా దాటింది.
అప్పుడు తలకొద్దిగా ఎత్తాడు అందరికన్నా వెనుక ఉన్న భరత్. కాళ్ళను బాగా మడిచాడు__బాగా పైకి తెచ్చాడు__ గుర్రం మీద వంగాడు, తలవంచి కాళ్ళుమాత్రం బాగా పైకి లేపాడు....కింగ్స్ గార్డ్ కి ఎయిడ్ అందించాడు.
(ఎయిడ్ గుర్రానికి జాకీ అందించే ప్రశంశంగాని, అభిశంశగాని) అది గమనించాడు శుక్రాచార్య.
బైనాక్యులర్ లో దాన్ని శశాంక కూడా గమనించాడు. పక్కనున్న యువతి భరత్ వేపు ప్రశంశా పూర్వకంగా చూసింది.
అప్పటివరకూ నెమ్మదిగా గుర్రానికి అలుపురాకుండా పరిగెత్తించిన భరత్ అప్పుడు కింగ్స్ గార్డుని తెలివిగా హిప్ చేసాడు.
అంతే....అప్పటివరకూ నెమ్మదిగా పరిగెత్తిన కింగ్స్ గార్డు తన జాకీ నుంచి సంజ్ఞను అందుకున్న మరుక్షణం మెరుపువేగం అందుకుంది.
క్షణాలు....క్షణాలు....గడుస్తున్నకొద్ది కింగ్స్ గార్డు ఒక్కొక్క గుర్రాన్ని దాటిపోతోంది.
అందరూ అయోమయంగా చూస్తున్నారు. అప్పటి వరకూ బిగినింగ్ నుంచి మెరుపువేగంతో పరిగెత్తిన మిగతా ఆరు గుర్రాలు 1200 మీటర్స్ దగ్గరకు వచ్చేసరికి అలసి పోయాయి. కొత్తగా మరికొంత వేగాన్ని పుంజుకోలేక పోతున్నాయి.
చూస్తూండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకెండ్ లో కింగ్స్ గార్డు నిన్ పోస్టుని దాటింది.
అంతటా కోలాహలం.
శుక్రాచార్య గర్వంగా మీసాలు నిమురుకున్నాడు.
శశాంక ఎమోషనల్ గా "ఫెంటాస్టిక్ జాకీ...." అన్నాడు. ఆ యువతి భరత్ ని మనస్సులోనే అభినందించింది.
ఆనందరావుకి, కింగ్స్ గార్డుమీద కాసిన మిగతా పంటర్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది.
కొందరు ఏడుస్తూ....
ఇంకొందరు మూగగా రోధిస్తూ....
మరికొందరు తమ సెలెక్షన్ ని తామే తిట్టుకుంటూ....గేలరీలు గందరగోళంగా తయారయ్యాయి.
మొదటి పరుగు పూర్తిచేసిన గుర్రాలు అటు నుంచి క్లబ్ లోకి వెళ్ళిపోయాయి.
అందరూ అప్పుడు ఊపిర్లు పీల్చుకున్నారు, మరో 45 నిముషాలకిగాని రెండో రేస్ మొదలుకాదు.
భరత్ కింగ్ గార్డ్ కి తన ప్రశంసలు అందించి దిగాడు.
అప్పటికి భరత్ ఎక్కాల్సిన మూడవ రేస్ గుర్రం సిద్ధంగా ఉంది.
శశాంక ఈ రేసుల్లో దాదాపు తొమ్మిది గుర్రాల్ని దించాడు.
శశాంక గేలరీలోంచి ఓనర్ స్టాండ్ వద్దకు వచ్చాడు శశాంక. అక్కడికి వస్తాడని తెల్సిన భరత్ ఆ టైమ్ కి అక్కడికి చేరుకున్నాడు.
భరత్ ముందుగా శశాంక వేపు చూడలేదు. ప్రక్కనున్న యువతి వేపు చూసాడు. ఆమే అశ్వని.
అశ్వని శశాంకను చూడకుండా భరత్ ని కళ్ళతోనే ప్రశ్నించింది.
ఆమె కళ్ళలోని మెరుపు.... పెదాల విరుపు.... కనుబొమ్మల సంజ్ఞను అర్ధంచేసుకున్న భరత్ ఆనందపడ్డాడు.
సరీగ్గా ఇదే సమయంలో రెండో రేసుకి సిద్ధమవుతున్న యజ్ఞభూపతి హార్స్ విక్టోరియా వేయింగ్ మెపిన్ మీదుంది.
అప్పుడు సెక్రటరీ రూమ్ లో వున్న యజ్ఞభూపతికి శశాంక గుర్రం ఫస్టు వచ్చినట్లు తెలిసింది.
తన ఫీలింగ్ ఏమీ బయటపడకుండా పెదవి విరిచాడు సింపుల్ గా.
రెండో రేసు మరికొద్ది నిముషాల్లో ప్రారంభంకానుంది. ఓనర్స్ స్టాండ్ దగ్గర యజ్ఞభూపతి తన ట్రైనర్ తో మాట్లాడుతున్నాడు. రేస్ క్లబ్ హాస్పిటల్ ముందు నిలబడున్న శశాంక బుక్ మేకర్ నిరంజన్ తో మంతనాలు జరుపుతున్నాడు.
"ఎంతదాకా కాసారు....?" శశాంక ఓరగా చుట్టుపక్కలకి చూస్తూ అడిగాడు.
"దాదాపు 50 లక్షలు....ఒక్క భూపతే 40 దాకా కాశారు."
"వెరీగుడ్....దిల్ జిత్ ఆరోరాతో మాట్లాడావా?"
"ఆ....వాళ్ళ ట్రైనర్స్ జాకీలతో కూడా...."
"సరే....పద__" అంటూ గేలరీవేపు నడిచాడు శశాంక.
సరీగ్గా 2.44 అయింది.
రెండో రేసు మొగలుకావటానికి మరొక్క నిమిషమే వుంది. యజ్ఞభూపతి ఓరగా మిగతా ఓనర్స్ వేపు చూస్తూనే శశాంక మీద ఓక్షణం దృష్టిని నిలిపాడు.
శశాంక హైదరాబాద్ వింటర్ రేసెస్ గురించి ప్రాస్ సెక్టస్ బుక్ చూసాడు_రెండో రేస్ వివరాలు చదివాడు....
చిత్తూరు ప్లేట్
రూ17,000__విన్నర్.
రూ 6,800__సెకెండ్
రూ 3,400__థర్డ్
రూ 1,700__ఫోర్త్
ఏ హేండికేస్ ఫర్ హార్సెస్ ఇన్ క్లాస్ టూ
డిస్టెన్స్__1200 మీటర్లు.
పంటర్స్ చాలామంది హుషారుగా వున్నారు. దానిక్కారణం క్లబ్ నిర్ణయించిన జాక్ పాట్ రేసెస్ 1,3,4,5,7 ఫస్టు రేస్ లో చాలామంది కింగ్స్ గార్డు మీద కాసారు. అనుకున్నట్టుగానే అది గెలిచింది.
ఇక 3,4,5,7 రేసుల్లో ఫస్టు వస్తేచాలు. రెండో రేసుపట్ల జాక్ పాట్ కాసిన పంటర్స్ కి పెద్ద ఇంట్రస్టులేకపోయినా చూస్తున్నారు.
ట్రిపుల్ రేస్ కాసిన పంటర్స్ మాత్రం ఆందోళనగా వున్నారు.
ట్రిపుల్ రేసెస్....1,2,4
రెండో రేసులో పాల్గొనే ఆరు గుర్రాలు, జాకీలతో సిద్ధంగా వున్నాయి.
5 సవంత్సరాల వయస్సు గుర్రాలు
1, భరణి (జార్జ్) రామన్ 2_50_0కి గ్రా
2, స్టార్ (ఫిలిప్స్) జగజిత్ 3_56_0కి గ్రా
3, బిగ్ బెన్ (కపిల్)లకన్ 5_56_0కి గ్రా
4, నూడో (వుడ్ వర్డ్) బి సింగ్ 4_56_0కి గ్రా
5, సన్ రెయిజ్ (ఆనంద్) శంకర్ 3_54_0కి గ్రా
బ్రాకెట్స్ లో వున్నవారు ట్రైనర్స్, పక్కనున్నవారు జాకీలు, చివరలో ఇచ్చినవి ఆయా గుర్రాలు మోయాల్సిన బరువు. ఈ బరువులో జాకీల బరువు కలిసి ఉంటుందని ఏ గుర్రం ఎంత బరువు మోస్తూ పరిగెత్తాలన్నది క్లబ్ నియమించిన హేండీకాప్ నిర్ణయిస్తాడు. ఉదాహరణకి భరణి అనే రెండో నెంబర్ గుర్రం 53కి.గ్రా మోయాలని నిర్ణయించినప్పుడు ముందు జాకీ బరువు చూస్తారు. దాని జాకీ రామన్ బరువు 40 కి.గ్రా అనుకుంటే మిగతా 10 కి.గ్రా బరువును ఆ గుర్రం జీనులో పెడతారు. టోటల్ గా అప్పుడు 53 కి.గ్రా అవుతుంది)
3వ నెంబర్ గుర్రం సన్ రెయిజ్ యజ్ఞభూపతిది. దానికి ట్రైనింగ్ ఇచ్చిన ఆనంద్ ఇండియాలో మంచి ట్రైనర్ గా పేరుపొందాడు. అతను గుర్రాల్ని తీసుకొని ఏదైనా రేస్ కి బయలుదేరితే చాలా ఎక్కువ సంఖ్యలో కప్పులు కొట్టుకోస్తాడని ప్రతీతి.
అలాగే దాని జాకీ శంకర్ కూడా. ఇండియాలో వున్న జాకీలలో శంకర్ కి మంచి పేరుంది.
యజ్ఞభూపతికి వీళ్ళిద్దరిమీద గొప్ప నమ్మకం.
సరీగ్గా 2_45 అయింది. గేట్లు తెరుచుకున్నాయి__
రేస్ స్టార్టు అయింది.
మామూలే....పంటర్స్ కేకలతో ,అరుపులతో గేలరీ ప్రతిధ్వనించి పోతున్నాయి.
రెండో నెంబర్, నాల్గవ నెంబర్, నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి....యజ్ఞభూపతి టెన్షన్ తో చూస్తున్నాడు. ఈ రెండో రేస్ లో తన గుర్రం సన్ రెయిజ్ గెలిస్తే వచ్చేది 17000 ప్లస్ చిత్తూరు ప్లేటు.
ట్రోపీరీత్యా, స్టేక్ రీత్యా చూసుకున్నా ఆ రెండు గొప్పేంకాదు కాని నలుగురూ భూపతి హార్స్ ఫాస్ట్ రాలేదంటే బాధపడతాడు.
1300 మీటర్లు వరకు మధ్యాస్తంగా పరిగెత్తిన సన్ రెయిజ్ హఠాత్తుగా గేలవ్ అందుకుంది చూస్తుండగానే విన్ పోస్ట్ దాటేసింది.
భూపతి రిలాక్స్ అయ్యాడు. పంటర్స్ లో కూడా చాలామంది సన్ రెయిజ్ గెలుస్తుందనే ఎక్సెప్ట్ చేయటం.... అది గెలవటం.... తను సెలెక్షన్ గొప్పదని, తాము ఇంటలిజెంట్ పంటర్స్ మని నమ్మకం పెంచుకోవటం జరిగింది.
3.25 మరలా మూడో రేసు మొదలవటానికి సిద్ధంగా ఉంది.