Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 19

 

    "ఏమిటది?"
    "అదే! మీరు స్వర్గ సుఖాల్లో తేలిపోయే రోజు అతి త్వరలో వచ్చేస్తుందనీ , మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పే వ్యక్తికీ ఎలాంటి అభ్యంతరమూ చెప్పోద్దనీ.'
    "దానికి, దీనికి ఏమిటి సంబంధం?" అడిగిందామె. అతను గొంతు తగ్గించి రహస్యంగా మాట్లాడాడు. "ఇదే ఆ సమయం. అంచేత అడ్డు చెప్పకండి. అద్భుతమైన మలుపు తిప్పుతాను. స్టీరింగ్ కంట్రోల్ బాగా చేయగలను" ఆమెను కౌగిట్లోకి తీసుకోబోయాడు.
    అతని ఊపిరి వేడిగా తగులుతోంది.
    గంగాభవానీ శరీరమంతా ఆవిర్లు కమ్ముతోంది. అంతలోనే తెలివి తెచ్చుకుని ఒక్క తోపు తోసింది.
    "వెళ్తారా లేదా?" కోపం నటిస్తూ అడిగింది.
    "ఒక షరతు మీద....."
    "ఏమిటది?"
    "అర్జంటుగా యాభయ్ రూపాయలు అప్పు కావాలి."
    "అడాళ్ళను అప్పు అడగడానికి సిగ్గుండాలి.'
    "రెండో దానికి మీరు వప్పుకోవటం లేదు కదా....."
    ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు.
    "మళ్ళీ ఎప్పుడిస్తారు?"
    "ఉద్యోగం రాగానే....."
    "మీ కేప్పటికి ఉద్యోగం రాకపోతే?"
    "శారీర శ్రమ చేసి మీ ఋణం తీర్చేసుకుంటాను......"
    ఆమె కళ్ళు డేగ కళ్ళయిపోయినాయ్.
    "అదేం కుదరదు. వచ్చే ఫస్ట్ కల్లా నా డబ్బు నాకిచ్చేయాలి. అలాగైతేనే యిస్తాను."
    "ఇస్తాను కానీ ఓ రిక్వెస్ట్....."
    "ఏమిటి?"
    "తులసి కి ఈ విషయం చెప్పకండి......."
    "మీరివ్వకపోతే చెప్తాను.'
    ఆమె లోపలికి వెళ్ళి తీసుకొచ్చి అతని కందించింది.
    సరిగ్గా అదే సమయంలో కమల లోపలకు రాబోయి వారిద్దరినీ చూచి చటుక్కున వెనక్కు తిరిగింది.
    "పర్లేదులెండి. ఈసారి మీ వంతు" అన్నాడతను.
    కమల అడుగులు తడబడినయ్ గానీ ఆగలేదు.
    గంగాభవాని నవ్వూ, కోపం రెండూ వచ్చినయ్.
    "మీ మాటల వాళ్ళ పచ్చని సంసారాలు కూడా కూలిపోతాయ్." అంది నిష్టూరంగా.
    "అది భార్య భర్తలు మొదట్లోనే పునాది సరిగ్గా వేయటం మీద ఆధారపడి వుంటుంది. నా మాటల మీద కాదు, మా మోహన్ జీ ఎంత స్ట్రాంగ్ పునాది వేశాడో చెపితే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళావిడ ఇప్పటికి హాస్పిటల్లోనే వుంది.'
    "ఇంక మీరు వెళితే నేను వంట పని చూసుకుంటాను" అసహనంగా అందామె.
    సురేష్ బయటికొచ్చాడు. టైం పన్నెండు దాటింది. బస్ స్టాప్ కొచ్చి డబల్ బెకర్ ఎక్కాడు.
    
                                                *    *    *    *

    తలుపు తెరచి అతనిని చూసి శోభాదేవి ఆశ్చర్యపోయింది.
    "మీరా! రండి."
    లోపలకు నడిచి కుర్చున్నాడతను.
    జేబులో నుంచి యాభయ్ నోట్ తీసి అమెకిచ్చాడు.
    "మీరు అదృష్టవంతులు. అందుకే అప్పు పుట్టింది నాకు.'
    ఆమె వెళ్ళి కిటికీ తలుపులు, గది తలుపులు మూసివేసింది.
    'లోపల గదిలోకి వెళదాం రండి"
    సురేష్ ఆమె వెనుకే గదిలోకి నడిచాడు. ఒకే మంచం, ఒకే టేబులు.
    ఆమె అతనికి సమీపంగా వచ్చేసింది.
    'ఇంకా అలోచిస్తారేం?"
    సురేష్ ఆమెను వెనక్కు నెట్టి బయటి గదిలో కొచ్చేశాడు.
    'అదేమిటి వెళ్ళిపోతారెం?"
    "నేను వచ్చింది అందుక్కాదు. నీకు డబ్బు యివ్వటానికి."
    ఆమె నిశ్చేష్టురాలయింది.
    "డబ్బు ఊరికే యిస్తారా?"
    "అందరూ అందరికీ ఇవ్వకపోవచ్చు. ఒక్కొక్కరూ ఒక్కొక్కరికీ యిస్తారు.'
    కొద్ది సేపు ఆమె అతని వంకే చూస్తుండిపోయింది నిశ్శబ్దంగా.
    "నాకిదంతా జరిగిందని నమ్మబుద్ది కావటం లేదు."
    "ఏమిటి మీ పరిస్థితి?" ఎందుకిలా అయింది?"
    'అయన తాగుబోతు - నా కారెక్టర్ మీద అనుమానం.'
    సురేష్ కి నవ్వు వచ్చింది.
    "చెంప దెబ్బలు కొడ్తూ తిరిగే అమ్మాయి మీద అనుమానామా!"
    "చివరకు నేనే ఆయనను వదిలేశాను.'
    "కానీ ఇలా ఎన్నాళ్ళూ గడపటం?"
    "మరో ఆరు నెలలు - టైలరింగ్ చేస్తున్నాను. అడయిపోగానే ఇంక నాకు సమస్య వుండదు."
    సురేష్ బయటి కొచ్చేశాడు.
    ఆమె వెనుకే వచ్చింది -
    "మళ్ళీ రారూ?"
    "ఊహూ నేను వచ్చినా ఉపయోగం ఏమీ లేదు.'
    తిన్నగా డార్క్ డెవిల్ రూమ్ కి చేరుకున్నాడు.
    "కమాన్ - కమాన్ - నీ కోసమే చూస్తున్నాను."
    "ఏమిటి సంగతి?"
    "నటాషా అర్జంటుగా హోటల్ రూమ్ కి రమ్మంది."
    "నటాషా ఎప్పుడొచ్చింది?"
    "రాత్రే - అర్జంట్ పని వుందట నీతో"
    "ఓ.కే!"
    "ఓ.కే ! అని నుంచోకు - వెంటనే వెళ్ళు. లేకపోతె మళ్ళీ నా రూమ్ కొస్తుంది.
    సురేష్ హోటల్ చేరుకున్నాడు.
    696 రూమ్ డోర్ బెల్ మోగించాడు.
    నటాషా తలుపు కొంచెం తెరచి చూసింది.
    "మైగాడ్ వచ్చావా! పొద్దుట్నుంఛి చూస్తున్నాను నీ కోసం."
    "దానికేనా?" అనుమానంగా అడిగాడు.
    అతని చెంప మీద నెమ్మదిగా కొట్టిందామే.
    "ఛీ నీకెప్పుడూ - ఓ సమస్య వచ్చింది.'
    "ఏమిటది?"
    "అర్జంటుగా మనం ఓ డాక్టర్ దగ్గర కెళ్ళాలి. లేడీ డాక్టర్"
    "అంటే?"
    "ఎస్! తీయించాలి."
    "కానీ ఎలా జరిగిందది?" ఆశ్చర్యపోతూ అడిగాడు.
    'అందరిలాగానే పొరపాటు. ఇప్పుడలాగే వదిలేస్తే ఆ పొరపాటు నెవరు పెంచుకుంటారు? అంచేత"
    సురేష్ సోఫాలో కూర్చున్నాడు.
    అతనికి అతి సమీపంగా కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుందామే.
    "నీకు తెలిసన లేడీ డాక్టర్స్ ఎవరయినా వున్నారా?"
    "లేరు! కానీ తెలియాల్సిన అవసరమేముంది? బిజినెస్ ఈజ్ బిజినెస్"
    'అయితే త్వరగా పద. ఐ కాంట్ ఎఫర్డ్ ఇట్"
    "ఓ.కే! పద"
    ఇద్దరూ ఆటోలో బయల్దేరారు.
    సురేష్ చకచకా ఆలోచించసాగాడు.
    డాక్టర్ కుమారి తనకు తెలుసు. తెలుసంటే తెలీదు కానీ ఓసారి తులసితో వెళ్ళాడు . ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె కన్ ఫర్మేషన్ కి టాబ్ లేట్ ఇచ్చాక సమస్య సాల్వ్ అయిపొయింది.
    అంతే అంతవరకే తెలుసు.
    బహుశా ఇప్పుడు మళ్ళీ వెళితే తనను గుర్తించలేదేమో!
    అటో డాక్టర్ డిస్పెంసరీ ముందాగింది.
    అరగంట తర్వాత తమ టర్న్ వచ్చింది.
    ఇద్దరూ లోపలికి నడిచారు.
    "గుడ్ మార్నింగ్ డాక్టర్!"
    "గుడ్ మార్నింగ్ - కూర్చోండి"
    "నన్ను గుర్తుపట్టారా? అదివరకో సారి వచ్చాను."
    "ఎస్! ఐ డోంట్ ఫర్ గెట్ పీపుల్"
    "టేరిఫిక్ రిమంబరేన్స్ పవర్"
    "డాక్టర్స్ కి అది అవసరం. ఏమిటి ప్రాబ్లం?"
    'అదే నేచర్స్ గిఫ్టు. ఈమెతో మాట్లాడండి. "నవ్వుతూ అన్నాడు.
    'దాటి ఎన్ని రోజులయింది?"
    "మూడు వారాలు"
    "ఓ! మరిన్ని రోజులు?"
    "కన్ ఫర్మేషన్ కోసం టాబ్ లెట్స్ వేసుకున్నాను. కన్ ఫర్మేషన్ అయింది."
    "కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా?"
    "వద్దని"
    "మీకిది మొదటి పాప కదూ?" అడిగింది డాక్టర్ సురేష్ ని.
    "ఆ - ఎస్ ....ఎస్ మొదటిది"
    "మరెందుకు వద్దనుకుంటున్నారు?"
    "ఎందుకంటె ......అదే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని"
    "ఎంత కాలమయింది మారేజ్ అయి?"
    "జస్ట్ వన్ ఇయర్"
    "ఓ కానీ ఇలా మాట్లాడితే డాక్టర్స్ దగ్గరకు రాకుండా వేరే పద్దతులున్నాయ్. ఉపయోగించండి"

 Previous Page Next Page