జైరాజ్ ఫజిలయ్యాడు.
"ఈ మాత్రానికి అతని పేరున మార్చటం దేనికంమా?"
"ఎందుకంటే బాంక్ వాళ్ళు మూడు నెలలయాక అతనిని పట్టుకుంటారు లోన్ తీర్చమని - మన జోలికి రారిక-"
"ఓహూ! అట్నుంచి నరుక్కోచ్చావా? చాలెంజ్ లో ఫెయిలయితే నన్ను జైలుకి పంపాలని రోజా ప్లాన్! ఒకే ! రోజా! ఎగ్రీద్- రేపట్నుంచీ మూడు నెలలు!" అన్నాడు భవానీ.
"యా! ఓన్లీ త్రీ మంత్స్-" అంది రోజా -
ఆ రాత్రి భవానీశంకర్ కి నిద్రపట్టలేదు. నిజంగా తన మూడు నెలల్లో బృందావనాన్ని నెంబర్ వన్ చానెల్ చేయగలడా? తనకా కెపాసిటీ ఉంది గానీ మూడు నెలల టైమ్ సరిపోతుందా? డౌటే! అయినా ఇప్పుడింక వెనక్కు తిరిగే ప్రసక్తే లేదు. లైఫ్ లో ఇంతవరకూ ఎలాంటి భయంకరమయిన పరిస్థితిలో ఉన్నా మడమ తిప్పలేదు.
అప్పుడే ఫోన్ మోగింది.
"హలో బ్రదర్ " రాకేష్ గొంతు.
"హాయ్- థింక్ ఆఫ్ ది డెవిల్ . ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా-"
"ఎందుకు ? ఆ శాడిస్ట్ - హింస పెడుతోందా?"
"శాడిస్టా? శాడిస్టేవరు ఫ్రెండ్?"
"ఇంకెవరు అదే!ఆనియన్ - అంటే రోజా-"
"రోజా శాడిస్టా?"
'అవును! మా ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఒకళ్ళనొకళ్ళు తెగ ద్వేషించుకునేవాళ్ళం -"
"హింసేమీ పెట్టడం లేదు గానీ ఇంతకుముందే ఒక విచిత్రమయిన చాలెంజ్ చేసింది" అంటూ విషయమంతా చెప్పాడు భవానీ!
"ఒహూ! అయితే దాని శాడిజం ఏమీ తగ్గలేదన్నమాట! థాంక్ గాడ్! దానిని ఆ రోజుల్లోనే వదిలించుకోవటం మంచిదయింది! నువ్వేం భయపడకు బ్రదర్! ఛాలెంజ్ టేకప్ చెయ్ - నీలాంటి తిక్క నా కొడుకు ఈజీగా ఏ చానెల్ నయినా నెంబర్ వన్ చేసేస్తాడు . నావల్ల ఏమయినా హెల్ప్ కావాలంటే తీసుకో - ఓకె?"
"థాంక్యూ! మరి నీ మోనికా సంగతేమిటి? ఎనీ ఇంప్రూవ్ మెంట్?"
"ఈ మోడల్స్ తో చాలా హెడేక్ భవానీ! నీలాగానే తిక్కరకాలు! నేను నిన్ను లవ్ చేస్తున్నానే అంటే ముందు మీ డాడీని మమ్మీని ఇంటర్యూ చేయాలంటుంది-"
"అదేంటి? వాళ్ళతో ఏం సంబంధం?"
"తనకు ఫామిలీ అంటే చాలా ఇష్టం అంట! ఇంట్లో ఎంత ఎక్కువ సంఖ్య గల కుటుంబం ఉంటే అంత హాపీగా ఉంటుందంట తనకి-"
"బాడ్ లక్-"
"ఓకే - సీయూ-"
ఫోన్ కట్ అయింది.
భవానీ కిప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. రాకేష్ లాంటి డాషింగ్ పర్సన్ తనకు హెల్ప్ చేస్తే - ఈజీగా బృందావనం చానెల్ ని నెంబర్ వన్ చేసేయగలడు . వాడు గాక విజయ్ యాదవ్ గాంగ్ ఉండనే ఉంది -
***
మర్నాడు భవానీ చానెల్ కేళుతూనే హనుమంతు రూమ్ లోకి ఎంటరయాడు.
"వెల్ కమ్ హనుమంతూ! రా ! కూర్చో-"
హనుమంతు అనీజీగా కూర్చున్నాడు.
"నువ్వింతకు ముందు ఏ చానెల్లో పనిచేశావ్ మిస్టర్ హనుమంతూ?"
"వసంతం చానెల్లో సార్ - అందులో నేను చానెల్ క్రియేటివ్ హెడ్ గా చేశాను -"
"చాలా క్రియేటివ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశావనుకుంటా! కదా?"
"సూపర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాను సార్ - ఆరు నెలలు రాత్రింబవళ్ళు తీవ్రంగా అలోచించి ప్రోగ్రామ్స్ అంతకుముందు ఇంకే చానెల్లో నూ రాలేదని వ్యూయర్స్ తెగ లెటర్స్, ఎస్. ఎమ్. ఎస్ లు పంపించేవారు -"
"అంటే ఆ చానెల్ మూసేయడానికి సెంట్ పర్సెంట్ నువ్వే కారణమన్న మాట! నేను ముందే అనుకున్నాలే!"
హనుమంతు గాబరాపడ్డాడు.
"సారీ సార్ - చానెల్ మూత పడ్డానికి కారణం నేను కాదు -- మానేజ్ మెంట్ పాలసీలు -'
"నీ ప్లేస్ లో ఎవడున్నా అదే అంటాడ్లె గానీ ఇవాళ్టి నుంచీ నీ క్రియేటివ్ నెస్ తగ్గించి నేను చెప్పిన ప్రోగ్రామ్స్ చెయ్-"
"ఏమిటి సార్ అవి?"
"రాత్రి పదీ - పన్నెండు మధ్యలో ఏం ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్?"
"డాన్స్, ప్రోగ్రామ్స్ , సినిమా సాంగ్స్, సినిమాల్లో వస్తున్నాయ్?"
"వాటి రేటింగ్ ఎంతుంది?"
"అల్ మోస్ట్ జీరో సార్-"
"అంటే నీ క్రియేటివ్ ప్రోగ్రామ్స్ ఒక్కడు కూడా చూడటం లా ! అవునా?"
"అంటే అది .......... లేట్ నైట్ - జనరల్ గా -"
"ఎల్లుండి నుంచీ రాత్రి పదింటికి పందిరిమంచం అనే సీరియల్ రన్ చెయ్ -"
"పందిరి మంచమా? అలాంటి సీరియల్ మన దగ్గరేమీ లేదే?"
"లేకపోతే ఇవాళ, రేపూ షూటింగ్ చేసి ఎల్లుండి టెలికాస్ట్ చేస్తావ్ -"
"నేనా?"
"చేతకాదంటే చెప్పు -- నీ అసిస్టెంట్ కి ప్రమోషనిస్తా-"
"అహహ! చేస్తాన్సార్ -స్క్రిప్ట్ ఏది?"
"బూతు సీరియల్ కి స్క్రిప్ట్ అడిగే వాడిని నిన్నోక్కడినే చూస్తున్నా-"
"ఆ! బూతు సీరియలా?"
"అవును! హీరోకి , హీరోయిన్ కి పెళ్ళయింది! ఫస్ట్ నైట్ గదిలో కొస్తారు. అక్కడి నుంచీ ఇక నీ టాలెంట్ - కెమెరా వర్క్ - అంతే-"
"నాకర్ధం కాలేదు సార్-"
"గదిలోకి రాగానే కెమెరా హీరోయిన్ అందమయిన ముఖం చూపిస్తుంది. ఆ తర్వాత పెదాల క్లోజప్ -- హీరో పాయింటాఫ్ వ్యూ - ఆ తరువాత హీరోయిన్ ఛాతీ -- ఉచ్చ్వాస , నిశ్వాసాలకు ఛాతీ ఊగటం -- అది చూసి హీరో కసి- దీనికే పదినిమిషాలు పడుతుంది. బొడ్డుని ఎంత సెక్సీగా , ఎట్రాక్టివ్ గా చూపించాలో నేను నీకు చెప్పక్కర్లా! చాలా సినిమాల్లో చూసే ఉంటావ్ -- లేకపోతే రాఘవేంద్రరావ్ సినిమాలన్నీ తెచ్చి చూసుకో! హీరోయిన్ బొడ్డు మున్సిపాలిటీ చెత్త కుండీ లాంటిది అనుకో! దాని మీద ముందు యాపుల్స్ విసరాలి ! తర్వాత మోసంబీ - ఆ తరవాత రేగి పళ్ళు - ఆ తరువాత గులాబీ పూలు - ఆ తరువాత బంతి పూలు, - ఇవన్నీ హీరో విసురుతుంటాడన్న మాట-"
ఆ తరువాత హీరోయిన్ దగ్గర కొచ్చి చాతీ మీద చేయి చేయివేస్తాడు . ఆ స్పర్శకి హీరోయిన్ పావుగంట సెక్సీ రీయాక్షన్స్ ఇస్తుంది! ఎపిసోడ్ ఎండ్- ఈ విధంగా అయిదొందల ఎపిసోడ్ లు తీయవచ్చు -"