Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 20

 

    విమల బోర్డింగు ,దగ్గిర యేటి వొడ్డున కొంచెం రాత్రి కాగానే మిణుగురు పురుగులు తీగెలు తీగెలుగా కాంతి చెట్ల ఆకుల్లో అల్లుకుంటో, అలంకరిస్తాయి. పుష్పదేవతలు దీపావళి చేసుకుంటూన్నారనిపిస్తుంది. ప్రతి పువ్వులోనూ దేవత -----ఓఅక అందమాటున అమ్మాయి వుందని కధలు వాశ్రారు కొందరు. మన దేశంలో సృష్టి శక్తులకి దేవతల పేర్లు పెట్టినట్టు గ్రీకు దేశంలో సౌందర్యలన్నిటి లోనూ, దేవతలు నివసిస్తున్నట్టు నమ్మారు. తలుచుకోండి! ఆ చిన్న పువ్వులో ఒకామె పడుకుని వుండటం -- ఈ మిణుగురులే దీపాలు -- ఆమె వొంటినిండా పుష్పరాజం- ఆమె భోజనం తేనే- చెట్టు వూగితే గాలిలో వూగడం . నేను ఆ పువ్వుల్లో వున్నట్టు తలచుకుంటే - ఏదో నేనొకసారి నివసించి దారి మరచిపోయిన లోకం నాకు జ్ఞాపకం వచ్చి బాధిస్తుంది. ఈ కల అంతా నిజమేనేమో! ఈ నిజమంతా కలకాగాలేనిది ఆ కల నిజం కాకూడదూ!
    మెల్లిగా అర్ధచంద్రుడు - ఎక్కడున్నాడో నీళ్ళలో నవ్వుతో - వీటిని చక్కిలిగింతలు పెట్టడం ప్రారంభిస్తాడు. విమల తోట యేటిలో ప్రతి ఫలించింది.
    
        "ఏటి కడుపున దాగి
        తోట నిదరోయింది"
    ఒకరోజున సుబ్బారావు గారిని తీసుకొచ్చాను. యీ అందం చూపడానికికని --అయన హృదయం యెంత కలవరపడ్డదంటే ఎంత ప్లీడరయినా , ఎంత చీట్ల పేకమీద ప్రేమ వున్నా కవి కదా------అందులో నిజమయిన కవి! - వెంటనే నా ముందు పాట వ్రాశాడు.
    Bed hot song in the making,
    Watoh చేశాను నేను.
        "ఈరేయి కన్నోల్ల సేరనా రాజా
        యెన్నెలల సాగానంత ఏటిపారెనటరా."
    అనేది అందువల్లనెమో నాకు ఆ పాట మీద అంత ప్రేమ.
        "కలవరపు నా బ్రతుకు
        కలత నిదరయ్యింది."
    అంటో వుంటే పాట మధురమైన బాధతో -- కుంగదీసే నిద్ర విరహంతో -- యీ మామిడి పూల మత్తు పరిమళం వలె - ఆ చంద్రుడి నిద్ర, ప్రతిఫలింత వలె - వినబడుతుంది నాకు. ఎంకి పాటల్ని అప్పుడే ఆంధ్రదేశం మరిచిపోయింది. గ్రామఫోనులో చవక చేశారు. కాని వూర్దులోని ప్రేమ గీతాలవలె - బరస్సు (Burnu) స్కాచ్ పద్యాల వలె -- పూర్వకాలపు పర్షియన్ కవుల ధీరమయిన కవిత్వంవలె - వైష్టవ గోపికా గానం వలె ప్రత్యేకమైన విలువ గలిగిన ఆంధ్ర ఐశ్వర్యం యీ పాటలు.
    ఆంధ్రాభిమానం ప్రత్యేకించి నాకేం లేకపోయినా, ఆంధ్ర దోమలు నా రక్తం పీలుస్తున్నా (దీక్షితులు గారూ వినండి) నేను ఆ పాట వ్రాయించి , ఆంధ్రదేశానికి మహోపకారం చేసినట్టు సంతోషించాను. ఆ సంఘటన వల్ల కాకపోతే ఆ పాట యీ విశ్వ సౌందర్యంలో భాగమై జన్మ లేకపోయేదేమో! ఆ ప్రత్యేకమైన రాత్రి వాసుదేవుడు దేవకిని కోరకపోతే కృష్ణుడు పుట్టేవాడా? ఆ ప్రత్యేకమైన రాత్రి ఏ పాలకోవా తినో గాంధీ గారి తండ్రి కాముకుడు కాకపొతే మన దేశం యింకా చీకట్లో బతుకుతో వుండేది కాదా? ఈ పాట ఎంతమంది యువకుల హృదయాల్ని ఉత్సాహింప చేస్తుందో! నా మూలాన కవి హృదయంలో ఉదయ మందింది! ఆ పాట అయన కవి జీవితానికి (Swan song) స్వాన్ సాంగ్ అనుకుంటాను, అదీ నా గర్వం.
    "వొక్కతెను నాకేల వోభజాలని సుఖము"
    అన్న పాదాన్ని కల్పించిన కవి హృదయం ఎంతమంది విరహించు యుగముగాల అశ్రువుల్ని తన హృదయంలో భరించి తప్పించకపొతే కల్పించగలడూ ఆ శబ్దాల్లోని ఆ అగ్నిని! నేను చూసిన వెన్నెలని చూసి వోబజాలని సుఖము కింద. ఆ కవి హృదయం ఎంత పెనుగులాడక పొతే మూర్చపోయ్యే ఆ మూలుగు బైటికి వొస్తుంది. మళ్ళీ  నేనే పిలుచుకు రాకపోతే అ సన్నని వెన్నెల రాత్రి బూజుగదిలో దీపం పెట్టుకుని ఏదో "కుదేలు" అని అరుస్తో చీట్లాట ఆడుతో వుండేవాడు యీ మహాకవి! "కుదేలేమిటి" కుందేలు అని అన్నా" అరవకూడదా! అనుకునేవాణ్ణి. ఎప్పుడు ఆ పాడుచుక్కల ముక్కల్ని వదిలివేస్తాడా, నాతొ కాలవగట్ట తిరుగుతో, నా కలల్ని వినడానికి? అని ఆశతో!
    కధలు వ్రాసేవాణ్ణి నేను, ఆ కవిని సుందరప్రదేశాలకి పిలుచుకుపోయిన సాయింత్రాలు, ఇట్టాంటివి యూరపు కవుల్ని గురించి విని ఆనందిస్తాము, ఆశ్చర్యపోతాము! ఈ దేశంలో కవినని చెప్పుకోడమే సిగ్గు కాకుండా ఉన్నట్టయితే కవులు వొస్తున్నారంటే, ఎట్టా దాక్కుందామా అనే భయమే కలించకపోతే,  ప్రజరంజితము కాకపోతే, యీ ఆంధ్రదేశాలలో కళ అనేదే పూర్తిగా చచ్చి వుండకపోతే కవులింతనేనూ కూడా కలుపుకుని గర్విష్టులు కాకపోతే ఒకడు కాకపోతే ఒకడైనా తన కళ వల్ల దారిద్యం కోదిలించుకుని వుంటే, కళా కారుకుల సంఘటనలూ, మార్గాలూ చర్చలూ అన్నీ ప్రశంసా పాత్రామయ్యేవి! కాని ఆ మాదుర్యమంతా మనిద్దరి హృదయాలలోనే మిగిలిపోయింది. ఆ సాయిన్త్రాల మాధుర్యం. కాని ఆయనకీ -- పార్టీలలో వాగ్యుద్దంలో, ఆ బీరువాలో పెద్ద పుస్తకాలు వెతకడంలో -- ఆ దుమ్మూ, కొయ్యా నాకు లేదు. నేనే కోర్టు హాలులో , చీట్ల పేక కుదేలులో మధ్య ఎప్పుడన్నా కారణం లేకుండా ఆ మామిడి పూల పరిమళం యేరు కొండమీద చుక్క జ్ఞానపమోస్తాయా! వొస్తే మాత్రం ఏదో చిన్నతనపు చేష్టలని చిరునవ్వు నవ్వి "ఐతే మీ భూమి తనఖా యే సంవత్సరంలో పెట్టారు? అని మనసుని మళ్ళించుకుంటారా?

 Previous Page Next Page