Previous Page Next Page 
దావాగ్ని పేజి 20


    మరో గుద్దుకి అందకుండా చెంగున వెనక్కి గెంతి, "ఇంకా లేదనుకుంటాను" అన్నాడు తోకాస్.

 

    గొంతు తగ్గించి అన్నాడు జనరల్ భోజా.." అయితే ఇంక మనం ఆలస్యం చేయకూడదు. వాళ్ళు ఏదన్నా చేసేలోపలే మనమే ఏదో ఒకటి చేసెయ్యాలి"  

 

    "యస్సర్" అన్నాడు తోకాస్.

 

    "తోకాస్...: ఆ ఇండస్ట్రియలిస్టు బాబూజీ అపాయింట్ మెంట్ యెప్పుడు ఫిక్స్ చేశాం?"

 

    "రేపొద్దున సార్..."

 

    "సరే: మా అరవయ్యో పుట్టినరోజుకి ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి?"

 

    "ఎక్స్ లెంట్ సర్...: ప్రపంచంలోని దేశాధినేతలందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి ఫ్రాన్స్ నుండి వంట వాళ్ళని పిలిపిస్తున్నాను. విఐపీలు పదివేలమందికి విందూ, మందూ, పొందూ అరేంజ్ చేస్తున్నాం"అన్నాడు తోకాస్.

 

    కానీ ప్రజల్లో కొంతమంది భోజా పుట్టినరోజు పండగ సంబరాల ఏర్పాట్లను గురించి విని, "మా పసికూనలకి పుట్టెడు మెతుకులు కరువయినప్పుడు పళ్ళూడిపోయిన ఈ ముసలి వెధవలకి పుట్టిన రోజుపండగలేమిటి?" అని ఈసడించుకోవడం గుర్తొచ్చింది. కానీ అలాంటి వాస్తవాలు చెబితే జనరల్ భోజా కల్లుతాగిన భల్లూకంలా అయిపోతాడు. "అహం బ్రహ్మాస్మి" అనే భావం అతనికి ఉంది.... తను తింటేచాలు అందరి కడుపూ నిండుతుందనుకునే రకం.

 

    " ఆ రోజుకి ఈవిడ పని సఫా అయిపోవాలి" అన్నాడు భోజా సాలోచనగా.

 

                             *    *    *    *

 

    బాబూజీ ఇంటి గోడ దగ్గర నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు సత్యజిత్.

 

    వాచ్ టవర్ మీద ఉన్న గార్డు దృష్టి అతని మీద పడింది.... అలర్ట్ గా సత్యజిత్ నే చూస్తున్నాడు గార్డు. అతడి వేళ్ళు చేతిలోని గన్ తాలూకు సేఫ్టీకాచ్ ని రిలీజ్ చేశాయి.   

 

    అది గమనించాడు సత్యజిత్. కారులోని మెషిన్ పిస్టల్ ని అందుకోబోయాడు.

 

    అంతలో -

 

    నీడలా కారుని సమీపించాడు ఒక ట్రాఫిక్ పోలీస్ ఇన్ స్పెక్టర్.

 

    "రాంగ్ పార్కింగ్ చేశావ్: పద: నీ లైసెన్స్ చూపించు..." అన్నాడు రూడ్ గా.

 

    "లుక్ ఆఫీసర్..." అంటూ ఏదో చెప్పబోయాడు సత్యజిత్.

 

    "డోన్ట్ ఆర్గ్యూ: ముందు డాక్యుమెంట్లు చూపించు:"

 

    చెల్లెలు కనబడటం లేదనే ఆరాటం సత్యజిత్ వివేకాన్ని కోల్పోయేలా చేసింది. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ని కొట్టడానికి అతడి చెయ్యి విసురుగా గాల్లోకి లేచింది.    

 

    గాల్లోకి లేచిన సత్యజిత్ చేతిని గాల్లోనే ఒడుపుగా పట్టుకున్నాడు ట్రాఫిక్ యిన్ స్పెక్టర్.

 

    "ఏం? ఒళ్ళు బలిసిందా? పద పోలీస్ స్టేషన్ కి" అని తనూ చటుక్కున డ్రైవింగ్ సీట్లో కూర్చుని మోటుగా సత్యజిత్ చెయ్యి పట్టుకొని కారులోకి లాగి, రెండో చేత్తో ఇంజన్ స్టార్టు చేశాడు.

 

    ఒక తలుపు తెరిచి వుండగానే కారు కదిలి రివ్వున వేగం అందుకుంది ఆ వేగానికి పెద్ద చప్పుడుతో తలుపు మూసుకుంది.

 

    ఇదంతా అలర్ట్ గా చూస్తున్న వాచ్ టవర్ లోని గార్డు సత్యజిత్ ని తీసుకుని ట్రాఫిక్ ఇన్ స్పెక్టరు పోగానే కొంచెం రిలాక్సయి నిలబడ్డాడు.

 

    దాదాపు సీటుమీద అడ్డంగా పడిపోయినట్లున్న సత్యజిత్ లేచి కూర్చుని కోపంగా పిస్టల్ అందుకోబోయాడు.

 

    "పిస్టల్ తియ్యవలసినంత అవసరంఏమీలేదు సత్యజిత్:" అన్నాడు ట్రాఫిక్ ఇన్ స్పెక్టరు శాంతంగా.

 

    అనుమానంగా ఇన్ స్పెక్టరు మొహంలోకి చూశాడు సత్యజిత్. తరవాత "రాజా: మీరా?" అన్నాడు ఆశ్చర్యంగా.

 

    "అవును: నేనే: సత్యజిత్: నువ్వు అతి సమర్థుడయిన వాడివని భావించి నిన్ను ఏజెంట్ గా అపాయింట్ చేశాను. ట్రెయినింగ్ ఇచ్చాను.చాలా సంవత్సరాలపాటు చాలా ఎఫిషియెంట్ గా, భారతదేశం పట్ల ఎంతో విశ్వాసంగా ప్రవర్తించావ్. కానీ ఆఫ్ లేట్, నీ ప్రవర్తన మారిపోతోంది. యూ ఆర్ లూసింగ్ యువర్ గ్రిప్: ఈ ఆరునెలల వ్యవధిలో రెండు తప్పులు చేశావు నువ్వు."                    

 

    దాదాపు సీటుమీద అడ్డంగా పడిపోయినట్లున్న సత్యజిత్ లేచి కూర్చుని కోపంగా పిస్టల్ అందుకోబోయాడు.

 

    "పిస్టల్ తియ్యవలసినంత అవసరంఏమీలేదు సత్యజిత్:" అన్నాడు ట్రాఫిక్ ఇన్ స్పెక్టరు శాంతంగా.

 

    అనుమానంగా ఇన్ స్పెక్టరు మొహంలోకి చూశాడు సత్యజిత్. తరువాత "రాణా: మీరా?" అన్నాడు ఆశ్చర్యంగా.

 

    "అవును: నేనే: సత్యజిత్: నువ్వు అతి సమర్థుడయిన వాడినని భావించి నిన్ను ఏజెంట్ గా అపాయింట్ చేశాను. ట్రెయినింగ్ ఇచ్చాను. చాలా సంవత్సరాలపాటు చాలా ఎఫిషియెంట్ గా, భారతదేశం పట్ల ఎంతో విశ్వాసంగా ప్రవర్తించావ్. కానీ ఆఫ్ లేట్. నీ ప్రవర్తన మారిపోతోంది. యూ ఆర్ లూసింగ్ యువర్ గ్రిన్: ఈ ఆరునెలల వ్యవధిలో రెండు తప్పులు చేశావు నువ్వు."

 

    "ఏమిటవి?" అన్నాడు సత్యజిత్.

 

    "నెంబర్ వన్. పవిత్ర అనే అమ్మాయితో ప్రేమలో పడడం."

 

    "అది మీకెలా తెలుసు?" అన్నాడు సత్యజిత్ అనాలోచితంగా. కానీ ఆ ప్రశ్న అనవసరమైనదని అతనికి తెలుసు.

 

    "మిస్టర్ సత్యజిత్: నేను దొంగలకి దొంగని: ఆ సంగతి నీకు బాగా తెలుసు: నా కన్ను కప్పి నువ్వు ఏ పనీ చేయలేవు."

 

    "ప్రేమించడం ఒక అపరాధమనుకోను."

 

    "అది మామూలు మనుషుల విషయంలో నిజమే కావచ్చు. కానీ ఏజెంట్లు అంటే మామూలు మనుషులు కారు. మామూలు మనుషులు ఏజెంట్లు కాలేరు ఇలాంటి సున్నితమైన భావావేశాలకి దూరంగా ఉండాలి మనం పవిత్రతతో ప్రేమలో పడ్డాక రెండు అసైన్ మెంట్సును ఫెయిలయ్యావు నువ్వు. అంటే ఏమిటి? నీకు ఏకాగ్రత కుదరటం లేదన్నమాట:"

 Previous Page Next Page