కాని విద్యాలయ నివేశనంలోనికి వాన కోట్లు ధరించిన వింత వ్యక్తులు ప్రవేశిస్తారు. పారిస్ అంతటా వ్యాపించిన "వియత్నాం కమిటీ" లను తనిఖీచేసే మనుష్యులే వాళ్ళు.
వాన కోట్ల మనుష్యులు "తీవ్రవాద" విద్యార్థుల ఫోటోలు తీసుకుంటారు.
విద్యార్థులు వానకోట్ల వాళ్ళ ఫోటోలు తీసుకుని బోర్డులకు పిన్నులతో గుచ్చుతారు.
అనంతమైన వసారాలలో బోర్డుల మీద "FLN (వియత్నాం యోచన దళం) జయిస్తుంది". ఇంకా "రియాక్షనరీలంతా కాగితపు పులులే". వియత్నాంలో ఉంది వియత్నాం విద్యార్ధులు. సాంఘిక శాస్త్రాధ్యాపకుణ్ని రోడియోసెటా సమ్మెమీదక్రస్ మార్కర్ నిర్మించిన చలన చిత్రాన్ని చూపించమంటారు. వీల్లేదంటారు ప్రొఫెసరుగారు.
సెక్సు కోరికలను అణచుకోవడంలేదా సెక్స్ తీవ్రత మీదా వీలియం రైషీ వ్రాసిన గ్రంథాలను చర్చించగోరుతారు విద్యార్థులు. ప్రొఫెసర్ల మీద అడ్డు సవాళ్లు ప్రారంభిస్తారు. "మహాశయాధ్యాపకా! షార్ల్ మాన్ ఎవరండీ?"
షార్ల్ మాన్ క్రైస్తవ మతంకోసం పోరాడిన మహా మంచి మహారాజు.
"అథ్యాపక మహాశయా! మధ్యాహ్నం పూట కార్మికులు ఏంటి తింటారండీ?"
ఏది దొరికితే అది తింటారురా అబ్బాయిలూ, అయినా మనం తుచ్చమైన అల్పమైన విషయాల జోలికి పోకుండా మనస్సుకి సంబంధించిన సంగతులే మాటాడుకుందాం.
ఎంచేతనంటే, మీరు క్రమశిక్షణతో కృషి చేసి, విచక్షణతో చదువుకుంటేనే ముందు మహోజలమైన భవిష్యత్తు ఉందిరా. గోడలమీద అనామధేయహస్తాలు రాస్తాయి. "అధ్యాపకులారా! మీరు ముసిలివాళ్లయిపోయారు."
ఎక్కడో ఏదో చెడిపోయింది. గోడలు పగుళ్లేశాయి.
మనస్సులు ఆందోళన చెందుతున్నాయి. కొందరు ఆందోళనకారులు విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారు. మంత్రులకు కొద్దిగా మనస్సులు చివుక్కుమన్నాయి.
కొత్త స్విమ్మింగ్ ఫూల్ (ఈత చెరువు) ఆవిష్కరించడానికి మంత్రి మిసాషీ వచ్చాడు.
యువతరం మీద ఆయనో పుస్తకం వ్రాశాడు. యువక మంత్రుల ధర్మం అది.
సమావేశ మందిరంలో మంత్రిగారి మీద స్పాట్ లైట్. మంత్రిగారు మాటాడుతున్నారు. విద్యార్థులు వింటున్నారు. విద్యార్ధి కాన్ - బాందీ (Cohn - Bendit) అడ్డొస్తాడు. నీ రాతలు చదివాను. ఆరు వందల పేజీల చెత్త. అందులో నువ్వు సెక్సు సమస్యల్ని ఎత్తుకోనేలేదు. మంత్రిగారికి వళ్ళు మండుతుంది. తొందరపడతాడు. "వింతేముంది? నీ జిడ్డు మొఖానికి ఇలాంటి సమస్యలే దొరుకుతాయి. వెళ్ళి ఓమారు చెరువులో ఈదు."
పత్రికలు మాట్లాడడం ప్రారంభించాయి. సాధనమే సందేశం కాబట్టి ప్రజల ప్రచార సాధనాలు విద్యార్థులకు తమ్ముతాము గుర్తించుకొనే మార్గాలు చూపిస్తాయి.
మర్యాద, మప్పితాల ముళ్ళతీగ పాతబడి తుప్పుపట్టిపోయింది. అడ్డు సవాళ్ళు, అడ్డ కత్తెరలు. జ్ఞానాన్ని తయారుచేసే కార్ఖనా అయిన విశ్వవిద్యాలయం మొట్టమొదటి అడవి పిల్లి సమ్మెల్ని చవిచూసింది.
ప్రొఫెసర్ల ప్రశ్నల వల్ల బట్లొలిపించుకున్న రాజులు. నవ్వులూ, ఈసడింపులూ అకస్మాత్తుగా అవహేళన చేసి మడిబట్టలు విప్పించే సులువైన కళ. త్వరలోనే అధ్యాపకులు దిగంబరరాజులయ్యారు.
అరుపులే అయుధాలైన చీపురుపుల్ల దళాల చిన్నచిన్న తూటాల కాల్పులకు తోడుగా, చైతన్యంతో మోహరించిన సేనలు కదలడంతో ప్రొఫెసర్లు కందకాలలో తలలు దాచుకోవడానికి పరుగెత్తారు. వార్తలు ప్రతిధ్వనిస్తాయి. ఇటాలియన్ విద్యార్థులప్పుడే బస్సు లైట్లు కొయ్యడం, తమ్ము వెంటాడే పోలీసుల కళ్ళల్లో ఇసుక జల్లడం నేర్చుకున్నారు.
జర్మన్ విద్యార్థులు పోలీసు కుక్కలతో తలపడుతున్నారు. ఒక నాగరికత లాగ ఇంకొకటి ఉండదు. వేరు వేరు పరిస్థితులకు వేరు వేరు సమాధానాలు.
మార్చి 22వ తేదీన విద్యార్థులు అధికార భవనాన్ని ఆక్రయించారు. డీన్ గ్రాపన్ కి అంకితంగాలా. కార్మన్యాల్ పాటను పరిస్థితి కనుగుణమైన ప్రత్యేక సవరణలతో పాడుకుంటూ (Dansonsla grappignole గ్రాసిన్నాట్యం చేద్దామా!)
లేత చేతుల విద్యార్థులు. బాధపడిన మనస్సులు.బూర్ఖువా వర్గపు సంతానం. రెండు మురికి పేటల ఆవరణలలో బంధితులిన విద్యార్థులు. ఒకటితాము జవాబులివ్వడమేగాని ప్రశ్నలడగకూడని యూనివర్శిటీ _ ఫ్యాక్టరీ రెండవది. పై తరగతులవాళ్ళు చలాయించే అధికారాలు.
పాపం, ఈ పసివాళ్ళకి క్రమశిక్షణ అనే పోలీసు తనిఖీ, పరీక్షలనే మిలటరీ గస్తీ. ఉల్లంఘించరాణి నియమాలతో గడ్డకట్టుకుపోయిన హృదయాలు. వాళ్ళ పురంలోని అంతఃపురం తమకు అంతరానిదైన సమాజాన్ని అనుకరించే బొమ్మలాటాడుతుంది. అయినా వాళ్ళకి తమదని చెప్పుకునే సంపదా లేదు. సమాజమూ లేదు.
వాళ్ళ గతం. కుటుంబ బంధాలు ఉక్కిరిబిక్కిరి చేస్తే గాభరాపడిపోయి, కుటుంబపు డబ్బు మీద ఆదారపడవలసిన అవమానంతో, జ్ఞానాన్ని కాదని పిడి వాదాలను నూరిపోసే వర్తమానంవైపు నెట్టుతుంది. ఆత్మవంచన అనే భారీ పరిశ్రమతో సహకారం కోరుతుంది. ఎదురాడని ఉత్పత్తి. జవాబులు లేని వాడకం ఇలాగే శాశ్వతంగా సాగడానికి తోడ్పడమంటుంది.
వాళ్ళ యూనివర్శిటీ సమాజాన్ని అనుకరిస్తుంది. ఫ్యాక్టరీని అనుకరిస్తుంది. తమకు అందజేసిన అల్ప జ్ఞానాలని సరదాగా, సాహసోపేతంగా ఉపయోగించి వాళ్ళు దాన్ని స్తంభింపజేసే ప్రమాదం ఉంది. వాళ్ళు తమ గదుల్లోని నిశ్శబ్దంలో కూర్చొని చాలా ఓపికగా, జాగ్రత్తగా తమ సమస్యల ముక్కల్ని అతికిస్తూ ఉంటారు. ఇవి వాళ్ళని విధేయంగా, మప్పితంగా మసలుకోమంటాయి. బొజ్జలు పెంచిన, విషాదపు అధికారులను గౌరవించమంటాయి. వెలుపలి ప్రపంచాన్ని పట్టించుకోవద్దంటాయి. అయినప్పటికీ వీళ్లచేతికొచ్చిన పనిముట్లు - వాటి కాపలాదారుల వల్ల ఎంత మొద్దుబారిపోయినా - అవహేళనకి ఉపకరిస్తాయి. బోనుల్నీ, దొంగ తలుపుల్నీ, వికారపు ప్రతిబింబాలు చూపించే అద్దాన్నీ, ఆటంకాల్నీ, మూసిన సింహద్వారాన్ని బయటపెడతాయి. ధూళి పట్టిన ఈ సుదూర విథుల చివర్న కనిపించేది: అన్యాయం.
11 వ ఏప్రిల్, రూడీ కష్కేని షూట్ చేశారు.
నీలాగ ఆలోచిస్తున్నవాళ్ళతో, సరిహద్దు అవతలి క్షుద్ర దేవతల్ని నీలాగే ఎదిరిస్తున్న వాళ్ళతో నిన్ను బంధించే చాలా పెళుసైన అనుబంధాలు. లాటిన్ కార్టర్ లో విద్యార్థులు సమావేశమవుతున్నాయి. సంభాషిస్తున్నారు.
మొదట చెదురుగా, తర్వాత జట్లుగా, తుదకు ఒక ప్రదర్శనం.
కలత పడిన సెలయేళ్లు, చిరుతరగలు, పెను కెరటాలు.
పత్రికాలయాల్లో రోటరీ యంత్రాలు తిరగడం మొదలయింది.
పియర్ జూకిన్ - కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యుడు, కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నాన్ టెర్ కి వస్తాడు. స్టూడెంట్ ఉపద్రవానికి "కమ్యూనిస్టు పరిష్కారం" గురించి మాట్లాడదానికి. వచ్చి దొడ్డి దోవన నిష్క్రమిస్తాడు.