Previous Page Next Page 
వేగు చుక్క పేజి 18


    ఆ మాత్రం తాకిడికే ఆ ప్లార్ ఒక వైపు సగం మునిగి, మళ్ళీ బాలెన్స్ చేసుకుంది.
   
    నడుముల దాకా తడిసి పోయాడు ప్రొఫెసర్.

    దుంగ మీద కూర్చున్న నల్లమందు భాయి కదిలి, చెంగున కిచెన్ ప్లోర్ మీదకు దూకాడు.

    మళ్ళీ ఒరిగింది కిచేస్ ప్లోర్.

    "ఇదిగో ఓ మనిషీ" అన్నాడు ప్రొఫెసరు కోపంగా. "ఆ కోతి చేష్ట లేమిటి! అలా దూకేస్తావేం ? మేమందరం మునిగి గంగా ప్రవేశం చేయ్యాలనా  నీ ఉద్దేశ్యం ! భలే వాడివే  వెళ్ళేళ్ళు, వెళ్ళి నీ దుంప మీదే  ఎక్కు" అని ఆగి, పరీక్షగా చూసి , "వార్నీ, ఇది మనిషి కాదోయ్  భాగావాన్లూ  నిజంగా కోతే! ఒరాంగ్  ఉటాన్! గొరిల్లా తర్వాత అతి పెద్ద  కోతి ఇదే. ఇది దుంగమీద ఎక్కిఎందుకు వస్తోంది చెప్మా" అన్నాడు విస్మియంగా.

    తను దుంగమీద ఎప్పుడు ఎక్కడ, ఎలా, ఎందుకు ఎక్కిందో చెప్పడానికి ఆ కోతి  మాటలు రాకపోవడంవల్ల, వాళ్ళకి ఆ సంగతి మిస్టరీ గానే  ఉండిపోయింది.

    "నువ్వు ఎక్కడ నుంచీ వస్తే మాకేం ! దీనిమీద ముగ్గురికే ప్లేసు లేదు. నువ్వు కూడా ఎక్కడ ఎక్కుతావ్? దిగు దిగు!" అన్నాడు అదిలిస్తూ.

    ఒరాంగ్ ఉటాన్ పళ్ళు బయటపెట్టి గుర్రుగా చూసింది.

    తోక ముడిచాడు ప్రొఫెసర్.

    "పోన్లెండి ప్రొఫెసర్ సాబ్ దాన్నికూడా ఉండనివ్వండి సాటి ప్రాణే కదా" అన్నాడు ఫకర్.

    "ఉండనిసావా ఇది తన పీకెల మీదికే తెస్తుందని అతను నిజంగా ఉహించలేదు.


                                 *    *    *

    తనని సకాలంలో రక్షించిన డాల్ఫిన్స్ చాలా తెలివైన జంతువులనీ, చాలా స్నేహ స్వభావం కలిగినవనీ త్వరలోనే అర్ధమయింది అనూహ్యకి.

    అవి చేస్తున్న శబ్దాలు ఏవీ  తన చెవికి వినబడకపోయినా, వాటి ప్రవర్తనావల్ల వాటిలో అవి మాట్లాడుకుంటున్నట్లూ, చకచక నిర్ణయాలు తీసుకుంటున్నట్టూ తోచింది అనూహ్యకి. డాల్ఫిన్స్ చేసే కొన్ని రకాల శబ్దాల మానవ శ్రనేంద్రియానికి వినబడవు.

    ఒకా నిర్ణయానికి వచ్చాక, తెరిపిన పడ్డట్లు కనబడ్డాయి. అవి ఇంక ఆటల్లో పడ్డాయి. ఒక దాన్ని ఒకటి కవ్వించుకుంటూ పరిగెత్తాయి. నాలుగేసి మీటర్లు పొడుగున్న ఆ డాల్ఫిన్స్ ఉత్సాహంగా ఎనిమిది మీటర్ల ఎత్తుకి ఎగిరి మళ్ళీ నీళ్ళలోకి పడుతున్నాయి.

    వాటన్నిటిలోకి కూడా ఒక డాల్ఫిన్ మరీ అల్లరి దానిలాగా  కనబడింది. అన్నిటిలోకీ అదే చిన్నది కూడా. స్వతహాగానే దాని నోరు కొంచెం వంపు తిరిగి కొంటెగా  నవ్వుతున్నట్లు కనబడుతోంది. అప్పుడప్పుడు హుషారుగా విజిలేస్తోంది అది.

    మంచి ఆట ఒకటి కనిపెట్టింది. అది అన్యూహ భయం భయంగా ఒక పెద్ద  డాల్ఫిన్  వీపు మీద కూర్చుని ఉంటే, తను చడీచప్పుడు కాకుండా వెనక నుంచీ జలాంతర్గామిలా వచ్చేసి తోసేయ్యడం!

    ఆ అమ్మాయి నీళ్ళలో పడేలోగా అందుకుని మళ్ళీ పైకి తొయ్యడం, విజిలెయ్యడం.

    చిన్న పిల్లలు బంతితో ఆడుకుంటున్నట్లు అనూహ్యతో ఆడుతోంది ఆ పిల్ల డాల్ఫిన్.

    అది అలా చేసినప్పుడల్లా ప్రాణాలు కడబట్టినట్లయి పోతోంది అనూహ్యకి.

    ఈసారి చావు భయం? అనుకుంటోంది ప్రతిసారీ ఆమె.

    కానీ నాలుగుసార్లు అలా జరిగిన తర్వాత 'ఈ డాల్ఫిన్ పిల్ల తనని నీటిలో మునిగిపోనివ్వద్దు' అన్న దైర్యం కలిగింది అనూహ్యకి.

    ఆమెకి అలా దైర్యం కలగగానే పట్టుకోవడం మానేసింది ఆ చిన్న డాల్ఫిన్.

    నీళ్ళలో మునిగి ఉక్కిరిబిక్కిరైపోయింది అనూహ్య.

    అప్పుడు మళ్ళీ కిందవైపు ప్రత్యక్షమయింది పిల్ల డాల్ఫిన్ అనూహ్యని నీటి ఉపరితలానికి తెచ్చింది.

    ఆ విధంగా నాలుగుసార్లు మునిగి తేలాక అర్ధమయింది అనూహ్యకి. ఆ డాల్ఫిన్ ఉద్దేశ్యమేమిటో.

    అవి తనకు ఈత నేర్పాలని చూస్తున్నాయి!

    చాలా తెలివైన జంతువులు డాల్ఫిన్స్ తమ ఈ కొత్త నేస్తానికి నీటిలో ఈదడం రాదని అవి గ్రహించాయి. సముద్రంలో తమ జీవితం అనుక్షణం ప్రమాద భరితమే అని తెలుసు వాటికి ఏ తిమింగలమో వచ్చి తమని తినేస్తే, ఈతరానిఈ నేస్తం గతి ఏమవుతుంది?

    అందుకే అనూహ్యకి ఈత నేర్పాలని నిశ్చయించుకున్నాయి అవి. పడగానే, నిస్సహాయంగా అలా ఉండిపోకుండా, కాళ్ళూ చేతులూ కదిలించడం మొదలెట్టింది.

    ఎనిమిదోసారి ప్రయత్నించాక తన శరీరం తేలికైపోయి నీళ్ళమీద తేలుతున్నాట్లు అనిపించింది ఆమెకి.

    చేతులూ,  కాళ్ళూకదిలిస్తుంటే తనుకొంచెంముందుకివెళుతోందికూడా!

    తనకు ఈత వచ్చేస్తోంది!

    నట్టనడి సముద్రంలో ఈత నేర్చుకొంటోంది తను.

    సంతోషం కలిగింది అనూహ్యకి.

    కానీ అతిత్వరలోనే అలసిపోయింది ఆమె రొప్పువచ్చేస్తోంది.

    'ఈ రోజుకి ప్రాక్టీసు చాలు' అన్నట్లు విజిలేసి ఆగింది  చిన్న డాల్ఫిన్.

    తర్వాత అది తన తల్లి తోక కింద దూరింది. అక్కడ చిన్న చట్రంలాంటి దానిలో ఉన్న ముచ్చికను నోట్లో పెట్టుకుంది.


    తల్లి డాల్ఫిన్ పిచికారీ చేసినట్లు పాలను పిల్ల నోట్లోకి స్ప్రే చేసింది తన్మయంగా పాలు తాగింది పిల్ల డాల్ఫిన్. తర్వాత అనూహ్య దగ్గరికి వచ్చి, ఆమెను తోసుకుంటూ తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది.

    అదేం చెయ్యపోతోందో మొదట్లో అర్ధం కాలేదు అనూహ్యకు.

    అర్ధమయ్యాక పెద్దగా అరిచింది, "అయ్యో వద్దు, నాకు వద్దు"

    అప్పటికే ఆమె తలను బలవంతంగా తల్లి తోక కిందకు నెట్టింది పిల్ల డాల్ఫిన్.

    తల్లి తన పాలను అనూహ్య  నోట్లోకి స్ప్రే చేసింది.

    అవి తన నోట్లో పడకుండా పదిమలు గట్టిగా బిగించి, తల అటూ ఇటూ ఆడించింది అనూహ్యా. పాలు ఆమె మొహం మీద అంతా పడ్డాయి.

    ఆ పరిస్థితి ఆమెకు కొద్దిగా వికారాన్ని కలిగించినా, ఆ మూగ జీవాల అభిమానానికి కరిగిపోయింది అనూహ్యా.

    ఉన్నట్లుండి డాల్ఫిన్స్ అన్నీ ఆలర్టుగా, నిశ్చలంగా అయిపోయాయి. అవన్నీ చెవి ఒగ్గి ఏదో వింటునట్లు అనిపించింది అనూహ్యకి

    తనకి మాత్రం ఏమీ వినబడంలేదు.

    మరి ఏమిటిది?

    డాల్ఫిన్ కి చూపు తక్కువ అందుకని తమ మార్గంలోకి అడ్డంకులని కనుక్కోవడానికి ఒక రకం శబ్దాలు చేస్తాయి. అవి మనుషులకి వినబడువు. ఆ శబ్ద తరంగాలు నీటిలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటికి తగిలి, ప్రతి ధ్వనిస్తాయి. తమ శక్తివంతమైన చెవులతో ఆ సున్నితమైన ప్రతిధ్వనిని కనిపెట్టి జాగ్రత్త పద్దతాయి డాల్ఫిన్స్.

    ఈసారి వినబడుతున్న ప్రతిధ్వని ఏమి సూచిస్తోందో చప్పున అర్ధమైపోయింది.

    దగ్గరలో తిమింగిలం ఉంది అతి దగ్గరలో!!

    డాల్ఫిన్స్ ఆగి, తమలో తాము చర్చంచుకున్నాయి, వినబడని శబ్దాలతో, అనుసరించ వలసిన వ్యూహాన్ని గురించి.

    షార్క్ లాంటి చేపలు తమ మీద దాడి జరిపితే, డాల్ఫిన్స్ అన్నీ  కలిసికట్టుగా ఉండి, వాటిని తరిమెయ్యడం పరిపాటి.

    కానీ ఇప్పుడు వస్తోంది షార్క్ కాదు, కిల్లర్ వేల్.

    క్షణ క్షణానికీ దగ్గరవుతోంది ఆ తిమింగిలం. అది ఇందాక సాగర్ ని చూసి వెనక్కి వెళ్ళిన తిమింగిలమే. ఇప్పుడు తన పిల్లలతో సహా వస్తోంది, ఆహారాన్ని వేటాడడంలో వాటికి ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడానికి.

    దాని నోరు ఎర్రటి గుహలాగా తెరుచుకుని ఉంది దాని పళ్ళు భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. తోకతో నీళ్ళని అల్లకల్లోలం చేసేస్తూ, ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ లా వచ్చేస్తోంది ఆ తిమింగిలం!


                                      11


    తమని సమీపిస్తున్న తిమింగిలాన్ని చూసే అలజడిగా వెనుదిరిగబోయాయి డాల్ఫిన్స్, అనూహ్యతో సహా.

    కానీ అంత వ్యవధి లేకపోయింది. ఆ లోగానే అతి దగ్గరగా వచ్చేసింది కిల్లర్ వేల్.

    తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనీ, ఆ జన్మకు సార్థకత కల్పించిన సాగర్ ని చివరిసారిగా తలుచుకునీ, కళ్ళు గట్టిగా  మూసుకుంది అనూహ్య.

    అప్పుడు జరిగింది ఊహాతీతమైన ఆ సంఘటన!

    ఒక్కొక్కటీ రెండొందల అడుగుల పొడుగున, నాలుగు అడుగుల వెడల్పున ఉన్న బ్రహ్మాండమైన, సర్పాలు నాలుగు నీళ్ళలో నుంచీ ఒక్క సారిగా పైకిలేచి, ఆ తిమింగిలాన్నీ, గాని పిల్లలన్నీ కూడా కలిపి కట్ట కట్టేసినట్లు చుట్టేశాయి.

    దిగ్ర్భమ పొంది చూస్తోంది అనూహ్య.

    మరుక్షణంలో అదృశ్యమై సాగరగర్భంలోకి వెళ్ళిపోయింది ఆ తిమింగిలం, దాని సంతానంతో సహా!

    ఆ తిమింగిలాన్ని తన టెంటకిల్సుతో బంధించి, నీటి లోతుల్లోకి లాక్కెళ్ళిపోయిన ఆ రాక్షస జంతువు క్రాకెన్. ఇందాక దాన్ని చూసే ప్రొఫెసర్ ఆనందరావు కొత్తగా తేలిన ద్వీపం అని భ్రమపడింది.

    డాల్ఫిన్ సంతోషంగా అరిచాయి. విజిల్సు వేశాయి. గాలిలోకి ఎగిరి దూకాయి.

    ప్రమాదం తప్పినందుకు అనూహ్య దీర్ఘంగా నిట్టూరుస్తూ ఉండగానే-

    వినబడింది దిక్కులు పిక్కటిల్లేలా ఒక శబ్దం.


                                                                 *    *    *


    నీటి మట్టానికి ఏడువందల అడుగుల లోతున జరాంతర్గామిలో.

    ఒంటి కాలిమీద గెంతుతూ సాగర్ ని సమీపించాడు ఆ మనిషి.

    సర్వేంద్రియాలనూ సమన్వయంలోకి తెచ్చుకొని అతన్ని ఎదుర్కోనడానికి సిద్దంగా నిలబడ్డాడు సాగర్.

    దేహంలోని శక్తినంతటినీ చేతి అంచులో కేంద్రీకరించి, ఒకే ఒక్క కరాటే ఛాప్ ఇచ్చాడు సాగర్.

    ఫట్ మని  మణికట్టు ఛాకా విరిగి, కింద ఆ మనిషి చెయ్యి! ఖణేల్ ఖణేల్ మని శబ్దం చేస్తూ దూరంగా దొర్లిపోయింది.

    అయినా వెనుకంజ  వెయ్యలేదు ఆ మనిషి. మీద మీదకు వస్తూనే వున్నాడు.

    ఆశ్చర్యంగా చూశాడు సాగర్.

    అప్పుడు అర్ధమైంది అతనికి.

    ఆ జలాంతర్గామిలో, మసక చీకట్లో మెసులుతున్న ఆ ఇద్దరూ మనుషులు కారు.

    మరమనుషులు, రాబొట్స్.

    రాబొట్స్ కంట్రోలు చేస్తున్న జలాంతర్గామి ఇది. ఏ దేశం పంపింది దీన్ని? భారతదేశానికి ఇంత దగ్గరగా ఎందుకు తిరుగుతోంది ఇది? ఏం చేస్తోంది? ఏం చెయ్యబోతోంది?

    ఈ పరిస్థితుల్లో తను ఏం చెయ్యాలి?

    అతను ఆలోచిస్తూ వుండగానే , జరుగుతున్న గొడవను చూసిన రెండో రాబొట్ కంట్రోల్స్ దగ్గరనుంచీ లేచింది.

    రెండు రాబొట్స్ రెండు వైపులనుంచీ సాగర్ మీదకు ఉరికాయి.

 Previous Page Next Page