Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 17

    ఆ వచ్చిన వ్యక్తీ కస్టమ్స్ అఫీసరూకాదు, కస్టమరూకాదు, ఓ ఆడపిల్ల. ఆ సమయంలో ఆ బీచ్ లో ఘోరాలు ఎన్నో జరుగుతుంటాయి స్మగ్లింగ్ కార్యకలాపాలు నమ్మకం మీద జరుగుతుంటాయి. ఎక్కడహామీ పత్రాలు, నోట్లు, రేవున్యూ స్టాంపులు అనేవి వుండవు. అంత మాటలమీద జరగాలి. ఎక్కడ ఏ చిన్నా పొరపాటు జరిగినా అవతల వ్యక్తితోపాటు అతడి కుటుంభం, అతడి స్నేహితులు... అనుచరులు కూడా బలయిపోతారు. దొంగసరుకు రవాణా అనేక సరుకుని అతి జాగ్రత్తగా పోలీతిన్ బ్యాగ్స్ లో పెట్టి ఆపైన సీలు చేసి పెద్దా బందిల్ గ కడ్తారు. ఓడ క్రింద తగిలి స్తారు. ఓడలో ఈ దొంగసరుకుండదు. ఓడతోపాటు నీళ్ళలో ఈ సరుకు వస్తుంది. ఓడ రేవుకి కొన్ని కోలోమీతారు దూరాన ఆగుతుంది. సముద్రములోని సరుకుని సముద్రములోనే అమ్మడం ఒక పద్దతి. తీరానికి తీసుకొచ్చి  అమ్మడం రెండోవా పద్దతి. సముద్రములో సరుకుని సముద్రములోనే అమ్మితే చాలా చౌకధరకు అమ్మవలసి వుంటుంది. అలాగాక  తీరానికి తీసుకొస్తే రూపాయి వస్తువు ఏబై రూపాయలవుతుంది. సరుకుని ఓడ నుంచి తీరానికి తీసుకొచ్చేవారిని జేట్టీలంటారు. తీరాన కొన్ని పాయింటే' అని గుర్తులు పెట్టుకుంటారు. జేట్టెలు సరుకుని తీసుకొచ్చి ఆ పాయింట్స్ కి దగ్గర స్మగ్లర్ల కి హేండ్ ఓవర్ చేయాలి. జేట్టీకి స్మగ్లర్స్ కొన్ని గుర్తులుంటాయి. విజల్స్ గని, బ్యాటరీగాని ఇరుపక్షలలో ఒక్కరూ ఉపయోగించరు. బోట ఓడనుంచి సరుకుతో తిన్నగా పాయింట్స్ కి రాదు. తీరానికి కొమ్తదూరణ బోట ని ఆపుతారు. స్మగ్లర్ల తీరానికి వచ్చి పాయింట్స్ దగ్గర బోట ని చూసి స్మగ్లర్ అగ్గిపుల్ల గీసి పడేస్తాడు. తన పార్టీ అని నిర్దారించుకున్న జేట్టీ పాయింట్ దగ్గరకు వస్తాడు. అప్పుడు అక్కడ గీసే అగ్గిపుల్లల సంఖ్యనిబట్టి తన పార్టీ అని నిర్దారించుకుని పాయింట్ కి చేరతాడు. కొన్ని పర్యాయాలు ఆ పాయింట్ దగ్గర కస్టమ్స్ వారి హడావడి వున్నా పక్షంలో స్మగ్లర్ మొదటిపాయింట్ , రెండోవా పాయింట్, మూడోవ పాయింట్... అని మూడు సంకేత స్థలాలు చెబుతాడు. మొదటి పాయింట్ దగ్గర సిగ్నల్ రాణి పక్షంలో కొద్ది సేపు వేచిచూసి రెండోవా పాయింట్ కి వెళ్ళడం, అక్కడ గూడా సిగ్నల్ రాకపోతే జేట్టీ మూడోవ పాయింట్ కి వెళ్ళడం జరుగుతుంది. సరుకు డెలివరీ యిచినందుకు జేట్టీకి కమిషను ముడుతుంది. సరుకు వివరాలతో జేట్టీకి పనిలేదు.

    జేట్టీ సముద్రంలో వుండగా ఎటాక్ చేయడానికి క్కస్తంస్ వాళ్ళు సయితం భయపడుతారు. నీటిలో మొసలి ఎంత బలవంతురాలో , సముద్రంలో జేట్టీ అంతటిశక్తీ మంతుడు. కస్టమ్స్ వారి దగ్గర ఎటువంటి అయుధాలున్నయో అంతకన్నా శక్తివంతమైన ఆయుధాలు జేట్టీ దగ్గరుమ్తాయి. పైపెచ్చు జీతపురాళ్ళాకోసం పనిచేసేవారు కస్టమ్స్ అధికార్లు.

    బ్రతుకుతెరువు కోసం ఆ విత్తిని చేపట్టినావారు స్మగ్లర్లు. ఈ వృత్తిని కోనసాగిస్తే అల్పకాలంలో ఐశ్వర్యవంతులు  కావచ్చు.... తమ పిల్లలు, పిల్లల పిల్లలు హాయిగా బ్రతకొచ్చు అన్న ఆశతో జెట్టీలు పోరాడతారు. ల్కస్తంస్ అధికారుల్నించి తప్పించుకోలెం అన్న స్థితిలో జెట్టీలు సముద్రంలోకి దూకి తమ బోటతో కస్టమ్స్ అఫేసర్స్ బోట ని డీకొట్టిన సంఘటనలున్నాయి చరిత్రలో!

    స్మగ్లింగ్ కార్యకలాపాల్ని అరికట్టడానికి ద్రవ్యోల్బణం సృష్టి స్తున్న స్మగ్లర్స్ దాడి చేయటానికి కంకణం కట్టుకున్న నిజాయితీపరులయిన ఆఫీసర్లు లేకపోలేదు. జెట్టీలు... కస్టమ్స్ అఫేసార్లు పాము... ముంగిసలాంటివారు. స్మగ్లింగ్ చాలా తెలికైనా పని అయితే ఈ దేశంలో అధిక ద్సంఖ్యాకులు దానినే వృత్తిగా చేపట్టేవారు.

    సముద్రం మీదనుంచి  సరుకు తీరానికి తీసుకు రావడం ఒక పద్దతిఅయితే, దేశంలోని  ఒక ప్రాతం నుంచి మరోప్రాతానికి చేరవేయడం (రైలు,రోడ్డు,విమాన మార్గాన) మరొక పద్దతి. ఇక్కడ ఎక్కడా సరుకు ఇచ్చిన వ్యక్తినిగాని, డెలివరీ తీసుకునే వ్యక్తిని గానీ డైరెక్టర్ గా సీనులోకిరారు. సరుకు కూడా చాలా చేతులు మారి చేరవలసిన చోటుకి చేరుతుంది. సరుకు విలువనుబట్టి ఎవరికీ వారికి పెర్సంటేజ్ అందుతుంది. అందువల్లనే స్మగుల్ద్ ధరలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. స్మగ్లర్ల భాష కూడా ప్రత్యేకంగా వుంటుంది. 'చిన్నపెట్టి' అంటే దృష్టిలో లక్షరూపాయలు 'పెద్దపెట్టి' అంటే పదిలక్షలు.

    స్మగ్లింగ్ కర్యాకలపంలో పట్టుబడకుండా రక్షణ, పట్టుబడితే తమని బయటకు తీసుకు రావడానికి.... తన కుటుంభానికి ఆదుకోవడానికి 'పెద్ద అండ' కావాలి ఆ పెద్ద అందని 'దాదా' అంటారు. ఈ పదాలు రాజకీయ నాయుకుల్ని, ప్రభుత్వ అధికర్లని శాశించగల సత్తా వున్నావారు. అవసరమైతే మాట కలహాలు సృష్టిస్తారు. అరాచకం సృష్టిస్తారుప్రభుత్వ పడిపోయేవరకు మిశ్రమించరు.

    రాజకీయ నాయుకులు తమ పార్టీ....ఓటర్ల ఆర్గనైజేషన్ కోసం ఒక వైపున 'దాదా' ల పైన, మరో వైపున 'ఫండ్స్' కోసం ఇండస్ట్రీయలిస్టు పైన ఆధారపడతారు.

    ప్రముఖ పారిశ్రామిక వేత్తా ఏం.వి.అయ్య. పారిశ్రామికంగా 'నెంబర్ వన్' స్థానాన్ని విలువకోవడానికి డిఫెన్స్ మినిష్టర్ కూమార్తె 'తంబి' సహాయాన్ని అర్దించింది.

    కావ్య ఓంటిమీద హాఫ్ ప్యాంటు, లోపలకి షార్ట్ టక్ చేసి వుంది. పైన పెట్టీకోటు, కాలికి కాన్వాసు బూతు, తలకు టోపి, కళ్ళకి గ్లాసెస్ ఆమె తెల్లటి శరీరంమీద వెన్నెల మరింతగా మెరుస్తోంది.

    "ఇంజన్ అన్ చెయ్యరా..." తంబి కేక విని ఇంజన్ స్టార్ట్ చేశాడు. బోట్ కి, ఒడ్డుకి మధ్య నీళ్ళున్నాయి. అదే పాసెంజర్స్ ని తీసుకెళ్ళే పడవలయితే చెక్కవేస్తారు. కాని ఈ పడవకీ అలాంటి సౌకర్యంలేదు. నీళ్ళలోకి దిగడం ఆమెకు అలవాటులేదు. "ఎలా" అని చూడసాగింది. ఆమె సందిగ్డతను అర్ధం జేసుకున్న తంబి తటాలున నీళ్ళలోకి దిగాడు. ఆమెను రెండు చేతులతోనూ లేవా నేత్తాడు. బలిష్టమయిన అతడికి బాహువుల్లో బొమ్మలా మిగిలిపోయిన ఆమెను అతి జాగ్రత్తగా బోట్ లో దించాడు. పడవ బయలుదేరింది.

   
                                                            *    *    *    *

 Previous Page Next Page