తండ్రి మాటలకు సమాధానంగా స్తబ్దుగా వుండిపోయింది. కావ్యకొద్దిసేపు. తిరిగి అన్నది__
"ఇట ఈజ్ ఏ గుడ్ బిజినెస్. టు ప్రమోట్ దట్ ఇండస్ట్రీ 'ఎషో ఉమన్ ఆర్ అట లిస్టు షోమాన్' కావాలి. ఇండస్ట్రీ ఎంతవరకు వచ్చిందట..."
"ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. ప్రాజెక్టు రిపోర్టు తయారుయితే మిగతా పనంతా ఫోను మీద చేయించుకోగలడు ఏం.వి.అయ్య. అతనికి ఆ గుడ్ విల్స్ వుండి. ప్రమోటర్లీ ఆర్ ప్లెంటి. షేర్ బ్రోకర్స్ కి అతడంటే క్రేజ్..." ఇంకా ఏదో చెప్పుకుపోతూనే వున్నాడు వడయారు. కాని కవ్యకి అదేమీ వినిపించలేదు. షేర్ మర్కెట్ లో ఏం.వి.అయ్య. కున్న పరపతి ఆమె మదిలో మెదులుతోంది. బిజినెస్ వరల్డు మ్యాగజైనులో అతడికి లభిస్తున్న 'ఎ_ర్యాంక్' ఆమెను ఆ ప్రమత్తురాల్ని చేస్తోంది. షిప్పింగ్ కార్పోరేషన్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాలని ఆమె ఎంతగానో ప్లాను చేసింది. కాని ఆమె అంచనాలను తలక్రిందులు చేస్తూ ఏం.వి.అయ్య.కొడుకు రంగా ప్రవేశం చేశాడు. ప్రత్యర్దిని తక్కువుగా అంచనావేసి తానెంత పొరపాటు చేసిందో ఆమెకి అర్దమయింది.
"డాడీ! ఈ రాత్రికి సముద్రం మీదకు సర్వేకి వెళుతున్నాం. నేను తిరిగి వచ్చేలోపు ఏం.వి.అయ్య కొడుకు ప్రారంభిస్తున్న ఆ పోలీలెన్స్ ఫైబరీ గ్లాసెస్ ప్రాజెక్ట్ రిపోర్టు కాఫీ తెప్పించగలరా?" అనడిగింది.
ఆ ప్ర్జేక్ట్ రిపోర్టు కాఫీ సంగతి అయన మనసుకి నాటినట్లు లేదు. ఆమె సముద్ర ప్రయాణం విషమమై ప్రశ్నల వర్షం కురిపించసాగాడు.
* * * *
మాదాల వెంకట్రామయ్య తన కొడుకు తలపెట్టిన పోలీలెన్స్ ప్రాజెక్టు గురించి ఆలోచించడం ల్డు. అతడి ఆలోచనలన్నీ వదయారు కూతురు ప్రారంభిస్తున్న షిప్పింగ్ కార్పొరేషన్స్ పైనే వున్నాయి. ఆ కార్పోరేషన్ ప్రాజెక్టు కాఫీ చూస్తున్నా అతడికి ఆ ఆడపిల్ల డైనమిజన్ అర్దమయింది. ఆమెను అదుపులో పెట్టడం తనకి సాధారణమయ్యేపనేనా? అన్న అనుమానం కలిగింది. ఆ క్షణాన అతడి నుదుట మీది గీతాలే అతడి మనోభావాలను సూచిస్తున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే డిఫెన్స్ మినిస్ట్రీ సెక్రటరియేట్ కి ఫోన్ చేశాడు. డిఫెన్స్ మినిస్ట్రీ సెక్రటరి ఎట్ మెంట్ తీసుకున్నాడు.
* * * *
వెంకట్రామయ్య కొడుకు పోలీలెన్స్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు తెలుసుకున్నా కావ్య రెట్టింపు పట్టుదలతో తన కార్యక్రామాన్ని త్వరితము చేసిందిగాని మాదల వెంకట్రామయ్య శక్తియుక్తుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఏ మాత్రం అనుమానించినా ఆ రాత్రి సముద్రంమీదకు బయల్దేరేదికాదు. మాదల వెంకట్రామయ్య ఫోన్ బుక్కింగ్ చేయిస్తే సరిపోయేది. ఆ ఆలోచన ఆమెకు రాకపోవడం ఆమె దురదృష్టం.
వ్యాపరమన్న తర్వాత కుయుక్తులు, ఎత్తుకు పైఎత్తులు సర్వసాధారణం. ఒక రకంగా ఇదికూడా తన కూతురికి ఒక పాఠం అవుతుందనుకున్నాడు మాదాల వెంకట్రామయ్య ప్రతిభా పాఠవాలు తెలిసిన వడయారు.
* * * *
ప్రతిదానికి ఏదో ఒకచోట 'ప్రారంభం' వుంటుంది. ఆ ప్రారంభానికి నంది పడింది. మనిషిలో వుండే అరచాకత్వపు అధమస్థాయిని చూసినవాడు- తనకోసం ఒక్కగానోక్కారుకూడా ఏడ్చేవాడు లేనివాడు లక్షలు? కోట్లు, కార్లు వీటిల్లో ఏ ఒక్కటీ 'సంతృప్తి' ఇవ్వలేని అసంతృప్తి జ్వాలతో రగలిపోతున్నాడు__ జీవితంలో మేటాఫిజికల్ ఖయాకి లోనయినవాడు__ ఖాకీబట్టల్ని కాసులతో కోనేసినవాడు నాంది పలికాడు వాడు_ తంబి.
దేశంలో అత్యంత ధనబలం. రాజేకీయహంగు వున్నా మాదల వేమ్కత్రంయ్యకి కూడా తెలియదు_ పతికేళ్ళాక్రితం ఇసుకలో వదిలేసినా ఓ పసికూన తన కంట్లో నలకలా తయారు కాబోతుందని; తనను అతలాకుతలం చేయబోతుందని! చేస్తే మాదాల వెంకట్రామయ్య డిఫెన్స్ మినిస్టరు ప్రిన్సిఫల్ సెక్రటరీ కలిసే ప్రయత్నం చేసేవాడు. వేటలో పరుగెత్తే గుర్రంలా ఆ బీచ్ కి వచ్చేవాడు.
తీరాన స్ట్రీమ్ బోటు ఆగివుంది. ఆ బోటులో నేల రాజులకి నలుగురికి సరిపడే భోజనం, మంచినీళ్ళు, డీసిల్ తదితర సామాగ్రి వుండి. కార్యదీక్ష కవచంపై కోటు వేసుకున్న తంబి పెదవులపై గాంభీర్యం గడ్డకట్టుకుని వుంది! కోటు జేబులో మౌత్ అర్మనీ! తంబి 'జేట్టీ' కడుతున్నాడంటే నూటికి నూరుపాళ్ళు సరుకు సురిక్షితంగా చేరుతుందని స్మగ్లర్స్ అందరకీ తెలుసు. తంబిలో వున్నా గొప్పదనం అదే! దేన్నీ ఎక్కడ ఏ విధంగా సాధించాలో అతడికి తెలిసి నట్లుగా మరెవ్వరికీ తెలితాడు. ఎవరెవరికి ఏఏ లింకులున్నాయో బాగా తెలుసుగనుకనే వ్యవహారం ఎక్కడ బెడిసి కొడుతుందో ముందుగా ఊహించగలడు. వ్యవహారాన్ని చక్కబెట్టగలడు.
నాలుగొందల కిలోమీటర్ల పొడవున్న ఆ సముద్ర తీరాన పొరపాటున ఎవరయినా సిన్సియర్ పోలీసు అధికారి ఎదురయితే, బీచ్ లో అలికిడి తగిలిన పీతలా క్షణాలలో వారి కళ్ళముందే అదృశ్యం కాగలదు. అంతకుమించి 'తంబి' యితరుల వ్యవహారాలలో అనవసరంగా జోక్యం కల్పించుకోడు తనదోవకు అడ్డుగా వచ్చినవాడు పోలీసు అధికారి అయినా, బడా గుండా అయినా వాడి పీక కత్తిరించకుండా వదిలిపెట్టడు.
ఈ పర్యాయం తమ్భి ఎవరికీ జేట్టీ కడ్తున్నడో స్టీమ్ బోట్ లో వున్నా ఆ యిద్దరీకి కూడా తెలియదు. అందుకే ఆసక్తిగా ఆ యిద్దరు కూడా తీరం వైపు చూస్తున్నారు. కడలి కెరటాల సవ్వడి మినహా మరో శబ్దం వినరావడం లేదు... అంతటా నిశ్శబ్దం ఆవరించింది.
దూరంగా ఆస్పష్టంగా ఓ ఓడ కదలడం గమనించారు బోట్ లోనివారు.తంబికి సైగచేశారు.