యస్య నిఃశ్వసితం వేదా యో వేదేభ్యో2ఖిలం జగత్|
నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ || శ్రీ మదాంధ్ర వచన అథర్వవేద సంహిత మూడవ కాండ
మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
పరసేనా మోహన కర్మమున ఫలీకరణ లేక కణికిక కలిపిన అన్నపిండమును సంగ్రామాగ్నియందు ఉలూఖలముచేహోమము చేయుట యందు. ఈ కర్మమందే 21 ఇసుక రేణువులను శత్రు సేన వైపు చల్లవలెను.
అప్వాఖ్వ దేవతకు దీనిచే చరు హోమము చేయవలెను.
1. అగ్ని మా శత్రువు మీద పడును గాక. విద్వాంసుడగు అగ్ని మమ్ము ద్వేషించు వారిని దహించును గాక. వారికి అభిముఖుడై సాగును గాక. జాతవేదాగ్ని శత్రుసేనను మోహింప చేయును గాక. శత్రుసేనను ఆయుధము ఎత్తకుండ చేయను గాక.
2. మరుత్తులారా! మీరు ఉగ్రులు. ఈ భీషణ సంగ్రామమున నాతో నిలువండి. శత్రువును వధించుటకు వారికి ఎదురు వెళ్ళండి. వసువులారా! మా ప్రార్ధన వినండి. మా శత్రువులను సంహరించండి. విద్వాంసుడు, మరుత్తుల దూతయగు అగ్ని కూడ పరసేనల మీద పడును గాకు.
3. మఘవ ఇంద్రా! మా అమిత్ర సేనలను శత్రువులను వధించుము. నీవు వృత్రహంతవు కదా! అగ్నితో కలసి శత్రుసేనను భస్మము చేయుము.
4. ఇంద్రదేవా! హర్యశ్వముల రథము మీద పల్లపు మార్గమున వచ్చు శత్రుసేన మీద పడుము. అప్రతి హతమగు నీ వజ్రము శత్రువుల మీద పడును గాక. ముందునుంచి, వెనకనుంచి, పక్కల నుంచి పడు సేనలను సంహరించుము. శత్రువు హవన కార్యోద్యుక్తుడై ఉన్నాడు. అతని మనసును వికలము చేయుము.
5. ఇంద్రా! అమిత్ర సేనలను మోహవశులను చేయుము. వాయువు, అగ్ని కలిసినంత వేగము గల మంటల వంటి దాహమున శత్రు సేనలను చుట్టు ముట్టి దహించుము.
2. అగ్ని దేవా! శత్రువుల హృదయములందు మమ్ము అణచి వేయవలెనను ఆరాటమున్నది. దానిని మోహపరవశను చేయుము. వారిని వారి స్థానముల నుండి తొలగించుము.
3. ఇంద్రా! శత్రువుల చిత్తములను మోహింప చేయుము. శత్రు సంహారమందు నీ మనసును కేంద్రీకరించి శత్రుసేనల ముందు నిలువుము. నీవు వాయువుతో అగ్ని కలసినంత ప్రచండ వేగవంతుడవగుము. శత్రువును పారద్రోలుము. ధ్వంసము చేయుము.
4. శత్రువు మనసులందు వివిధ విరుద్ద సంకల్పములు కలుగును గాక. వారికి చిత్తభ్రమ కలుగును గాక. శత్రువుల మనసులందు యుద్దమునకు ఉద్యమించు ఆలోచనలు ధ్వంసమగును గాక.
5. అప్వే! మా శత్రువుల చిత్తములను మోహింప చేయుము. వారి ప్రత్యంగమున ప్రవేశించుము. మా శత్రువు మీద పడుము. వారిని దహించుము. వారి హృదయములందు దుఃఖమును నింపుము. శత్రువును చీకటిలో పడవేసి వధించుము.
6. మరుత్తులారా! శత్రుసేన బలములు కూర్చుకొని మా మీదకు వచ్చుచున్నది. మీ వద్ద గల సకల విఘ్నకర శక్తులచే వారికీ అంధకారము అగునట్లు చేయండి. ఈ శత్రువులను ఒకడు, మరొకరిని తెలియకుండునంతటి చీకటిన త్రోసి వధించండి.
మూడవ సూక్తము - 3
వినియోగము :-
1) శత్రువుచే తరిమి వేయ బడిన రాజును తిరిగి రాజ్య ప్రవేశము చేయించుట. శత్రుసేన ఆకారము గల పురోడాశమును నీళ్ళలో దర్భలను పరచి పెట్టవలెను. దాని మీద మట్టి పెడ్డ పెట్టి ముంచవలెను. క్షీరాన్నమును ఈ సూక్తముచే సంపాతన, అభిమంత్రణ చేసి రాజునకు తినిపించ వలెను.
1. అగ్నిదేవా! ఇతడు రాజ్యభ్రష్టుడు తిరిగి తన రాజ్యమున ప్రవేశించుటకు నిన్ను పిలుచుచున్నాడు. ప్రార్ధించుచున్నాడు. ఇతడు తన ప్రజను పాలించునట్లు అనుగ్రహింపుము. ఇతనిని రక్షించుటకు నీవు ద్యావా పృథ్వులందు పరివ్యాప్తుడవగుము. మరుత్తులు నీకు సాయపడుదురు గాక. ఇతడు నీకు నమస్కరించుచున్నాడు. హవి అర్పించుచున్నాడు. ఇతనిని తిరిగి అతని రాజ్యమున ప్రతిష్టించుము.
2. ఋత్విక్కులారా! దూరముగా స్వర్గమందున్న ఇంద్రునితో ఈ రాజునకు స్నేహము కలిగించండి. దేవతలు ఇంద్రుని గాయత్రి, బృహతి చందస్సులతోను, పూజనీయ సౌత్రామణి చేతను పరమ వీరుని చేసి ఉన్నారు.
3. పరాజిత రాజా! వరుణుడు నిన్ను జలము నుంచి పిలుచును గాక. సోమము పర్వతముల నుండి పిలుచు గాక. ఇంద్రుడు నీ ప్రజనుండి పిలుచును గాక. అట్లు వారిచే పిలువబడి డేగవలె నీ రాజ్యమున ప్రవేశింపుము.
వ్యాఖ్య - 'దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ భావము ఇందు కనిపించినది.
జలమును, పర్వతమును, ప్రజలను మాత్రమే దేవతలు విముక్తము చేసినారు. నేలను కాదు మట్టి కన్నా మనుషులు ముఖ్య మనియే కదా!
రాజు తన ప్రజను తీసికొని జలమున్న పర్వత ప్రాంతములకు చేరి పాలించినాడనియు భావము కావచ్చును.
"శ్యేనో భూత్వావిశ" డేగవలె ప్రవేశించుట ఒక వాయు యుద్దపద్దతి. పదాతులను అతిక్రమించి విమానములే ఆక్రమించుట. ఈ పద్దతిని రెండవ ప్రపంచ యుద్దమందును, బంగ్లాదేశ విముక్తి సమర మందును అనుసరించినారు.
4. ప్రశంసనీయ వేగవంతులగు దేవతలు పరులు ఆక్రమించిన రాజ్యమందు ఈ రాజును ప్రవేశపెట్టుదురు గాక.
అశ్వినులు మార్గములను సుగమములు చేయుదురు గాక. ప్రజలు ఈ రాజును సేవింతురు గాక.
5. రాజా! నీకు ప్రతికూలురగు ప్రజా అనుకూలురై నీకు సహకరింతురు గాక. నీకు ప్రతికూలురైన మిత్రులు అనుకూలురై స్నేహమున వర్తింతురు గాక. ఇంద్రుడు, అగ్ని, విశ్వేదేవతలు నీకు ప్రజలను రక్షించు శక్తి కలిగింతురు గాక.
6. రాజా! నీవు నీ రాజ్యమున పునః ప్రవేశము చేసినపుడు నీతో సమాన బలవంతులును, తక్కువ బలవంతులును నీకు స్వాగతము పలుకుదురు గాక.
ఇంద్రదేవా! ఈ రాజ్యము నుండి సర్వ విధ శత్రువులను బహిష్కరించి ఈ రాజును రాజ్యమున ప్రసిద్దుని చేయుము.
నాలుగవ సూక్తము - 4
వినియోగము :- మూడవ సూక్తము వలెనే.
2) ప్రయా ణేష్టి యొక్క పథ్యాస్వస్తి యాగాను మంత్రణమున ఏడవ మంత్రము వినియోగము.
1. రాజా! శత్రువులు ఆక్రమించిన నీ రాజ్యము నీకు సంక్రమించినది. బలవంతుడవు, ప్రసిద్దుడవు ఆగుము. మరల ప్రజా పాలకుడవై. శత్రురహిత రాజ్యమున తేజరిల్లుము. నాలుగు దిక్కులు, వాటి అధిష్టాన దేవతలు, సకల దిశల ప్రజలు నిన్ను ప్రభువుగా స్వీకరింతురు గాక. నీ రాజ్యమందలి సకల ప్రజా నీకు నమస్కరించి, నిన్ను సేవింతురు గాక.
2. రాజా! ప్రజలు నిన్నే ప్రభువుగా కోరుకుందురు గాక. మధ్య దిశ సహితముగా అయిదు దిశలు నిన్ను సేవించును గాక. తదుపరి నేలకు నూపురము వంటి సింహాసనమున ఆసీనుడవగుము. ప్రచండ బలశాలివి ఆగుము. సేవకులకు ధనము అందించుము.
3. రాజా! నీతో సమానులగు రాజులు నీ ఆజ్ఞను తలదాల్తురు గాక. నీ దూతలు అగ్ని వలె సర్వత్ర అప్రతిహతులై సంచరింతురు గాక. నీ భార్యా పుత్రులు సంతోషింతురు గాక. నీవు మహా బలవంతుడవై నీ ముందున్న కానుకలను వీక్షింపుము.
4. రాజా! అశ్వినులు, మిత్రావరుణులు, మరుద్గణములు నిన్ను రాజ్య ప్రవేశము చేయింతురు గాక. తదుపరి నీ మనసు దానము లిచ్చుటందు లగ్నము చేయుము. నీవు ఉగ్రుడవై సంపదలను అనుభవింపుము.