Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 15

    " ఆగండాగండి. మిరు నిజమే చెపుతున్నారా?" అప్పటికే హడలిపోయిన అబ్బులు అడిగాడు.

    " పోనీ ఒసారి అలా వెళ్ళి చూసొద్దామేమిటీ?" అబ్బులు చెవి కొరికాడు వ్యాకర్ణ.

    " నిజం చెప్పాలంటే అన్నీ నిజం చెప్పటంలేందండీ.శాంపిల్ అంతే అంతే!" అంది జయచిత్ర.

    " ఇలా అయితే మరెలాగండి?" అన్నాడు అబ్బలు.

    " ఓ అని చెయ్యండి."

    " చెప్పండి."

    " మిరు రూమ్ లోంచి బయటికొచ్చి, బాత్ రూమ్ కెళ్ళే మార్గంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తలు చెపుతాను మననం చేసుకుని కడుజాగరూకతతో మసలిన కాష్ఠంబులు రావు.

    " కానీండి కానీండి."


    " ఎడంవైపు మార్గంబున వృద్దకన్య మోము చూడక మి మెడ కుడివైపుకి పూర్తిగా తిప్పుకుని-

    ఆపై పడమటివైపు అనుమానం మొగుడి వాటా ముందు పూర్తిగా తల దించుకుని వెళ్ళితే ఎందుకైనా మంచిది. కాస్త నడుం కూడా వంచి ముందుకి సాగి-

    అప్పుడు చెమిటిమాలోకానికి మళ్ళీ వస్తానని సౌంజ్ఞచేసి గబుక్కున తూర్పుకి పారిపొండి. భజన బృందంగారి ఫ్లేసులో ఎత్తెత్తి అడుగులేస్తూ సాగితే."

    " ఏదీ మళ్ళీ చెప్పండి" అన్నాడు అబ్బులు.

    మళ్ళీ చెప్పమంటారా?" అని మల్లె చెప్పింది జయచిత్ర.

    " ఏమండీ జయచిత్రగారూ! తగు జాగ్రత్తలు చెప్పారు బాగానే వుంది. మా అబ్బులుగాడు నాలుగు కళ్ళతో ఎదుటి వాటిని చూస్తూ కూడా గుద్దేస్తుంటాడు. అలాంటిది తలొంచుకు నడిస్తే ఎవరినో ఒకరిని గుద్దేయక తప్పదు అప్పుడు?" అంటూ వ్యాకర్ణ ఆగిపోయాడు.

    " ఎలా అండి" అన్నాడు అబ్బులు భయపడిపోతూ .

    " లాభం లేదు యిన్ని జాగ్రత్తలు ముందుగా మికు అదీ నేను మంచిపిల్లను గాబట్టి చెపితే ఏమాత్రం లక్ష్యం లేకుండా మాకూ ఓ అలవాటుంది గుడ్డుతాం, తంతాం అంటే ఎలాగండి? అసలు-

    జయచిత్ర మాటలు పూర్తిగాకముందే బామ్మగారు హడావిడిగా లోపలినుంచి వచ్చేశారు. వచ్చి, " ఎళ్ళుండీ నాలుగునలబైకినిమిషాలకి వర్జ్యం లేదు. అన్ని విధాలా మంచిది. అప్పుడొచ్చి గదిలో చేరండి" అంది ముళ్ళకిరీటం సరిచేసుకుంటూ.

    " ఎళ్ళుండి మంచికాదు నానమ్మా! శనివారం శని పట్టుకుంటుంది" అంది జయచిత్ర.

    " నీ ముఖం కాదూ! శనివారం దివ్యమైన రోజు వెంకటరమణునికి ప్రీతికర మైన దినం" అంది బామ్మగారు.

    ఆలస్యం అమృతవిషం అని గబుక్కున అందుకని " యాది వెరకు మేము ఆ యింట్లో చేరినప్పు శనివారమే చేరాము. దివ్యమైన రోజంటే శనివారమే బామ్మాగారూ!" అన్నాడు వ్యాకర్ణ.

    " హ్హో... దివ్యమైన రూజు చేరారు కాబట్టే దివ్యంగా యిల్లు మారుతున్నారు ఇదెందుకొచ్చిందో?" వ్యాకర్ణని ఓరకంటితో చూస్తూ అంది జయచిత్ర.

    " ఈ పిల్ల ముక్కు చెవులు కోయాలి" కోపంగా అనుకున్నాడు వ్యాకర్ణ.

    " భడవఖానా! అన్నీ భడవా మాటలు, అల్లరి, భయపెట్టి ఆడిస్తుంది. దాని మాటలు కేం నయానా! ఎల్లుండి వచ్చేసేయండి" అభయహస్తమిచ్చింది బామ్మగారు.

    అలాగే అని జాయింట్ గా బుర్రలూపి బామ్మాగ్రి వద్ద శలవు తీసుకుని ఎందుకైనా మంచిదని జయచిత్రక్కూడా చెప్పి శలవు పుచ్చుకుని అక్కడినుంచి కదిలారు అబ్బులు, వ్యాకర్ణ.

    బామ్మగారు లోపలి కెళ్ళిపోయారు.

    జయచిత్ర ఆలోచిస్తూ కూర్చుంది.

    వ్యాకర్ణంతో చాలా కష్టం. మొండి శిఖండి ఈ వ్యాకర్ణ కూడా ఆ బాపతు జాతివాడు లాగానే వుంది.

    తెల్లగా బొద్దిగా మెడలదాకా వేలాడే గిరజాల క్రాపు పూల బుష్ కోటు మిసాలు నున్నగా చెక్కేసాడు సైడ్ లాక్స్ మాత్రం జానెడు పెంచాడు.  

 Previous Page Next Page