Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 14

    " మిరు మా యింటి కొచ్చింతర్వాత ఎంత జాగ్రత్తగా వుండాలో ఎందుకు చేపుతుంనాను? మి శ్రేయస్సు కోరి.

    ఆడపిల్లని మొదటిసారి అత్తారింటికి పంపేతప్పుడు ఆత్తారింట్లో అక్కడి మనుషులతో ఏమ్త్య్హ జాగ్రత్తగా వుండాలో ఎందుకు పెద్దవారు చెపుతారు?

    ఆ పిల్లకి ఏం తెలియదు కాబట్టి, వెళ్ళేది కొత్త ప్రదేశం ,మెలిగేది కొత్త మనుషుల మధ్య కాబట్టి..."

    జయచుత్ర వాక్ ప్రవాహానికి అడ్డు తగిలి " ఇప్పుడు మేం వెళ్ళేది అత్తాతింటికి కాదుకదండీ? అద్దె యింట్లోకాయె" అన్నాడు బిక్కముఖం వేసుకున్న అబ్బులు.

    " ఛా... ఛా... ఛా... మరీ పసిపిల్లవాడిలా మాట్టాడ తారేమిటండీ? అత్తారింటికి హాయిగా వెళ్ళవచ్చు, అద్దెయింటి కెళ్ళి వుండటం మహా మహా కష్టం.

    ఎక్కడిదాకానో ఎందుకు రేపు మా యింటికొస్తారుగా తెలుస్తుంది. బాత్ రూమ్ కెళ్ళాలనుకోండి మా యింట్లో భాగాలన్నీ దాటుకుని వెళ్ళాలి కదా!

    ఓ భాగం దగ్గర తలవంచుకు నడవాలి. మరో భాగం దగ్గర వంగొని నడవారి. యింకో భాగం దగ్గర ముఖం ప్రక్కకు తిప్పుకు నడవాలి..."

    " ఇంకో భాగం దగ్గర పరుతీయాలనుకుంటానండి" కసిగా అన్నాడు వ్యాకర్ణ.

    " కరెక్ట్" అంటూ మెచ్చుకోలుగా వ్యాకర్ణని చూసింది జయచిత్ర.

    " ఈ పనులన్నీ ఎందుకు చేయ్యలండీ?" అడిగాడు అబ్బులు.

    " అలా అడిగారు బాగుంది" అని అబ్బుల్ని కూడ మెచ్చుకుని కధలోకి దిగింది జయచిత్ర.

    " ముందే చెప్పకదండీ మా యింట్లో రకరకాల మనస్తత్వం గల వ్యక్తులున్నారని... మిరు బాత్ రూమ్ కెళ్ళే ముందు రూమ్లోంచి బయటకొచ్చి ఎడంవైపుకి తిరుగుతారు కదా!

    అక్కడున్న వాటాలో వృద్ధకన్య అమాంతం " హానాధా వచ్చితివా!" అంటూ ముకు అడ్డు తగులుతుంది.

    అదెలాగో అలా తప్పించుకు నాలుగడుగులేసి పడమట వైపు తిరిగి పదడుగు లేశారనుకోండి మరో గండం అనుమానం మొగుడు అడ్డు తగిలి.

    " ఏమయ్యా! బుద్ధుందా లేదా! అసలు కొద్దిగా అయినా వుందా అని నా పెళ్ళాంవైపు ఎందుకు చూశావ్? అంతగా భరించలేకపోతే ఎవతో ఒకతిని పెళ్ళాంగా తెచ్చుకో. నీ పెళ్లాన్ని నే చూస్తే వూరుకుంటావా అంట? మాట్లాడవేమయ్యా ఏంటట్లా  చూస్తావ్ మళ్ళీ నా పెళ్ళాం కనపడుతుందా అనేనా?" ఇలా అరగంట సతాయిస్తాడు.

    అదెలాగో అలా తప్పించుకుని మూడడుగులు నడిచి దక్షిణానికి తిరుగుతారను కొండీ. చెమిటిమాలోకం తగులు కుంటాడు.

    " ఎక్కడికబ్బాయ్? లెట్రిన్ కా?" అంటాడు.

    మిరేమో " కాదండి బాత్ రూమ్ కి" అంటారు.

    వెంటనే ఆయన నవ్వి. " లెట్రిన్ లయితే అర్జంట్ గా వెళ్ళాల్సింది. బాత్ రూమ్ కయితే ఆలస్యమయినా ఫరావాలేదు. లెట్రిన్ కి కాదూ సరాసరి బాత్ రూమ్ కా.

    అయితే తొందరేం కాసేపు మాట్లాడి వెళ్ళండి. ఏంటంటున్నారు ఫరవాలేదనా? మి సంగతి నాకు తెలియదండీ!" ఇలా సాగుతుంది ఆయన గారి వాక్  ప్రవాహం.

    ఆ వాక్ ప్రవాహం నుమ్చిఒ బయటపడి తూర్పువైపు సాగారనుకోండి భజన బృందంగారి మడిమనుషులు అడ్డు తగిలి కాస్త ఆగండని చెప్పి ముమ్మల్ని నుంచోబెట్టి మి ముఖానే వల్ల పని కానిచ్చుకుని యిహ వెల్లోచ్చని చెప్పి-

    మిరు అల్లా వెళ్ళంగానే మిరు నడిచినంత మేరా లేక మి వీపుతో సహా పసుపు నీళ్ళు సుద్ధికై చల్లబడతాయి అప్పుడప్పుడు పేడనీళ్ళు కూడా. ఆవుపంచికం సరే సరి.

 Previous Page Next Page