Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 15


                                కళారవి

పోనీ, పోనీ,
పోతే పోనీ!    
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!

రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ, రానీ!

కానీ, కానీ!
గానం, ధాన్యం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ! పవీ! కవీ!

                                                                11-7-1734

                                            * * *

 Previous Page Next Page