ఆమె జవాబు చెప్పలేదు.
"మీరు నాకు థాంక్సే చెప్పలేదు..."
"థా...థా... థాంక్స్".
"ఒక 'థా' నా? మూడు 'థా' లా?"
వెనుకనుంచి నాయకుడు విహారిని కారులోకి తోశాడు. అతడు కారెక్కగానే "ఏయ్! నువ్వూ మాతో రా-" అన్నాడు తుపాకీతో సూచిస్తూ.
అందరి కళ్ళూ అటువైపు తిరిగాయి.
అక్కడ ప్రవల్లిక వుంది.
జనంలో కలకలం రేగింది. చీఫ్ అడుగు ముందుకేశాడు. ఆమె ఆయన్ని వారించి కారు దగ్గిరగా నడిచింది. పిల్లల్నించి ఆ ఉగ్రవాదుల్ని దూరంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళాలి. వీళ్ళు మనసు మార్చుకుంటే ప్రమాదం. ఒక స్త్రీగా వాళ్ళతో వెళ్ళడం దుస్సాహసం. కానీ పిల్లలకన్నా తనకొచ్చేది పెద్ద ప్రమాదంకాదు. పైగా తను బాధ్యతగల పోలేసు అధికారి.
విహారి ముందు సీట్లో కూర్చున్నాడు. ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకుని ఇద్దరు టెర్రరిస్టులు వెనుక చెరోవేపు కూర్చున్నారు.
కారు స్టార్టయింది.
అందరూ ప్రేక్షకులై నిస్సహాయంగా చూస్తూ వుండగా కారు క్రమక్రమంగా అదృశ్యమైంది. దాన్ని వెంటాడే ప్రయత్నం చేయలేదు చీఫ్. అది అనవసరం అని అతడికి తెలుసు.
* * *
అరగంట ప్రయాణం చేసి పక్కదారి పట్టింది కారు. ఘాట్ రోడ్డు ప్రవేశించింది. అడవి ప్రారంభమైంది.
ప్రవల్లిక బుష్ షర్టు మీద వుంది.
గోడ దగ్గిర రాళ్ళు ఎక్కేటప్పుడు పై బటన్ వూడిపోయింది. ఆమె దాన్ని చూసుకోలేదు. ఆమెది చాలా ఆరోగ్యవంతమైన శరీరం. మెడ క్రిందుగా నిలువుగీత- రెండో బటన్ దగ్గిర మడతలో అదృశ్యమవుతూ వుంది. అంత చీకట్లో కూడా ఆమె శరీరం తెల్లగా మెరుస్తోంది. కారు గతుకుల్లో పడ్డప్పుడల్లా ఆమె వక్షద్వయం పైకీ కిందకీ వూగడాన్ని ఆసక్తితో గమనిస్తున్నారు చెరోప్రక్క వున్న ఇద్దరూ. ఒకడు ఆ అమ్మాయి తొడమీద చెయ్యివేసి నెమ్మదిగా పైకి జరిపాడు. ఆమె దానిని తీసెయ్యడానికి ప్రయత్నం చేసింది.
ఇంతలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అన్నాడు- "ఆ పిల్లాడినీ అమ్మాయినీ వదిలి మిమ్మల్నిద్దర్నీ తీసుకురావటానికి ఎందుకు ఒప్పుకున్నామో మీరేమైనా ఊహించగలిగారా?"
ప్రవల్లిక, విహారి మాట్లాడలేదు.
పిస్టల్ కొసతో ఆమె మెడక్రింద గీతని రాస్తూ "పోలీస్ డిపార్ట్ మెంట్ కదా వూహించగలవా బేబీ?"
ఆమె ఒకచేత్తో పిస్టల్ తొలగిస్తూ మరో చేత్తో అతడి చెంపమీద కొట్టబోయింది. ఆ చేతిని గాలిలోనే పట్టుకుని, అతడు బిగ్గరగా నవ్వుతూ మొహంమీద ముసుగును తొలగించాడు.
ఆమె నిశ్చేష్టురాలయింది.
నాటకం జరిగినరోజు తను అరెస్టు చేసినవాడు! అనంతానంతస్వామి కారు డోర్ తెరిచి పట్టుకున్నవాడు - A2.
"మిమ్మల్ని ఎక్కించుకున్నది స్వీట్ గా పగ తీర్చుకోవడానికి బేబీ, ఆ రోజు నామీద పిస్టల్ పేల్చినందుకు నిన్ను, ఈ రోజు మావాడిచేతికి గాయం చేసినందుకు ఇతడిని తీసుకువెళ్తున్నాం. పాపం మీ వాళ్ళంతా మేము మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళి వదిలేస్తామని అనుకున్నారా?"
ఆమె అనుకోలేదు. అంతకన్నా ఆశ్చర్యం గొలుపుతున్న విషయం ఆమె మనసుని తొలిచేస్తూంది. సూర్యారావుమీద వీళ్ళు హత్యాప్రయత్నం చేశారు. మళ్ళీ అతడే ముఖ్యమంత్రి అవడానికి ఎలా వప్పుకున్నారు?
అదే అడిగింది.
వాళ్ళు ముగ్గురూ బిగ్గరగా నవ్వేరు.
కారు అడవి మధ్యలో ఆగింది. "దిగండి" అన్నాడు నాయకుడు. అందరూ దిగారు.
"అనంతానంతస్వామి లీలలు మీకు అర్ధంకావు. ముందు సూర్యారావు మీద హత్యాప్రయత్నం చేసినట్టు నటిస్తే- తర్వాత అతడిని ముఖ్యమంత్రిని చేసినా ఎవరికీ అనుమానం రాదు... ప్రజలకి అతడిమీద సానుభూతి వుంటుంది! స్వామి తాలూకు మూడో స్తంభం సూర్యారావే! రాముడు చందమామని అడిగినట్టు, సూర్యారావు స్వామిని ముఖ్యమంత్రి పదవి అడిగాడు. ఏం?... చావబోయేముందు ఈ రహస్యం షాక్ కలుగచేస్తోందా? మొత్తం ఇదంతా స్వామి ప్లానే... రాజకీయ చదరంగం!"
"పాలిటిక్స్... బ్లడీ పాలిటిక్స్" కసిగా అన్నాడు విహారి.
"పాలిటిక్స్ గురించి స్వర్గంలో ఆలోచిద్దువుగానిలే.... పద" అంటూ ఒకడు విహారిని పక్కగా తోసేడు. విహారి ముందుకు తూలాడు. విహారి ముందుకు తూలాడు. వీపు వెనుక పిస్టల్ పెట్టి తోసుకుంటూ ప్రవల్లిక నుంచి అతడిని దూరంగా చెట్లచాటుకు తీసుకు వెళ్ళాడు. అడవి అక్కడనుండి స్లోప్ గా వుంది. పెద్ద లోయ- అక్కడ ఆపాడు.
"లోయలోకి దూకి ఛస్తావా? పిస్తోలుతో కాల్చి చంపమంటావా?" నవ్వేడు టెర్రరిస్టు. "..... చూశావా నేనెంత మంచివాడినో! నిన్నే ఏది కావాలో కోరుకోమంటున్నాను".
విహారి మాట్లాడలేదు.
"బట్టలు విప్పు-"
విహారి అదిరిపడి చూశాడు.
"నువ్వు చచ్చిన తర్వాత గ్రద్దలకీ, జంతువులకీ నీ బట్టలు అడ్డు రాకూడదు. 'పరోపకారార్ధం మిదం శరీరం' అన్నారు స్వామి, చూశావా నాకెంత దయా గుణమో-"
వాడో శాడిస్టు అని గ్రహించాడు విహారి. చెప్పిన పని వెంటనే చెయ్యకపోతే మరింత చెలరేగిపోతారు ఇలాంటి వాళ్ళు. నిశ్శబ్దంగా బట్టలన్నీ విప్పి- డ్రాయర్ తో నిలబడ్డాడు.
వెనుకనుంచి 'ఫాట్' మని దెబ్బపడింది. "... అదికూడా".
విహారి దాన్ని కూడా విప్పేసేడు. ఇలాంటి శాడిస్టులని అతడు కేవలం సినిమాల్లోనే చూసాడు.
"నా పేరేమిటో నీకు తెలుసా? తెలిస్తే గుండాగి ఛస్తావ్" అని మొహంమీద ముసుగు తొలగిస్తూ "నా పేరు రామ్ లాల్" అన్నాడు.
"రామ్ లాల్...."
విహారి స్తబ్దుడయ్యాడు. స్వామి తాలూకు రెండో స్తంభం!!
"ఈ రివాల్వర్ లో నాలుగు గుళ్ళున్నాయి. అటు తిరిగి చెప్పు. మొదటి దానితో నిన్ను కాలుస్తానా- కాల్చనా?"
విహారి అటు తిరిగాడు. వెనగ్గా పది గజాల దూరంలో రామ్ లాల్ నిలబడి వున్నాడు. మరణం తప్పదని తెలిసిపోయింది. "....కాలుస్తావు" అన్నాడు పెదాలు బిగపట్టి.
గుండు గాలిలోకి వెళ్ళింది.
"కాల్చలేదు.... హ్హహ్హ.... కాల్చలేదు. అబద్ధం చెప్పను. ఈసారి ఇంకో ఛాన్స్ యిస్తున్నాను. అబద్ధం చెపితే కాల్చేస్తాను. అప్పుడు నిన్ను చంపిన పాపం నాకంటదు. అవునా... చెప్పు, ఈసారి కాలుస్తానా లేదా?"
"కాలుస్తావు" అన్నాడు నిజం చెపుతున్నట్టు.
వరుసగా మూడుసార్లు పిస్తోలు పేలింది.
* * *
ప్రవల్లిక ఇంకా శిలాప్రతిమలాగే నిలబడి వుంది. వాళ్ళు చెప్పిన విషయం ఆమెకో పెద్ద షాక్. వాళ్ళు చెప్పేవరకూ అనంతానంతస్వామి ప్లాను ఇంత గొప్పదని ఆమె వూహించలేదు. ఈ పిల్లల కిడ్నాప్ వెనుక స్వామి వుంటాడన్న అనుమానం ఎవరకీ రానంత గొప్పగా ప్లాన్ వేశాడు. సూర్యారావుమీద హత్యా ప్రయత్నం చేసింది స్వామేనని తనకి తెలుసు. టెర్రరిస్టులు సూర్యారావుని ముఖ్యమంత్రిని చేయమన్నప్పుడు వీళ్ళు అనంతానంతస్వామికి వ్యతిరేకమైన గ్రూపు అనుకుంది. తెర వెనుక ఇంత నాటకం జరిగి వుంటుందని కలలో కూడా వూహించలేదు.
భుజం మీద చెయ్యి పడేసరికి ఆమె ఆలోచన్లనుంచి తేరుకుంది. A-2 ఆమె వెనగ్గా చెయ్యివేసి వెన్ను నిమురుతున్నాడు. అతడి పెదవులమీద క్రూరమైన నవ్వు కదలాడుతోంది. చేతిని మరింత క్రిందుగా జరిపాడు. ఆమె విదిలించుకోబోయింది. అది ముందే వూహించినట్టు వాడు ఆమె వెన్ను క్రిందభాగంలో బలంగా కొట్టాడు.
ఆమె పారలైజ్ అయింది.
అలాటి కిక్ గురించి, సి.బి.ఐ. ట్రెయినింగ్ లో నేర్పుతారు. స్పృహ తప్పదు. కానీ భరించలేనంత నిస్సత్తువ ఆవరిస్తుంది. అవయవాలు స్వాధీనంలో వుండవు.
తుపాకీ ఉపయోగించకుండా వాళ్ళు తమని స్వాధీనపరుచుకోదలచుకున్నారని ఆమెకి అర్ధమైంది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితి ఆ అడవి మధ్యలో అంత అర్దరాత్రిపూట అరిచినా ఎవరికీ వినపడదు.
ఆమె విహారికోసం చూసింది. వాళ్ళ లీడరు అతడిని తుప్పల్లోకి తీసుకువెళ్ళాడు. బహుశా చంపెయ్యడానికి అయి వుంటుంది.
వీళ్ళు ముగ్గురూ పిల్లల్ని వదిలి తమని ఎందుకు తీసుకువచ్చారో- వీళ్ళ రహస్యాలన్నీ తమకి ఎందుకు చెప్పారో ఆమెకు అర్ధమైంది. ఈ అడవిలో తమ ఇద్దర్నీ చంపేసి పాత పగ తీర్చుకోబోతున్నారు.
ఆమె కదలబోతుంటే ఒకడు రెండు చేతులూ వెనక్కి విరిచి పట్టుకున్నాడు. మరొకడు ఆమె బుష్ షర్టు బటన్స్ విప్పేసేడు. ఆమె నిరోధించడానికి ప్రయత్నించినా వాళ్ళు కొట్టిన దెబ్బకి చేతులు స్వాధీనంలో లేవు. నిల్చుని వున్న ఆమె ముందు మోకాళ్ళమీద కూర్చుని మరొకడు పాంటు చెరోవైపు పట్టుకుని గట్టిగా లాగాడు. ఫట్ మన్న శబ్దంతో జిప్ జారింది. ఆమె నిస్సహాయంగా నేలవాలిపోయింది. ఆమె శరీరం క్రింద ఎండుపుల్లలు విరిగాయి. అడవి పిట్ట ఒకటి దూరంనుంచి వికృతంగా అరిచింది. చెట్ల కొమ్మలు వూగుతున్నాయి. అంతా నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ కొన్ని గజాలచెట్ల అవతల్నుంచి పిస్తోల్ మూడుసార్లు పేలిన శబ్దం, దానితోపాటు విహారిని తీసుకువెళ్ళిన వాడి నవ్వూ వినిపించాయి.
అప్పుడు మొట్టమొదటిసారిగా ఆమె కంటినుంచి నీటి చుక్క రాలింది.
విహారి-
...అతడు ఏ రక్షణశాఖకూ సంబంధించినవాడూ కాదు. ఏ గూఢచారి సంస్థకూ సంబంధించినవాడూ కాదు. కేవలం పిల్లల్ని రక్షించడానికి వచ్చినవాడు. ఒకమ్మాయిని 'సేవ్' చేయడానికి కారు ఎక్కినావాడు. బాధ్యత తెలిసిన సాధారణ పౌరుడు. ఒక నిర్దుష్టమైన గమ్యం కోసం ప్రాణాలు అర్పించాడు.
ఈ రెండు దారుణాల్ని చూడటానికా అన్నట్టు చంద్రుడు మేఘాల చాటునుంచి బయటకు వచ్చాడు. అడవి తెల్లబడింది. వెల్లకిలా పడివున్న ఆమె మీదకు ఒకడు వంగాడు. ఆమె చేతుల్తో వక్షద్వయాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. పక్కనున్నవాడు కాలితో ఆమె మోచేతిమీద కొట్టాడు. నరం కలుక్కుమంది. మీదకు వంగినవాడు ఆమె మెడక్రిందుగా చెయ్యివేసి శరీరాన్ని పైకిలేపి వెనుకనున్న బ్రా హుక్కువిప్పి గాలిలోకి విసిరేసేడు. ఆమె మిగతా దుస్తులతోపాటూ అదీ పక్కనున్న లోయలోకి జారిపోయింది. తల దగ్గిర కూర్చున్నవాడు ఆమె చేతుల్ని కదలకుండా పట్టుకున్నాడు.
ఆమె అరవడం లేదు.
యుద్ధంలో-మరణించేముందు ఆర్తనాదం చేయడం వీరుల లక్షణం కాదు.
గంట తర్వాత రాబోయే మృత్యువుని ఆహ్వానిస్తూ ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె మీదకు వంగినవాడు భుజాలమీద చెయ్యి నెమ్మదిగా క్రిందికి జార్చి ఆఖరి ఆచ్చాదనను తొలగించాడు.
ఆమె తెల్లటి శరీరంమీద వెన్నెల మరింత తెల్లగా మెరుస్తూంది.