మమత_ పెంచుకుంటే పెరుగుతుంది.
బాధ_ పంచుకుంటే తరుగుతుంది.
జ్ఞాపకం_ పంచుకున్నా,పెంచుకున్నా మిగుల్తుంది.
అందమైన జ్ఞాపంకంగా__
మమతల కోవెలలోని దేవతగా__
మగత నిద్రలోకూడా దర్శనమిచ్చి బాధపెట్టె ఏకైక వ్యక్తీ__
అతడి తల్లి!!
అతడి జీవితం వేదనగా మారడానికి_సామవేడంగా పరిణతి చెందడానికి కారుకురాలు ఆమె మాత్రమె!
* * * *
కారు ఫాస్టు గా డ్రైవ్ చేయడం కావ్యకి అలవాటు.
సర్వ సాధారణంగా బిజినెస్ పీపుల్_ బిజీ పీపుల్. తాము కారు డ్రైవింగ్ చేయరు. కారణం_ పరాకు. కాని కొందరు కంపార్టమెంటా లిస్టులు. వీరు దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపారాన్ని వ్యక్తీ గత జీవితానికి ముడిపెట్టరు. కోట్లాది రూపాయల వ్యాపారంచేస్తూ, బిజినెస్ ఎంగేజ్ మెంట్స్ పెట్టుకున్నా శ్రీమతిని షాపింగ్ కి, పిక్చర్స్ కి తీసుకెళ్తారు. పుడ్ దగ్గర, బెడ్ దగ్గర ఏ విధమైన టెన్షన్ పెట్టుకోకుండా తృప్తిగా అనుభవిస్తారు. ఇటువంటి వారికి బి.పి.,గాస్ట్రిక్ ట్రబుల్ కంప్లెయింట్స్ ఎక్కువుగా వుండవు.
బ్రేకులు అప్లయ్ చేయకుండా డ్రైవ్ చేసేవ్యక్తీ ఎదుటివ్యక్తిని చక్కగా అంచనా వేయగల సామర్ద్యం కలిగివుంటాడు, ఎటువంటి పరిస్థితి నయినా ఎదుర్కోడానికి_ రెప్పమూసి తేరిచెంతలో నిర్ణయాలు తీసుకోగల చురుకైనా మెదడు కలిగివుంటారు. తన షిప్పింగ్ కార్పోరేషన్ విషయవిన్నాక, ఏం.వి.అయ్య తన పావుల్ని చురుగ్గా ముందుకీ కుదుపుతాడని తీవ్రమయిన పోటీ ఇస్తాడని ఆమె ఊహించింది. అందుకే అతడికన్నా ముందుండటానికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. డ్రైవింగ్ సీట్లో వున్నా కావ్య ప్రక్క సీట్ లో తంబి కూర్చునున్నాడు. అతడి చేతిలో బ్రీఫ్ కేసు వుండి. ఆ బ్రీఫ్ కేసులో సముద్రగర్బంలో చిక్కుకుపోయిన భాతతీయ ఓడల వివరాలు_ ఆ ఓడలలో వున్నా ఆస్తి వివరాలు వున్నాయి తంబి ఆ వివరాలు చూస్తున్నాడు.
"మేడమ్! హిస్టరీ బుక్స్ లో దొరికే వివరాలన్నీ మీకేవరో అందజేశారు. వాస్తావానికి ఇందులో నాలుగోవంతుకూడా ఇప్పుడు మీకు దొరకదు. ఎందుకంటే_ ప్రొఫెషనల్స్ కొందరున్నారు. వారిపని సీకోరల్స్ సీపెరల్స్ కలెక్షన్, సముద్రం పాలయిన సంపదని చాటుగా తీరా తీసుకురావడం! అటువంటివి ఏవైనా మునిగిపోయిన ఆ ఓడలలో వుంటే ఈపాటికి ఎందరి చేతులు మారి ఉంటాయో... మీరు కాలయాపన చేస్తున్నారెమోననిపిస్తుంది" అన్నాడు తంబి.
ష్యూర్... అగ్రీవిత్ యూ... ఇప్పుడు మనం కాలంలో పోటీ పడుతున్నాం. రూపాయలలో డెబ్బయిపైసలు దొంగల హస్తగతం అయిందనుకొందాం. మిగిలిన ముప్ఫయ్ పైసల ఆస్తిని మనం పది పైసలకే తీసుకొంటాం. ఖర్చులు పదిహేను పైసలిన్న ఐదుపైసలు లాభిస్తుంది గదా!"
"కావచ్చు. కాని ఇంత శ్రమ, కాలం ఇతరత్రా వినియోగిస్తే ఇంకలాభం ఉంటుంది గదా!"
"ఉంటుంది. కాని ఇక్కడ అదనపు లాభాలు రెండు వున్నాయి. పోటీ తక్కువ. మనకున్న వనరులకి మోనోపలీ చేయవచ్చు. రెండవది పబ్లిసీటీ, ఇమేజ్. రేపు అన్ని పత్రికలూ సముద్ర గర్బంలో మన సాహాస విన్యాసాల గురించి ఫోటోలతోసహా వ్యాసాలూ, ఇంటర్యూలు ప్రచురిస్తాయి కడలిగర్బంలో కలసిపోయిన జాతీయ సంపదని వెలికి తీసుకొచ్చి నందుకు ప్రశంశలు లభిస్తాయి. ఆ గుర్తింపు, గౌరవం నేను చేయబోయే ఇతర వ్యాపారాలకి పెద్ద పెట్టుబడి అవుతుంది. బిగార్స్ కి ఇంత బ్రేక్ దొరకటం అదృష్టం గదా!"
ఆమెను అర్ధంచేసుకోవడానికి అతడికి అయిదు నిమిషాలు పట్టింది. ఆ రాత్రికి సముద్రం మీదికి వెళ్ళడానికి కార్యక్రమం ఖరారయింది.
సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ప్రెసిడెంట్ క్లబ్ లో ఓ మూల టేబుల్దగ్గర చేరి కావ్య విషయమే మాట్లాడుకుంటున్నారు. పైఫ్ పీలుస్తున్న వ్యక్తీ ఏం.వి.అయ్య.అతడికి ఎదురుగా బ్రౌన్ సూట్ లోనున్న వ్యక్తీ ఫైనాన్షియల్ అడ్వైజర్ వి.ఎ .చలం.
ఏం.వి.అయ్య ముందు టేబుల్ మీద చికెన్ కార్న్స్ సూఫ్ వుండి. చలం చేతిలో విస్కీ గ్లాసు వుండి. అతడి ముందు చికెన్ చాప్స్ వున్నాయి.
"మనోహర్ పోలీలేన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తాయారు చేసింది నేనే. మోస్ట్ పీజియాల్ ప్రాజెక్ట్. ఆ ఫిల్ ఎందుకు పెండింగ్ లో పెట్టావు" అసలు విషయానికి వచ్చడు చలం.
ఆ మీటింగ్ ఆరెంజ్ చేసింది మనోహర్. తన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన తండ్రి అవుననకుమ్డా ప్రక్కన పెట్టడంతో తండ్రి ఉద్దేశామేమిటో అతడికి అర్దంగాలేదు. అలాగని తండ్రిని అడిగే ధైర్యం లేదు. అతనా తండ్రిచేసే ప్రతి వ్యాపారానికి చలం ఫైనాన్షియల్ అడ్వైజర్ అందుకే అత్తడ్ని సంప్రదించాడు. మనోహర్ కోసం ఏం.వి.అయ్యని క్లబ్స్ కి తీసుకొచ్చాడు చలం.
సూప్ లో చిల్లీపౌడర్, సాల్ట్ కలుపుతూ అన్నాడు ఏం.వి.అయ్య "ఇప్పుడు మనకు కావలసింది ప్రోఫిట్ కాదు_ కార్పోరేట్ ఇమేజ్. అన్ డౌ తేద్లీ ఇట ఇఇజ్ ఎ ప్రోఫిటబుల్ ప్రాజెక్ట్. మీరు మార్కెట్ సర్వ్ చేయించారు, ప్రాఫిట్ కేలిక్యులేట్ చేశారు. కాదనడంలేదు. కాని పబ్లిసీటీ ప్లానింగ్ బాగుండలేదు. 'ఒనిడా టి .వి.' ఒకే ఒక పబ్లిసేటీ కాప్షన్ టో మార్కెట్ ని కాంకర్ చేసింది. అలాగే గోద్రెజ్ ప్రోడక్టుకి మార్కెట్ లో ఒక గుడ్ విల్ వుండి. పబ్లిసేటీ కేంపస్ తో కొన్ని ప్రోడక్ట్స్ మార్కెట్ లో సక్సెస్ అవుతాయి. డబ్బున్న అన్ ఏమ్ప్లాయిడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రారంబింఛబోయే ప్రజేక్తులా తయారు చేశారు గాని ఏం.వి.అయ్య అండ్ సన్స్ ప్రాజెక్ట్ రిపావుర్తలా లేదు. ఇతర సంస్థలకి మనకు ఒక తేడా ఉంది. మిగతా వారు ప్రోడక్టు నాణ్యత నిరూపించి అమ్ముకోవాలి. కాని మనం, సంస్థకున్న గుడ్ విల్ ఉపయోగించుకుని పబ్లిసేటీ చూపించి మార్కెట సంపాదించాలి.