"దట్స్ గుడ్... కనుకునే మనం ఆ ఓడల్ని అతి తక్కువధరకు ఆక్షన్ చేస్తాం. ఇంతకుమించిన విషయం మరొకటుంది. సీ కోరల్స్ స్మిగుల్ చేయటానికి అవకాశం వుంటుంది. పై పేచ్చు బ్లాక్ మనీని వైట్ చేసుకోవచ్చు. అన్నిటినీమించి నేను ప్రారభాస్తున్నా తొలి బిజినెస్ ఇది మీ పూర్తీ సహకారం కావాలి! ఈ వ్యాపారంలో నేను లాభాలు ఆశిచడంలేదు. వెనకడుగు వేయడం నాకిష్టం లేదు. విల్ యు జాయిన్ విత్ మీ"
"తప్పకుండా_ఈ బీచ్ నా నివాసం, నా విద్యాలయం, ప్లేగ్రౌండ్, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రండి. కాదు_ జరగదు అనకుండా చేసి పెడతాను."
"నీ లాటి వ్యక్తీ సహకారం నాకు అవసరం. సిటీలో చక్కటి అపార్ట్ మెంట్ _ కారు బ్యాంకు బ్యాలెన్సు చూపిస్తాను నాతో రావచ్చుగా" ఆమె ప్రశ్నకు సమాధనంగా నిర్వికారంగా చూశాడు.
"ఏం మాట్లాడవు...."
"రాను... రాలేను!"
"కారణం తెలుసుకోవచ్చా?"
"దాదాపుగా పాతికేళ్ళాక్రితం ఇక్కడే నా తల్లి తప్పిపోయింది. ఎప్పటికయినా నన్ను వెదుక్కుంటూ అమెఇక్కడికి వస్తే నేను కనిపించకపోతే ఎలా?"
ఎప్పుడో పాతికేళ్ళక్రితం ఇక్కడే నా తల్లి తప్పిపోయిన తల్లికోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న అతడి అమాయకత్వానికి జాలిపడాలో, తల్లిపట్ల అతడి కున్న మమకారానికి సాటి స్రీగా అతడి పాదాలకు నమస్కరిం చాలో బోధపడలేదామెకు.
రేపు సాయంత్రం వస్తాను. ప్యూచర్ ప్రోగ్రాం ఏమిటన్నది నిర్ణయిద్దాం " అని అతడివద్ద శెలవు తీసుకున్నది.
ఇసుకలో నోట్లకట్టతోసహా దిగబడిన కత్తిని తీసుకుని నెమ్మదిగా వెనుదిరిగాడు తంబి.
అట్లాంటి నోట్లకట్టలు యిప్పటికి ఎన్నో సంపాదించాడు.
అవును మరి... అతడి తల్లి తిరిగొస్తే ఆమెకు మంచి మంచి చీరలు, నగలు కొని పెట్టాలి. ఆమె అలా బీచ్ లో వుండాలేదుగదా... ఆమెకోసం ఓ ఇల్లు చూడాలి. డబ్బు కూడబెడుతున్నాడు.
అతడు అంతగా ఆరాధించే ఆ తల్లి అతడికి ఎలా దూరమయిందంటే.... పాతికేళ్ళానాడు ఆ దుర్ఘటన జరిగింది.
నటుడు అనేవాడికి డైలాగ్ మాడ్యులేషన్, టైమింగ్ చాలా ముఖ్యం. ఈ రెండూ జాగ్రత్తగా పాటించినవాడు నటుడుగా కరతాల ద్వనులందుకుంటాడు మాదాల వెంకట్రామయ్య మహానటుడు అయితే ఇతడు జీవితంలో అద్బుతంగా నటించాడు. 'ప్రేమ_ అరాధాన' అనే ఆయుధాల్ని ఆమెపై చక్కగా ప్రయోగించాడు. ప్రశాంత తటాకంలా వున్నా ఆమె మనసులో ఆలోచనా తరంగాలని రేకెత్తించాడు. మంత్రముద్దలా అతడు చెప్పినట్టు సాయత్రం బీచ్ కి వెళ్ళింది. ఆ పిల్లవాడికి యిష్టమైన విషయాలు రెండే రెండు వున్నాయి. తన జుత్తులోకి వ్రేళ్ళు జొప్పించి దువ్వుతుంటే తల్లి ఒడిలో పడుకుని నిద్రపోవడం, సముద్రం ఒడ్డున నిలబడి నీటి కెరటాలు వచ్చి తన కాళ్ళను తాకి వెనుతిరిగిపోతుంటే చూస్తుండటం! బీచ్ కి వెళ్ళగానే నీళ్ళ దగ్గర పరుగెత్తాడు ఆ పిల్లవాడు. ఆడదాని మనస్సు శృతిపెట్టిన వీణలాంటిది. పావని మానసవీణ మాదల వెంకట్రామయ్య వశమవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు. ఆ పిల్లవాడు అమాయకంగా అలాగే నీటిలో ఆడుకుంటున్నాడు.... చుట్టూ చీకట్లు వ్యాపించే వరకు! అప్పుడు అమ్మమ్మలాంటి ఆ సముద్రం ఓడిలోంచిబయటకు వచ్చాడు. అక్కడ అమ్మ కాదుగదా మరెవ్వరూ లేరు. చుట్టూదట్టంగా అలుముకుంటున్న చీకటి... ఒకవైపు సముద్రపు ఘోష... ఆ ఇసుకలో 'అమ్మా... అమ్మా...' అని అ పసివాడు గొంతుచించుకుని ఏడుస్తున్నాడు... అరుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి అలసి సొలసి పోయాడు. ఆ బీచ్ లో ఓ పడవవుంది. పగిలి శిధిలా వస్థలో వుందా పడవ. అటువంటి పడవ ప్రక్కన కూర్చుని అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారిపోయాడు.
అలా కలతనిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా కన్పించిన దృశ్యం నిశ్శేష్టుడ్ని చేసింది. పండు మిరప చూసేసరికి కాయలు అరబోసినట్లుగా, పండు ఈతకాయలు పరచినట్లుగా వుంది! ఆ పసివాడికి అదేమిటో అర్ధంకాలేదు. నెమ్మదిగా ముందుకు అడుగులేశాడు. ఇసుకలో అతడు కాలుతీసి కాలు వేస్తుంటే ఆ అలికిడికి ఇసుకలో పరుచుకున్నవి హఠాత్తుగా ఇసుకలోకి అదృశ్యమవుతున్నాయి. అవి పీతలు.... జనసంచారం లేనప్పుడు చల్లటి వేలల్లో ఇసుకలో నుంచివస్తాయి. ఏ మాత్రం అలికిడయినా ఆ ఇసుకలోకి వెళ్ళిపోతాయి. తన కళ్ళముందే అలా పీటలు అదృశ్యమవడం అతడికి వేడుకగా వుండి.
కొద్దిసేపు పీతలనడుమ పరుగెత్తుతూ, వాటిపైన యిసుక వెదజల్లుతూ ఆదుకున్నాడు. కొంచెం పొద్దెక్కడంతో పీతలు వాటికి అవిగా ఇసుకలోని తమ బోరియాలోకి వెళ్ళిపోయాయి. అప్పుడుగాని అతడి అతముగియలేదు. అట తర్వాత ఆకలేసింది. ఎదురుగా అనంతమైన సాగరం__ ప్రక్కగా సువిశాలమైన ఇసుక పర్ర! అక్కడ తినడానికంటూ ఏమీలేదు. కాని ఆ ఇసుకలో అంతకు క్రితంరోజు సాయత్రం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాఫ్ కార్న్, క్యాష్ నట్, గ్రౌండ్ నట్ తింటూ కాలక్షేపం చేసిన వారి చేతుల్నించి జారిపడిన పలుకలు కనిపిస్తున్నాయి. ఇవిగాక అక్కడక్కడ ఇసుకలో విసిరేసిన తినుబండారాలు అతడికి దర్శనమిచ్చాయి. మొదట్లో అవి తీసుకుని తినడానికి అహం అడ్డొచ్చిందిగాని, ఆకలి అతడ్ని జయించింది. అ ఎంగిలి తిన్నాడు. అసలు సమస్య ఎదురయింది దాహమేసింది పసితనంలో గబగబా వెళ్ళి సముద్రపు నీళ్ళు గుక్కెడు తాగాడు. అతడి గొంతుక భగ్గుమన్నది.... కళ్ళు చింతనిప్పులయ్యాయి. ఆ గుక్కెడు నీళ్ళు గంటసేపు నరకయాతన పెట్టాయి. కాని ఆ ఉప్పునీళ్ళు తాగడం తప్పనిసరి అయింది. తనను బీచ్ కి తీసీకొచ్చిన తల్లి తనను వెదుక్కుంటూ రావచ్చు.... అని ఆశతో ఆ బీచ్ లో పగిలిన పడవ ప్రక్కనే నిద్రపోతూ రోజులు, నెలలు, సంవత్సరాలు దాడిపేస్తూన్నాడు. ఇప్పడతడికి ఆ సముద్రపు ఒడ్డున ఎన్ని అరాచకాలు, వ్యాపారాలు ఏ ఏ వేళల్లో జరగుతయో తెలుసు. ఆ సముద్రం మీదకి చేపలు పట్టడానికి వెళ్ళేవారు, స్మగ్లింగ్ గూడ్స్ తీసుకురావడానికి వెళ్ళేవారు, లంచాలు పుచ్చుకునే అధికార్లు, చీకట్లో ఆ బీచ్ లో అమ్మాయిల్ని తెచ్చుకుని మజా చేసుకునేవారు. అందరూ అతడికి సుపరిచితులే! అతడు స్మగ్లర్స్ కి సాయపడ్డాడు_ సరదాగా ఫిషింగ్ కి సముద్రం మీదకి వెళతాడు_ అధికారులకి ముడుపులు వసూలుచేసి ఇస్తాడు_ ఇచ్చి పుచ్చుకునే దగ్గర తేడా వస్తే ప్రాణాలు తీస్తాడు. అతడికిప్పుడు అన్నీ వున్నాయి. లేనిదోక్కటే_మనశ్శాంతి.