Previous Page
Next Page
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 14
శ్రీ జోగారావు, యస్వీ
ప్రస్థానం
పద పదరా భారతవీరా
పథమంతా నీ వశమేరా ||పద||
ఇది భారత శివ జటాజూట
హిమ వన్నగ శిఖరి!
శిఖరోపరి ముఖరిత రంగత్తుంగ
తరంగిత గంగాలహరి!
ఇది హరిద్వార మిది హృషీకేశ
మిది బదరీవన మది నైమిశసీమ!
మన మానసహంసధ్వని ధామ!
ఇది భారత జనయిత్రీ కిరీట
కోటీర హీర కిర్మీరిత కాశ్మీరధరిత్రి!
ఈ మంచు మల యంచున
పొంచిన పొగమబ్బు నిల్చున?
నీ శౌర్య ఝంఝకు తూలి
నీ ధైర్య గిరి మ్రోల వ్రాలి
కన్నీరు కార్చవలె
మున్నీటి మూర్ఛవలె.
* * * *
Previous Page
Next Page