Previous Page
Next Page
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 13
శ్రీ జాషువా, జి.
పారాహుషార్
ప్రతినంబూని భయంకరంబయిన శౌర్యజ్వాలయై లేచి, భా
రత చండీశ్వరి కోటికంఠముల నార్భాటించి, లంఘించి, ప్రో
న్నత చీనా విషకాసురుని కంఠంబుం విదారించి, శా
శ్వతకీర్తిన్ ఘటియించుగావుత ప్రపంచం బద్భుతం బందగన్.
కాసెబిగించి లెమ్మదె, యకారణ వైరము లేపినాడు, చీ
నాసురు డాక్రమించుకొనినా డిరుమూరు పురాలు భారతాం
బాసుత! మంత్రతంత్రములు పారవు, క్రూరవిరోధి రక్తమున్
దోసిటబట్టి త్రావుట యధోచితపూజ జుమీ సవిత్రికిన్.
చేసినబాస తప్పి పెరసీమల బాములపాలు చేయు ట
భ్యాసము చేసినట్టి నరు లాచయనీయులు; వారితోడ సా
వాస ముపద్రవంబు నవభారత వీరుల ధర్మనిష్ఠయే
బాసటగాగ, శాత్రవ కపాల పరంపర వ్రక్కలింపరా!
చివ్వకు గాల్ద్రవ్వెడు నా చెవ్వెనలై కింత బుద్ధిచెప్పక మనవా
రివ్వలికిరారు, చీనా మువ్వన్నె మెకాల కాలమున్ దాపయ్యెన్.
* * * *
Previous Page
Next Page