నా ప్రశ్నకి ముకుందరావు నొచ్చుకున్నట్టు గమనించాను.
" అందుచేత మిమ్మల్ని పిలిచాను రావుగారూ! మీకు పూర్తికథ తెలీదు, మీకేకాదు. చాలామంది కీకిటుకు తెలీదు. సుందరశివరావు పోవడంతో సత్యవతి స్వర్గాన్నే పోగొట్టుకుంది. కాదనను కానీ అతనుపోవడం కామాక్షమ్మ, శ్రీధరరావులకి అన్ని విధాలమంచిది. ఈరోజుల్లో డబ్బుముందు కూతురి సౌభాగ్య, కూతురి కలలవిలువెంత? డబ్బు మను మనుషులు వీళ్ళిద్దరూను. ఎంతకీ తెంగించకపోతే చెట్టంత కూతురు ఇంట్లో వుండగా, కట్టుకున్న భార్యనోరుమూసి రెండో పెళ్ళి చేసుకుంటాడా? సత్యవతికి అత్తవారింట్లో స్థానం లేదని వాదించాడు. 'తండ్రిమిద భక్తీ గౌరవముంటే నాతో వచ్చెయ్యమని సత్యవతిని ఆజ్ఞాపించాడు స్వర్గాన్నే పోగొట్టుకున్న అభాగ్యురాలికి ఈలోకంలోగానీ. ఈ లౌక్యంతో పనేమిటి, తండ్రిమాట కాదనలేక సరేనన్నది. ఇక్కడ్నుంచే అసలైన గారడి ప్రారంభించాడు శ్రీనివాసరావు. కూతుర్ని ఇంటికితెచ్చుకుంటూ వాళ్ల ఆస్తిలో భాగం అడిగాడు. సత్యవతిని, ఈ పార్ధుడ్ని కనిపెట్టుకునుండమని చెప్పి అతను అడిగిన 'భాగం' పంచియిచ్చారు వాళ్లు: ఆ 'భాగం'తాలూకు రాబడితో కులుకుతున్నాడీ శ్రీనివాసరావు తండ్రికథకం కూతురికి తెలీదుకాదు అస్తమాను జీవచ్ఛవంలా బతికే తనకి లౌక్యంతో పనేమిటనే నిర్నయానికొచ్చేసింది సత్యవతి. దేవుడు తన సౌభాగ్యన్ని పాడుచేసినందుకు బాధపడుతుందేగానీ, పార్దుడి భవిష్యత్తు గురించి కించతైనా ఆలోచించడు. అందుకే పార్దుడంటే మాకు జాలి మాచాతనయ్యేదేమిలేదని ఒప్పుకుంటాం అయితే పొరుగునవున్న వాళ్ళంగనుక తెలీజేసే బాధ్యతని మే తీసుకున్నాం. అందుకే మేమంటే కామాక్షమ్మకీ , శ్రీధరవారుకీ కడుపుమంట."
ఆయన చెప్పిందంతా విని ఆశ్యర్యపోవడం నావంత యింది. శ్రీనివాసరావు గురించి కధ రాసినశర్మ గుర్తుకొచ్చేడు. శ్రీధరరావు కథ అతని రెండో పెళ్ళితో ఆగిపోలేదు.రెండో భాగం మహా ఘోరంగావుంది, ఈ భాగంకూడా శర్మకథగా రాస్తే ఎంత బాగుంటుంది?
ముకుందరావుభార్య కాఫీ తీసుకొచ్చింది.
"తీసుకోండి." అన్నాడు ముకుందరావు .ఆవిడ మరో కుర్చీలో కూర్చుంది. ఆవిడముందు కొంచెం యిబ్బిందిగా కాఫీ తాగవలసి ఒచ్చింది. ముకుందరావుకి మనుషుల్ని చదవడం తెలుసునేమో- ఖచ్చితంగా అనేశాడు.
" మిరు బిడియస్థుల్లా ఉన్నారు."
నవ్వేసి వూరుకున్నాను.
ముకుందరావు భార్య ట్రాన్సిష్టరు చేతుల్లోకి తీసుకున్నది. ట్యూన్ చేసింది.
"మా చిన్న కృష్ణుని మాటలు
మా పూర్వ పుణ్యాలు మూటలు
మమ్ముదరిచేర్చు తియ్యని బాటలు."
ఉలిక్కిపడ్డాను. సర్దుకోడం కొంచెం కష్టమయ్యింది. వాళ్ళిద్దరిదగ్గిరా సెలవు పుచ్చుకుని గబగబా డాబా దిగి వచ్చేశాను.
* * * *
పార్ధుడివాళ్ళకధ విన్నతర్వాత నాలో గొప్ప మార్పు ఒచ్చేస్తున్నట్టు గమనిస్తున్నాను.పిచ్చి ఆలోచనలు లక్షల కొద్దీ నన్నుపాడుచేస్తున్నాయి. ప్రతిదీ వెలితిగా కనుపిస్తోంది.మనసంతా ఒకపెద్ద గందరగోళంగా తయారవుతోంది. ఇక్కడ నాకు తెలిసిన పార్ధుడికథ యావత్తూ శ్రీమతికే ఉత్తరంలో రాసేను. కఈ కథతో నాకెలాటి సంబంధమున్నదో మాత్రం స్పష్టంగా వ్రాయలేకపోయేను. ఈ ఉత్తరానికి శ్రీమతి జబాబు వ్రాసింది.
"మీ మనసు నాకు తెలుసు. ప్రతి అనసరమైన విషయానికీ ఖంగారు పడిపోతుంటారు. ప్రపంచంలో జరిగే దారుణాలన్నీ మిరేం బంధిచనక్కర్లేదు. మీర్రాసిన పార్ధుళ్ళు ఈ భూమ్మిద చాలామంది వున్నారు. అంతమాత్రాన వాళ్ళందర్నీ చూచి బాధపడిపోవడమేమైనా బాగుంటుందా?మీ పెద్దఉత్తరం చదివింతర్వాత నాకూ భయంగావుంది. అలాంటి చోట మీరు వంటరిగా వుండకూడదసలు. శెలవుపెట్టి వొచ్చేయండిఎంచక్కా , ఈ వూళ్ళో సినిమాలు చూడండి. అన్నట్టు యివాళ పేపర్లు కుర్రాడు సినికాగితమొకటి యింట్లో పారేసి వెళ్ళాడు. మి అభిమాన నటీమణి సోఫియా నటించిన ' ది డిజైర్ అండర్ ది ఎల్మ్స్ ఆడుతోందిట. లోగడ మిరీసినిమా మెచ్చుకున్నారుగదూ.తెలుగు సారంగధర జ్ఞాపకానికొస్తుందని గూడా అన్నారు ఆ సినీమా నాలుగు రోజులేనట.- అదుగో అప్పుడే పసిగట్టేశారుకదూ- అవును నా మనసు మిమ్మల్ని చూటాలని కోరుతుందన్న మాట నిజంగానీ మీరు మెచ్చుకున్న సినీమా మిరు చుడకుండా వుండటం నాకు నచ్చడంలేదుమరి.తర్వాత ని యిష్టం. ముఖ్యంగా -అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునిమి రేం సిద్దార్దులు కానక్కర్లేదని నామమవి. నా ఆరోగ్యం గురించి మిరేం ఖంగారు పడనవసరంలేదు. మా అన్నయ్య డాక్టరన్నవిషయం గుర్తుంచుకోండి.వాడుమిమ్మల్ని యాగీ చేస్తున్నాడు కనక అనవసరంగా ఖంగారుపడకండి. ముందుమి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. నోలేట్ నైట్సు ప్లీజ్ "
ఉత్తరం చదివేసి నేనేం బాధపడలేదుగానీ, నన్నెవరూ అర్దంచేసుకోడం లేదేమోననిపించింది, సిద్ధార్దుడిలాటి సున్నితమైన హృదయం నాదని నేనేం చెప్పడంలేదు. నా లాగా నా భార్యగుండా పరాయివాళ్ళ అసహాయస్థితి కి సాను భూతి చూపడం కాదనీ దిగులు చెందను. నాచుట్టూ వున్న జనం నాలాగా వుండాలనే సిద్ధాంతాన్ని నేను మెచ్చుకోను. కానీ నామనసు నర్ధం చేసుకోలేక సలహాలు చెప్పే వ్యక్తుల్ని నేను హర్షించలేను.
కొంచెం ఆలోచించి చూస్తే నేనీకధలో అనవసరంగా చోటు చేసుకుంటున్నానేమో- ననిగూడా అనిపించింది. పార్దుడూ, సత్యవతుల్తో నాకు సంబంధమేంటసలు?
-చాలా రోజులు కేవలం ఆఫీసుపనిమిదనే మనసు నిలుపుగోగలిగేను. కానీ, ఓనాటి సాయంత్రం పార్ధుడిమూలం గానే మళ్ళా సిద్దార్ధుడినయ్యాను. అయితే ఈనెపం యావత్తూ పార్ఢుడిమిద తోసేయడమూ పొరపాటే. నా అంతరాంత రాల్లో సుళ్ళు తిరుగుతున్న సానుభూతి నోరునొక్కేయడం నాచేత కాదు.
ఆ సాయంత్రం పార్ధుడు నాగది కొచ్చాడు. వాడి చేతిలో ఆల్భమ్ వుంది, నాకిచ్చేడు.
"చూడండి. మా నాన్నారూ,అమ్మా అందరూ వున్నారు" అన్నాడు.
కుతుహలం కొద్దీ ఆల్భమ్ తెరిచి చూసేను. భయవేసింది. నిజంగానే భయపడిపోయేను, సుందరశివరావూ సత్యవతి భార్యా భర్తలు. వాళ్ళఅనురాగానికి హద్దులేవని ఆల్భమ్ చెప్పింది. వాళ్ళితోఫోటోలు చూస్తూంటే నా కళ్ళల్లో నీళ్ళూ తిరిగేయి. ఆల్భమ్ పార్ధుడి చేతిలోపెట్టి, రెండు పిప్పురమెంట్లు యిచ్చి నాగదినుంచి పంపేశాను.
అదృష్టవంతుల భాగ్యంతో పోలిక చేసుకున్నాడు మనసెంత తేలికవుతుందో , దౌర్భాగ్యుల జీవితాల తాలూకు నీడల్ని నాలో వూహించుకుంటే అంత కలత పడిపోతాను ఈ రెండో దే జరిగిందప్పుడు. పార్ధుడుతెచ్చిన ఆల్భమ్ నా పెళ్ళి నాటి కొత్తరోజుల్ని గుర్తుచేసుంది. సుందరశివరావుని నాకో పోల్చిచూచుకుని తల్లడిల్లిపేయేను. రేపొద్దున్న చావనేది చెప్పి ఒచ్చేయోగంకాదు. బ్రతుక్కీ , చావుకీ మధ్య దూరం చాలా తక్కువ. చావుని తలుచుకుంటూ కూర్చుంటే క్షణం క్షణంమూ భయపడవలసిన అవసరం ఎంతైనా వుంటుంది.