Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 14

    "ఒక్కసారి నా రూముకి రండి సార్." అన్నాడతను.
   
    అతడిడీ ఊరుకాదు. నిన్ననే వచ్చాడు. అతడు సినిమాల్లో పని చేస్తున్నాడు నా డిపార్టుమెంట్లోని ప్రొఫెసర్ ఇతడికి చదువు విషయంలో సాయపడ్డాడుట.
   
    "ఆయన సాయం నేను మరువలేనిది. నేనెవరో తెలియకుండా మానవత్వంతో సాయపడ్డ మహనీయుడాయన. ఆయన తైలవర్ణ చిత్రం తయారుచేయాలని నాకెంతో మనసుగా ఉన్నఃది. ఆయన రూపు నేను చిత్రిస్తే అధి మీ డిపార్టు మెంట్లో ఉండిపోతే-నాకు ఎంతో తృప్తిగా వుంటుంది. ఇందుకు నేను డబ్బుకూడా తీసుకోను" అన్నాడతను.
   
    అతడి మాటల్లో నిజాయితీ ఉన్నదనిపించింది.
   
    నేను చాలా సంతోషిస్తూనే, "నీ పెయింటింగ్స్ చూడవచ్చా?" అన్నాను.
   
    "తప్పకుండా చూడండి" అంటూ అతడో పెద్ద ఆల్బం ఇచ్చాడు.
   
    చాలా గొప్పగా వున్నాయి పెయింటింగ్స్ ప్రకృతి సౌందర్యము తెలుసుకోవాలంటే-చిత్రకారుల రూప కల్పితాల వల్లనే సాధ్యపడుతుంది. నేను నిత్యం చూసే సాధారణ దృశ్యాలు ఎంత మనోహరమైనవో ఈ వర్ణచిత్రాలు చెబుతున్నాయి.
   
    ఇప్పుడు రిటైర్ అవుతున్న ప్రొఫెసర్ దయానిధి కూడా ఇతడి తైలవర్ణ చిత్రంలో ఇంత మనోహరంగానూ ఉంటాడా?
   
    తైలవర్ణ చిత్రానికి ఎంత ఖర్చు చేయాలో తెలియక డిపార్టుమెంట్లో అంతా కొట్టుకు చస్తున్నాం. ఇతడూరికే గీస్తానంటున్నాడు. ఇది నాకు చాలా మంచిపేరు తెచ్చిపెడుతుంది.
   
    "అన్నీ ప్రకృతి చిత్రాలేనా?" అన్నాను.
   
    అప్పుడతను మరో ఆల్బం ఇచ్చాడునాకు. అందులో ప్రముఖ సినీనటులున్నారు. రాజకీయ నాయకులున్నారు. అన్ని బొమ్మలూ జీవకళ ఉట్టిపడుతున్నాయి.
   
    "నీకు చాలా పెద్ద పెద్ద పరిచయాలే వున్నట్లున్నాయి. బాగా సంపాదిస్తున్నావనుకుంటాను" అన్నాను.
   
    "నా పెయింటింగ్స్ కి పదివేలు తక్కువ కాకుండా తీసుకుంటాను. నా సంపాదన నా కోసం వినియోగించుకోను. సంఘసేవ..." అన్నాడతను.
   
    "మరి నీ కుటుంబం...."
   
    "నా తల్లిదండ్రులకు తోచినంత పంపుతుంటాను."
   
    "మరి భార్యాబిడ్డలు...."
   
    "నా వ్రుట్టికీ మనస్తత్వానికీ పెళ్ళితో సరిపడదు. బాధ్యతలు లాభం లేదు. అంతకుమించి అడక్కండి. చెప్పుకుందుకు బాగుండదు" అన్నాడతను.
   
    అర్ధమయింది అతడికి ఆడది శారీరకావసరమేగానీ_జీవితాన్ని పంచుకుందుకు కాదు. ఎందుకంటే...
   
    అతనే చెప్పాడు. "నా జీవితాన్ని ప్రకృతితో పంచుకుంటున్నాను..."
   
    అధి హర్షించాలో కూడదో తెలియలేదు. నాకు అతడిమీద సదభిప్రాయం కొంత తొలగింది. అధి గ్రహించాడో ఏమో నాతో నేమందిగా "నేను ముందు ప్రొఫెసర్ దయానిధి గారిని కలుసుకున్నాను. నా తైలవర్ణ చిత్రం గురించి నేను మాట్లాడటం సబబుగా ఉండదు. శ్రీరామచంద్రమూర్తిని కలు....అన్నారు" అన్నాడు.
   
    "అలాగా...." అన్నాను. అతడేమీ మాట్లాడలేదు. మా మధ్య ఏర్పడిన నిస్సభ్దాన్ని చేధించదానికి "ఇంకా ఏమైనా ఆల్బమ్స్ ఉన్నాయా?" అనడిగాను మళ్ళీ.
   
    "మీరు చూసేవేమీ లేవు" అన్నాడు మాధవరావు.
   
    "అంటే..."
   
    "అవి కేవలం నా అభిరుచికి తగ్గవి...."
   
    "అంటే ఒక చిత్ర కారుడి అభిరుచికి భిన్నంగా ఉంటుందనా నా అభిప్రాయం?" అన్నాను కోపంగా.
   
    "మీరలాగ అనుకుంటారనుకోలేదు-అవి యువతుల నగ్నచిత్రాలు..." అన్నాడతను.
   
    తెల్లబోయాను.
   
    "నేనవి సాధారణంగా ఎవరికీ చూపించను. ఎందరో యువతులను నేను బ్రతిమాలి ఒప్పించి తయారు చేసిన వర్ణచిత్రాలవి..."
   
    "అంటే?"
   
    "చిత్రకారుడి హృదయం అందరికీ అర్ధం కాదు. అయినప్పటికీ అందరూ ఒప్పుకొవలసిన విషయమొకటి ఉన్నది ఈ సృష్టికే వన్నె తెచ్చినది ఆడదాని శరీరం అంతకుమించి అందంగా ఏ ప్రాణికీ రూపకల్పన చేయలేదు బ్రహ్మ అందుకే చిత్రకారుని మనసు ఆడదాని నగ్నశరీరం చుట్టూ ప్రదక్షిణం చేస్తూంటుంది. అందులో కొందరు స్త్రీలను చూడగానే చిత్రీకరించాలనిపిస్తుంది. అయితే యిక్కడ ఊహకు రూపకల్పన చేస్తే చిత్రకారుడి మనసుకు తృప్తి ఉండదు. ఆ యువతి కనులముందు నిలబడితేనే అతడికి తృప్తి కలుగుతుంది. అందుకు ఎందరో యువతులు మోడల్సుగా పని చేస్తున్నారు. కానీ నావద్దనున్న చిత్రాలు మోడల్సువి కాదు...." అని ఆగాడతను.
   
    అప్పుడు నా వళ్ళు వేడెక్కింది. ఇతడు మోడల్సు కాని యువతులను వేసుకుని వారిని తన ముందు నగ్నంగా నిలబడడానికి ఒప్పించి వారి చిత్రాలు గీస్తున్నాడు. ఇదెలా సాధ్యం? కళాకారులు తమ కళతో వనితలను ఆకర్షిస్తారా?
   
    నా కనుల ముందు కోమలి, పద్మిని మెదిలారు.
   
    ఆడదాని శరీరం గురించి మాధవరావు చెప్పింది అక్షరాలా నిజం. అయితే నా ముందు వారలా నిలబడగలగడానికి ప్రేమలేక చనువు కారణం.
   
    కానీ ఇతడి విషయం...

 Previous Page Next Page