కానీ నా ముందు నిలబడిన ఆ సజీవశిల్పాన్ని చూస్తూ అవాక్కయిపోయాను. ఈమెను కాదనకూడదు అని మనసులో అప్పుడే నిశ్చయించుకున్నాను.
తర్వాత ఆమె నడిచింది. అది కలహంస గమనం కాహ్డు. పద్మినికే ప్రత్యేకమైన ఒక ప్రత్యేక చలనం. ఆ చలనమూ నన్నాకర్షించింది.
ఆపైన ఆమె నా భార్యకావడం నా అదృష్టం.
తొలిరాత్రి ఆమె నా ఎదుటనిలబడి ఉంటే కూర్చోమని చెప్పాలని తోచలేదు నాకు. ఆమెనలా చూస్తూ ఉండిపోయాను.
పాపం పద్మిని నేను చెప్పేవరకూ అలా నిలబడే ఉండిపోయింది. అందులోనూ ఆమెకు సిగ్గు ఎక్కువ.
ఆ రోజైతే తొలిరోజు ఇప్పటికీ ఆమె నన్నుచూసి ఆమె సిగ్గుపడుతుంది. నేను శృంగారపరంగా మాట్లాడబోతే "ఛీ! అవేం మాటలండీ" అంటుంది.
సీతారాముల శృంగారజీవితం అలాగే ఉండేదేమో!
వివాహానికి ముందు నాకు ఆడవాళ్ళతో పరిచయం లేదు. నేను వారికెప్పుడూ దూరంగానే వుంటాను. వివాహానికి ముందు నాకు దగ్గరగా వచ్చిన ఒకే ఒక్క ఆడది కోమలి!
ఆమె కారణంగా ఆడువారిపై నాకు దురభిప్రాయం ఏర్పడితే అది తొలగించడం కోసమే ణ అభార్య అయింది పద్మిని.
స్వేచ్చా విహారాన్ని కోరి సమాజానికే ఎదురు తిరిగినన్ను పొందాలనుకున్నది కోమలి.
సమాజం ఆశీర్వదించి నా వద్దకుపంపితే నేను వేడుకున్నా సిగ్గు పడుతున్నది పద్మిని.
సిగ్గుపడే ఆడువారిని నమ్మకూడదని కొందరంటారు. ఆడదానికి సిగ్గేలేకపోతే దాంపత్య జీవితానికి శోభలేదని పద్మినిద్వారా నాకు తెలిసింది.
మా దాంపత్య జీవితం చక్కగా సాగిపోతున్నది. అప్పుడప్పుడు కోమలి గుర్తుకువచ్చి ణ అమనసు కలుక్కుమంటూటుంది.
కోమలి పిలుపు నాకు ఎప్పుడూ ఉంటుందన్నదామె.
కానీ ఇప్పుడు కోమలి వివాహిత. మా ఊరు వదిలి పెట్టిన రెండు సంవత్సరాలకు కోమలి వివాహం జరిగింది. వరుడు ఫారిన్ రిటర్న్డ్. అప్పుడు నేను అసూయపడ్డాను కూడా. నేనే కోమలికి అందనివాడిని అనుకున్నాను. కోమలికి నాకంటే మంచి సంబంధం దొరికింది. బహుశా అతడు అందగాడై వుండడని సరిపెట్టుకున్నాను.
ఆమె శుభలేఖ అందుకున్నప్పుడు నేను ఎమ్మెస్సీ చదువుతున్నాను. శుభలేఖలో వరుడిపేరు చూసినపుడు నా ఆత్మీయులను పోగొట్టుకున్నాననిపించింది. కోమలితో ఆరోజు గుర్తుకు వచ్చింది.
ఇప్పుడు ఆమె నా గురించి ఏమనుకుంటున్నది?
ఆ శుభలేఖ ఆమె ప్రత్యేకంగా నాకోసం నా అడ్రసుకు పంపింది. కవరుమీది దస్తూరీ ఆమెదే! ఎందుకో ఆ శుభలేఖనూ కవరునూ కూడా దాచుకోవాలనిపించింది.
ఇప్పటికీ అవి నావద్ద వున్నాయి.
నేను పద్మిని సుఖంగా కాపురం చేసుకుంటున్నాం. అయినా మధ్య మధ్య నాకు ఆమె గుర్తుకువస్తూనే ఉంటుంది. ఆమె మళ్ళీ నాకు కనిపిస్తుందా? అప్పుడు నా మనసు పెడదారులు తొక్కుతుందా?
బాగా ఆలోచిస్తే నాకు ఆమెపై వాంఛ ఉన్నదనీ ఆమె మళ్ళీ నాకు కనపడాలని కోరుకుంటున్నానని అనిపించింది.
ఏది ఏమైనా పద్మినిపట్ల నాకు అసంతృప్తి కలుగకపోవడం నా అదృష్టం.
నాకిప్పుడు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి-అమ్మాయి- ఇద్దరికీ పద్మిని పోలికలే వచ్చాయి - పద్మిని ఆపరేషన్ చేయించుకున్నది.
పద్మిని వయసు పాతిక దాటుతున్నది- అయినా ఇంకా ఆమె పదహారేళ్ళ యువతివలే వుంటుంది- నేనామెకు తగిన వాడిగానే వుంటాను. మా పిల్లలంటే చాలామంది నమ్మరు.
మేము అప్పుడే పెళ్ళయిన కొత్త దంపతుల్లా ఉంటామని చాలామంది అంటూంటే నాకెంతో గర్వంగా వుంటుంది. అద్దంముందు నిలబడినపుడూ, ఫోటోలు చూసుకున్నప్పుడూ ఇతరులనేవి ముఖప్రీతి మాటలు కావని నాకు తెలుస్తూంటుంది.
ఇటువంటి నా జీవితంలో సుడిగుండం రేగుతుందని నేననుకోలేదు. ఎప్పుడైనా కోమలి కారణంగా ప్రమాదం రావచ్చునని నేననుకుంటూంటే-పద్మినే అందుకు కారణ భూతురాలు కావడం నా మనసులో కల్లోలాన్ని రేపింది.
O O O O
అతడి పేరు మాధవరావు. మనిషి నాజూకుగా, ఆడపిల్లలా ఉన్నాడు. అతడికించుమించు నా వయసే వుంటుంది.
ఒకరోజు యూనివర్సిటీలో నన్నతడు కలిశాడు. కారణం నాకు అర్ధమయింది.
నా డిపార్టుమెంట్లో ఒక ఫ్రొఫెసర్ రిటైరవుతున్నాడు. రిటైరయిన ప్రొఫెసర్లకు తైలవర్ణ చిత్రాలు గీయించడం నా డిపార్టుమెంటు రివాజు. అ అబాధ్యత నామీద పడింది.
ఈ విషయమై నేను పెద్దగా శ్రమ పడవలసిన పనిలేదు. తైలవర్ణ చిత్రాలలో ఘడికుడయిన వాడు నా సీనియర్ కొలీగ్ ఒకతనున్నాడు. అయితే ఒక ఆరునెలల క్రితం అతడు ఆస్ట్రేలియా వెళ్లాడు. ఇంకో ఏన్నార్ధం దాకారాడు అందుకని నేనొక కొత్త వర్ణచిత్రకారుని అన్వేషించవలసి ఉన్నది. నా అన్వేషణ ప్రారంభమయ్యేలోగానే మాధవరావు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు.
"నీ వల్ల ఈ పని అవుతుందా?" అన్నాను.