Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 13

 

    అహహః- అంటే నా ఉద్దేశ్యం-"
    "ఇంటలేక్చువల్స్ అనాలి! కరెక్ట్ వర్డ్ యూజ్ చేయటం నేర్చుకో!" చిరాకుపడ్డాడు జైరాజ్.
    "రెండింటికీ తేడా ఏముంది లే అంకుల్! ఇద్దరూ ఒక్కటే - అయ్ మీన్ అల్ మోస్టాల్-"
    జైరాజ్ కోపం ఇంకొంచెం ఎక్కువయింది గానీ భవానీ అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గరున్నాడు.


                              ***

    ఆ రాత్రంతా రోజాకి నిద్ర పట్టలేదు. తండ్రితో చాలా డబ్బు ఇన్ వెస్ట్ చేయించి ఆ చానెల్ పెట్టించింది. జస్ట్ యాభై కోట్లు పెట్టుబడి పెడితే - ఇంకో యాభై బాంక్ లోన్ వస్తుందనీ- ఆ తర్వాత చానెల్ మీద నెలకు పాతిక కోట్లు లాభం వస్తుందనీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉంది.
    జైరాజ్ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ ని నమ్మి డబ్బు పెట్టేశాడు. అదీగాక ఉన్నది ఒక్కగానొక్క కూతురు.
    చిన్నప్పటి నుంచీ రోజా ఏ అట వస్తువడిగినా కొనివ్వటం అతని కలవాటే ఇదీ అలాంటిదే! కూతురు ఇష్టపడిన ఆటవస్తువు - కాకపోతే కొంచెం ధర ఎక్కువ-
    రోజా అదే ఫీలవుతోంది.
    ఇప్పుడు ఆ వంద కోట్లల్లో ఒక్క పైసా కూడా తిరిగి రాదంటే తన తల్లిదండ్రులు ఎంత అప్సెట్ అవుతారో అన్న ఆలోచనతో ఆమె అప్సెట్ అయిపొయింది.
    దాంతో తెల్లారేసరికి జ్వరం వచ్చేసింది.
    కూతురు కండిషన్ చూసి జైరాజ్ దంపతులు కంగారుపడిపోయారు.
    "డబ్బు పొతే పోనీ బిడ్డా! నేను సంపాదించిన పైసలన్నీ ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ ల ఫ్రాడ్ జేసి సంపాదించిందే! మేనత్ జేసి సంపాయించిందా , ఏంది - పరేషానవనికి!" అంటూ రొజాని ఓదార్చాడు జైరాజ్. కానీ అతను చాలా కష్టపడి -- ఒక లిక్కర్ ఇండస్ట్రీ పెట్టి అబద్దాలు చెప్పి -- దాన్ని సక్సెస్ చేసి డబ్బు సంపాదించాడని రోజాకి తెలుసు. అయినా రోజా దిగులు పడటం మానలేదు.
    "చానెల్ ని చాలా హైస్టాండర్ద్ లో మెయింటెయిన్ చేశాను డాడీ! సెన్సేషనలిజం లేకుండా , అశ్లీలం, అబద్దాలు లేకుండా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయించాను - మన కల్చురల్ వాల్యూస్, మన సంప్రదాయాలు అన్నీ రిఫ్లెక్ట్ ఆయె సీరియల్స్ రన్ చేయిస్తున్నాను. అయినా అవి ఆడియెన్స్ ని ఎందుకు ఎట్రాక్ట్ చేయటం లేదో నాకు అర్ధం కావటం లేదు -"
    "ఇంకా ఆ విషయాల గురించి ఆలోచించింది బంద్ జెయ్ బిడ్డా! నువ్ కంప్లీట్ గా రెస్ట్ తీసుకో - కొద్ది దినాలు - ఈ చానెల్ దిక్కు కెళ్ళి రాత్రింబవళ్ళు టెన్షన్ ఎక్కువయిపోయింది " అంది సబిత.
    రోజా నవ్వింది.
    "బెడ్ రెస్ట్ తీసుకోవాలా? మంచి గున్నావ్ మమ్మీ! నేను ఒక్కరోజు ఆఫీస్ కెళ్ళకపోతే చానెల్ ప్రోగ్రామ్స్ అల్లకల్లోలమయిపోతాయ్-"
    జైరాజ్ షాకయ్యాడు'.
    "ఏంటి? ఇంత జ్వరం పెట్టుకుని చానెల్ కేల్తావా? నోవే! కావాలంటే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను- ఫోన్ లో నీతో మాట్లాడి అన్నీ సెట్ చేస్తాను - డోంట్ వర్రీ!"
    "సడెన్ గా ఎంటరయి మానేజ్ చేసే జాబ్ కాదు డాడీ అది -"
    "నాకు తోడుగా రాకేష్ ని కూడా తీసుకెళ్తాలే- డోంట్ వర్రీ-"
    "రాకేషా! చానెల్ వర్కింగ్ రాకేష్ కి మాత్రం ఏం తెలుస్తుంది - వీళ్ళంతా న్యూస్ పేపర్లో రాసుకునే టైప్-"
    "అది నే ఫీలింగ్! ఎక్కడి కెళ్ళి నా దున్నేయగలం అనేది నా ఫీలింగ్! చూశావా ఎంత తేడా ఉందొ-"
    రూమ్ లో ఎంటరవుతూ అన్నాడు భవానీ-
    రోజా తడబడింది -
    "ఓ! నువ్విక్కడే ఉన్నావా?" అంది కొంచెం ఇబ్బందిగా ఫీలవుతూ-
    "అంకుల్- నేను రడీ" అన్నాడు భవానీ!
    "దేనికీ?"
    "దుమ్ము దులపడానికి-"
    "వ్వాట్?"
    "అర్ధం కాలేదా/ మన చానెల్ దుమ్ము దులపడానికి! వెళ్దామా మరి?"
    "వెళ్ళిరా బిడ్డా! నీక్కూడా మంచిగ టైం పాసుంటది ! అంది సబిత'.
    ఇద్దరూ బృందావనం చానెల్ చేరుకున్నారు.
    ఏమ్ డి రూమ్ లో కూర్చోగానే హనుమంత్, రాధా చమేలీ , డాషింగ్ రంగా ఎంటరయారు.
    "గుడ్ మాణింగ్ సర్!" అన్నారందరూ వినయంగా.
    "నమస్తే -నమస్తే - కూసొండ్రి! మీ డిటేయిల్స్ నాగ్గుర్తులేదు గాని - మీలో ఏవళ్ళెం కొలువు జేస్తున్రో- ఈ రాకేష్ కి జెప్పండ్రి! మా రోజాకి జరంత తబీయత్ మంచిగ లేదన్నట్లు ! దాన్దిక్కు కెళ్ళి పద్దినాలు రాజేశ్ చానెల్ మానేజ్ చేస్తాడు , సమజయిందా?"
    వెంటనే హనుమంతు లేచి నులబడ్డాడు.
    "నేను వ్యూయర్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్ ని సర్ -"
    "ఓ! మీరేనా! ఒండర్ ఫుల్ ! మీరేమేం ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ?"
    "ఎన్నెన్నో జన్మల బంధం -" అంటే మన యాంకర్ ఒకో రోజుకో కాలనీ కెళ్ళి అక్కడి దంపతులందరినీ వాళ్ళ మారేజ్ గురించి ప్రశ్నలడిగి - వాళ్ళల్లో సినిమా పాటలకు బాగా డాన్స్ చేసిన దంపతులకు బహుమతిలిస్తాం సార్-"
    "చెత్త -- ' అన్నాడు భవానీ.
    అతను షాకయ్యాడు.
    "కానీ మన చానెల్ ప్రేక్షకులు ఆ ప్రోగ్రాం అద్భుతం అని తెగ పొగడుతున్నారు సార్-"
    "వాళ్ళంతా మెంటల్ హాస్పిటల్ పేషెంట్స్ అయింటారు-"
    హనుమంతు మొఖం వాడిపోయింది. జైరాజ్ హాపీగా ఫీలయ్యాడు. ఆ ప్రోగ్రాం గురించి తన అభిప్రాయం కూడా అదే! రోజా ఫీలవుతుందని ఎప్పుడూ క్రిటి సైజ్ చేయలేదు.
    "రెండో ప్రోగ్రాం -- " దాగుడు మూ చీ" సార్ - యాంకర్ రోజుకో రోడ్ సెలక్ట్ చేసుకుని దారిన పోయేవాళ్ళకు తను చానెల్ తాలుకూ అని చెప్పకుండా వాళ్ళను రకరకాలుగా ఇబ్బంది పెట్టి - వాళ్ళను ఫూల్స్ ని చేసి - చివరకు అదంతా చానెల్ ప్రోగ్రాం అని చెప్పటం -"
    "హరప్పా, మొహంజోదారో - " అన్నాడు భవానీ -
    హనుమంతుకి అర్ధం కాలేదు -
    "అంటే సార్?"
    'అంతపురాతనం ఆ ప్రోగ్రాం - అదో శిధిలం !" ఆ తర్వాత ఇంక అతను మాట్లాడలేదు.

 Previous Page Next Page