ఇక ఆగలేక- అప్పుడు కదిలింది సునీత వేగంగా. ప్రీతమ్ ఏం జరిగిందో గమనించే లోపలే ఆమె పెదవులు, అతని పెదవుల్ని మూసేసాయి. అతని కిది తొలిముద్దు. క్షీరసాగరాన్ని కాక అమృతాన్నే నాలుకతో మధిస్తున్న అనుభూతి అతనిలో కలుగుతుండగా వివశంగా ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. సునీత అలాగే సోఫాలో వెనక్కి ఒరిగి పడుకుంది. అతను ఆమె పెదవుల్నించి తన పెదవులు విడదీయకుండానే ఆమెపై పూర్తిగా ఒరిగిపోయాడు.
రెండు నిమిషాల తర్వాత రధమిక్ గా ఆమె నోటి నుండి విన్పించే మూలుగు అతని కోరికకు మరింత ఆజ్యం పోయసాగింది. పచ్చని అతని వీపుపై పేరుకుపోతున్న స్వేద బిందువులు తెల్లని గులాబీపై ఉదయాన్నే కురిసిన మంచు బిందువుల్లా వున్నాయి. భుజాలపై పడే నఖక్షత్రాలు అతనిలో తీయటి అనుభూతిని మరింత పెంచుతున్నాయి.
ఇన్నాళ్ళూ ఆమెలో అతడిపై కోరిక త్రాచుపాములా బుసలు కొడుతుండేది. ఈ రోజు అది తీరుతుండటంతో ఆనందంగా మరింత ఉత్సాహంగా అతనికి సహకరించసాగింది.
ఆ కుర్రవాడికి ఆ అనుభవం మొదటిసారి కావటంతో తడబడ్డాడు. సరిగ్గా అప్పుడు..... హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తిన ప్రీతమ్ గుండె క్షణకాలం ఆగిపోయింది. అక్కడ తలుపు దగ్గర సునీత భర్త చేతిలో సూట్ కేస్ తో నించోని వున్నాడు.
ముందు అతనికేమీ అర్థంకాలేదు. రెండు క్షణాల తర్వాత పరిస్థితి అర్థమయ్యాక. చేతిలోంచి సూట్ కేస్ అలాగే జారి క్రిందపడింది. అతని ముఖంలో క్రమ క్రమంగా రూపు దాల్చుకుంటున్న రౌద్రాన్ని చూసి ప్రీతమ్ స్పృహలోకొచ్చి చప్పున లేచాడు. క్రింద కుప్పగా పడివున్న బట్టలని అందుకుని గబగబా తొడుక్కున్నాడు.
అంతసేపూ అతను పైన వుండటంతో, అదీగాక సోఫా కూడా అడ్డంగా వుండటంతో సునీతకు వచ్చిందెవరో అర్థంకాలేదు. అతను లేవటంతో ఆమె చప్పున నైటీ సరి చేసుకుని లేచి నిలబడింది. భర్తను చూడగానే ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అసంకల్పితంగా ఆమె నోరు చిన్నగా తెరుచుకుంది. క్యాంపుకెళ్ళిన తను ఇంత త్వరగా వస్తాడని కల్లో కూడా ఊహించకపోవటంతో ఆమె డీప్ షాక్ లోకి వెళ్ళిపోయింది.
5
"థై....... తకథై....... థై.......తకథై....."
లోపల హాల్లోంచి మాస్టారి కంఠం వినబడుతోంది. శ్రీలక్ష్మికి బాగా తలనొప్పిగా వుండటంతో ఇంటికి బయలుదేరింది; లోపల ధాత్రి, మాస్టారి కంఠానికి అనుగుణంగా డాన్స్ చేస్తూంది.
సాధారణంగా ధాత్రి డాన్స్ క్లాసు పూర్తయ్యేవరకు శ్రీలక్ష్మి అక్కడే వుండి కూతురితో కలిసి ఇంటికి వెళుతుంది.
పదమూడేళ్ళ కూతురు ఇంటికి ఒంటరిగా రాలేదని కాదు. తను ఇంటినుంచీ, భర్త నుంచీ దూరంగా వుండటానికి అదొక సాకు మాత్రమే.
.....విష్ణువర్థన్ ఈ మధ్య మరీ అతిగా ప్రవర్తిస్తున్నాడు. చెడు తిరుగుడు ఎక్కువై నందువల్లనో ఏమో అతడిలో 'శక్తి' బాగా తగ్గిపోయింది. ఆ నిజాన్ని ఒప్పుకోలేక, అతడిలో ఏ బలహీనతా లేదని నిరూపించుకోటానికి దాదాపు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లటానికి సిగ్గు. అతడిలో కొత్తగా బయలుదేరుతున్న ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ అతనికి ఉచ్ఛనీచాలు మరచిపోయేలా చేస్తూంది.
వయసులోకి వస్తున్న కూతురి ముందు అతడు ఎప్పుడు బయట పడిపోతాడో అని శ్రీలక్ష్మి భయం. శ్రీలక్ష్మి భయపడినంత పనీ జరిగింది.
అరుస్తున్నది చాకలి రంగమ్మ. ఆమె పక్కనే పన్నెండేళ్ళ మనుమరాలుంది. ఆ దృశ్యం చూడగానే శ్రీలక్ష్మికి జరిగినదంతా అర్థమైంది.
రంగమ్మ కాలనీలో చాలామంది ఇళ్ళల్లో బట్టలు ఉతుకుతూ వుంటుంది. తను ఇక్క ఇంటికి బట్టలు తీసుకువెళితే మరో ఇంటికి మనుమరాలిని పంపిస్తూ వుంటుంది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో విష్ణువర్థన్ ఆ పిల్లని ఏదో చేయబోయాడు తరువాత జరిగిన గొడవ ఊహకి అందనిదేమీ కాదు.
......విష్ణువర్థన్ ఎప్పుడో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. బయట ఎంత గొడవ జరిగినా తనకేం పట్టనట్టు లోపలే కూర్చుండి పోయాడు. రంగమ్మను సముదాయించి పంపే బాధ్యత శ్రీలక్ష్మి మీద పడింది. రంగమ్మ రకరకాల బూతులు తిడుతూంది. శ్రీలక్ష్మికి తల కొట్టేసినట్టయింది. అయినా ఎలాగో సముదాయించి ఆమెని పంపించేసింది. ఇంతలో ఇది ఆగిపోదని, రంగమ్మ నోరు ఊరుకోదనీ, కాలనీలో ఇదంతా ప్రచారం అవుతుందని ఆమె తెలుసు. ఇక ఆ ఇంటి గుమ్మం తొక్కరు. ధాత్రి స్నేహితురాళ్ళని ఎవరూ ఆ యింట్లో అడుగు పెట్టనివ్వరు. తమని వెలివేసినట్టు చూస్తారు.
ఆమెకి దుఃఖం కలిగింది. ఇన్నాళ్ళూ తనకి పరిమితమైన సమస్య ఇప్పుడు కూతుర్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతూంది. ధాత్రి మనసు మీదా, మానసిక స్థితిమీదా ఈ సంఘటన ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిగా ఆమె ఊహించగలదు. మరోవైపు భర్తని నిలదీసి అడగలేదు. అడిగినా ప్రయోజనం వుండదు కూడా. "మరీ పత్తిత్తులా మాట్లాడుతుంది రంగమ్మ. వందరూపాయలకి ఇప్పటికి నాతో నాలుగుసార్లు గడిపింది. ఇప్పుడు డబ్బెక్కువ కావాలని గొడవ చేస్తూంది. నేనివ్వననేసరికి ఈ విధంగా నాటక మాడుతుంది" అని అప్పటికప్పుడు కథ అల్లుతాడు తన భర్త. లేదా, "ఆ పిల్ల మరీ చిన్నదేం కాదు. అదే కావాలని నా దగ్గర కొచ్చింది" అని తేలిగ్గా కొట్టేస్తాడు.
శ్రీలక్ష్మి ఇంకేమీ ఆలోచించలేదు. బయటికొచ్చి ఆటో ఎక్కి అద్దె ఇళ్ళు చూపించే బ్రోకర్ దగ్గరికి వెళ్ళింది. ఇది జరిగిన రెండు గంటల తరువాత శ్రీలక్ష్మి సామానులు పాక్ చేస్తూంటే ధాత్రి ఆశ్చర్యంగా చూస్తూ "ఎందుకమ్మా ఇప్పటికిప్పుడు ఇల్లు మారటం?" అని అడిగింది.
"అక్కడైతే నీ డాన్స్ క్లాసుకి, టెన్సిస్ కోచింగ్ కి దగ్గరవుతుంది. ఇలా ఆటోలో తిరగవలసిన అవసరముండదు. అందుకని" అంది శ్రీలక్ష్మి.
ధాత్రి దీనంగా "అమ్మా! ఈ కాలనీ బావుంది. ఫ్రెండ్సంతా ఇక్కడే వున్నారు. కొంచెం దూరమైనా ఫరవాలేదు. ఇక్కడే వుండి పోదాం" అంది.
"ధాత్రీ, నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంక నన్నేమీ అడక్కు" స్థిరంగా చెప్పింది శ్రీలక్ష్మి. విష్ణువర్థన్ ప్రేక్షకుడిలా చూస్తూండిపోయాడు. అంత తొందరగా క్షణాల్లో ఇల్లెందుకు మారవలసి వస్తూందో అతడికి తెలుసు. అందుకే అతడు మాట్లాడటం లేదు.
ఆ మర్నాడే వాళ్లు ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయారు.
* * *
ఆమె భర్త వేగంగా వచ్చి ఆమె జుట్టు పట్టుకుని వంచి మొహంమీద, వీపుమీద ఎడాపెడా గుద్దసాగాడు.
ఆ హఠాత్ సంఘటనకి ప్రీతమ్ క్షణకాలం తెల్లబోయినా వెంటనే రియాక్ట్ అయి, క్రోధంతో ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న అతన్ని ఆమెనించి బలవంతంగా వేరుచేశాడు. అప్పుడు కన్పించాడతనికి ఆ తప్పులో భాగమైన ప్రీతమ్. అంతే. భార్యను వదిలి అతని మీదికి లంఘించాడు.
ప్రీతమ్ "అంకుల్......" అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అతను వచ్చి ఫోర్సుగా మీద పడటంతో బ్యాలెన్స్ తప్పి నేలమీద పడిపోయాడు. అతనితోపాటే సునీత భర్తా అతనిమీద పడిపోయాడు.
ముందు ప్రీతమ్ తప్పు చేసినందువల్ల భయపడ్డాడు. ఆ తర్వాత క్షమాపణ కోరాలనుకున్నాడు. తర్వాత అతని దెబ్బల్ని తప్పించుకోవటానికే చూశాడు. అయినా అతని ఆవేశం చల్లారకపోవటంతో ఇక ప్రీతమ్ కూడా అతన్ని వెనక్కి నెట్టి కాలర్ పట్టుకుని లేపి తలపడ్డాడు.
అంతవరకూ మ్రాన్పడిపోయినట్టున్నదల్లా చప్పున ముందుకు కదిలి వారిద్దర్నీ బలవంతంగా వేరు చేసింది సునేత. సునీత భర్త రొప్పుతూ "నిన్ను చంపేస్తాను" అంటూ తిరిగి వురకబోయాడతని మీదకు. సునీత గట్టిగా అతన్ని పట్టుకుని ఆపి, ప్రీతమ్ తో "నీకు దండం పెడతాను. ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ప్లీజ్" అంది.
ప్రీతమ్ కదిలే లోపులో సునీత భర్త గట్టిగా అరిచాడు "ఒరేయ్! నిన్ను వూరికే వదల్ను" అని
ప్రీతమ్ ఆగి 'ఏం చేస్తావేం?" అన్నాడు.
"నేనేం చేస్తానో అది తర్వాత. ముందు మీ అమ్మా, నాన్నలకి చెప్తాను. వాళ్ళేం చేస్తారో చూద్దాం" అన్నాడు సునీత భర్త కోపంగా.
అతడి దృష్టిలో ప్రీతమ్ ఇంకా చిన్నకుర్రాడు. ఆ వయసు కుర్రాళ్ళు 'చేసిన తప్పులు బయటివాళ్ళ కెంతమందికి తెలిసినా ఫరవాలేదు. ఇంట్లోవాళ్ళకి తెలియకుండా వుంటే చాలు' నన్న ధోరణిలో ప్రవర్తిస్తారని అతడికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే తల్లిదండ్రుల పేరు చెప్పి భయపెట్టాలనుకున్నాడు.
"చెప్పుకో నీ పరువే పోతుంది" అనేసి బయటకు వెళ్ళిపోయాడు ప్రీతమ్.
ఆమాటలకి షాక్ తగిలిన సునీత భర్త ఆమెవైపు తిరిగి "చివరికి ఏమాత సిగ్గుమాలినదానిగా తయారయావే" అన్నాడు ఈసడింపుగా.
ఈ కొద్ది సేపట్లోనూ సునీత చాలా రకాలుగా ఆలోచనలు చేసింది. అతడి కాళ్ళమీద పడి 'తప్పయిపోయింది. నన్ను క్షమించండి' అని పెద్దగా ఏడ్చేయ్యాలనుకుంది. ఉహూఁ, చేసిన తప్పుని అంత బ్లంట్ గా ఒప్పుకోవడమంత బుద్ధితక్కువపని మరొకటుండదనిపించింది. జీవితాంతం ఆ సాధింపులు దెప్పిపొడుపులు భరించాల్సొస్తుంది.
సునీతకు ఒక విషయం బాగా తెలుసు. భర్త రెండు రోజులు ఇంట్లో వుంటే వారం రోజులు క్యాంపులో వుంటాడు. అతడికి ఒక్క అలవాటు కూడాలేదు. కాబట్టి భార్యగా తన అవసరం అతనికి చాలా వుంది. ఉన్న రెండు రోజులూ ఆమెను వదలడు. ఈ బ్లూఫిలిమ్స్ కోరిక కూడా అతడిదే. కాబట్టి కాస్త తెలివిగా వ్యవహరిస్తే తప్పకుండా చల్లబడతాడు.
"తప్పునాదేంకాదు. నిజం చెప్పాలంటే కొంతవరకు మీదే" అందామె.
"తప్పు నాదా? ఏం కూస్తున్నావు? చేసిన నిర్వాకం చాలక పైగా నన్నే అంటున్నావా?" అతడు చెయ్యెత్తి కొట్టడానికి ముందుకు వచ్చాడు.
"అసలు విషయం తెలుసుకోకుండానే అలా ఎగిరి పడతారేం? ఆ కుర్రాడు ఎప్పటిలానే ఏదో సినిమా చూస్తానని వచ్చాడు. సరే చూసుకొమ్మని నేను వెళ్ళి లోపల పడుకున్నాను. ఈ క్యాసెట్ అక్కడే వుందనుకుంటాను. నేనెందుకో లేచి బయటకు వచ్చేసరికి నా మీద పడ్డాడు. అంత చిన్నకుర్రాడు అలాంటి పని చేస్తాడని ఊహించగలనా? పెనుగులాడుతుంటే మీరు వచ్చారు" అంది గబ గబా.
అతడు మాట్లాడలేదు.
"అంత బరితెగించిదాన్నయితే తలుపులు అయినా వేసుకోకుండా అలాంటి పని చేస్తానా? అయినా మీరనుకునేలాంటి సంబంధం పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్నకుర్రాడెందుకు, నాకు వేరే మగాడే దొరకడా" అందామె ధైర్యంగా.
అందులో నిజమెంతో తేల్చుకోలేకపోతున్నాడు. కాస్సేపలాగే నిలబడి తర్వాత మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
భర్త విషయం ఆమెకు బాగా తెలుసు. 'అది' లేకుండా వారం రోజులు కూడా వుండలేడు. అంతేకాదు, తమకి పిల్లలు కలగకపోవడానికి కారణం అతడిలో లోపమేనని డాక్టర్లు నిర్ధారించేశారు. ఆ గిల్టీఫీలింగ్ కూడా అతడిలో వుంది.
కాబట్టి నాలుగు రోజుల్లో అతడు మామూలు మనిషి అయిపోతాడు తప్పదు. ఈ ఆలోచన రాగానే సునీత రిలీఫ్ గా నిట్టూర్చింది.