Previous Page Next Page 
ధ్యేయం పేజి 12


    ఈసారి కన్నీరు పెట్టుకోవడం మహతి వంతయింది. నిఖిత వాళ్ళిద్దరి వైపు జాలిగా చూసింది. తల్లిదండ్రుల పెంపకం అస్తవ్యస్తంగా వుంటే చిన్నపిల్లలు..... ముఖ్యంగా మానసికంగా అప్పుడప్పుడే వికసిస్తున్నవాళ్ళు, ఎంత బాధపడతారో చెప్పడానికి రెండు సజీవమైన ఉదాహరణలు ఉత్తర దక్షిణ ధృవాల్లా తనకి  చెరో వైపున నిలబడి వున్నట్లు ఆమెకి ఆ క్షణం అనిపించింది.

    కొంచెంసేపు మాట్లాడేసరికి ధాత్రి బాగా తేరుకుంది. అప్పటివరకూ వున్న బాధ కొద్దిగా తగ్గినట్లనిపించింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఏడయ్యింది.

    "కాలికి అంత దెబ్బ పెట్టుకొని ఎక్కడ తిరుగుతున్నావే?" అని అడిగింది శ్రీలక్ష్మి.

    "పార్క్ కెళ్ళానమ్మా. మిఖిత, మహతి కలిశారు" అంది ధాత్రి.

    వాళ్ళకంటే ఏమీ పనిలేదు. పార్క్ ల చుట్టూ, రోడ్లచుట్టూ తిరక్కుండా ఇంట్లోనే వుండు" అంది శ్రీలక్ష్మి.

    మహతి సంగతి  వదిలేస్తే, నిఖిత కన్నా  తను ఏ విషయంలోను గొప్పది కాదని ధాత్రికి తెలుసు. తనకి రేపొద్దున్న  టెన్నిస్ టోర్నమెంట్ లో కప్పు రావొచ్చు. లేదా డాన్స్ పోటీల్లో ప్రైజ్ రావచ్చు. అయినా కూడా నిఖిత తనకన్నా అన్ని విధాల గొప్పది. అందులో ఏ సందేహమూ లేదు. జీవితంలో కూడా ఆ అమ్మాయే ఎక్కువ సుఖంగా బతుకుతుందని ధాత్రి కెందుకో నమ్మకం.

    రాత్రి పదింటికి పడుకొని ఆ విషయమే ఆలోచిస్తూంది ధాత్రి. డాక్టరిచ్చిన మందుల ప్రభావం తగ్గటంతో కాలిలో నెమ్మదిగా సలపరం మొదలైంది. బాధని  నొక్కి పెట్టుకుంటూ నిద్రపోవటానికి ప్రయత్నించింది. పక్కగదిలోంచి తల్లీ తండ్రి సంభాషణ ఆమెకి వినిపిస్తోంది. అంతకుముందు రెండు నిమిషాల క్రితమే తన దగ్గిర కూర్చొని వున్న తల్లిని "లక్ష్మీ ఒకసారి లోపలికి రా" అని తండ్రి పిలిచాడు.

    తల్లి ఉలిక్కిపడి లోపలి కెళ్ళటం ధాత్రి గమనించింది. తల్లిని తన తండ్రి ఎందుకు పిలిచాడో తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు ధాత్రిది.

    ఆ స్థితిలో కూతుర్ని వదిలి భర్తగదిలోకి వెళ్తున్న శ్రీలక్ష్మికి చచ్చేటంత సిగ్గుగానూ, అసహ్యంగానూ అనిపించింది భర్తకు ఇవన్నీ అర్థంకావు. అది అత్యంత సహజమైన విషయంగా పరిగణిస్తాడు అతను.

    భార్యంటే 'కార్యేషు దాసి, శయనేషు రంభ' అని మాత్రమే అతని ఉద్దేశ్యం అతని కోర్కెలన్నీ చాలా విచిత్రంగా వుంటాయి. ఒక్కొక్క  రోజు 'పురాణకాలం నాటి పతివ్రత' లా వుండాలి. మరొకరోజు ఆధునిక ఫాషన్స్ ననుసరించి అతనితో పాటు కలిసి తాగాలి.

    అంతవరకూ ఫరవాలేదు. తాగిన తరువాత అతడు మరీ జంతువై పోతాడు. ఆవిడ జీవితం నరకమవుతుంది. విష్ణువర్ధన్ మామూలు సెక్స్ మానియాక్ అతడిలో పర్వర్షన్ కూడా వుంది. ఒక్కోసారి "ఇప్పుడు నేను నిన్ను రేప్ చేస్తాను నువ్వు నన్ను ప్రతిఘటించాలి. దూరంగా తోసేయాలి. బలవంతంగా ఆక్రమించుకుంటాను" అంటాడు.

    మరో రోజు "నిన్ను నలుగురు అపరిచితులు రేప్ చేస్తున్నట్లు ఊహించుకో, ఎలా ఫీలవుతావో చెప్పు" అని బలవంతం చేస్తాడు. మరో సారైతే "ఈ రోజు మధ్యాహ్నం మనింటి కొచ్చిందెవరూ? ఆ అమ్మాయి భలేగా వుందిలే. ఆ ఎత్తులు అవి" అని వర్ణన మొదలుపెడతాడు. ఆమె ఏం చెప్పాలో తెలియక కుంచించుకుపోతుంది. ఒక అర్థరాత్రి లేపి "ఇప్పుడే నాకు కలొచ్చింది. ఫలానా సినిమా యాక్టర్ లాగా నువ్వు  వూహించుకొని నాతో మాట్లాడటం మొదలు పెట్టు" అంటాడు. పర్వర్షన్ కి పరాకాష్ఠ అది. అతడు డిగ్రీ  కూడా పాసవలేదు. "ఉద్యోగాలు చెయ్యాల్సిన ఖర్మ నాకు లేదు. నా కెందుకు చదువు" అని మానేశాడు. వాళ్ళ తాతముత్తాతలు సంపాదించిన ఆస్తి ఒక్కొక్కటీ అమ్ముతూ వుంటాడు. సుఖించటం తన జన్మహక్కని, చాలామందికి ఆ ఆర్ట్ లేదని అతడు మనస్ఫూర్తిగా  నమ్ముతాడు.

    ......శ్రీలక్ష్మి గదిలోకి రాగానే "అరగంట నుంచి అరుస్తున్నాను. ఇప్పటికొచ్చావ్. వెళ్ళి డ్రింక్స్ తీసుకురా" అని పురమాయించాడు.

    "అవతల ధాత్రి అలా పడుకుని వుంటే ఇదేం గోడవండీ? అమ్మాయికి కూడా వయసోస్తుంది. మన గురించి ఏమనుకుంటుంది" అని పురమాయించాడు.

    "అవతల ధాత్రి అలా పడుకుని వుంటే ఇదేం గొడవండీ? అమ్మాయికి కూడా వయసోస్తుంది. మన  గురించి ఏమనుకుంటుంది" అని చెప్పింది శ్రీలక్ష్మి.

    "ఇలా పిలువు. ఏమనుకుంటుందో నేనే అడుగుతాను" అన్నాడు జోక్ గా శ్రీలక్ష్మి కళ్ళు నిస్సహాయతతో తడి అయ్యాయి. ఈ లోపులో అతనన్నాడు. "నువ్వు దగ్గరుంటే నొప్పి తగ్గుతుందా? అయితే వెళ్ళి కూర్చోనాకేం అభ్యంతరంలేదు. నా మొహాన ఓ రెండొందలు తగలెయ్. నా బాధ తగ్గించుకోవడానికి ఇంకెవరి దగ్గరకన్నా వెళతాను".

    శ్రీలక్ష్మికి అసహ్యంవేసింది. బీరువాలోంచి డబ్బులు తీసి అతని పక్కమీద వేసి విసురుగా కూతురి గదిలోకి వెళ్ళిపోయింది. రెండు నిముషాల తరువాత అతడు వెళ్తూన్న శబ్దాన్ని తల్లీ, కూతుళ్ళిద్దరూ విన్నారు.

    ధాత్రి నిద్ర నటిస్తోంది.


                                           4

    కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తెరిచిన సునీత, ప్రీతమ్ కనిపించగానే ఆనందంగా "రావోయ్ రా! నీ గురించే చూస్తున్నాను" అంటూ చనువుగా చెయ్యి పట్టుకుని లోపలి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది.

    "టీ.వీ. చూస్తూండు. అయిదు నిముషాల్లో వస్తాను" అని చెప్పి లోపలి నడిచింది. ప్రీతమ్ ఆమెనే చూడసాగాడు. నడుముపై కదలాడే ఆమె వాల్జడను చూస్తూ 'వయసు పెరుగుతున్నా, అంటీ  నడకలో ఆ వయ్యారం తగ్గలేదు' అనుకున్నాడు. అతని కిప్పుడు పద్దేనిమిదేళ్ళు. నూనూగు మీసాలు స్పష్టతని సంతరించుకున్నాయి.

    అయిదు నిమిషాల్లో బెడ్ రూమ్ తలుపు తెరుచుకుని వస్తున్న ఆమెని చూడగానే అతని కళ్ళు విభ్రమంతో పెద్దవయ్యాయి. లేత గులాబీరంగు ట్రాన్స్ ఫరెంట్ నైటీ వేసుకుని, జడతీసేసి పైన క్లిప్ పెట్టి జుట్టును లూజ్ గా  వదిలేసింది. అదికాదు అతను గమనించింది నైటీలోంచి కన్పించే ఎత్తయిన శిఖరాలను, కాస్త క్రిందుగా కన్పించే లోయలను గమనిస్తున్నాడు. సునీత అతని చూపులు గమనించి కూడా మామూలుగా వచ్చి ప్రక్కన కూర్చుంది.

    మట్టయిన పరిమళం అతని నాసికాపుటాలకు సోకింది. ఆమె చనువుగా వెనక్కివాలి 'ఊ...... చెప్పు! ఏమిటి విశేషాలు?" అని అడిగింది. అతను అన్యమనస్కంగా వుండి వెంటనే సమాధానం చెప్పలేదు. టీ.వీ. నే చూస్తూ కూర్చున్నా మనసులో మాత్రం ఇందాక ఆమెలో కన్పించిన అందాలే మెదుల్తున్నాయి.

    ప్రీతమ్ కి అంతకుముందు ఆమె స్పర్శ కొత్తకాదు. మధ్యలో రెండు సంవత్సరాలు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళి ఆర్నెల్ల క్రితమే వచ్చారు. ఆ తరువాత ఎప్పుడు ఆమె ఇంటికి అతను వచ్చినా ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. పత్రిసారీ ఏదో నెపంమీద అతని శరీరాన్ని తాకుతూ వుంటుంది. అతను బిడియపడుతూ వుంటాడు. ఈ రోజు మాత్రం ఆమె వేషధారణ చూసిన దగ్గర్నించి అతనిలో కోరిక ఎక్కడినుండో నిద్రలేస్తోంది. ఇక ఆమె అలా అనుకుని కూర్చోవటంతో అతని శరీరం గాలిలో తేలిపోతున్నంత తేలికయిపోతున్నట్టుగా వుంది. ఆమె ప్రశ్నకు అతను సమాధానం చెప్పకపోవటంతో "ఏంటలా వున్నావు.... మూడ్ బావోలేదా?" అని అడిగింది. ఆమె అలా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడగటంతో అతను తడబాటుగా చూసి "ఊఁ' అన్నాడు.

    "అయితే పది నిమిషాల్లో నిన్ను మంచి మూడ్ లోకి తెస్తానుండు" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అతను వూపిరి బిగబట్టి ఆమె ఏం చేస్తుందా అని  టెన్షన్ తో చూడసాగాడు.

    కొద్దిసేపట్లో బెడ్ రూమ్ లోంచి బయటికి వచ్చిన ఆమె చేతిలో ఓ వీడియో క్యాసెట్ వుంది. ఆమె వి.సి.ఆర్. ని టీ.వీ.కి కనెక్ట్ చేసి అందులో ఆ క్యాసెట్ వుంచి రీవైండ్ చేసింది. కొద్దిక్షణాల తర్వాత ప్లేబటన్ నొక్కివచ్చి అతని ప్రక్కన కూర్చుంది. అతను ఆమెవేపు తిరిగి "ఏమిటిది ఆంటీ?" అని అడిగాడు.

    సునీత నవ్వుతూ "తినబోతూ రుచులెందుకు?" అన్నట్టు నవ్వింది. అతను  తిరిగి టీ.వీ. వేపు చూడసాగాడు. కొద్దిసేపు చూసిన తరువాత అతనిలో ఏదో  కదలిక. తలతిప్పి ఆమెవేపు చూశాడు. ఆమె ఏ భావమూ లేకుండా టీ.వీ. చూడసాగింది. అతను మళ్ళీ టీ.వీ. వైపు చూడసాగాడు. అలా చూస్తున్న  అతను శ్వాస బరువుగా తీయటం ఆమె కంటి కొసలనించి గమనించి సన్నగా నవ్వుకుంది.

    ప్రీతమ్ చాలా చురుకైన కుర్రవాడే. అమ్మాయిల్తో పరిచయాలు లేవని కాదు. ఏ అమ్మాయితో నయినా అతను చలాకీగా మాట్లాడగలడు. కానీ అంతకుమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అతడి వయసు కూడా తక్కువే.

    'ఆంటీ' అంటే చాలామంది ఆడవాళ్ళకన్నా తెలివైనది, మంచిది అని  మాత్రమే అనుకున్నాడు. ఆమె కోర్కెను తీర్చుకోవటానికి తనని పావుగా ఉపయోగించుకుంటోందని అతనికి ఆ క్షణంలో తెలీదు. ఇదంతా అతనికి థ్రిల్లింగ్ గా వుంది. మిగతా వారికి దొరకని అవకాశం తనకి మాత్రమే దొరుకుతోందని గర్వంగా వుంది.

    తరచూ క్యాంపుళ పేరుతో భర్త బయట గడుపుతుంటే, వాళ్ళ భార్యల్ని ఎలా ట్రాప్ చేసి ఉపయోగించుకోవాలా అని ట్రై చేసే చాలా మంది మగరాయుళ్ళలానే, కొందరాడవాళ్ళు కూడా తమ కోర్కెల్ని తీర్చుకోవటానికి ఏమీ తెలీని కుర్రవాళ్ళని సాధనంగా ఉపయోగించుకుంటారని చాలామంది వూహించి వుండరు.

    ప్రీతమ్ మౌనంగా స్ర్కీన్ మీద కదుల్తున్న బొమ్మలను చూస్తున్నాడు. అతని నాలుక తడారిపోయింది. సునీత అతని దగ్గరగా జరుగుతూ "ఇలాంటి ఫిలిమ్ ఎప్పుడయినా చూశావా?" అంటూ అడిగింది. అవుననో కాదనో తల వూపాడతను. అతనికి ఇదంతా విచిత్రంగా వుంది. తను ఇన్నాళ్ళుగా చూసే ఆంటీ ఈ రోజు చాలా  కొత్తగా  కనిపిస్తోంది. ఆమె ఇలా  ప్రవర్తించటం అతనికి కొత్తకాదు గానీ, ఎందుకో ఆమె ప్రక్కన కూర్చొని బ్లూ ఫిలిమ్ చూస్తూండటంవల్ల అతనికీ పరిస్థితి కొత్తగా, వింతగా వుంది.

    తెరమీద ఓ అమ్మాయి వంటిమీద బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తోంది. ముందు షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పుతూ షర్ట్ ని తీసేసింది. తరువాత జీన్స్ ప్యాంట్ బటన్స్ విప్పి జిప్ క్రిందకు లాగింది. ప్రీతమ్ శరీరం సన్నగా కంపించసాగింది. గుండె వేగం మరింత పెరిగి, అరచేతుల్లో చెమట పట్టేసింది. తల త్రిప్పి సునీతను చూసే సాహసం చేయలేకపోయాడు. అతనికి ఇలాంటి అనుభూతి కొత్తగాదు. కొన్ని రోజులుగా రాత్రిళ్ళు అతను నిద్రపోవటం మానేసి ఇలాంటి అనుభూతిని ఆస్వాదించేవాడు. అయితే  ఇప్పుడు పక్కన ఆంటీ వుంది!

    అతను కోరికను బలవంతంగా అణచుకుంటూ టీ.వీ. వైపు చూడసాగాడు. తెరమీద అమ్మాయి ఇప్పుడు పూర్తి నగ్నంగా నించుని ఆమె కెదురుగా వున్న యువకుడి బట్టలు కూడా విప్పేసింది. ఇద్దరూ ఒకరి నొకరు అభిముఖంగా నించుని క్షణంసేపు శరీరాల్ని చూసుకుని ఒకటయ్యారు.

    సరిగ్గా ఆ సమయానికి సునీత చెయ్యి అతని భుజంమీంచి క్యాజువల్ గా జారి ప్రీతమ్ మోకాలిమీద ఆనింది. అతనిలో ఒక్క సారిగా చిన్న జెర్క్ సాహసం చేసి ఆ చేతిమీద తన చేయివేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. సునీత్ ఇంకాస్త అతని  దగ్గరగా జరిగింది. ఇప్పుడు ఆమె గడ్డం అతని భుజంమీద ఆని వుంది. ఆమె ఉచ్చ్వాస, నిశ్వాసాలు అతని మెడమీద వెచ్చగా తగుల్తూ అతని శరీరం మరింత వేడెక్కటానికి దోహదం చేస్తున్నాయి. ఒకవైపు టీ.వీ. చూస్తూ, సునీత కదలికల్ని ఓరకంటితో గమనించసాగాడు.

 Previous Page Next Page