"ఓగాడ్ - సో బాడ్" అంది ఒకామె.
"అయ్ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ ' అన్నాడు జే.కే!
"దిసీజ్ డిసాస్ట్రస్!" అన్నాడు మూర్తి.
మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అడుగంటి పోవటం చూసేసరికి అందరూ సైలెంటయిపోయారు.
"మీరందరూ ఏమాలోచిస్తున్నారో నాకు తెలుసు?" అంది రోజా.
అందరూ భయపడిపోయారు.
ఎందుకంటే ఎవరికి వాళ్ళు వెంటనే ఈ చానెల్ వదిలి ఇంకో చానెల్ లోకి దూకేయాలనే ఆలోచిస్తున్నారు.
"ఎలాగయినా మన చానెల్ కోసం కష్టపడి మళ్ళీ కనీసం నాలుగో స్థానానికయినా తేవాలని అనుకుంటున్నారు -' అందామె.
"అవును మేడమ్- " అన్నాడు కేకే.
"నా మైండ్ వాయిస్ కరెక్టుగా గెస్ చేశారు మేడమ్- కాకపోతే నేను మన ఛానెల్ ని సెకెండ్ ప్లేస్ కి తేవాలని డిసైడ్ చేశాను -"
అందరూ అదే అభిప్రాయం వెలిబుచ్చారు.
"ఓకె లెటజ్ రీడేడికేట్ అవర్ సేల్వాస్ టు ది ఆఫ్ లిప్ట్ మెంట్ ఆఫ్ ది చానెల్" అంది రోజా ఆవేశంగా.
అందరూ "యా" అరచారు.
సమావేశం ముగిసిపోయింది.
కానీ రోజా మనసులో ఇంకా అనుమానం తొలుస్తూనే ఉంది! నిజంగా చానెల్ ని మళ్ళీ పైకి తేవటం సాధ్యమా?
కొంచెం వర్రీడ్ గానే ఇంటి దగ్గర కారు దిగిందామే.
***
రూమ్ లో కెళ్ళగానే ముందు రాకేష్ సెల్ కి రింగ్ చేశాడు.
టక్కున మాట్లాడాడు రాకేష్.
"హాయ్ భవానీ! నీ ఫోన్ కోసం సస్పెన్స్ తో చస్తున్నాను -- ఇంతకూ కిడ్నాప్ చేసిందేవరు?" అత్రుగా అడిగాడు రాకేష్.
"మీ డాడీ ఫ్రెండ్ జైరాజ్-"
రాకేష్ ఒక్కసారిగా రిలాక్సయిపోయాడు.
"ఓ! జైరాజంకుల్! బెస్ట్ అంకుల్ ఇన్ ది వరల్డ్! కొంచెం తిక్కగా ప్రవర్తిస్తుంటాడు. అయినా -- స్టిల్ ది బెస్ట్ ఇన్ ది లాట్- " అన్నాడు హాపీగా.
"యా! నేనూ అదే అనుకుంటున్నా -"
"ఎలా వుంది లైఫక్కడ? నువ్ రాకేష్ కాదన్న అనుమానం రాలేదా వాళ్ళకి?"
"హాఫ్ ఇంచ్ కూడా రాలేదు - మిత్రమా! ఇక్కడ లైఫ్ ఎంత లగ్జరీయస్ గా ఉందో తెల్సా౧ సెకండ్ హాండ్ సెవెన్ స్టార్ హోటల్లో ఉన్నట్లుంది!"
"గదే మళ్ళా తలాబ్ కట్టాడైలాగంటే! నా ఇల్లుగింత మంచిగుంటే సెకెండ్ హాండ్ సెవెన్ స్టారంటావ్?"
ఆ డైలాగ్ విని ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు భవానీ. జైరాజ్ గడపలో నిలబడి ఉన్నాడు.
భవానీ కంగారుపడ్డాడు.
ఓపక్క రాకేష్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు.
"సూపర్ ఎరెంజ్ మెంట్ రా తంబీ! నువ్ నా పేరుతొ అక్కడే సేటిలయావనుకో! డబుల్ ధమాకా! నేను హాపీగా బాంబే- హైదారాబాద్ ట్రిప్పులు కొడుతూ నా గాళ్ ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తుంటా! నువ్వేమో సూపర్ లగ్జరీస్ ఎంజాయ్ చేస్కో-"
"ఎవల్తో మాట్లాడుతున్నావ్?" అడిగాడు జైరాజ్.
"నా గాళ్ ఫ్రెండ్ తో అంకుల్ - ఎనీ ప్రాబ్లం?"
"ఫస్టా, సెకండా?"
"ఫోర్త్-"
"సూపర్ - ఎంజాయ్ లైఫ్ మై బాయ్- నా పాలసీ కూడా అందే!" వెళ్ళిపోయాడతను.
"ఎవర్తో మాట్లాడుతున్నావ్ అక్కడ?" ఆడిగాడు రాకేష్.
"జైరాజంకుల్- సూపర్ పర్సనాలిటీ - వెళ్ళిపోయాడులే-"
"హెన్ పెకేడ్ కేటగిరిలే! ఆంటీని మస్కా కొట్టవంటే అంకుల్ ని నీ బానిసగా చేసుకుని ఆడుకోవచ్చు -"
"మంచి క్లూ బ్రదర్! అవసరమొచ్చినప్పుడు దున్నుకుంటాలె-"
"నీ ఇష్టమొచ్చినంత కాలం అక్కడే ఉండిపో! దాంతో మా డాడీ నేను చాలా బుద్దిమంతుడయిపోయాననుకుని హాపీగా ఫీలవుతాడు. నేనిక్కడ నా డార్లింగ్ మోనికాను మారేజ్జేసుకుని -- పిల్లల్ని కంటూ జగమే వెన్నెలా సాంగ్ వేసుకుంటుంటా!
"అది సరే గాని బ్రదరూ- జైరాజంకుల్ డాటర్ రోజా సంగతేమిటి? మీ ఇద్దరూ చిన్నప్పుడు ఊటీ పబ్లిక్ స్కూల్లో చదివారంట కదా" రాకేష్ పగలబడి నవ్వాడు.
"యా - యా! అదొక మెంటల్ కేస్! నా మీద బాసికం చేయడానికి ప్రయత్నించేది. ఇద్దరికీ క్షణం పడేది కాదు. దాన్ని నేను "ఉల్లిపాయ" అనే నిక్ నేమ్ తో పిలిచేవాడిని - "
"ఉల్లిపాఏంటి?"
"అంటే ఎప్పుడూ ఏడుపని అర్ధం- ఎప్పడూ ఎదుటి వాడి మీద ఏడ్చేది కదా?"
"ఒండర్ పుల్ బ్రదర్ - సూపర్ నిక్ నేమ్-"
"ఓకె - ఉంటా -- అక్కడేమయినా ప్రాబ్లం వస్తే కాంటాక్ట్ చెయ్-"
"అంతవరకూ ఎవరి దారి వాళ్ళదేనా?"
"ఎనీ డౌట్?"
"ఓకె- సీయూ-"
"దోస్త్ హు తో ఐసా-"
సెల్ కట్ అయింది.
అదే సమయానికి జైరాజ్ దినేష్ తో మాట్లాడుతున్నాడు.
"ఇంక నువ్వేం ఫికర్ జేయ్యకురా భయ్- రాకేష్ చాలామంచి పోరగాడురా! నాయింట్లో నే కొన్ని దినాలుంచుకుని వాడికి బ్రెయిన్ వాష్ చేసి -- అమెరికా పంపుతా! ఏమంటున్నా?"
"ఇంకోపని గూడా జేయాల్రా నువ్వు!"
"ఎందది?"
"ఎలాగయినా గానీ ఆడా మోనికా అనే పోరిని మర్చిపోవాలే! వానికి నీ కూతురు రోజాతో మంచిగ దోస్తానా జేయించానావనుకో! రోజాతోనే లవ్ లో పడతాడు. ఈ పోరగాళ్ళ సంగతి నీ కెరుక లేందేమున్నదిరా! కొత్త పోరి దొరికితే పాతదాన్నోదిలేస్తారు - అవునా కాదా?"
జైరాజ్ పగలబడి నవ్వాడు.
"అవ్! పెండ్లికి ముందు మనదందా గట్లనే ఉండే గదా-"
"థాంక్యూ రా భయ్- దినాం ఫోన్ జేస్తుంటా - ఏడవకు -"