Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 10


                                       సంస్తుతి

    అత్యంతం మధురాకారం
    నృత్యంతం భక్తమానసే
    శ్రుత్యంతం సత్యసాహిత్యం
    నిత్యం తం సాయినం భజే!!

    విశ్వమందిర సందీప్తం
    విశ్వ శ్రేయోభి లాషిణం
    శాశ్వ తైశ్వర్య దాతారం
    విశ్వ యోగీంద్ర మాశ్రయే!!

    విశ్వమయ! విశ్వభావన!
    విశ్వప్రియ! విశ్వహృదయ! విశ్వాత్మన్!
    విశ్వేశ్వర! విశ్వంభర!
    విశ్వపతే! ఘటయ విశ్వసంక్షేమమ్!!

    విశ్వమందిర శాశ్వతైశ్వర్య ధుర్యులై
    విశ్వయోగీంద్రులకు విశ్వాసపాత్రులై
    ఈశ్వరార్చన కళా హేలా సువర్ణులౌ
    ఈశ్వరీ కోటేశ్వరులకు "విజయశ్రీలు".

    కష్టాలు పోకార్చి యిష్టాలు చేకూర్చి
    శాంతి నందిచ్చు విశ్వంజీని గనవచ్చు
    సభ్యులకు సమస్త సౌకర్యములు గూర్చు
    ఈశ్వరీదంపతుల కెల్ల శుభములు గల్గు.

    ఈశ్వరివై, సమర్చిత మ
        హేశ్వరివై, అలరారుమమ్మ! కో
    టేశ్వరరావు కూర్మి హృద
        యేశ్వరివై, సతులందు రాజరా
    జేశ్వరివై; ప్రశస్తి గడి
        యింపుము బీదల పాలి అన్నపూ
    ర్ణేశ్వరి వౌచు "మాధురి" "సు
        రేశుల" గన్న వరాలతల్లివై!!

 Previous Page Next Page