Previous Page Next Page 
ధ్యేయం పేజి 10


    అతడీ రోజు వెళ్ళిపోతానంటే చెప్పలేనంత దిగులుగా వుంది. రేపటినుంచి ఎలా బతకగలను అనే ఆలోచనతో దుఃఖం కలుగుతోంది. 'వెళ్ళకు రజనీ! నీ వరూధినిని వదిలి వెళ్ళకు' అని అతని గుండెల్లో తల దాచుకుని ఏడవాలనిపిస్తోంది.

    రజనీకాంత్ ఊరంతా తిరిగి చీకటి పడేవేళకి ఇంటికి తిరిగివచ్చాడు. భయం భయంగా లోపలికి  అడుగుపెట్టాడు. ఎదురుగా సోఫాలో కూర్చుని వుంది అనసూయమ్మ.

    "ఏరా ఎక్కడికెళ్ళావ్. అసలే ఊరు కొత్త ఏమయిపోతావో అని దిగులుతో ఛస్తున్నాను" అంది.

    'అమ్మయ్య' అనుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు రజని. జరిగిన విషయాలు ఆవిడ చూడలేదు. అదికాదు అతని సంతోషం. వరూధిని కూడా వాళ్ళ నాయనమ్మకి ఏమీ చెప్పలేదు. అంటే వరూధిని అదంతా ఎంజాయ్ చేసిందనేగా.

    రజనీకి కూడా ఈ అనుభవం అంతా చాలా కొత్తగా వుంది. అతడికీ ఇది మొదటిసారే. అతను కూడా ఉద్వేగభరితమైన విషాదంలోనూ, థ్రిల్ లోనూ పడికొట్టుకుపోతున్నాడు.

    "నాన్నింకా ఇంటికి రాలేదా" అడిగాడు రజని చుట్టూ కలియజూస్తూ- తలుపు చాటునుంచి తననే గమనిస్తున్న వరూధిని కంటపడింది.

    "మీ నాన్నింకా రాలేదు. రాగానే టైమ్ అయిపోయిందని హడావిడిచేస్తాడు. నువ్వన్నీ సర్దిపెట్టుకో, నాకు వంట పనుంది" అని వంటింట్లోకి వెళ్ళిపోయింది.

    ఇంట్లో మరెవ్వరూ లేరని నిర్థారించుకున్నాక అతడు వరూధిని గదిలోకి వచ్చాడు. వరూధిని చాలా ఉద్వేగంగా వుంది. 'వెళ్ళొద్దు వెళ్లొద్దు' అనబోయింది. ఈ లోపులో అతడు దగ్గరగా వచ్చి గుండెలకు ఆమెను బలంగా హత్తుకున్నాడు. మొదటిసారి వున్నంత బెదురు ఈ సారి ఇప్పుడు లేదు. ఆమె తన మొహాన్ని చేతుల్లోకి దాచుకోలేదు. ఆమెను మరింత దగ్గరగా లాక్కుని బుగ్గలు, కళ్ళు, పెదవులు ముద్దులతో నింపేశాడు. తమకంతో ఒళ్ళంతా తడిమేశాడు.

    ఆమెకేమీ తెలియటంలేదు. ఏదో ట్రాన్స్ లో వున్నట్టుంది. అడగాలనుకున్నవేవీ గుర్తు రావటంలేదు. అతడా అవకాశం ఇచ్చేటట్లులేడు, 'ఐ లవ్ యూ' 'ఐ లవ్ యూ....' అని చెవిదగ్గర మాటిమాటికీ అంటున్నాడు.

    ఇంతలో డోర్ బెల్లు మోగటంతో అతడామెను వదిలేసి వేగంగా పక్కగదిలోకి వెళ్ళిపోయాడు. వచ్చింది అతడి తండ్రి. రాత్రి బస్సుకి టిక్కెట్టు దొరకలేదని తెల్లవారుఝాముకి దొరికిందని అనుసూయమ్మతో చెప్పాడు.

    వరూధిని గదిలోంచి బైటకి రాలేదు. ఆ అమ్మాయి మొహం అంతా ఎర్రగా కందిపోయి వుంది. అసలు అతడంత ధైర్యం చేస్తాడని ఆ అమ్మాయి కలలోకూడా ఊహించుకోలేదు. ఇంట్లో నానమ్మ వుండగానే అంత ధైర్యంగా వచ్చి తనతో ' ఐ లవ్ యూ' అన్నాడంటే, ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత ధైర్యంగా ఏ పనైనా చెయ్యగలడో అర్థమై ఆమెకి అతనిపట్ల ప్రేమ మరింతగా పెరిగింది.

    రజని, అతని తండ్రి కలసి భోజనం చేశారు. ఈ లోపులో ప్రీతమ్ కూడా వచ్చేడు. ప్రీతమ్ కీ, వరూధినికీ విడిగా భోజనాలు పెట్టింది అనసూయమ్మ.

    "ఏరా, మీ నాన్న , అమ్మా రాలేదా? ఈ రాత్రికి రారా" అని అడిగింది.

    "ఏమో, నాకేం తెలుసు" అన్నాడు ప్రీతమ్. అతడికి కూడా ఆ రోజు చాలా ఎక్సైటింగ్ గా గడిచింది. మొట్టమొదటిసారి అతడు ఒక ఫారిన్ సిగరెట్ ని ఆ రోజే త్రాగాడు.


                          *    *    *

    రాత్రి పదకొండయింది. వరూధిని బల్ల దగ్గిర కూర్చుని చదువుకుంటుంది. ఇంకా తల్లీ, తండ్రీ రాలేదు. ఆ రాత్రి తెల్లవారుఝాము వరకు ఏదో నైటవుట్ పార్టీ వుందని వెళ్ళారు. అదే గదిలో మరో ప్రక్కమీద ప్రీతమ్ నిద్రపోతున్నాడు. రజనీ, అతని తండ్రి ముందు హాల్లో పడుకొని వున్నారు. అనసూయమ్మ గదిలో నిద్రపోతోంది.

    వరూధినికి చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఇంకొక నాలుగయిదు గంటల్లో రజనీ తండ్రితో కలిసి వెళ్ళిపోతాడు. అదికాదు ఎక్సయిటింగ్.

    ఆమె భోంచేసి తన గదిలోకి వచ్చేసరికి బల్లమీద చిన్న  కాగితం వుంది. ఆ కాగితంలో ఇలా రాసుంది.

    "ప్రియమైన వరూధిని.....ఇంకొక నాలుగ్గంటల్లో మేం వెళ్ళి పోతున్నాం. ఈ లోపులో నీతో ఎన్నో చెప్పాలని, మనసు విప్పి మాట్లాడాలని ఎంతో కోరికగా వుంది. ఆరు మూడైనా, మూడు ఆరైనా నేను నిన్ను విడిచి వుండలేను. ఈ రాత్రి సరిగ్గా  పన్నెండు గంటలకి పెరట్లోకి రా. అక్కడ నీ కోసం ఎదురు చూస్తుంటాను".

    గుండె వేగంగా కొట్టుకుంటోండగా, కాగితం చింపేసేసి కిటికీలోంచి బయటపారేసింది.

    బల్లముందు కూర్చొని చదువుకుంటుందన్న మాటేగాని వరూధినికి తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తూంది. గడియారం చూసింది. రెండు నిముషాలు తక్కువ పన్నెండయ్యింది. ఈ లోపులో హాల్లో చప్పుడయింది.

    అంటే రజనీ లేచి పెరట్లో కెళుతున్నాడన్నమాట.

    ఆమె సందిగ్థంలో పడింది. తలతిప్పి చూసింది. ప్రీతమ్ గాఢ నిద్దరలో వున్నాడు.

    వరూధిని భయంగా కూర్చొని మరో రెండు నిముషాలు అలాగే వుండిపోయింది.

    టైము పన్నెండు గంటల అయిదు నిముషాలయింది. బయట పెరట్లో చీకట్లో చలిలో రజనీ వున్నాడని తెలియగానే ఆమె ఆగలేక పోయింది. లేచి గుమ్మం దగ్గరకొచ్చింది.

    ముందు గదిలో అనసూయమ్మ గురక నెమ్మదిగా వినిపిస్తూంది. రజనీ తండ్రికూడా గాఢ నిద్దర్లో వున్నాడు.

    మనసులో ఏదో బెదురు, భయం!

    తల్లీ, తండ్రీ వచ్చేస్తారేమోనన్న జంకు!

    వెళ్లి రజనీ దగ్గరిగా వుండాలన్న కోరిక!

    రకరకాల ఆలోచనలు, రకరకాల ఘర్షణలు. వరూధిని ఎటూ నిర్ణయించుకోలేక పోయింది.

    ఇంతలో పన్నెండయినట్టు దూరంనుంచి గడియారం గంటలు వినిపించాయి. వరూధినికి టెన్షన్ మరింత ఎక్కువైంది. వేళ్ళు సన్నగా కంపిస్తున్నాయి. మాటిమాటికీ గడియారం వైపు చూడసాగింది. మరో రెండు నిమిషాలయ్యేసరికి ఆమె ఇక నిభాయించుకోలేకపోయింది. అక్కడ పెరట్లో రజనీకాంత్ ఎదురుచూస్తూ వుంటాడన్న ఆలోచనతో ఆ అమ్మాయి కాళ్ళు నిలవలేదు. గుండెలనిండా ధైర్యం చిక్కబట్టుకొని నెమ్మదిగా తన గదిలోంచి బయటికి వచ్చింది.

    హాల్లో అనసూయమ్మ గురక ఇంకా నెమ్మదిగా వినిపిస్తూనే వుంది. వరూధిని చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోంచి వెనక వంటింటివైపు కొచ్చి అక్కడ ఆగింది. వంటింటి తలుపులు తెరిచేవున్నాయి బయట పెరడంతా నల్లటి చీకటి పరుచుకొని వుంది. మరోక్షణం అక్కడే ఆగింది. ఆమె గుండె శబ్దం ఆమెకే స్పష్టంగా వినిపిస్తూంది. బయట గదుల్లో ఎక్కడా ఏ అలికిడీ లేదు.

    తెరచి వున్న ద్వారంలోంచి వరూధిని మెట్లుదిగి పెరట్లోకి వచ్చింది. చల్లటిగాలి ఒకసారి ఆ అమ్మాయిని చుట్టుముట్టింది. అయినా కూడా ఆ అమ్మాయి ఒళ్ళంతా చెమట పడుతూనే వుంది. పెరట్లో బట్టలార వేసుకునే తీగ దగ్గర నిలబడి వున్నాడు  రజనీ, వరూధిని నెమ్మదిగా అతని దగ్గర కెళ్ళింది. "ఎంతసేపటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?" అనడిగాడు గుసగుసగా. వరూధిని మాట్లాడలేదు. అతడు ఆమె భుజాల చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించలేదు. అలాగని సహకరించే మూడ్ కూడా లేదు. ముందు గదుల్లో ఎవరన్నా లేస్తారు అన్న భయంతో ఆ అమ్మాయి మాటిమాటికీ  ఇంటివైపు చూడసాగింది. అది గమనించినట్టు "ఫరవాలేదులే. మా నాన్న, మీ నాయనమ్మ పిడుగులు పడినా లేవరు" అన్నాడు ధైర్యమిస్తున్నట్టు.

    ఈ మాటలకి వరూధినికి కూడా కొంచెం ధైర్యమొచ్చినట్లు అతడికి దగ్గిరగా జరిగింది. అతడు ఆమె భుజాల చుట్టూ చేయివేసి, మొహంవంచి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వరూధిని కళ్ళు మూసుకుంది. ఆ అమ్మాయి మనసులో భయం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ మరోవైపు తన శరీరంచుట్టూ వున్న రజనీకాంత్ చేతులు ఆమెని ఏవో లోకంలోకి తీసుకుపోతున్నాయి.

    రజనీ ఆమె చెవి దగ్గర మళ్ళీ 'ఐ లవ్ యూ" అంటున్నాడు. ఆమె మనసంతా తమకంతో నిండిపోయింది. అప్రయత్నంగా అతనికి దగ్గిరగా జరిగి గాఢంగా హత్తుకుంది. నూతి పక్కనే వున్న చప్టామీద ఆమెని కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఆమె మెడమీద నుంచి మొహంమీదకి చెయ్యి జరిగి, బుగ్గలు నిమురుతూ "డూ యూ లవ్ మీ" అని అడిగాడు.

    "యస్" అంది ధీమాగా - నిజాయితీగా - ఈ ప్రపంచంలో ఆ పదం కన్నా సత్యవంతమైంది మరొకటి లేదన్నంత నమ్మకంగా.

    మెడకింద అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆమె  యవ్వనపు ఛాయల్ని అతడి చేతులు తడమసాగాయి.   వరూధిని సిగ్గుతో ముడుచుకుపోతూ, అతని చేతుల్ని బలవంతంగా దూరంగా తోయడానికి ప్రయత్నించింది. అతఃదు ఆమె అయిష్టాన్ని గుర్తించినట్లుగా అక్కడినుంచి చేతులు తీసేసి వెన్నెముక మీదుగా వేళ్ళతో కొద్దిసేపు రాయసాగాడు. అతడి పెదవులు మాత్రం ఆమె పెదవులతో ఆడుకుంటూనే వున్నాయి. కొన్ని క్షణాలయిన తరువాత అతడు మళ్ళీ తన చేతులు ముందుకు తీసువచ్చాడు. ఈసారి ఆమె అంతగా ప్రతిఘటించలేదు. నిమ్మచెట్టుమీద నుంచి వస్తున్న గాలి శబ్దం తప్ప అక్కడ చాలా ప్రశాంతంగా వుంది. అతడామెని నెమ్మదిగా చప్టామీద పడుకోబెట్టాడు. పక్కనే లేచి కూర్చోబోయింది. కానీ అతడామెని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అతడి చేతులు ఆమె మోకాళ్ళమీద పాకసాగినాయి. నైటీ మోకాళ్ళవరకు వచ్చేసింది. ఇద్దరికీ ఏం చేయ్యాలో పూర్తిగా తెలీదు. ఏదో చేయాలని తెలుసు.

    "నేను వెళ్ళిపోతాను" అంది భయంగా.

    "ఒద్దు ప్లీజ్! వుండు" అంటూ బ్రతిమాలసాగాడు. వెళ్ళిపోవాలని ఒకవైపు, వుండాలని మరోవైపు. ఈ రెండు రకాల భావాలతో ఆ అమ్మాయి ఏమీ చెప్పలేక పోయింది. అతడి చేతివేళ్ళు ఆ అమ్మాయి శరీరం మీద నాట్యం చేస్తూ ఎక్కడికెక్కడికో తీసుకువెళుతున్నాయి. అతడు ఆమె కాళ్ళ చుట్టూ  తన కాళ్ళూవేసి గట్టిగా పెనవేసి ఆమెని ఆక్రమించుకొని ఉక్కిరిబిక్కిరి చేయసాగాడు. ఈ లోపులో బయట శబ్దం వినిపించింది. విలుకాడి అలికిడి వినగానే జింక ఎలా పరిగెడుతుందో అలా ఇద్దరూ దాదాపు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు. అదృష్టవశాత్తు అనసూయమ్మ లేచేసరికి వరూధిని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒక నిమిషానికి తల్లిదండ్రులు లోపలికొచ్చిన శబ్దం వినిపించింది.


                                                                  2


    రజనీకాంత్ వెళ్ళిపోయి రెండు రోజులైంది. వరూధినికి అతను వెళ్ళిపోయిన దగ్గరనుంచి దిగులుగా వుండసాగింది. ఏదో ఆలోచనల్తో కూతురు ఎప్పుడూ ఉదాసీనంగా వుండటం ఆమె తల్లిదండ్రులు గమనించలేదు. అనసూయమ్మ గమనించింది. అయితే ఆమెకి అంత గొప్ప విశ్లేషణా శక్తిలేదు.

    'ఎప్పుడు చూసినా సినిమాలకి పరిగెత్తే పిల్ల బుద్ధిగా యింట్లోనే వుండి చదువుకుంటూంది. బాగుపడే లక్షణాలు కన్పిస్తున్నాయి. ఇల్లెగిరిపోయేట్టు భయంకరంగా వినిపించే ఇంగ్లీష్, హిందీ పాటలు ఇప్పుడు వినిపించటంలేదు' అని ముచ్చట పడిపోయిందా ముసలావిడ. కానీ  వరూధిని స్థితి వేరు.

    "అవర్ స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోజ్ దట్ ఆఫ్ అవర్ సాడెస్ట్ థాట్స్" అన్నాడు షెల్లీ. వరూధిని ప్రస్తుతం విరహ వేదనలో మునిగితెలుతోంది. తిండి సహించటంలేదు. నాయనమ్మ ఇచ్చిన పళ్ళు, బోర్నవిటా కిటికీలోంచి బయట పారబోసి విషాదంగా నవ్వుకుంటోంది. 'ణా ప్రాణానికి ప్రాణం దూరమయ్యాక ఇవన్నీ ఎలాసహిస్తాయి' అనుకొంటోంది.

    ఇదంతా అసహజమేమీ కాదు. కానీ అసహజమైంది మరొకటి వుంది. వయసులో వున్న కూతురు ప్రేమలో పడితే ఆ విషయం ఆఖరున తెలిసేది తల్లిదండ్రులకే. ఇంతకన్నా అసహజమైన స్థితి మరొకటి వుందా? ఒక  ఇంట్లో ఎవరి దోవ వారిది అని బ్రతికే ఖరీదైన వ్యక్తుళ మధ్య అయితే ఎవరేం చేస్తున్నారో మరొకరికి తెలిసే అవకాశం లేదు. కానీ ఆమధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక ఆడపిల్ల ప్రేమలో పడితే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా కాస్తంత పరిశీలనా దృష్టి వుంటే కూతురి పరిస్థితి క్షణాల్లో పట్టుకోవచ్చు. అప్పుడప్పుడు నోట్సులు పరిశీలించటం, ఎప్పుడూ హుషారుగా వుండే కూతురు ఎందుకు దిగులుగా వుంటుంది అని గమనించటం, ప్రతిరోజూ స్కూలయిపోగానే యింటికొచ్చే ఆడపిల్ల పావుగంట, ఆరగంట ఎందుకు లేటుగా వస్తుందా అని ఆలోచించటం, ఏదన్నా మిష మీద కూతురు శలవు రోజు యింట్లోనుంచి బయటకెళ్ళే ప్రయత్నం చేస్తే దాన్ని గమనించటం..... వీటిల్లో ఏ ఒక్క విషయాన్ని కాస్త పసిగట్టి, కొద్దిగా  లోతుగా పరిశీలించినా చాలు - ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు సులభంగానే పట్టుకోవచ్చు. మొక్కగా వుండగానే ఈ వలపు విషయాన్ని తెలుసుకుని, మానసిక పరిణితి లేకుండా ప్రేమించడం వల్ల ఎదురయ్యే నష్టాలేమిటో చెప్పగలిగితే, అలాంటి తల్లిదండ్రులకి "నాన్నా! ఫలానా అబ్బాయితో నేను లేచిపోతున్నాను" అనే ఉత్తరం అందుకునే పరిస్థితి రాదు.

    ప్రస్తుతం నిద్రకూడా పట్టని స్థితిలో వుంది వరూధిని. కళ్ళు మూసుకొని రజనీతో జీవితాన్ని ఊహించుకుంటోంది.....కాశ్మీర్ డ్యూయెట్లు, ఊటీలో విహారాలు అన్నీ ఆ కలల్లో వున్నాయి. తనకి కోపం రావటం, అతను బతిమాలటం లాంటి అందమైన కలలు................

    ఇలా రెండు రోజులు గడిచాయి. ఒక రాత్రి ఆమెకి సడెన్ గా మెలుకువొచ్చింది. కడుపులో చిన్నగా నొప్పి మొదలయింది. బొడ్డు కింద నుండి మొదలై క్రమంగా క్రింద భాగమంతా పాకుతోంది. ఆమెకి వెంటనే  రజనీకాంత్ గుర్తొచ్చాడు. 'అతడేగాని పక్కనుంటే ఎంత ఆరాటపడి పోయ్యేవాడో. డాక్టర్ని పిలిపించి హాస్పిటల్ కి తీసుకెళ్ళి కంగారుపడిపొయ్యే వాడేమో కదా' అనుకుంది.

    రజనీ గుర్తుకు రాగానే ఆమెకి అంత నొప్పిలోనూ అకస్మాత్తుగా భయమేసింది.

    'తను గర్భవతి!'

 Previous Page Next Page