త్రిపుర ముఖంలో స్త్రి సహజంగా ఇంచుక గర్వం తొణికిస లాడింది.
"వచ్చే చ్తెత్రానికి నలభయ్యే ఏట అడుగు పెడతాను. ఇన్నేళ్ళు వంటరిగా నడిచాను. ఇప్పుడు నాకు జోడేందుకు, అజిత్? జీవితాంతం వంటరిగా నడవాలన్న నిశ్చయమెప్పడో జరిగిపోయింది."
అజిత్ కుతూహలంతో, "మీ వంటరి బాటలో మీకు కలిగిన అనుభవా లేమిటి,పిన్ని?" అడిగాడు "ఆనందం, విచారం ఏమి లేకుండా ఇఒక విధమ్తెన జడత్వంతో గడిచిపోయాయి రోజులు. ఒక విధంగా అన్నయ్య పిల్లలు నన్ను కాపాడారు. వాళ్ళే లేకపోతే నేనేప్పడో పిచ్చిదానయి పోయేదాన్ననుకుంటాను. కన్నది వదినేగాని, పెంచింది మాత్రం నేను!"
మాతృత్వపు మధురిమ మీరు వాళ్ళలో వేదుక్కున్నారన్నమాట. మనిషి సహజ ప్రవృత్తినుండి ఎప్పడూ బయటపడలేడని మిమ్మల్ని చూస్తే తెలుస్తూంది. యవ్వనోధయంలో అడుగు పెట్టిన మనిషి ఎవరి అడుగుల సవ్వడి కోసమో చేవివోగ్గి వినే క్షణం రాకుండా వుండదు. ఎవరికో అంకితం కావాలన్న తహతహ నుండి తప్పించుకోవడమూ సాధ్యం కాదు. ఏ వయసుకా ముచ్చట అని అంటూ ఉంటుంది మా అమ్మమ్మ. వయసు సహజంగా కలిగే కోరికలు ఫలించక పోతే, వాటిని బలవంతంగా అదిమి పెడితే అవి వికృత రూపాలు దాలుస్తాయని మన స్తత్వశాస్త్రం చెణుతుంది.
"సహజమయిన జీవితం నుండి దారి మళ్ళించారు కదా. ఎవరికో అంకితం కావాలన్న ఆకాంక్ష నుండి మిమ్మల్నేలా రక్షించుకోగాలిగారు,పిన్ని?"
అజిత్ నుండి వచ్చిన సూటి ప్రశ్నకు త్రిపుర ముఖం కొంచెం వెలవెలబోయినట్టుగా అయింది. ఏం జావాబు చెప్పాలో పాలుపోనట్టుగా మౌనం వహించింది.
"చెప్పండి, పిన్ని! యవ్వనం తొలి సంధ్య నుండి మలి సంధ్యకు తిరిగింది. ఈ నడిమి కాలం సంసారంలో మునిగితేలే వాళ్ళకు చిన్నదే కావచ్చుగాని మీకు మాత్రం సుదీర్ఘ యానం అయివుంటుందని నా నమ్మకం వలబడి భావన సొకకుండా ఇంతకాలం గడిపెయగాలిగారా? ఈ మలిసంధ్యలో నిలబడి వేనుదిరిరి చూస్తే మికెవరూ కనిసించలేదా?"
ఇన్నేళ్ళ జీవితంలో తన గుండె తలుపులు తట్టి లోపల ఎవరున్నారో తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నం చేయలేదు. అజిత్ ముఖంలో కనిపించే నిష్కపటత, నిర్మలత చూస్తే అతడి ముందు ఎవరూ అబద్ధం ఆడలేరనిపిస్తుంది.
"నా గుండె గదిలో ఎవరు కాపురం చేశారో తెలుసుకొని ఏం చేస్తావు అజిత్?" చిరునవ్వుతో అడిగింది త్రిపుర.
"మిమ్మల్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలనే ఆకాంక్ష తప్ప ఇంకేం లేదు,పిన్ని"
"నీ ప్రశ్నకు జవాబు ఉంది. కానీ, ఇప్పడుకాదు. ఎప్పడ్తేనా చెబుతాను!" అని లేచింది త్రిపుర.
సప్తమి చంద్రుడి లేతవెన్నెల పరచుకోంది. గాలి చల్లగా ఉంది. పారిజాత పరిమళాలతో ఆ ప్రదేశమంతా నిండి పోయింది. పరిసరాలు ప్రశాంతగా, నిశ్శబ్దంగా ఉన్నాయి.
ఆ నిశ్శబ్ద ఏ కాంతంలో ఏక్ తార మీటిన ధ్వని.
దానిని అనుసరించి పాట.
"ఏమి సేతురా లింగా ఏమి సేతురా
గంగ వుధకము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే
గంగనున్న చేప కప్పుఎంగిలంటున్నది లింగా !!ఏమి!!"
తాతగారు సంకీర్తనం వినిపోదామా" అనడిగింది త్రిపుర.
"విన్నాకే వెడదాం! దానికేం తొందర?"
త్రిపురతో మళ్ళి కుటిరంలో ప్రవేశించాడు అజిత్.
పిటమిద ఏవో రెండు పటలున్నాయి. రెండువ్తేపు లా కుందుల్లో దీపాలు వెలుగుతున్నాయి! కృష్ణజినం మీద కూర్చొని పాడుతున్నారు తాతగారు.
తాతగారు పాట ముగించి, ఏక్ తార మిటడం ఆపకుండానే "ఎప్పడూ సంకీర్తనం వేళవరకు ఉండవు! ఇవాళ ఉన్నావు! ఈరోజు నీ పాట వినాలని ఉంది త్రిపురా!" అన్నారు.
"అలాగే, తాతగారూ! నా మనసు ఈ రోజు ఏమిటో అల్లకల్లోల మ్తెంది! సంకీర్తనంలో తెరుకోంతుందేమో! ఏక్ తార ఇటివ్వండి"
తాతగారి చేతులనుండి ఏక్ తార అందుకొని ఒకకాలు మడిచి భక్త మిరా భంగిమలో కూర్చొంది త్రిపుర. కళ్ళు మూసుకొని ఒక నిమిషం ద్తేవధ్యాసం చేస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. తరువాత గొంతు సవరించుకోంది. అన్న మాచార్యుల కీర్తన ఎత్తుకోంది.
"నానాటి బతుకు నాటకమూ
కానక కన్నది క్తేవల్యమూ
పుట్టుటయు నిజమూ పోవుటయు నిజమూ
ఎట్టి నెదుట కలది ప్రపంచమూ కట్ట కడపటిధి క్తేవల్యమూ!!నా !!"
ఆ పాట బావానికి రాగానికి మనస్సంతా ఒక విధమ్తెన వ్తెరాగ్యంతో నిండిపోతూంది.
"మీరు చాలా బాగా పాడతారని నాయనమ్మ చెప్పింది! చాలా బాగా కాదు! అధ్బుతంగా , అత్యంత ద్బుతంగా పాడతారు! మీరు సంగీత కచేరీలు చేస్తే చాలా గొప్పగా రాణించేవారు. పిన్ని! ఫారిన్ టూర్స్ కూడా చేయగలిగేవాళ్ళు!
భాగావధత్తమ్తెన ఈ స్వరం భగవదారాధనకు ఉపయోగపడితే చాలు ననుకోంటానయ్య!" అని మరో కీర్తన అన్నమా చార్యులదే పాడింది!