చెద బావి ఈ మధ్యే త్రవ్వించారు. ఇంకా రాయి కట్టలేదు నీళ్ళు కొబ్బరి నీళ్ళులా తెల్లగా ఉన్నాయి!
"పెద్దమ్మా! నేను సాయంచేయనా?" అజిత్ అక్కడికి వచ్చి అడిగాడు.
"ఏం సాయం చేస్తావయ్యా?"
"తోడడం నాకురాదు! కానీ, మొక్కలకి నీళ్ళు పోస్తాను! ఏ మొక్కలికి పోయాలో చెప్పు! కెమెరా హండ్ బాగ్ నూతికి కొంచెం దూరంలో ఒక రాతి మీద పెట్టి వచ్చాడు.
"నువ్వేంచేయొద్దు అజిత్! నువ్వలా కూర్చో!"
"మీరు కష్టపడుతుంటే మగపిల్లవాడిని చూస్తూ కూర్చోనా? నీళ్ళుపోస్తాను. పెద్దమ్మ! నాకు నీళ్ళు తోడడంరాదు!" త్రిపుర నీళ్ళు నింపిన బిందెను రెండు చేతులతో పై కెత్తి, "ఏ మొక్కలకి పోయాలో చెప్పడి" అన్నాడు.
"వద్దని చెబితే వినవుకదా?.....ఆ ఎర్ర గులాభి మొక్కతో మొదలు పెట్టి ఆ వరుస అంతా పోయల్సిందే!" అని రెండు బిందెలు తోడాక మళ్ళి అంది: ఈ పూల మొక్కలకి మాత్రం నా చేతులతో నీళ్ళు తోడి పోసుకోంటాను! అది నాకెంతో ఆనంద! ఆ పళ్ళ మొక్కలికి జీతగాడు పోస్తాడు!"
త్రిపుర పదిహేడు బిందెలదాకా తోడి, ఇక చాలు, అజిత్ మొక్కలు మిగిలిపోయినా ఇక తోడడానికి ఇవాళేందుకో ఉత్సాహంగా లేదు!" అని ఛాలించింది.
తడిసిన చిర కుచ్చేళ్ళు పిండేసుకొని చూచేసరికి అజిత్ పైజామా మట్టిమరకలతో పాదాల దగ్గర పాడ్తేపోయింది!
"అరెరే! నీళ్ళు పోసేప్పడు జాగ్రత్తగా పోయాకూడదూ? మట్టిచింది పై జామా చూడు ఎలా పాడ్తేపోయిందో?"
"ఫర్వాలేదులే, పెద్దమ్మా!"
నీళ్ళు తోడిన బకెట్, బిందె తీసుకువచ్చి కుటిరంలో ఒక మూలాన ఉంచింది త్రిపుర.
"నేనిక వస్తాను, తాతగారు!"
"మంచిధమ్మ!"
అజిత్ కూడా తాతగారి దగ్గర సెలవు తిసుకోవి, ఆమెతో బయటికి వచ్చాడు. "కాస్సేపు ఇక్కడే కూర్చుందాం, పెద్దమ్మ! ఇంటికి వెడితే ఇక మీతో మాట్లాడడం కుదరదేమో!
"ఏం మాట్లాడాలి?"
"నాన్నగారికి, మా అమ్మను చేసుకొనే అవకాశాన్ని మిరెందు కిచ్చారో తెలుసుకోవాలని ఉంది!"
"ఆ సంగతులు యిప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు?"
"ఇద్ధరికిద్దరు అందమ్తెన వాళ్ళు! తెలివ్తెన వాళ్ళు! ముఖ్యంగా మేనత్త మేనమామ పిల్లలు! ఎందుకిలా అయ్యాయి మీ జీవితాలు?"
"మీ నాయనమ్మ చెప్పలేదా?"
"ఆమెకు తెలిసింది ఆమె చెప్పింది. కానీ మీ ద్వారా వింటే ఆ కథకి ఒక కొత్త రూపం వస్తుందనుకొంటున్నాను!"
"ఇలా నిలబడినా? ఆ చెట్టు క్రింద కూర్చుందాం పద!"
కొంచెం దూరం నడిచి ఇద్దరూ పారిజాతం చెట్టు క్రింద కూర్చున్నారు.
"ఇక చెప్పండి, పెద్దమ్మ! మీరు విడిపోవడంలో తప్పు మీదా, మానాన్న గారిదా"
"నా మనసుకు తప్ప అతడిదే అనిపిస్తుంది. అతడి మనసుకు తప్పు నాదే కనిపించవచ్చు!"
"మీ కథ చెబితే తప్పు ఎవరిదో నేను చెబుతాను, పెద్దమ్మా!"
"నా పదో ఏటనే ఆయనతో పెళ్ళి జరిగింది! అప్పటికే ఆయన మెడిసిన్ చేస్తున్నారు!....." అని చెప్పడం మొదలు పెట్టింది త్రిపుర.
సుందర్ వాళ్ళ తనలో కలిగిన ప్రణయ స్పందన, అతడు తనని వివాహ మాడతానని కోరడం, తను తిరస్కరించడం మినహా మిగతా కథంతా చెప్పింది త్రిపుర.
".....ఇపుడు చెప్పు, మా వివాహబంధం విచ్చిత్తి కావడానికి కారణం నేనా, మీ నాన్నగారా?"
"మీ నమ్మకాలు మీవి; మీ పద్ధతులు మీవి: నాన్నగారు మీ జోలికి రాకుండా వుండాల్సింది! అలాగే, నాన్నగారి అలవాట్లు అభిప్రాయలు, మిమ్మల్ని బాధపెట్టేవి కాదనుకొంటాను! నాన్నగారికి అప్పడున్న అలవాట్లు ఇప్పడున్నాయి! అవి అమ్మను బాధ పెట్టినట్లు నాకెప్పుడూ అనిపించలేదు. స్టేట్స్ లో త్రాగడం అనేది మనకిక్కడ టి త్రాగినంత మామూలు విషయం! ఇహ తిండిదేముంది? ఇవరికిష్టమ్తెంది వాళ్ళు తింటారు. ఇక లేడి ఫ్రెండ్స్ అనుకోకుండా కొన్ని అనుబంధాలు ఏర్పడతాయి. అవి మనుషుల్ని చిత్రంగా కలుపుతుంటాయి. ఒక్కోసారి శరీరాన్ని ఏకం చేసేంత దగ్గరగా నేట్టుతుంటాయి నాన్న గురించీ అమ్మ ఈర్ష్య పడుతున్నట్టు, ఘర్షణ పడుతున్నట్టు నేనెప్పుడూ చూడలేదు"
"అది విచ్చలవిడి తనం అనిపించుకోదా?"
" నియమనిబంధనలు జీవితాన్ని మెరుగు పెడతాయనడంలో సందేహం లేదు. అయితే అప్పడప్పడూ కాస్త సడలింపు అనేది వుంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. పిన్ని!" అని హాయిగా నవ్వాడు అజిత్.
"తండ్రికి తగ్గ కొడుకే!" అనుకొంది. త్రిపుర.
"మిమ్మల్ని పిన్ని అనే పిలుస్తాను. అమ్మకంటే మీరు పదిపన్నెం డేళ్ళు చిన్నవారు. అమ్మ వయసు, నాన్న వయసు ఇంచుమించు ఒక్కటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ చిన్న దానిగా కనబడుతున్నారు. ఇహ అందచందాల విషయానికి వస్తే నాన్న మిమ్మల్ని ఎలా విడిచి పెట్టగలిగారో అని ఎంత ఆశ్చర్యంగా ఉందో, అమ్మని మీ స్ధానంలోకి ఎలా తేగలిగారా అని అంతకు రెట్టింపు ఆశ్చర్యం కలిగిస్తూంది. అమ్మకి ఈ మధ్య స్దూలకాయం వచ్చేసి నాన్నకి అమ్మలాగా అయిపోయింది. నాన్న తిన్నా, త్రాగినా, పడుకొన్నా కొన్ని పరుమితులోనడుస్తారు. ఆయన వయసుకు ఓ పదేళ్ళు చిన్నగా, చాలా ఏక్టివ్ గా కనిపిస్తారు. భార్య భర్తకంటే చిన్నదిగా ఉండాలన్న పద్ధతి పెద్దలు ఎందుకు ఏర్పరిచారో మిమ్మల్ని నాన్నని, అమ్మని చూస్తే సరిగ్గా అర్ధమౌతుంది. నాన్నకి మీరే సరిజోడి! అమ్మకాదు!"