Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 31

    "భావములోనా బాహ్యమునందునూ

    గోవింద గోవిందా అని కొలువవో మనసా!!

    హరి  అవతారములే అఖిల దేవతలు

     హరిలోనివే బ్రహ్మాండంబులు

    హరినామములే  అన్ని మంత్రములు

    హరి హరి హరి హరి  హరి  యనవో మనసా!!

     కాస్సేపటికి సంకీర్తన ముగిసింది.

    తాతగారి  దగ్గర సెలవు తీసుకొని  ఇద్దరూ బయటకి వచ్చారు.

    ఊళ్ళోకి  వచ్చేసరికి ఏడు  గంటలయి పోయింది.

    "ప్రభాకరం వాళ్ళ ఇంటికి వెడతానన్నావు  కదా?   అదిగో!  అదే ఇల్లు"  అని చూపించింది త్రిపుర.

    "మీరు ఇంటికి వేడతారా?  నేను వాళ్ళని ఒకసారి పలకరించి వస్తాను!"

    "వెళ్ళు!"  త్రిపుర  ఒక్కతే  ఇంటికి వెళ్ళి పోగా,  అజిత్ ప్రభాకరరావు  ఇంటికి  వెళ్ళాడు.

    ప్రభాకరానికి నలభయ్యేళ్ళుంటాయి.    ఆయన వాకిట్లో  ఈజీ  చేయిర్లో కూర్చొని ర్తెతులతో  మాట్లాడుతున్నాడు.

    అజిత్  నమస్కరించి తనవి  పరిచయం చేస్కున్నాడు.

    "యశోదత్త పంపించిందా?  ఈవిడకి మేమింకా జ్ఞాపకముమన్నన్నా మాట!   బాగుందా, యశోదత్త?"

    "బాగుంది!"

    ర్తెతులతో  రెండు మాటలు మాట్లాడి పంపేసి అజిత్ నీ లోపలికి తీసుకువచ్చాడు.

    హల్లో అఖిల  కనిపించింది.  అజిత్  మనసులో ఏదో చెప్పలేని సంతోషం పిల్లతెమ్మిరలా  సాగింది.  "ఓ!  అఖిలాండేశ్వరి!  ఇక్కడ దర్శన మిచ్చారు!"  అన్నాడు విప్పారిన ముఖంతో.

    అఖిలతో మాట్లాడుతున్న  అమ్మాయిని చూపి "ఈమె నా చెల్లెలు నీరజ! అఖిల,    నీరజ హ్తెద్రాబాద్ లో బి. ఎ .   ప్తెనల్ చేస్తున్నారు."
    "అఖిలని పై వూళ్ళకి  పంపి చదివిస్తున్నారంటే  ఆశ్చర్యంగా ఉందే! నామనమ్మ  చెప్పినదాన్ని బట్టి వాళ్ళు వట్టి చాందసులనుకోంటాను.  ఇంత వయసోచ్చే వరకూ ఆమెకు పెళ్ళికాకుండా ఉందంటేనే ఆశ్చర్యం!పైగా  ఆమెను పై ఊళ్ళకు పంపి చదివిస్తున్నారంటే ప్రపంచంలో ఎనిమిదవ వింత అనిపిస్తూంది"

    "మూడేళ్ళ  క్రితమే అఖిలకి పెళ్ళి  కుదిరింది. పెళ్ళి మూడు నాలుగు రోజుల్లో ఉండగా పెళ్ళికొడుకు  కారెక్టర్  మంచికాదు తెలిసింది.  ఆ సంబంధం  వెంటనే కాన్సిల్  చేశారు.  అఖిల తాతగారు,  అంటే తల్లి తండ్రి అన్నమాట.  ఆయన  మంచి  జ్యోతిష్కుడు.   అఖిలకి ఈ మూడు సంవత్సరాలు ఆమె జాతకరీత్యా  మంచిదికాదని ఈ సమయంలో పెళ్ళి ప్రయత్నాలు పెట్టవద్దని  చెప్పాడు.

    "ఈ మూడు సంవత్సరాలు ఊరికే ఉంది ఏం  చేస్తుందని,  మా నీరజతో కలసి చదువు కొంటుందని మేమే  చాలా బలవంతం చేశాం! ముఖ్యంగా  అఖిల కూడా చదువు కొంటానని పట్టుపట్టింది!  ఎలాగో ఒప్ప కొన్నారు. పట్నంలో మా పిన్ని ఒకావిడ  ఉంది! ఆవిడ ఇంట్లో ఉంది చదువు కొంటున్నారు. మా నీరజ భోజనం  మాపిన్ని దగ్గరే!  అఖిల మాత్రం  వండుకోంతుంది!"

    "తరువాత అజిత్ చదువు సంధ్యల గురించీ,  అమెరికా గురించి  చాలా కుతాహలంతో  ప్రశ్నించాడు  ప్రభాకరం తరువాత అన్నాడు!  "మీ నాన్నగారు నాకు బాగా తెలుసు!తనుచేయధలచుకోన్నది   ధ్తేర్యంగా  చేయగల   మనిషి ఆయన!  ఆయనవి చాలా  పెద్ద ఆశలు!  ఆ ఆశల కనుగుణంగానే  జీవితాన్ని మలుచుకొన్నాడు.   గొప్ప డాక్టర్లంటే  చిన్న విషయమా?"

    "అది చిన్న విషయం కాబట్టే,  ఆఖిలని వాళ్ళు పరాయి ఊరు  పంపించి  చదిస్తున్నారంటే   చిన్న  విషయంగా  కనిపించడం లేదండి!  వాళ్ళ లోనూ మెల్లి మెల్లిగా  మార్పు వస్తుందన్న మాట!  ఆ చాధాసం  వదిలి  మనుషుల్లో పడుతున్నారన్న మాట!"

    "అఖిలని  చదివించడం తప్పితే,  మిగతా  ఏ  విషయంలోనూ ఏ మార్పు రాలేదు!  ఆ ఇంటి వాళ్ళు  ఎక్కడా  పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు!   ఎప్పడ్తేనా  యాత్రలకి వెళ్ళినా వాళ్ళ చెంబు తప్పేలా, బియ్యం,  పప్పు వెంటనే ఉంటాయి!"

    "వాళ్ళ ఆ  చాదసంలో  శుచి శుభ్రం  దాగిఉన్నాయి!   బయట ఆ తిఅది ఈ తిండి  తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిదంటార?"  అఖిలకి రోషం  వచ్చినట్టుగా అడిగింది.

    "తల్లి!  అఖిలాండేశ్వరి!  ఒప్పకోంటాను   నీ మాట!"  భయపడ్డట్టుగా అన్నాడు ప్రభాకరం.

    "ఆచారం, మాది అంటే ఎందుకు  వెక్కిరిస్తారో నాకు అర్ధంకాదు!  డాక్టర్లు  ఆపరేషన్ చేసేప్పుడు ధరించే దుస్తులు వేరే  వుంటాయి!  అది మాడి అంటారా? ఆరోగ్యంనీకి  సంబంధించినదే  అంటారా?"

    "ఆరోగ్యానికి  సంబంధించినదే అంటాను!"

    "మడిబట్ట  కూడా అంతే! ఈ బట్టా ఆ బట్టా  కట్టుకొని చేస్తే మనం తినే ఆహార పదార్దలలో  క్రిములు వ్యాప్తిచెందే   అవకాశముంటుందని  శుభ్రంగా  ఉతికి ఆరవేసుకొన్న  బట్ట మాడి  అన్నారు!  వాళ్ళూ వీళ్ళు తాకడం వాళ్ళ క్రిములు వ్యాప్తిచెందే  అవకాశం వుంటుందని,  ఎవరూ తాకకూడదని నియమం పెట్టారు! అర్ధాలు తెలుసుకోకుండా వెక్కిరించడం మాత్రం ఫాషన్ అయింది"

    "క్షమించు, తల్లి! అజ్ఞానులం!"

    "మీరే జ్ఞానులు! మేమే  అజ్ఞానులం లెండి!"

    "ఏదో  సరదాగా అన్నయ్య అంటే అంత  సీరియస్ గా తీసుకొంటావేం,    అఖిలా?"  అంది నీరజ.

    "చాందసం గింధాసం  అంటే ఒళ్ళు  మండదా మరి?"  అజిత్ వ్తెపు కొరకొరా చూస్తోంది అఖిల.

    "కోపం  నేనన్నమాటకు వచ్చిందన్నమాట!  ఇప్పటికి అర్ధమ్తేంది!"  అని నవ్వసాగాడు అజిత్.  "చదువుకొన్న అమ్మాయి కదా?  ఆచారాలకి ఎడంగా ఉంటారనుకొన్నాను!"

 Previous Page Next Page