"నీతోపనుండి వచ్చినప్పుడు నియిష్టాలు తెలుసుకోవాలిగా?" అన్నాడు సాగర్.
నాతో ఏంపని?" అంది మాణిక్యాంబ కాస్త కంగారుగా.
"కొద్దిరోజులపాటు నీయింట్లో ఒగది కావాలత్తయ్య!" అన్నాడు సాగర్. "కారణాలగోద్దు అదంతా వ్యాపారరహస్యం ఎటొచ్చి ఊరికేవుండమంటే మాత్రంవుండం నేలకు రెండువందలు అద్దెయిస్తాం."
మాణిక్యాంబ ముఖం వెలిగింది. వాళ్ళిల్లు పెద్దదే ఒగది అద్దెకివ్వడం కష్టకాడు అందులోనూ ఎరుగున్నవాళ్ళ పిల్లలు బంధువులు.
"ఆలోచిస్తున్నావా అత్తయ్య?" అన్నాడు సాగర్.
మాణిక్యాంబ తడబడి "ఒక్కనిముషం ఉండండి. టిఫినుతిన్నాక అన్ని మాట్లాడుకోవచ్చు...." అంది.
"ఇప్పుడు టిఫినేమిటి అత్తయ్యా...." అన్నాడు చంచాల్రావు.
"అలావిల్లేదు మాఇంటికొస్తే టిఫిను తినితిరాల్సిందే...."అంటూ మాణిక్యాంబ లోపలకు వెళ్ళింది.
అప్పటికి నిర్మల మొత్తం ఉప్మానంతా కంచంలోకి మార్చింది.
"ఏమే- ఇంకా తినడం మొదలు పెట్టేయలేదుకదా" అంది మాణిక్యాంబ
"లేదు-" అంది నిర్మల.
"ఏడుస్తూ తినాలనుకునే వాళ్ళకి తినే యోగామెక్కడిదిలే....మూడు ప్లేట్లలో టిపిను సర్దితిసుకురా మూడింటిలో ఒక ప్లేటు మీనాన్నకు అందులో కాస్త తక్కువ సర్దు...."అంది మాణిక్యాంబ
ఎవరోవచ్చినట్లు నిర్మలకర్దమయింది. మాణిక్యాంబ వెళ్ళిపోగానే ఆమె మొత్తం ఉప్మనంతా మూడు ప్లేట్లలోకి సర్దేసింది. అందులో తండ్రికి బాగా తగ్గించింది అందువల్ల మిగతా రెండు ప్లేట్లూ నిండుగావున్నాయి.
నిర్మల ప్లేట్లు తీసుకుని హాల్లోకి వెళ్ళేసరికి అక్కడకుర్చీలో చంచల్రావు సాగర్ మాత్రమే వున్నారు. పిల్లలు వెరేగదిలోకివెళ్ళారు. మనుక్యామ్బ బట్టలు మార్చుకుందుకు వెళ్ళింది. రామారావు చేతులూ, కాళ్ళూ కడుక్కునేందుకు పెరటిలోకి వెళ్ళాడు.
సాగర్ నిర్మలను చూశాడు.
ఆమె చేతిలో ట్రే- ట్రేలోమూడుప్లేట్లు -ప్లేట్లలో ఉప్మా.....
సాగర్ అవేమి చూడడంలేదు.
అందమ్తెన అమాయకమైన ముఖం ఆమె ధరించిన దుస్తులుకానీ , పడుతున్న శ్రమగాని, అనుభవిస్తున్న మానసిక వేదనగాని కరిగించలేకపోయిన అందంతో ఆమె అద్భుతంగా వుంది. అద్భుతమైన ఆ ముఖానికి ప్రత్యేకత ఆమెకళ్ళు.....
"బాఫ్ రే!" అనుకున్నాడు సాగర్.
"ఈమెముందు వనజాక్షి దిష్టిబొమ్మ" అనుకున్నాడు చంచల్రావు.
నిర్మల వాళ్ళిద్దరికీ ఉప్మాప్లేట్లు అందించింది.
"థాంక్స్ !" అన్నాడు సాగర్.
నిర్మల తెల్లబోయి అతడివంక చూసిందికానీ మాట్లాడలేదు.
చంచల్రావు మాత్రం "అయ్యబాబోయ్-ఇంత ఉప్మా నేను తినలేను" అన్నాడు.
"ఈ ఉప్మా మిరేచేసివుంటే ఇందాతా నేను తినేయగలను "అన్నాడు సాగర్.
అతడి పొగడ్తనామె గ్రహించలేదుకానీ ఉప్మానతడు తినేయల్సిన అవసరం గుర్తుండడం వల్ల- "ఈ ఉప్మా నేనేచేశాను...." అంది నిర్మల చటుక్కున.
"చంచల్ నువ్వు తినలేనిది నా ప్లేట్లో వేసెయ్ "అన్నాడు సాగర్.
చంచల్రావు కంగారుగా "అమ్మా-నేనివ్వను..."అన్నాడు.
సరిగ్గా అప్పడే రామరావక్కడకు వచ్చాడు. నిర్మల తండ్రికి కూడా ఓ ప్లేటందించింది రామారావు మాట్లాడకుండా ప్లేటందుకుని చంచల్రావు సాగర్ ల వంక చూశాడు. నిండుగావున్న వాళ్ళ ప్లేట్లుచూసి తిరిగి కూతురు ముఖం చూశాడు.
గండంనుంచి బయట పదినట్లుందామే!
రామారావు తేలికగా నిట్టూర్చి తనూ వాల్లిదారి పక్కనకూర్చున్నాడు.
"బ్యాటింగ్ ప్రారంభిద్దామా?" అన్నాడు చంచల్రావు.
ఈలోగా లోపల్నుంచి ఓ పెద్దకేక-"నిర్మలా వాళ్ళకు టిఫినిచ్చేవా?
"ఆఅంది బదులుగా నిర్మల.
"చెబితేకానీ నీకు తెలియదు వాళ్ళకు మంచినీళ్ళు తేచ్చియ్యి...."
నిర్మల వెంటనే వంటింట్లోకి పరుగెత్తింది కేటిల్లోకి నీళ్ళు తిసి ఓమూడు గ్లాసులు తెచ్చింది అందరికి గ్లాసులతో మంచినిళ్ళిచ్చింది.
"టిఫిను సైజుచూసి- మంచినీళ్ళు బిందెలతో ఇస్తారేమో-ఎలాతాగాలా అనుకున్నాను ఫరవాలేదు గ్లాసులోనే తెచ్చారు" అన్నాడు సాగర్.
నిర్మల కిసుక్కున నవ్వింది.
ఆ నవ్వుచూఛి తన్మయుడయ్యాడు సాగర్.
రామారావు మౌనంగా టిఫినుతిని మంచినీళ్ళుతాగేసి చేయి కడుక్కుని వచ్చాడు. అప్పటికి మాణిక్యాంబ అక్కడకువచ్చింది మనుక్యంబను చూస్తూనే నిర్మల లోపలకు వెళ్ళబోయింది.
"వెళ్ళిపోకు వాళ్ళకింకా మంచినీళ్ళు కావాలంటే పోద్దువుగాని" అని "అదేమిటి పెట్టిన ఉప్మాఅంతా అలాగే ఉన్నట్లుంది. మీకు నచ్చలేదా?" అంది మనుక్యంబ.
"అబ్బే- ఉప్మా చాలాబాగుంది అప్పడే పెట్టినదాంట్లో మూడొంతులి తినేశాంకాదా -ఇది తినేస్తాం-" అన్నాడు సాగర్.
"అయ్యో అంతఉప్మా విల్లకేపెట్టావేమితే?" అంటూ ఉరిమినిర్మల వంకచూసింది- అసలువిషయం అర్ధంచేసుకున్న మనుక్యంబ.
"అబ్బే -ఇందులో ఆ అమ్మాయి తప్పలేదండి. ఉప్మా చాలా చాలా బాగుంది మేమే ఆబగా అడిగి ఎక్కువ వేయించుకున్నం " అన్నాడు సాగర్.
నిర్మల మనసులోనే అతడికి కృతజ్ఞతలు తెలుపుకుంది.
మిత్రులిద్దరూ కష్టపడి మొత్తంమీద ఆ ఉప్మాతినేశారు తర్వాత మనుక్యంబ వాళ్ళకిల్లివ్వడానికి అంగీకరించింది. సాగర్ అడ్వాన్సుగా ఆమెకు మొదటి నెలఅద్దేయిచ్చి "అత్తయ్య మంచిరోజునువ్వేచెప్పు మేము వచ్చేస్తాం." అన్నాడు.
మనుక్యాంబ గంటలపంచాగంచూసి "రేపు సాయంత్రం అయిందింటికి బాగుండి ముహూర్తం "అంది.
మిత్రులిద్దరూ సెలవుతీసుకుని వెళ్ళిపోయాక రామారావు నెమ్మదిగా "ఎదిగిన ఆడపిల్లలిద్దరున్నారు మనింట్లో -వయసులోవున్న కుర్రాళ్ళనింతలో తెచ్చి పెడుతున్నావు పర్యవసానం ఎలాగుంటుందో ఆలోచించుకో!" అన్నాడు.