"నిజంగా పర్యవసానమే ఉంటే అడిమనకే మంచిది మామూలుగా అయితే ఆ కుర్రాళ్ళు మనకందుబాటులో లేరు..." అంది మాణిక్యాంబ.
"అంటే- మననిర్మలకి, వలికి ఆకుర్రల్లిద్దరూసరిపోతారని నికుందా?" అన్నాడు రామారావు.
"నువ్విక్కన్నించి వెళ్ళు" అని అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న నిర్మలను కసిరిందిమాణిక్యాంబ నిర్మల వెళ్ళిపోగానే "అన్నింటికి నిర్మల నెందుకు కలుపుతారుమిరు?దానికి నేనో సంబంధం చూసే ఉంచాను...."అందామె.
"ఎవరిదీ- ఆ త్రినాధరావుదేనా?" అన్నాడు రామారావు.
ఆర్నెల్ల క్రితం త్రినాధరావు సంబంధం గురించి మణిక్యాంబకు తెలిసింది. త్రినాధరావుకు సుమారు ముప్పే అయిదేళ్ళుంటాయి. ఏడాది క్రితం ఆయన భార్య పోయింది. ఆయనకో పదేళ్ళకొడుకున్నాడు. భార్యతరపు ఆస్తి కొంత ఆయనకు కలవాలి ఆయన మళ్ళి పెళ్ళి చేసుకుంటాడని భయపడి మామగార తదికా ఆస్తి దక్కనివ్వడం లేదు త్రినాధరావు కోర్టుకువెళ్ళాడు కోర్టులో ఆయనే కేసునేగ్గేవరకూ మళ్ళి పెళ్ళిచేసుకోవద్దణిలాయరాయనకు సలహాయిచ్చాడు. ఈలోగా మాణిక్యాంబ ఆయనకు మధ్యవర్తులద్వారా తన సవతి కూతుగురించి కబురు పంపింది. ఒకసారి ఆయన పిల్లను చూసుకుందుకు వచ్చాడు. నిర్మల ఆయనకు నచ్చింది.
"ఆ త్రినాధరావే- ఆయనకు అమ్మాయి నచ్చడం అదృష్టం...."
"కానీ ఆయనని మొదటిపెళ్ళి కాదు...."
"ఏం-నేను చేసుకోలేదా రెండోపెళ్ళి?" అంది మాణిక్యాంబ చాటుకున. కూడా మంచిది కాదంటారు..."
"ప్రవర్తన మంచిదికాదంటే ఏమిటి చెప్పండి? హత్యలు చేస్తాడా ? స్మగ్లింగులో ఉంటాడా? జూడమాడతాడా?" అంది మాణిక్యాంబ.
"అవేమికాదు పెళ్ళాన్ని బాధలు పెడతాడని చెప్పుకుంటారు...."
"రెండోపెళ్ళివాళ్ళగురించి అంతా అలాగే చెప్పుకుంటారు. మీగురించి ఎన్ని విన్నానోనేను కానీ నాన్నామాటవిన్నాను. ఇప్పుడు సుఖపడుతున్నాను" అంది మాణిక్యాంబ.
రామరావింకేమి మాట్లాడలేదు. త్రినాధరావు నిర్మలతో ప్రవర్తించిన తిరతడికి గుర్తుంది. అతడు పెళ్ళిచూపులకు వచ్చినట్లుకాక- వేశ్యను బెరమాడు కాబోతున్నవాడిలా జుగుప్సాకరంగా మాట్లాడాడు మాణిక్యాంబ అతడిని సమర్ధించడంవల్ల రామరావింకేమి అనలేక ఊరుకున్నాడు కానీ త్రినాధరావు తన అల్లుడిగా ఊహలోకూడా భరించలేకపోతున్నాడు.
అయితే తనింటిలో మాణిక్యాంబ అనుకున్నదే జరుగుతుందని రామారావుకు బాగాతెలుసు.
5
మాణిక్యాంబ ఇంట్లొంఛిబయటపడ్డాక "నీకు ఒకందుకు థాంక్స్ చాలా తెలివిగా మాణిక్యాంబను బుట్టలో వేసుకునివాళ్ళింట్లో గది సంపాదించి పెట్టావు కానీ నువ్వు నా ప్రియురాలివిషయంలో జిక్యం చేసుకుంటున్నావు ఆమెనాకర్షించడానికి నాతోపోటి నువ్వూ ప్రయత్నించావు...." అన్నాడు చంచల్రావు సాగర్ తో.
"అక్కడేం చేస్తున్నావో నాకు తెలియలేదు. నిర్మలను చూస్తే నాకు మతిపోయింది సారిబ్రదర్...." అన్నాడు సాగర్.
"సారి ఒకటి చెప్పి ఊరుకుంటే లాభంలేదు నువ్వాయింటిలో నాతో పాటుండడానికి వీల్లేదు...."అన్నాడు చంచల్రావు.
"నువ్వు లేనప్పడుండనా?" అన్నాడు సాగర్.
"నువ్వునాకు నెలరోజులు టైమీచ్చావు. అంతవరకూ నువ్వాచాయలకు రావద్దు...." అన్నాడు చంచల్రావు.
"చంచల్-తప్పటడుగు వేస్తున్నావు నువ్వు నా సాయం లేకుండా ఈ విషయంలో సాధించలేవు...." అన్నాడు సాగర్.
"ఎందుకని!"
"ప్రతిఆడది వనజాక్షిలా వచ్చినిన్ను వరించదు. నిర్మలను మొదటి చూపులోనే నేనర్ధం చేసుకున్నాను. ఆమె అమాయకురాలు. సులభంగా నివలలో పడదు నువ్వు తొందరపడితే కొంపలుమునగవచ్చు అప్పుడు నేను తప్పు నిన్నేవ్వరూ రక్షించలేరు...."
"నాకు నిరక్షణ అవసరంలేదు నా పద్దతులునవి...."
"ఇల్లు ఇద్దరం కలిసితీసుకున్నాం! నువ్వోద్దన్న నేను నీతోకలి సే ఉంటాను. నన్ను బ్రతిమాలుకుంతే నిర్మలజోలికిరాను. లేదా యిప్పట్నించి నితోపోటిగా ఆమెను వశపర్చుకునే ప్రయత్నాలారంభిస్తాను ఆలోచించుకో!" అన్నాడు సాగర్.
"నువ్వు మిత్రద్రోహివి...."అన్నాడు చంచల్రావు.
"ద్రోహమనడానికిందులో ఏముంది? నువ్వుకాని , నేనుకాని ఆమెను పెళ్ళిచేసుకోబోవటంలేదు- అవునా?" అన్నాడు సాగర్.
చంచల్రావు ఆలోచించి "సరేలే కానీ -మొదట్లో కొన్నాళ్ళు నువ్వు నిర్మల జోలికి రాకూడదు ...."అన్నాడు.
"అలాగేలే-ఎలాగూ మొదట ఆమెనాకు దక్కుతుంది. నువ్వెలాగూ ఆమెవద్దు ఓడిపోతావని నాకు తెలుసు ...."అన్నాడు సాగర్.
"అనుభవం లేనివాళ్ళలాగే అంటారులే...." అన్నాడు చంచల్రావు. మొత్తం జరిగిందంతా నాకు వివరంగా చెప్పాలి. అది నాగెలుపుకు సహకరిస్తుంది...."
"నేను ఓడినప్పటిమాతకదా!" అన్నాడు చంచల్రావు.
"మాట ఎప్పటిదైనా ఇవ్వవలసిందిప్పడే!" అన్నాడు సాగర్.
చంచల్రావు సాగర్ కు మాటిచ్చాడు.
6
చంచాల్రావు సాగర్ ఆ యింటిలో మాకం పెట్టాక నిర్మలకిబ్బంది ప్రారంభమయింది.
రామారావు ఆఫీసుకు వెళ్ళిపోతాడు. రఘు వల్లి స్కూళ్ళకు వెడతారు మధ్యాహ్నాలు మాణిక్యాంబ పెత్తనాలకు వెడుతుంది. ఆమె పెత్తనాలకు వెళ్ళే ముందువస్తారు వాళ్ళిద్దరూ ఏవో పరీక్షలకు కడుతున్నమంటూ పుస్తకాలు తేచ్చుకోస్తారు. వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు.