Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 8

    "వల్లి అంటే?"
    "అక్కకు చెల్లి...."
    గోపి మాటకు చంచల్రావు నవ్వి- రోజూవస్తూంటావాఇక్కడికి? అనడిగాడు.
    "ఆ చాలా యిష్టం నాకు అక్కంటే ఎంతోబాగా కబుర్లు చెబుతుందక్క. మామూలు మాటలు కూడా కథల్లాఉంటాయక్క చెబుతుంటే-" అని స్వరం కాస్తా తగ్గించి -" అక్క పాఠాలుకూడా ఎంతోబాగా పాడుతుంది...." అన్నాడు గోపి.
    "నువ్వూ కబుర్లు బాగా చెబుతావు. నువ్వు దొరకడం నా అదృష్టం-" అన్నాడు  చంచాల్రావు గోపిని  మంచిచేసుకుందామని.
    "నువ్వు దొరకటం నా దురదృష్టం" అన్నాడు  గోపి వెంటనే నిర్మొహమాటంగా.
    "ఏం?" అన్నాడు చంచాల్రావు చిన్నబుచ్చుకుని.
    "అక్కతో మాట్లాడే చాన్సు పోయిందిగా...."
    "పోలి మనిమిద్దరం వెళ్ళి మీ అక్కతో కబుర్లు చెబుదామా?"
    "నువ్వు రావద్దు. అక్కకి తిరిగిరాకూడాదూ?" అన్నాడు గోపి.
    "వెడతాను వచ్చేటప్పుడు నీ అక్కకిష్టమైన వేమైనాతెస్తాను. తనకేమిష్టమోచెప్పు...."అన్నాడు.
    "అక్కకి జడలో రంగురంగుల రిబ్బన్లు పెట్టుకోవడం ఇష్టం. కాలికిమంచి చెప్పలేసుకోవడం ఇష్టం. రేడియోలో పాటలువినడం ఇష్టం తనమాటలు టేపులో వినడం ఇష్టం. సినిమాలుచూడడం ఇష్టం...."
    "ఇంకా....అన్నాడు చంచల్రావు నిరుత్సాహంగా గోపి చెప్పిన వేవి  అతడిప్పుడు తేచ్చివ్వలేడు.
    "వేయించి కారంఅద్దిన వేరుశనగగుళ్ళు కూడా చాలాయిష్టం"
    ఇదొక్కటేసులభంగా అనిపించింది చంచల్రావుకి. అతడుచటుక్కునలేచి "సరే- కాసేపలా తిరిగిస్థాన్లె" అని వెళ్ళిపోయాడు.
    గోపివెళ్ళి విదితలుపులు వేసి నిర్మల దగ్గరకు వెళ్ళాడు. అప్పడామే హడావుడిగా బట్టలుతుకుతోంది. "హమ్మయ్య- శనిగాడు వెళ్ళిపోయాడు" అన్నాడు వాడు.
    అయితే ఆ శనిగాడి గురించే నిర్మల తీవ్రంగా ఆలోచిస్తోందని గోపికి  తెలియదు గోపికి శనిగాడుకనిపించిన చంచల్రావు నిర్మల్లో ఎన్నోఆశలు రేపాడు. చీరలు, నగలు, షికార్లు- ఆవయసులో ఆమెకంతకుమించిన ఆశలే ముంటాయి?
                                        4
    రామారావు కుటుంబంతో సహా సినిమానుంచి తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నరయింది. అప్పటికి నిర్మల టిఫిన్ తో సహా అన్ని చేయదమేకాక వంట కూడా ప్రారంభించింది.
    మాణిక్యాంబ వస్తూనే "ఏమే- టిపిను తడియేనా?" అంది.
    "ఊ" అంది నిర్మల.
    మాణిక్యాంబ భర్తవంక చూసి "చూశారా! అన్నంతపని చేసిందిది. వెధవది ఉప్మాకలపడం ఎంతసేపు మనమిలావచ్చి బట్టలు మార్చుకునే సరికల్లా అయిపోతుంది. ఇప్పడా టిపిను ఏం చేస్తాం?" అంది.
    "మనం వచ్చేటపుడు హొటల్లోతినేవస్తామని దానికి జెప్పలేదుకదా" అన్నాడు రామారావు నసుగుతూ.
    "చెప్పకపోతేమాత్రం-అంత ఊరికి ముందు  చేసేసి కూర్చోవాలా? పొద్దున్న పదిన్నరకు తిన్నభోజనం  సినిమా అయ్యేసరికి అయిదుదాటింది. పిల్లలాకలితో ఉంటారు. గోల పెడితే ఏహొటలుకైనా వెళ్ళి టిఫిను చేసివస్తారేమోనని ఊహించోద్దూ?" అని "ఎంతుప్మా చేశావో అంతానువ్వేతిను వృధా అయితే నాకు బాధగా ఉంటుంది"అంది మాణిక్యాంబ.
    నిర్మల భయపడిపోయింది. ఆమెకు ఉప్మా బొత్తిగా సహించదు. మాణిక్యాంబ చేసివుంచమని మరిమరిచెప్పడంవల్లనే ఆమె ఉప్మా చేసింది అయితే  ఆ మాట ప్తెకి అనే దైర్యంలేదామెకు. కానీ కాస్త ఉప్మాయేతినలేదు. అంతఉప్మా ఎలా తినగలదు?
    నిర్మల గ్రుడ్లనిరు కుక్కుకుంటూ అక్కడే నిలబడింది.  
    రఘు, వల్లి- చూసినసినిమాలోని విశేషాలు  ఉత్సాహంగా ముచ్చటించు కుంటున్నారురామారావు  అసహయుడిలా నిలబడ్డాడు.
    "ఇప్పుడు నేనేమన్నానని ఆ ఏడుపు? ఉప్మా తినమనడంకూడా తప్పేనా వెళ్ళు...."అంది మాణిక్యాంబ.
    ఉప్మాతినడం ఓబాధ. అంతమందికి తాయారుచేసిన ఉప్మాతినడం ఇంకాబాద అయినా తప్పదు. నిర్మాలలోపాలకు  వెళ్ళింది.
    "ఇదిగో ఉప్మా కంచంలోకి  వేసుకుని ఇక్కడికే తెచ్చుకుని తిను-" అంటూ కేకేపెట్టింది మాణిక్యాంబ.
    సరిగ్గా అప్పడే ఇంటిలో ఇద్దరు యువకులు అడుగుపెట్టారు. వారిలో ఒకడు చంచల్రావు రెండో వాడు సాగర్. ఇద్దరిచేతుల్లోనూ రెండు ప్యాకెట్లు వున్నాయి.
    "నమస్కారం అత్తయ్యా!" అన్నారు వాళ్ళిద్దరూ ఏకకంఠంతో
    రామారావు ఎదుటవుండగా కూడాతననే పలకరించేవాళ్ళంటే మాణిక్యాంబ కెంతో యిష్టం ఆమె అప్యాయంగా వాళ్ళిద్దవంకాచూసి" ఎవరూ? అంది.
    ఇద్దరూ తమనుతాము పరిచయం చేసుకున్నారు.
    "అలాగా- కూర్చోండి" అంటూ  వాళ్ళకు కుర్చీలు చూపించింది మనుక్యాంబవాళ్ళిద్దరూ కూర్చున్నారు.
    "ఊళ్ళోఊళ్ళోఉంటూ ఎవరూ అనడగాల్సిన పరిస్ధితి కల్పించారు  ఇదేనా మంచిచుట్టాల పద్ధతి?" అంది మనుక్యాంబ  నిఘ్టరంగా.
    "మా వల్ల తప్పేజరిగింది. అందుకే నేను స్వీట్లు ,చంచల్రావు హటూ తీసుకుని వచ్చాం నిన్ను చల్లబరచడానికి "అన్నాడు సాగర్ చనువుగా.
    వాళ్ళిద్దరూ అందించిన ప్యాకెట్లు తిసుకుఅది మనుక్యంబ "ఏమిటో పెద్ద హడావుడిమీదనే వచ్చారు" అంది సంబరపడుతు.
    "ముందు పాకెట్లువిప్ప అత్తయ్యా!" అన్నాడు సాగర్.
    మాణిక్యాంబ ప్యాకెట్లువిప్పింది ఒకదానిలో పాలకోవాలున్నాయి. రెండోదాంట్లో కారంఅద్దిన వేయించిన వేరుశనగపప్పంది.
    "నీకిష్టమని తేచ్చామత్తయ్యా!" అన్నాడు చంచల్రావు.
    "నాయిష్టాలు మీకెలాతెలుసు?" అంది మాణిక్యాంబ.  

 Previous Page Next Page