సూట్- అతను గురిచూసి రెండోది విసిరేడు సూటిగా వెళ్ళి ఎరుపుకి గుచ్చుకుంది. ప్రకాశం కళ్ళు మెరిసేయ్. మూడోబాణం మళ్ళి పసుపుకే గుచ్చుకొంది.
ప్రకాశానికి రూఒపాయి టోకెన్ ఇచ్చాడు ఆటవాడు. అర్ధరూపాయి లాభం.
టోకెన్ మర్చుకోందామనే ఉద్దేశ్యంతో వెనక్కి తిరగబోతూ వుంటే పక్కతను "మిది లక్కి హేండ్ లా వుందే" అన్నాడు.
ప్తెకి ప్రకాశం నవ్వేడుగాని లోపల ఏదో గర్వంగా ఫిలయ్యేడు.
మళ్ళి ఇంకో ఆట ప్రారంభం అవబోతూ వుంది.
"ఈ సారి దేనిమీద ఆడబోతున్నారు?" అడిగేడు పక్కతను.
"వెళ్ళిపోతున్నాను__" అని చెప్పుబుద్దికాలేదు. "చూద్దాం" అన్నాడు.
ఆటవాడు దగ్గరకు రాగానే రూపాయి టోకెన్ యిచ్చి 'పసుపు' అన్నాడు. పక్కతను ప్రకాశంవేపు విచిత్రంగా చూసేడు. ఆటవాడు వెళ్ళిపోయాక ప్రకాశం అతనివేపు తిరిగి "మీరేం కాయలేదే....?" అన్నాడు.
"ఒకఆట ఊరుకొంటాను___" అన్నాడు అతను.
సూటతను బాణాలు విసరటం ప్రారంభించేడు.
రెండోది తెలుపుకి, మొదటిది మూడోది పసుపుకి గుచ్చుకున్నాయి. పక్కతను ఎగిరి గంతేసి ప్రకాశాన్ని కౌగిలించుకొబోయి నంతపని చేసేడు. చెయ్యిపట్టుకొని నలిపేస్తూ "ఈరోజు హేండ్ బాగుంది గురూగారూ- లేకపోతే వరుసగా నలుగుసార్లు పసుపుకి గుచ్చు కోవటం ఏమిటి?" అని జేబులోంచి యాభయిరూపాయిల టోకెన్లు తిసి ప్రకాశానికిచ్చి "కాయండి సార్, మీ యిష్టం__" అన్నాడు.
ప్రకాశం కంగారుపడి___" అబ్బే నాకసలు ఎని తెలిదండి__ ఏదో లక్కు ఇంత డబ్బు-" అని ఏదో చెప్పబోతూవుంటే అతను మధ్యలో ఆపుచేస్తూ "ఆ దేసార్- లక్ పోతే పోయింది....కట్టండి-వస్తే తీసుకుందాం పోతే జేబులో దులి పెసుకుని పోదాం-" అన్నాడు.
ఆటవాడు దగ్గరకు వచ్చేడు ప్రకాశం భయపడుతూనే వాడిచేతిలో యాభ్తేమూడు రూపాయల టోకెన్లు పెట్టి "తెలుపు" అన్నాడు.
వాడు వెళ్ళిపోయాడు.
బాణం దానికి తగలకపోతే మన మొహాలు తిరిగే 'రంగు' అదే!
ప్రకాశం నవ్వేడు. అతని చనువు చూస్తే ముచ్చటేసింది. స్త్రి దగ్గరా, తాగుడు దగ్గరా, జూదం దగ్గారా అయ్యే స్నేహం ఇంకెక్కడా అవదు.
"పోయింది గురూగారూ" అన్న మాటలతో ఉలిక్కిపడిబోర్డు వ్తెపు చూసేడు. బాణం నలుపు గడికి గుచ్చుకొని వుంది. ప్రకాశం సూటు మనిషివ్తెపు చూసేడు. అతని మొహం ఆనందంతో వెలిగిపోతూంది. అతను నలుపుమీద కాసేడు.
సూటుమనిషి రెండోబాణం విసిరేడు.
అది నలుపు కే గుచ్చుకొంది.
ఇద్దరి మొహాలు తెల్లగా పాలిపోయాయి. "పదండి పోదాం, ఇక చూడనక్క రాలేదు" అన్నాడు అతను. ప్రకాశానికి బాధగా వుంది, తనాన్ మీద నమ్మకంతో అతను అంత డబ్బు పోగొట్టుకున్నందుకు. తలెత్తి చూసేడు సూటువాడు మూడోబాణం గురిచూసి విసిరేడు.
ఒక్కసారి ప్రకాశం మొహం విప్పారింది. తెలుపు గడికి మధ్యలో బాణం గుచ్చుకొని వుంది. పక్కతని సంగతి చెప్పనక్కర లేదు....
"ఇంక ఆడొద్దు పోదాం పదండి" అన్నాడు ప్రకాశం ఇక రిస్క్ తీసుకొదల్చుకోలేదు అతను.
నూట ఆరు రూపాయలూ తీసుకొని గుంపులో నుంచి బ్తేట కొచ్చారు.
"చాలా దాంక్స్ గురుగారూ! ఈ మూడ్రోజుల్లోనూ నాది రెండొందలు పోయింది__" అన్నాడతను.
ప్రకాశం మొహామాటపడి "నాదేముంది, బిగినర్స్ లక్ అంతే" అన్నాడు. ఇద్దరూ టోకెన్లు డబ్బుగా మార్చుకొన్నారు.
అంతలో ఏదో గంట వినిపించింది.
"రండి ఒక షో చూసి పోదాం..." ఆహ్వానిస్తూన్నట్టు అన్నాడతను.
ప్రకాశానికి అర్ధంకాలేదు. మౌనంగా అతనితోపాటు నడిచేడు. ప్రకాశం తీసుకోబోతూవుంటే__ "మీరూరుకోండి" అంటూ కౌంటరు దగ్గిర టిక్కెట్లు అతనే తీసుకోన్నాడు.
ఇద్దరు టెంట్ లోకి వెళ్ళేరు.
లోపల చిన్నస్టేజి ఒకటి వుంది.తెరలు వేలాడుతున్నాయి. స్టేజికి రెండు వ్తేపులా అమ్మాయిల బొమ్మల నాట్యం చేస్తున్న భంగిమాలో వున్నాయి. హాలు దాదాపు నిండివుంది. ఇద్దరూ ప్రవేశించిన మూడు నాలుగు నిముషాలకి డాన్సు ప్రారంభం అయింది. దాన్ని డాన్సు అని అనలేం ముందోకడు డోలు మెడలో వేసుకొని గెంతుతూ వచ్చాడు. వాడి వెనుకనే ఇద్దరు స్త్రిలు పరికిణిలు కట్టుకోణివచ్చేరు. వాళ్ళవయసు ముప్పెకి తక్కువ వుండదు ముఖానికి దట్టంగా ఎరుపురంగు వేసుకున్నారు.
పాట ప్రారంభమయింది.
పాటతోపాటే ముగ్గురూ డాన్సు మొదలు పెట్టేరు. పాటా పల్లవి విని "ఎక్కడో విన్నట్టువుందే యీ పాట" అన్నాడు ప్రకాశం అతను నవ్వి, ఒక సినిమా పేరుచెప్పి "ఈ పాట అందులోదే" అన్నాడు.
డాన్సు చూస్తున్నకొద్ది అ పాటలో వున్న రెండో అర్ధం తెలియసాగింది. "అబ్బా-యింత వల్గర్ గా వుందేమిటి?" అన్నాడు. ప్తెకి అప్రయత్నంగా.
అతను నవ్వి "ఈ పాటవల్లే ఆ సినిమా వందరోజులు ఆడింది! బాగా చదువుకున్న ఒక పెద్దకవి వ్రాసేడు దాన్ని_" అన్నాడు. అంతలో