ప్రేక్షకుల్లోంచి విజిల్సూ, చప్పట్లూ వినబడ్డాయి. ప్రకాశం స్టేజివైపు తల తిప్పేడు. పాటకి లయగా క్రిందనుంచి చప్పట్లు కొడుతున్నారు. డోలువాడి తల విసురుకి జుట్టు నుదుటిమీద గమ్మత్తుగా కదులుతుంది. జనంలో హుషారు యెక్కువైంది. ఆడవాళ్ళి ద్దర్లో ఒకామె కాలు గాలిలో విసురుతూ గిరగిరా తిరగసాగింది. ఇంకో ఆమె స్టేజి పుట్ ల్తెట్స్ దగ్గిర గెంతుతూ మోకాళ్ళు దగ్గిర పరికిణిణి గుప్పెట్లో మేలిపెట్టి కొద్ది కొద్దిగా పై'కి ఎత్తసాగింది. విజిల్స్ యెక్కువయ్యాయి. జనంలో హుషారు చూసి డోలు వాడికి ఉత్సాహం ఎక్కువైంది. వాడూ పుట్ ల్తేట్స్ నీడలు ఆమె కాళ్ళ సందుల్లో అస్పష్టంగా నాట్యం చేస్తున్నాయ్. జనంలో కలకలం తగ్గింది. అందరూ - తమ జన్మ రహస్యం చూడటానికి ఊపిరి బిగపట్టి వున్నట్టు నిశ్శబ్దంగా ఉంది ఆడిటోరియం.
ప్రకాశం సీట్లో ఇబ్బందిగా కదిలేడు.
పక్కతను కళ్ళప్పగించి చూస్తున్నాడు.
ప్రకాశానికి ఈ డాన్సుకన్నా వెనుక వినిపిస్తున్న పాట భరించ లేనంత అసహ్యంగా ఉంది. జనం ఎందుకు ఇంత ఎస్కేపిస్టుల్తేపోతున్నారో....
ప్రకాశం ఆలోచన్లని తెగ్గోడూతూ పక్కతను చటుక్కున లేచి ప్రకాశం చెయ్యి పట్టుకుని "రండి తొందరగా" అంటూ మరిక అతన్నీ ఏవి మాట్లాడనివ్వకుండా దాదాపు లాక్కొని వెళుతున్నట్టు బ్తేటికి తీసుకొచ్చాడు. ఈ లోపులో ఆడిటోరియమ్ అంతా గందరగోళం అయి పోయింది. అందరూ దాదాపు పరుగెడుతున్నట్టు బై'టకు రావాలనుకోటంతో ద్వారం దగ్గిర దొమ్మిలా తయారయింది. ఇద్దరూ ఒక క్షణం ముందు వచ్చేయటం వలన ఇబ్బంది లేకపోయింది.
బ్తేటికి వచ్చి చుట్టూ దిగ్బాంతుడై పోయేడు. పోలీసులు -దొరికిన వాడినల్లా పట్టుకోంటున్నట్టున్నారు. అంతా గొడవగా వుంది.
"ఇటురండి" అంటూ కార్నవాల్ వెనుకవ్తేపుకి పరుగెత్తాడు. ప్రకాశం అతన్ని అనుసరించాడు అటువ్తెపు అంతా చీకటిగా వుంది. అంతకుముందు రెండ్రోజుల క్రితం వర్షం పడటం వలన చిత్తడిగా వుంది.
"జాగ్రత్తా! కంచే వుంది" అన్నాడతను. ప్రకాశం దూకెడు. కొంచెం నడిచేక స్దిమితపడి "ఎక్కడున్నాం మనం" అని అడిగేడు.
అతను కొద్దిగా రోప్పతూ __ "సినిమా హాలు వెనుక వ్తెపు..." అన్నాడు.
"అసలేం జరిగింది?"
"వాడు ల్తేసేన్సు కట్టలేదనుకుంటా. పోలీసులు ర్తేడ్ చేసేరు" అని ప్రకాశం ఏదో అడగబోతూ వుంటే ఆ ప్రశ్న తనకి తెలుసునన్నట్టుగా "వాళ్ళకి ఒక్కసారిగా దొరికేం అంటే తప్పోప్పలు విచారించారు. ఎంతో కొంత చదివించుకొంటేగాని వదలరు" అన్నాడు.
ఇద్దరూ సినిమా కంపౌండులోంచి బ్తేటికి వచ్చేరు.
"ఇలాటి వాటికికూడా గవర్నమెంట్ ల్తేసేన్నిస్తుందా?" అన్నాడు ప్రకాశం కొంచెం ఆశ్చర్యమిళితమ్తెన స్వరంతో.
అతను నవ్వి, "ఇలాటి విషయాల్లో గవర్నమెంటు చాలా అందముగా ఆత్మవంచన చేసుకొంటుంది లెండి."
ప్రకాశానికి అర్ధంకాలేదు- "అంటే?" అని అడిగాడు.
"ఆ ఆత్మవంచనే చేసుకోకపోతే లాటరిలని, క్యాబరేలని, రేసుల్ని వెంటనే అపుచేయ్యాలి! చెయ్యడు ప్రజాలెంత ఎస్కేపిస్టుల్తేతే అంత మంచిది. అంతవరకూ ఎందుకు? మాట్నిలవల్ల, మార్నింగ్ షోలవల్ల "ప్రొడక్టివ్ అవర్స్ ఆఫ్ ది కంట్రి" ఎన్నికోట్లు నాశనం అవుతున్నాయో తెలిసికూడా, ఏవి చెయ్యదు."
ఇద్దరూ కిళ్ళికొట్టు దగ్గర కొచ్చేసరికి అతను ఆగి, "మీరు కిళ్ళి వేసుకుంటారా?" అని అడిగేడు. ప్రకాశం అడ్డంగా తలూపేడు.
అతను షాపువాడివ్తెపు తిరిగి "శివాజీ కాశ్మీర్ ఒకటి" అంటూ ఫేంటు జేబు దగ్గర చెయ్యి పెట్టుకొని "అరె..." అన్నాడు.
"ఏమ్తెంది" ఆతృతగా అడిగేడు ప్రకాశం.
జేబులన్నీ తడుముకొంటూ "డబ్బు__ఎక్కడో జారిపోయింది" అన్నాడు. ప్రకాశం కంగారుపడి, "సరిగ్గా చూడండి" అన్నాడు. కొట్టువాడు కిళ్ళి కట్టిస్తూ "ఎంతబాబూ" అని అడిగేడు.
"దాదాపు వంద."
కిళ్ళికి ప్రకాశావే డబ్బులిచ్చాడు. అది గమనించి, "సారి సార్ మీతో ఇప్పిస్తున్నాను" అన్నాడు.
ప్రకాశం నొచ్చుకొని "చాచా, అలాంటిదేమి లేదు" అని "మనం వచ్చిన దారిన వెళ్ళి టై చేస్తే ఏమ్తేనా లాభం వుంటుందేమో" అంటూ అటు నడవబోయాడూ. అతను వారించి "లాభంలేదు. ఆ చికట్లో ఎక్కడని వెదుకుతాం? కనబడుతూ వున్నట్టయితే ఈ పాటికే ఎవడో తీసుకొని వుంటాడు" అన్నాడు.
అతని నిర్లిప్తతని గమనించి ప్రకాశం కొద్దిగా ఆశ్చర్యపోయేడు. దాన్ని పసిగట్టినట్టు అతను నవ్వి. "ఇందులో బాధ పడటానికి ఏవిలేదు. ఆ యబై గాంబ్లింగ్ లో పోయిందనుకొందాం" అన్నాడు.
"నిజమే కానీ మీలా ఈ విషయన్నీ ఇంత తేలికగా తీసుకోవటము అందరికి చేతకాదు."
"సర్లెండి ఇక ఆ విషయం గురించీ ఆలోచించటం అనవసరం వెళ్ళొస్తాను గురువుగారూ! మళ్ళి ఇక్కడే కలుసుకొందాం ఎప్పుడయినా బై ది బై మీరేం చేస్తుంటారో చెప్పేరు కారు-"
అంతవరకూ పరిచయాలు చేసుకోలేదని గుర్తొచ్చి, "నా పేరు ప్రకాశం. ఇన్ కంటాక్స్ ఆఫీసులో పనిచేస్తున్నాను. మీరు?" అని అడిగేడు.
పంటికింద ఇరుక్కున్న తమలపాకు ముక్కని నాలుకతో ప్తెకి లాగుతూ "నా పేరు గోపాలస్వామి. లేబరీ సైకాలజిలో రిసెర్చి చేస్తున్నాను...." అన్నాడు.