ఇమతవరకే ప్రకాశం ఆలోచించగలిగెడు. సగటు మనిషి.... సమస్యను ఆలోచించటం ఒక్కటే చేతనవును. ఇక్కడ్నుంచి పెరగటం నూటికో, కోటికో ఒకరికి సాధ్యమౌతుంది. వాళ్ళు సిద్దాంతికరణ చేస్తారు జాతిని ప్రభావితం చేస్తారు. కానీ కాలం ముందు వాళ్ళేపాటి? కోట్లాణుకోట్ల చరిత్ర పుటల్లో ఒక్క అక్షరం వాళ్ళది -అంతే__మనిషి నిజాయితిగా బ్రతుకుతె అదేచాలు క్రోస్తూ అదే చెప్పాడు-క్రీస్తుశకం అయిదు వందల దేబ్బ్తేలో పుట్టిన మహామ్మదూ అదే చెప్పాడు.
"ప్రతివ్యక్తియొక్క సంపూర్ణ స్వేచ్చాయుత అభివృద్ధి సార్వభౌమతత్వముగాగల సమాజాన్ని ఊహించిన కారల్ మార్క్స్ అదే కోరాడు. అంతకు నాలుగువేళ సంవత్సరాలముందు పుట్టిన మనువూ అదే వ్రాసేడు. పోతే దార్లువేరు. అది వేరేసంగతి...ఎందుకి చింతన ?ప్రశ్న చాలా చిన్నది. కానీ జవాబు మాత్రం...మనం వుంటున్న సంఘం అంత పెద్దది. హిమాలయాల్లో యెక్కడో, ఎత్తయిన శిఖరాల వెనుక మంచు కప్పేసిన చీకటిగుహల్లో , రాత్రింబవళ్ళు కఠొర దీక్షతో తపస్సు చేసుకొనే బుషుల పెదవుల మీద వెలసిన చిరునవ్వు దానికి సమాధానం చెబుతుంది.
"అలాగే నిలబడి వున్నారేం బాబూ" అడిగేడు ఇస్మాయిల్.
ప్రకాశం తడబడి "అబ్బే , ఏంలేదు వెళుతున్నాను" అన్నాడు కానీ దిన్ని యింకోలా అర్ధం చేసుకుని "లోపలికి వెళ్ళండి బాబూ" అన్నాడు ఇస్మాయిల్. "ఇంటికెళ్ళి చేసే పనివిలేదు. అదేమిటో చూద్దాం" అనుకొని లోపలికి ప్రవేశించాడు.
రకరకాల రంగుల ల్తెట్లు ఆహ్వానిస్తూ కనబడ్డాయి. చిన్న చిన్న గుడారాల్లో వున్నచోట జనం గుమిగూడి వున్నారు. దారి తెలియని వాడిలా క్షణంపాటు అచేతనంగా నిలబడిపోయేడు ప్రకాశం ఒకవ్తెపు నుంచి మ్తెకులో పాటలు వినిపిస్తున్నాయి. అటు చూసేడు నిలువెత్తు బొమ్మలు ద్వారాలకి రెండు వ్తేపులా వేలాడదియబడి వున్నాయి. వారిమీదకి ల్తెట్లు ఫోకస్ చేసేరు అర్ధనగ్నంగా వున్న ఇద్దరాడపిల్లల బొమ్మలు, ప్తెన అడ్డంగా కట్టిన "సుస్వాగతం " గుడ్డ వర్షానికి తడిసి వికృతంగా కానబడుతూ వుంది.
"రండి బాబూ రండి" అన్న కేకవిని అటు చూసేడు. జనం అడ్డుగా వుండటంవల్ల ఏవి కనపడటం లేదు. అప్రయత్నంగా అటునడిచెడు. దగ్గరకివెళ్ళి దూరంనుంచి కానబడినంతమంది లేరు. కొంచెం సందుచేసుకొని మధ్యలోకి వెళ్ళేడు. ఒక పెద్దబల్ల మధ్యలో వుంది. దాని మీద ఆరురంగులు వున్నాయి. బల్లకి అటుచివర గోడకి ఆన్చి ఒక బోర్డు వుంది. ఆ బోర్డుకి చిన్న గళ్ళున్నాయి. గళ్ళు అన్నిటికి ఈ ఆరురంగులూ వేయబడ్డాయి.
ప్రకాశం ఉత్సుకతతో చూడసాగేడు. ఆ కార్నర్ వాల్ తాలూకు బల్ల దగ్గరున్నవాడు మూడు చిన్న చిన్న 'యరోస్' లాటి వాటిని ఒకరి చేతికిచ్చేడు. తరువాత ఆరు రంగుల మీద బెట్టింగ్ జరిగింది. ఎవరికీ తోచినంత వారు తమ కిష్టమైన రంగులమీద పందెం కాసేరు, ఒకదాని తరువాత ఒకటి మూడు 'యరోస్' విసిరేడు. ఒకటి పసుపు, ఇంకొకటి ఎరుపు, మూడోది నిలంరంగుమీద గుచ్చుకున్నాయి. ఆ మూడు రంగుల మీద కాసిన వాటికి రెట్టింపు యిచ్చి మిగతా కాసిన డబ్బులు తిసి పెట్టెలో వేసెనుకున్నాడు.
ప్రకాశానికి ఆ ఆట అర్ధమ్తేంది. అందులో మోసం ఏమ్తేనా వుందే మోనని ఆలోచించాడు. ఏవి కనపడలేదు. ఉన్నవి ఆరురంగుల మూడు బాణాలు వ్తేస్తాడు కాబట్టి చాన్సు సగం సగం అందులో మోసం ఏముంది? అదృష్టం తప్పు...
రెండు రోజులక్రితం వారపత్రికలలో 'స్పెక్యులేషిన్ లాభించును' అని చదివినట్టు జ్ఞాపకం వచ్చింది. "ఆడాలా? వద్దా?" అని క్షణం సేపు మీమాంస...జేబులు తడువుకొన్నాడు. చిల్లర మాత్రం తగిలింది. నేలాఖారు అని జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు.
ఇంకో రెండు రౌండ్లు సాగినయ్....
ప్రకాశం ఒక విషయం గమనించేడు. దాదాపు ప్రతిసారి ఎరుపు రంగుమీద బాణం గుచ్చుకొంటూనే వుంది. ఆకుపచ్చ , నిలం రంగుల మీద పడటం లేదు.
జనంలోంచి బ్తేటికి వచ్చి ల్తెటుస్ధంభం కింద నిలబడి జేబులోంచి చిల్లర తిసి లెక్కపెట్టేడు.
రెండున్నర వుంది-
రెండు రూపాయలు జేబులోపడేసుకొని, అర్ధరూపాయి టోకెన్ కొన్నాడు.
ప్రకాశం వచ్చేసరికి ఇమకో రౌండు పూర్తయింది. ఈసారి ఎరుపు రంగుకి ఏ బాణమూ గుహ్చుకోలేదు. కాబట్టి వచ్చేసారి తప్పకుండా గుచ్చు కోవాలి అనుకున్నాడు.
ఆట తలూకువాడు దగ్గరకొచ్చినప్పుడు అతని చేతిలో తోకన్ పెట్టి "ఎరుపు" అన్నాడు.
తోకన్లు వసూలు చేయటం పూర్తయింది.
ఎవరో సూట్ వాలా యబ్తే రూపాయల టోకెన్ "నిలం" మిదాస్ కాసి, బాణాలు చేతిలోకి తీసుకొన్నాడు. ప్రకాశం పక్కనున్నతను చప్పన ఆ ఆట తాలూకువాణ్ని పిలిచి "నా పదిరూపాయలూ పసుపు మీద నుంచి తిసి నీలం మీద వెయ్యి అన్నాడు.
ప్రకాశం అతనివ్తెపు విచిత్రంగా చూసేడు. అది గమనించి అతను ప్రకాశం వైపు తిరిగి నవ్వి,
"ఆ సూటు ఆయన మంచి ఘాటరండి, సాధారణంగా గురి తప్పదు" అన్నాడు.
ఇంకో నలుగుర్తే దుగురు 'నీలం' మీద కాసేరు.
ఆట ప్రారంభం అయింది.
మొదటిబాణం వెళ్ళి 'పసుపు'కి గుచ్చుకుంది దానిమీద ఎవరో రూపాయి కాసేరు- అంతే ప్రకాశం తలతిప్పి పక్కతానీవైపు చూసేడు నేత్తూరుచుక్క లేనంతగా పాలిపోయింది అతని మొహం.