Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 9

 

    "స్త్రి చిన్నది,  పురుషుడు పెద్ధవాడుగా ఉండడం శాస్త్రిసంమతమ్తెన  విషయం కదా."

    "ప్రతీది  శాస్త్రానికి ముడిపెట్టి నీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్లనే ఆ శాస్త్రాలకి మాలాంటి వాళ్ళ దృష్టిలో విలువలేకుండా పోయిందేమో!"  చిరాకు పడ్డాడు మల్లిక్.  "రెండు ప్రవాహల ఉధృతం ముంచు వయసు ఎవరికీ జ్ఞాపకముంటుంది?"

    "ఆవిడతో సంబంధం త్రెంచుకోలేనిదా."

    "నాయుడుగారి కుటుంబం డబ్బూ,  దేశ విదేశాలలో పలుకుబడి కలవాళ్ళు,  ఫారిన వెళ్ళాలన్న నా కలలకి వాళ్ళ పలుకుబడి ఎంతో అవసరమైన!  నాకు ఫారిన్ చాన్స్ వచ్చేవరకు ఆ ఇంటికి నా రాకపోకలు  జరుపక తప్పదు.  ఆ ఇంటికి వెళ్ళడం మానేయనంత వరకు ఆవిడతో సంబంధం తప్పదు."

    "పరాయిస్త్రీతో  సంబంధం మీకు పాపమనిపించాలేదా!"

    మల్లిక్ ఫక్కున నవ్వాడు.  "పుస్తె కట్టినంత మాత్రాన నువ్వునా దానివి,  ఆమె పరాయిదినా?  ప్రస్తుతం ఆమే దగ్గరి మనిషిగా కనిపిస్తూంది నాకు నీకంటే కూడా!  ఇహ పాపపుణ్యాల గొడవకి వస్తే,  పాతికేళ్ళు నిండకుండానే విధవయ్తే  కోరికల వేడికి వేగిపోతున్న ఆమెను ఆ బాధ నుంచి తప్పించాను.  మా రహస్య సంబంధం ఎవరికీ బాధ కలిగించలేదు.  అన్యాయం   జరుగలేదు అలాటప్పుడు పాపం ఏముంది?"

    "వ్యభిచారం పాపం కాదా?"

    "అవన్ని చాతగాని చవటలు,  ద్తేర్యం లర్ని వాళ్ళు చెప్పే మాటలు!  పదహారు,  పదిహేడేళ్ళప్పడే  నీలో యవ్వన సహజమ్తెన కోరికలు తలెత్తాయి!  ఇన్నేళ్ళ యవ్వనంలో బ్రహ్మచారిగా ఉండాలంటే సాధ్యమా?  ఆరోగ్యం సరిగా ఉన్నవాణ్ని,   ద్తేర్యం ఉన్నవాడిని!  నా దారికి ఎదురుగా ఆమే నడిచివచ్చింది.  ఇద్దరం ఒక్కటయ్యం!  చెప్పానుకదా!  ఎవరికీ అన్యాయం జరుగనంతవరకు  అది పాపం కాదు!"

    "ఇప్పుడు నాకు అన్యాయం జరుగడం లేదా?"

    " మనిద్దరం ఒకటి కాలేదు కదా?  అయ్యాక ఆలోచిస్తాను!  నీకు అన్యాయం ఎంతవరకు అవుతుందో!"
 

                                                                       6


    మూడమి వెళ్ళడానికి ఓ వారం రోజులుండగానే అన్నగారిని,  వదిన గారిని పిలిపించింది యశోదమ్మ.   శోభనానికి ముహూర్తం పెట్టించింది.  బందువులందరినీ  పిలిచి ఆర్చటం చేయడం కొడుక్కు ఇష్టం వుండదని ఎవరికీ కబురు పంపలేదు!  ముక్తసరిగా కార్యం దాటేద్దామనుకోంది!

    రోజులు దగ్గర పడుతున్నకొద్ది తన జీవితం సమాధికావడానికి ఊబి ఏదో దగ్గర పడుతున్నట్టుగా అనిపించసాగింది త్రిపురకి.  భర్త అంటే చెప్పలేనంత అసహ్యం ఏర్పడింది!  "ఆయన  త్రాగుతాడు!  మాంసం తింటాడు!   పర స్త్రీలతో  పోతాడు!  తను చేసింది కాక,  నన్నూ వాళ్ళ సోస్తేటిలో తిరగమంటాడు!  అధునాతనంగా అలంకరించుకో మంటాడు!  అతడు చెప్పినట్టు వినకపోతే గొర్రె,  బర్రె అని హేళన చేసి మాట్లాడతాడు! నేను ఆయనతో కాపురమంటేనే ఇప్పటికిప్పుడు ఆత్యహత్య చేసుకు  చచ్చిపోదామనిపిస్తూంది!  అలాంటి ఆపవిత్రుడికి,  హినుడికి మనసేకాదు,  శారిరాన్ని కూడా అర్పించాలేననిపిస్తూంది!"   అని,  ఏడ్చింది తల్లిదండ్రులతో.

    "మాతో అంటే అన్నావుకాని,  ఇంకెవరితోనూ ఈ సంగతులు చెప్పకు!  ఈ ధోరణిలో మాట్లాడకు!  అతడి మిద ఫిర్యాదు చేస్తే నిన్ను నీ వేలోకువచేసు కొన్నట్టు అవుతుంది!  నువ్వుచేప్పే లోపాలు నిన్నంతగా బాధించేవి కావు!  అతడు డాక్టరు!అందగాడు!  తెలివ్తేనవాడు!  ఇవిచాలు నువ్వు సుఖపడడానికి! లేనిపోనివి మనసు కేక్కించుకొని నిన్ను నువ్వు నరక యతన పెట్టుకోవద్దు!"  అని  త్రిపురనే మందలించింది తల్లి.

    పరమేశ్వరశాస్త్రి మాత్రం కూతురి ఆవేదనను అంత తేలిగ్గా తిసి వేయలేక పోయాడు.  "అల్లుడు డాక్టరు అని మురవగానే సరా?  బ్రాహ్మణు డ్తె  పుట్టి తినకూడని తిళ్ళుతిని, త్రాగి, పరస్త్రీలను కామిస్తూ,  పాపం పుణ్యం వదలి పరమ నాస్తికుడయ్యడే,  వాడితో పిల్ల ఏ పాటి  సుఖపడుతుందో కొంచెం ఆలోచించావా?"

    "పిల్ల ముందే అలా అంటే దానికి మరి వత్తాసు ఇచ్చినట్టుగా అయిపోధండి?  అది కాపురం చెయ్యనని మనింటికి వచ్చేస్తే ఎవరికీ అప్రదిష్ట?  ఆప్రదిష్ట అలా వుంచండి.  దాని జీవితం మొగుడూ మొగుడూ మొద్దులూ లేక నాశనమ్తెపోదూ?"  భర్తను చాటుకు  లాక్కువెళ్ళి  చివాట్లు పెట్టింది లలితమ్మ.  " అబ్బాయి డాక్టరు!  విదేశానికి కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడట!  రెండు చేతులా పేరునూ డబ్బునూ సంపాదించి ధాన్ని మహారాణిలా  సుఖ పెడతాడు!  మనం  చూడాల్సింది దిన్నె గాని,  అతడు చాటుగా ఏం చేస్తే మనకెందుకు?  మగవాళ్ళకి చాటుమాటు వ్యవహారాలు లక్షా ఉంటాయి! ఒక మగవాడి విలువ వాటిబట్టి అంచనా వేయంకదా?  అందం,  హొదా,  పలుకుబడి సంపాదనా,  ఇవేకదా చూసేది!  వీటిని బట్టి చూస్తే మన అమ్మాయి కేమిటి తక్కువ?"

    "అయితే,  పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకోంటారా ఏమిటి ఖర్మ!"  మంటున్నాను!  అంతే!  ఏదో ప్రళయం ఊహించుకొని దానినోరు నొక్కేయడం సబబుగా అనిపించడం లేదు నీకు?  నా చిన్నప్పుడు నా మేనత్త ఒకామె సరిగా త్రిపుర పరిస్దితిలోనే చిక్కుకొని ఆత్మహత్య చేసుకొని ఆ బాధ నుండి  విముక్తి పొందింది! భర్తతో వేగలేక పుట్టింటికి వస్తే,  భర్త విడిచిన ఆడదానికి మా ఇంట్లో చోటులేదు పొమ్మన్నారు మాతాతగారు,  నాయనమ్మా!  నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు.  తమ నిర్దాక్షిణ్యత  కూతురి కాపురం చెడిపోకుండా  నిలుపుతుందనుకొన్నారు గాని ఆమె బ్రతుకునే బలి తిసుకుంతుందనుకోలేదు.  ఆమె సరాసరి వెళ్ళి పోయింది!  త్రిపురకి ఆమె పోలిక వస్తే నేను భరించలేను!"  ఆయన కళ్ళలో సంనతినితి తెర మెరిసింది.

    ఇద్దరు మగపిల్లల తరువాత త్రిపుర ఒక్కతే కూతురు!  మగపిల్లల  మిద కంటే ఈ కూతురి మిదే ఆయనకీ ప్రాణం!  ఆ పిల్లకాలిలో ముల్లు  గ్రుచ్చుతే విలవిల్లాడి పోయేంత అపురూపం!

    "నా చిన్నప్పడూ మా పుట్టింట్లో,  మా తాతగార్లు కలిసి ఉన్నప్పుడు  తల్లిదండ్రులు  ఉన్నంత వరకూ బాగానే చూశారు!  వాళ్ళు పోవడంతో అత్తవారింట్లో కంటే అసలు నరకం అక్కడే ప్రారంభమ్తెంది! అన్నదమ్ములు వదిన మరదళ్ళు ఆమెను పెద్ద దాసిలాగా చూసి చాకిరి చేయించుకొనే వాళ్ళు! తిండి దగ్గరికి వచ్చేసరికి ఓ ముష్టిదానికి చూసినట్టుగా  చూసేవాళ్ళు!  రోజూ తిట్లతో చిత్కారాలతో చావడానికి కూడా లేకుండా పోయింది!  ఓ పిల్ల ఉండడంతో,  సర్తెన పెంపకం లేకపోవటంతో,  ముఖ్యంగా తల్లి జీవితం సవ్యంగా  లేకపోవడం వాళ్ళ ఆ పిల్ల ఎవడితోనో  లేచిపోయింది!  దాంతో ఆవిడ గుండె పగిలి చచ్చిపోయింది."

    "అయితే అది తల్లికాకముందే ఆ బాధ తప్పించడం మంచిది" 

    "మీకు  నిజంగా పిచ్చిపట్టింది!  మీరసలు పిల్లను విదిపించుకొనే ఆలోచన ఎలా చేయగలుగుతున్నారు?   అతడు మీ కూతుర్ని అంతకష్టాలు ఏం పెడుతున్నాడని?  అతడు తాగితే తింటే మీ ముల్లెంపోయింది?  త్రాగడం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది."

   
    "ఛి  ఛి!  బ్రాహ్మణుడ్తె  పుట్టి!  బావకాబట్టి  ఊరుకోన్నాడు గాని,  నా కొడుకే అయితే చంపి పూడ్చేసేవాడిని! అల్లుడని చెప్పుకోడానికి సిగ్గు చేటుగా ఉంది.  త్రిపుర సనాతనాచారవంతుల ఇంట విలక్షణంగా పెరిగిన పిల్ల.  అతడి ప్రవర్తనకు  ఎలా సరిపెట్టుకోంటుంది?   మగణ్ని అది అవహ్యించు కోవండంలో అర్ధం లేదని మాత్రం అనకు!"

    "అది మనం ఏకాస్త సానుభూతి చూపిస్తున్నాం అనిపించినా నెత్తినెక్కి కూర్చుంటుంది!  అప్పుడు మగణ్ని  విడిచిన కూతురుతో మనకు చావడానికి కూడా చోటుండదు.  దానికి వత్తాసుగా ఒక్కమాట మాట్లాడినా నామీద ఒట్టు!"

    సాయంత్రం నుండి త్రిపుర కళ్ళనుండి నీళ్ళు కారిపోతూనే  ఉన్నాయి!

 Previous Page Next Page