"కూర్చోవయ్యా? కాస్త ఫలహారం తీసుకొని వేడుదువుగాని!" అంది మీనాక్షి.
మల్లిక్ కూర్చున్నాడు.
మీనాక్షి ప్లేట్ లో ఫలహారం, మరోచేత నీళ్ళు పట్టుకువచ్చి పెట్టింది అతడి ముందు "త్రిపుర గోంతులో అమృతం ఉంది! సంగీతం చెప్పడానికి, మేష్టారిని పెట్టు, మల్లిక్! కాస్త అందిస్తే చాలు, ఇట్టే పైకి వెళ్ళి పోగలదు!" అంది మీనాక్షి సిపార్స్ చేస్తూ.
"ఏం సంగీతంలేండి! ఎవరు వింటారు ఈ కాలంలో! ఈ సారి ఇంటర్ పరీక్ష వ్రాయిస్తున్నాను! ఆ పరీక్షకు బాగాచదివితే చాలు!"
"ఇంటర్ వ్రాస్తుంది! బి.ఎ. కూడా వ్రాస్తుంది! సంగీతం కూడా నేర్చుకోంటుంది! శాస్త్రీయ సంగీతమంటే నీకంత చిన్న చూపెందుకు?"
"బోర్ అంటి: ఆ 'తరనానా' అని సాగదీసి పాడతారే, ఆలాపన అంటారేమో దాన్ని- ఇంకా అది విన్నప్పుడు ఎక్కడిక్తేనా పారిపోదామని పిస్తుంది!"
"నీకు మనదంతా బోరేకదా? సంగీతం ఒక్కటేనా? మన కట్టు మన బొట్టు, మన సంప్రదాయం. మన చదువులు, శాస్త్రాలు పురాణాలు అన్ని బోరేకదా నీకు? ప్రతి మాటకు ముందు పాశ్చాత్యులను చూసి నేర్చుకోవాలంటావు! మన వేదాలు దొంగిలించి, వాళ్ళివాళ ఇంతవాళ్ళ య్యా రంటే చాలామంది ఒప్పకొనే సంగతేకదా?"
"మన విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమ్తెతే అయి ఉండవచ్చు! దాన్ని వెలికితీసి, దాన్ని ప్రయోజనాన్ని సామాన్య ప్రజలందరి దగ్గరికి తెచ్చింది మటుకు పాశ్చాత్యులేనంటే ఒప్పకొనే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఆంటి! అదేం చిన్నపనా? దానికోసమ్తెనా వాళ్ళని మనం అభినందించాలి. ఎక్కడినుండి దోంగిలించినా వెలుగులోకి తెచ్చింది మటుకు వాళ్ళు! వాళ్ళు వెలుగులోకి తీసుకురాకపోతే పాశ్చాత్య ప్రపంచమే కాదు, మన ప్రపంచం కూడా చాలా చీకటిలో మునిగిపోయి ఉండేది. మనం కనిపెట్టింది మన వేదాలలోనే దాచేస్తే వాళ్ళు ఏది తెలుసుకొన్నా దాని ప్రయేజనాన్ని ప్రపంచానికంతా అందించారు! అందిస్తున్నారు! ఏ విధంగా చూసినా వాళ్ళే గొప్పగా కనిపిస్తారు నాకు!"
"వాళ్ళమిద నీకు గొప్ప అభిప్రాయం ఉంటే ఉండని! పరధర్మం ఎంత గొప్పద్తే స్వధర్మాన్ని కించపరచాకూడదని, త్యజించావచ్చునా? మన ధర్మం, మన మతం, మన ఆచార సంప్రదాయాలు మనకు కన్నతల్లితో నమానమ్తెనవి: ఆ తల్లి నీ ఏ పరిస్దితిలోనూ మనం వదులుకోకూడదు. మల్లిక్!" నచ్చ చెప్పతున్నట్టుగా అంది మీనాక్షి.
"ఎక్కడ వేలుగుంటే, ఎక్కడా జీవితం ఆనందమయం అవుతుందనుకొంటే అక్కడికి పరిగెత్తడం ప్రతి జివి సహజ ప్రవృత్తి, ఆంటి! నునవ్తేనాసరే! అనవసరమ్తేనవి పట్టుకు వ్రేలాడకూడదు! మంచి జరుగుతుందంటే పరాయివాళ్ళద్తేనా స్వికరించాల్సిందే! మంచి మంచివన్ని ఏరు కొని జీవితంలో పోందుపరుచుకోవడం నా హాబీ! ఈ పోందుపరుచు కోవడంలో అర్ధం లేనివి. అనవసరమ్తెనవి నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్ళి పోతాను ముందుకు!" అని లేచాడు మల్లిక్.
వీడ్కోలు తీసుకొని మోటార్ స్తెకిల్ మిద వెళ్ళిపోతున్న ఆ జంటను చూస్తూ, "సంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రతి సంప్రదాయాన్ని జీర్ణించుకొని ఆ పిల్ల జీవితం, ప్రతిక్షన్మ క్రొత్తదనం కావాలను కొనే అతగాడి చేతిలో ఏం మలుపులు తిరుగుతుందో!" అంది వేదనగా.
5
ఒకరోజు,
మల్లిక్ ఫ్రెండు భార్య సుగుణ అనే ఆమె వచ్చింది. త్రిపురను పరిచయం చేసుకోడానికని, పరిచయాలు అయ్యాక కబుర్లలోకి దిగడానికి ఎంతోసేపు పట్టలేదు. ఎలాంటి మూగ మొద్దున్తెనా మాట్లిడించగల నేర్పుంది సుగుణకు. త్రిపుర ఎవరితోటి ఎక్కుగావ మాట్లాడే మనిషి కాకపోయినా సుగుణ ప్రభావంలో పడి బాగానే మాట్లాడింది. తను చూసిన సినిమాల గురించీ, చదివిన నవలల గురించీ.
"ఇంకా మీ ఇద్దరికి శోభనం కాలేదని విన్నాను నిజమేనా?"
త్రిపుర ముఖం సిగ్గుతో ఎర్రబడింది. "మావాళ్ళు పెట్టిన ముహూరథానికి ఆయన రాలేదు. తరువాత మూడమి అని కూడదని చెప్పారు."
"ఇంట్లోనే భార్యను ఉంచుకొని డాక్టరుగారు ఎలా ఊరుకోన్నారబ్బా!"
సుగుణ మాటకు ఒకరోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది త్రిపురకు. ఆరోజు మధ్యాహ్నం అత్తయ్యా ప్రక్కింటికి వెళ్ళింది మామగారు భోజనం చేసి వరండాలో చల్లగాలికి పడుకొన్నారు. దక్షిణం వ్తెపు గదిలో చల్లగాలికి చాపవేసుకు పడుకొంది తను. అతడు ఎప్పుడు వచ్చాడో తనమీద చేయి వేశాడు "ఒక్కదానివి, ఇక్కడేం పడుకోంతావు? నాగాదిలోకి పోదాం పద!"
"మీ గదిలోకా? ఉహు రాను!"
"ఎన్నాళ్ళు రాకుండా ఉంటావు?"
"... ... ... "
"పదంటే! కాస్సేపు సరదాగా మాట్లాడుకొందాం!"
"ఇక్కడ మాట్లాడొచ్చు!"
గడుసుదనం చాలుగానీ పద"
మరి బలవంత పెడుతూంటే వెళ్ళక పోతే ఏమ్తేనా అనుకోంటాడే మోనని వెళ్ళింది.
వెడుతూనే తలుపులు మూసేసి త్రిపురని వాటేసుకొన్నాడు మల్లిక్. అతడి ఊపిరి వెచ్చగా తగులుతూంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది త్రిపుర. అతడి స్పర్శ హాయి గోలపడానికి బదులు భయం గొల్పింది. ఎలాగో అతడి పట్టు విడిపించుకొని బయటపడింది.
ఆ తరువాత మల్లిక్ ముఖం రెండురోజులు వరకూ ధుమధుమ లడుతూనే ఉంది.
"ఆ ఇంట్లో మాణిలాంటి భార్య ఉండగా మసిబోగ్గువెంట పడడం ఇంకా మానుకోనట్టున్నాడు మల్లిక్!" అనాలనే అని మళ్లి బ్నాలిక కరుచు కొంది సుగుణ.
ఇప్పడన్నదానికి అర్ధమేమిటో చెప్పందే విడువను" త్రిపుర పట్టు బట్టింది.
"నేను చెప్పానని ఎక్కడా చెప్పకపోతే చెబుతాను"
"ఎక్కాడా చెప్పను?"
"ఆరునెలల క్రితం అనుకుంటాను నేనూ మావారూ సినిమాకు వెళ్ళాం. అక్కడా మీ ఆయన మరోకావిదతో కలిసి కనిపించారు 'శ్రీమతా ' అనడిగాను మావారిని 'వాడికంటే పది పదిహేనేళ్ళు పెద్దది! శ్రీమతేమిటి దాని మొహం!మల్లోక్ కి నాయుడుగారి అబ్బాయి ఒకతడు స్నేహితుడున్నాడు! తరచూ వాళ్ళింటికి వెళ్ళడంతో వాడి విధవ మెన త్తతో స్నేహం ఏర్పడింది! ఆ సంబంధం వాడికి పెళ్ళయినా పోనట్టుగా ఇప్పుడు ఆ ఇద్దరిని చూస్తే తెలుస్తూంది అన్నారు."
"సుగుణా, మీరు చెప్పేది నిజమా?" త్రిపుర ముఖం పాలి పోయింది.
"నిజమే చెప్పాననుకోంటున్నాను! మరి మీ వారిని అడిగితే ఏమంటారో? నావల్ల తెలిసిందని కాకుండా, ఎవరో చెప్పినట్టుగా అడిగి చూడు! ఏం జవాబు చెబుతాడో!"
* * *
త్రిపుర అడిగింది మల్లిక్ ను.
"మనం దగ్గరయ్యాక నేనే ఈ విషయం దాపరికం లేకుండా చేబుదామనుకోన్నాను నిజమే! ఆవిడతో నా పద్దేనమిదోఏటే సంబంధం ఏర్పడింది. ఆవిడకప్పడు పాతిక సంవత్సరాలు."
"మీ కంటే అంత పెద్ధదానితో."
"నాకంటే ఇంత చిన్నదానితో ఎందరో పెద్దలు ఆమోదించలేదా?"