తల్లి పువ్వులజడ కుడుతూన్నా, అత్తగారు తెల్లపట్టుచిర, బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకొమ్మని చెప్పినా ఆ పిల్ల మొహంలో కాస్తకూడా ఉత్సాహం విరియలేదు!
దిగులుతో దుఃఖంతో నిండిపోయివున్న ఆ పిల్ల ముఖం చూసి, "భయమా? భయమెందుకే? వాడేం క్రోత్తా? కార్యమని భయపడుతున్నావా? ఆడజన్మ ఎత్తాక ఏదో ఒక రోజు తప్పదుకదా? ఇంకా నయం? నీకు పది హే నేళ్ళోచ్చాక పెద్దమనిషివి అయ్యావు నాక్తెతే ఎనిమిదేళ్ళకే పెళ్ళయింది. పదకొండు వెళ్ళి వెళ్ళకముందే పెద్దమనిషి నయ్యాను! ఆలస్యం ఎందుకని కార్యం జరిపించేశారు! మీ మామగారిని చూస్తే, రాత్రి అవుతుందంటే ఎంత భయపడిపోయేదాన్నో తరువాత తరువాత అంతా మామూలు అయిపోయింది. ఒక్కరాత్రి మీ మామగారు ప్రక్కన లేక పోతే నిద్రపట్టని రోజులొచ్చయంటే నమ్ము" అంది యశోదమ్మ ముసి ముసి నవ్వుతో.
* * *
తల్లి, అత్తా కలిసి ఒక విధంగా బలవంతంగానే త్రిపురని గదిలోకి నెట్టి తలుపులు మూసేశారు.
"త్రిపుర గుమ్మం దగ్గరే తలొంచుకు నిలబడింది!
మంచం మిద పడుకొని, పుస్తకమేదో చదువు కొంటున్న మల్లిక్ రెండు నిమిషాలు ఊరుకొని, తరువాత లేచి వచ్చాడు.
"ఇవాళ కూడా భయమేనా?"
"... ..."
"ఈ రాత్రి క్షణాలు ఎంతో అమూల్యమైనవి? దోసిళ్ళకొద్ది ఆనందం జుర్రుకోవాల్సినవి! కర్రలా బిగుసుకుపోయి ఈ క్షణాలను నాశనం చేయకు! పద! " మల్లిక్ ఆమె చెయ్యి పట్టుకొన్నాడు.
త్రిపుర కంపరంతో విదిలించి వేసింది.
"అలకా?"
"కాదు. అసహ్యం. మీరంటే నాకసహ్యం!" త్రిపుర గొంతు కోసంతో వణికింది.
మల్లిక్ ఉత్సాహపు పొంగు మిద చప్పన నీళ్ళు చల్లినట్టుగా అయింది. "ఎందుకు?" అని అడిగాడు దెబ్బతిన్న స్వరంతో.
"పద్దెనిమిదో ఏటనే పర స్త్రీతో సుఖం పంచుకొన్నారు. ఇప్పటికి పంచుకొంటున్నారు. మీకిది మొదటి అనుభవం కాదు! ఒక కన్నేపిల్లను తాకడానికి మీకు సిగ్గేయడం లేదూ?"
"సిగ్గెందుకు? ఎంతమందితో వెళ్ళినా మగవాడికి చెల్లుతుంది."
"చెడిపోయిన ఆడదాన్ని మగవాడు దూరంగా ఎలా ఉంచుతాడో చెడిపోయిన మగవాణ్ని ఆడది అలా ఉంచగలిగితే మగవాడికి చేల్లెరోజులు పోతాయి. ఒక స్త్రీకి ఒకడే మాగాడు! ఒక మగాడికి ఒక్కతే స్త్రి! ఇలాంటి పవిత్రమైన సంబంధాన్ని కోరుకొంటాను నేను! అపవిత్రమ్తెన మీకు పవిత్రమైన నా శరీరాన్ని అర్పించాలేను! మీకు అభిమానం అనేది ఉంటే నన్ను తాకోద్దు!" త్రిపుర కఠినంగా అంది.
"సరే త్రిపురా! నిన్ను తాకను. ని కన్నె చేర వదిలించుకోకుండా ఎన్నాళ్ళుండి పోతావ్ఫు? అది ఎంత నరకమో కొన్నాళ్ళకి నీకు తెలుస్తుంది! అప్పుడు నువ్వు నన్ను కోరితే నీకు అందనంత దూరం వెళ్ళిపోయి ఉంటానేమో!"
"నా మనస్సంత బలహినమ్తెంది కాదు! ఒకసారి వద్దు అనుకొన్న తరువాత మళ్ళి మిమ్మల్ని కోరుతానని అనుకోవద్దు!"
"బహుశ! నీలాగా పరిశుద్ధంగా ఉండే బ్రహ్మచారిని వెదుక్కొంటావు కాబోలు!"
అతడి వెటకారం పూర్తి అయ్యికాక ముందే చెంప చెళ్ళుమంది. "ఎమిటనుకొన్నారు నన్ను?" త్రిపుర కళ్ళు నిప్పులు కురిశాయి.
"సరే , త్రిపురా! త్వరల్ప్నే విడాకులు ఏర్పాటు చేస్తాను!" మల్లిక్ గదిలోంచి చర్రున వెళ్ళిపోయాడు.
త్త్రిపురని గదిలోకి త్రోసి తలుపులు మూసిన తల్లి, అత్త గుండెల మిది బరువు దింపుకొన్న ఆనందం పదినిమిషాలు కూడా నిలువలేదు. మల్లిక్ గదిలోంచి దూసుకు వచ్చి బయటకి వెళ్ళిపోతుంటే నివ్వెరపోయిచూశారు. అతడు వెళ్ళిపోయాక గదిలోకి గభాలున వచ్చి చూశారు. త్రిపుర కొయ్య బొమ్మలా అలా నిలబడే ఉందింకా!
"ఏమన్నావే అతడిని? ఏం చేశావే?" ఇద్దరూ ఒకేసారి విరుచుకు పడ్డారు కోపంతో.
బిగుసుకుపోయి నిలబడిన త్రిపుర నుండి ఎంత ప్రయత్నించివా జవాబు పొందలేక పోయారు!
మరునాడు ఉదయం పదిగంటలకు ఇంటికి తిరిగి వచ్చిన మల్లిక్, త్రిపురని తిసి కెళ్ళండి, మామయ్యా! ఆమెను ఇక్కడ ఉంచడం అనవసరం!" అని చెప్పాడు.
ఆయన ముఖం వివర్ణమ్తెంది. "ఎందుకు? ఏం జరిగింది?" అనడిగాడు.
"నాకు మరొక స్త్రీతో సంబంధం ఉన్న మాట నిజమే! ఆ కారణంగా పరిశుద్దురాల్తెన మీ అమ్మాయిని నేను తాకడానికి అనర్హుడినట! ప్రపంచంలో ఏ మగాడూ తన భార్యతో ఈ మాట పడి ఉండడను కొంటాను!" మల్లిక్ శుష్కంగా నవ్వాడు.
"నాయనా, నువ్వు తొందరపడి నిర్ణయలేం తీసుకోవద్దు! త్రిపురకు నేను నచ్చ చెప్పతాను! కొంతమంది ఆడపిల్లలు భయం కొద్ది ఇలా ప్రవర్తించడం కద్దు!" తలుపు చాటున నిలబడి అల్లుడి మాటలు వింటున్న లలితమ్మ ఆత్రంగా బయటికి వచ్చి అంది.
"చిన్నపిల్ల అయితే భయపడింది అనుకోవచ్చు! పదహారేళ్ళ వయస్సంటే చిన్న వయస్సెం కాదే! తనకి అన్ని తెలుసు! తన దృష్టిలో నేనో గడ్డిపరకను!"
"వయసొస్తే మనసు పెరగోద్దా? నేను నచ్చాజేప్పతాగా?"
"కలవదండి ఇక మా ఇద్దరికి! మా ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు అభిరుచులు సమాంతర రేఖలు! నాకు అధునాతనం అంటే ఇష్టం! తనకు పురాతనం అంటే ఇష్టం! పరిగెత్తే నా ఆలోచనలకు, ఆ ముదివగ్గు ఆలోచనలకు అస్సలు కలవదు! తను నాకనుగుణంగా నడుచుకొనేట్టయితే ఇక్కడ ఉందమానండి లేకుంటే అక్కరలేదు! క్షణ క్షణం ఆవిడతో నరకం పడేకంటే విడిపోయి బ్రతికిపోతాను! నాకు తగినదాన్ని నేను చూచుకోంటాను!"
"ఒక్కమాట అడుగుతాను! ఏమి అనుకోకు మల్లిక్! త్రాగుతావట. తినకూడనివి తింటావట! ఆ పిల్ల ఎలా ఒర్చుకోంటుందో చెప్పు!" పరమేశం అడిగాడు.
"త్రాగడం ఇవాళ ఫ్యాషన్! అది స్టేటస్ ను సూచిస్తుంది! త్రాగాక గుండెలు కాలిపోతాయి కాబట్టి కాస్త బలమ్తెన తిండిపడాలి! అదంతా నా పర్సనల్ ల్తేఫ్ ! దాంతో మీ అమ్మాయి కేమి సంబంధం లేదు! మీ అమ్మాయికి చీరెలు పారెలు లేకపోతే, తిండి పెట్టకపోతే, భర్తగా నా బాధ్యతలు విస్మరిస్తే అప్పడడగండి ! అంతేగాని, నువ్వు త్రాగుతావటకదా? తింటావట కదా? అని మిరడగాల్సిన అవసరం లేదు!" మల్లిక్ నిష్కర్షగా జవాబు చెప్పాడు.
ఆ రాత్రి గదిలోకి పంపడానికి త్రిపురకు ఎంతో నచ్చజెప్పారు తల్లి. అత్తా ఏకధాటిగా. "నువోక్కదానివే ప్రత్యేకం కాదుకదా? మేమంతా మగాళ్ళకి అణగి మణిగిలేమా? నువ్వు తేలివ్తెన దానివ్తెతే అతడిని చేతిలో పెట్టుకొనే ఉపాయం చూడాలి! అంతేగాని, మగణ్ణే వల్లనంటే ఇలాగే? అతడిని కాదంటే నీకు బ్రతికే ఆధారం ఏమిటి చెప్పు!"
"ఏమిటి అతడికి అణగిమణగి ఉండడం? నేనేం తప్పచేశానని?"
"మగణ్ని కాదంటే వేరేదారేది?"
"నాన్నగారు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నారు కదమ్మా?"
" ఆ ఆశలేం పెట్టుకోవద్దు. కాపురం కాదని వస్తే నా ఇంట్లో ఆడుగుకూడా పెట్టనివ్వను! ఒక్కతే ఆడపిల్లవని గారాబం చేసినందుకు మాంచి కీర్తే తెస్తున్నావు!"
ఆ రాత్రి బెదిరించి, అదిరించి గదిలోకి వచ్చాడు మల్లిక్! మల్లె పువ్వులా వున్న ప్రక్కమీద ముడుచుకు పడుకొంది త్రిపుర.
ఆమెమీద చెయ్యేసి షాక్ కొట్టినట్టుగా వెనక్కి తీసుకొన్నాడు అతడు.