ఆ ఖాళీలో నుంచి నల్లగా నిగనిగలాడుతున్న డే అండ్ నైట్ విజువల్ బైనాక్యులర్స్ బయటకు తొంగి చూశాయి.
పడకగదిలో గీతాదేవి - సునీల్ ఒకరినొకరు పెనవేసుకుపోతున్న దృశ్యం బైనాక్యులర్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నది.
ఎంతో సేపు ఆ కారు అక్కడ ఆగలేదు.
బైనాక్యులర్స్ లోపలకు తీసుకోవడం.....గ్లాస్ పైకి లేపడం .... కారు ముందుకు కదలడం వెంట వెంటనే జరిగిపోయాయి.
ఆ కారులో ఇరువురు వ్యక్తులు వున్నారు.
* * *
ఆర్.పి.ఎఫ్ . కానిస్టేబుల్ సుందరం.....కి.ఆర్.పి. కానిస్టేబుల్ సుందరం మరికొందరు మిత్రులతో వన్ టౌన్ లోని పాత శివాలయం దాటి ముందుకు వచ్చారు.
సరిగ్గా అప్పుడే సింహాచలం భార్య స్వప్న పట్టుచీర కట్టుకుని భుజం నిండా పమిట చెంగును కప్పుకుని చేతిలో పూల సజ్జతో వాళ్ళకు ఎదురయింది.
ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ సింహాచలం అదృష్టానికి లోలోపలే మురిసిపోయారు.
కొందరయితే బహిరంగంగానే మెచ్చుకున్నారు.
"ఏమోయ్ సింహాచలం , మీ శ్రీమతి కి దైవభక్తి చాలా ఎక్కువే" అన్నాడు ఒకడు.
"భలే వడివే ఈ ప్రశ్న నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే మా ఆవిడను అడిగి వున్నట్టయితే అసలు జన్మలో ఇలా ఇలాంటి ప్రశ్న వేసే అవకాశం రాకుండా పురాణ కధలు అన్నింటినీ నీకు వినిపించి వుండేది?" అన్నాడు సింహాచలం నవ్వుతూ.
భర్తనూ, అతని స్నేహితులనూ చూసిన స్వప్న తల వంచుకుని వాళ్ళను దాటి శివాలయం వైపు వెళ్ళిపోయింది.
'ఓహో! నీ భార్య అంతటి పతివ్రత అన్నమాట" అన్నాడు సుందరం అక్కసు పట్టలేక.
"నా భార్య పాతివ్రత్యం ఎలాంటిదో నువ్వు ఎప్పుడూ చూసి వుండవులే...." అని పెద్దగా నవ్వాడు సింహాచలం.
అతని వైపు అదోలా చూశాడు సుందరం.
అది ఏమీ గ్రహించలేని సింహాచలం తన ధోరణిలో తను చెప్పుకుపో సాగాడు.
"నైట్ డ్యూటీ వున్నప్పుడు మినహాయించి నేను వచ్చేవరకూ భోజనం కూడా చేయదు. నాకు పెట్టిన తరువాతనే తను తింటుంది. నాకోసం ఎందుకు ఎదురు చూడడం , ఆలస్యం అవుతుంది కదా? ముందే నువ్వు తినవచ్చు కదా అంటే భర్తకు పెట్టకుండా భార్య ముందుగా భోజనం చేయడాన్ని హైందవ ధర్మం ఒప్పుకోదు. ఎంత ఆలస్యం అయినా పరవాలేదు. ముందు నా పతిదేవుడు భుజించాకే నేను ఎంగిలి పడతాను అంటుంది."
'అవునురా? మొగుడిచేతే వంట చేయించే వాళ్ళుయీ రోజుల్లో అలాంటి ఆదర్శ భార్య దొరకడం నీ అదృష్టం కాక మరేమిటి?" అంటూ మెచ్చుకున్నాడు మరొకడు.
సుందరం ఎలాంటి కామెంట్ చేయకుండా మౌనం వహించాడు.
"ఎంత పరిచయం వున్న బంధువులు అయినా సరే బజారులో కనిపిస్తే అసలు పలకరించదు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప మగవాళ్ళతో మాట్లాడదు. అందుకే ఆమె ప్రవర్తన చూసి అయిన వాళ్ళే నెత్తీ నోరు లబలబ బాడుకుంటారు."
"అదృష్టవంతుడివి సింహాచలం! సుగుణాల రాశి వంటి భార్య నీకు లభించడం నువ్వు చేసుకున్న పుణ్యమే..... ఇంటి దగ్గర వంచిన తల తిరిగి ఇంటికి వెళ్ళాకే తల ఎత్తే నీ భార్య లాంటి ఆదర్శ గృహిణులు ఇంటింటా వుంటే ఎంత బాగుంటుందో కదా?" అంటూ మరొకడు ఆమెను ఆకాశానికి ఎత్తివేశాడు.
ఓరి ....! నీ బుద్ది మండిపోనూ....అలాంటి కోరిక కోరావెంటిరా వెధవా.....అదే నిజంగా జరిగితే ఎందరి కొంపలో నిలువునా కూలిపోతాయి .....అని మనసులో బాధపడిపోయాడు సుందరం.
ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏదో ఒకటి స్వప్న పాతివ్రత్యాన్ని గూర్చి మాట్టాడు కుంటూనే అడుగులు వేస్తున్నారు.
సుందరం ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోయాడు.
"మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను, చిన్న పని వున్నది" అన్నాడతను.
సుందరాన్ని వదిలి సింహాచలం అతని మిత్రులు ముందుకు సాగిపోయారు.
అతను వెనుదిరిగి శివాలయం వైపు వడివడిగా నడిచాడు.
బయట వున్నా మండపం దగ్గరే అతనికి ఎదురయింది స్వప్న.
"స్వప్నా.....! ఒక మాట."
తల వంచుకుని అడుగులు వేస్తున్న ఆమె ఉలిక్కిపడుతూ ఆగిపోయింది.
"ఏమండోయ్ పతివ్రతగారూ! దేవుడిని యేమని కోరుకున్నారో నేను తెలుసుకోవచ్చా?"
అతని గొంతులో వినిపిస్తున్న హేళన ను గమనించినా ఆమె పెదవి విప్పి పలకలేదు. సరికదా తనని కాదన్నట్టు ముందుకు నడిచింది.
వేగంగా నడిచి స్వప్నకు అడ్డుగా నిలుచున్నాడు సుందరం.
"ఏమిటిది?"
"కోపగించుకోవద్దు స్వప్నా! నీ భర్తకు నీపై కొండంత నమ్మకం వుంది కదూ? పాపం నేవ్వెం చేసినా చెప్పినా నీమాటే వేదం అని నమ్ముతున్నాడు. అంత గొప్పగా నటించగలవన్న మాట."
"నటించడమేమిటి?"
"ఏమిటో నీకు తెలుసు....కళ్ళారా చూసిన నాకు తెలుసు."
స్వప్న గతుక్కుమన్నా వెంటనే తేరుకుంది.
"చూడడమేమిటి.....? అయినా మా వారి స్నేహితుడివని, ఇంటికి వచ్చి మాట్లాడేంత చనువు ఆయనతో నీకు ఉందని ఇంతవరకు మర్యాద ఇచ్చి వూరుకుంటుంటే పిచ్చిపిచ్చిగా వాగుతున్నావే."
"కోపంలో కూడా నువ్వు అందంగానే వుంటావు ప్వప్న."
"షటప్.....! కట్టుకున్న మొగుడిలా అంత ధీమాగా మాట్లాడుతున్నావు? నా అందం ఎలా వుంటే మాత్రం నీకు ఎందుకు?"
"కావాలి డార్లింగ్.....ఎందుకంటే మగవాళ్ళు నువ్వంటే వెంపర్లాడి చచ్చిపోవడానికి నీ అందమే కారణం కదూ... నీతో పడక సుఖాన్ని పంచుకోబోయేవాడిని నీ అందాన్ని గురించి కామెంట్ చెయ్యడం తప్పు ఎలా అవుతుంది. నీతో ఆనందం పంచుకున్నవాళ్ళు అందరినీ నువ్వు మొగుళ్ళుగా భావిస్తే నన్ను కూడా ఆ లిస్టులో వేసుకో.."
"సంసార స్త్రీని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా పాపాత్ముడా....." కోపంతో అన్నది స్వప్న.
"నువ్వు చేసేది సంసారమో, వ్యభిచారమో నాకు తేలియదా....? నీ పడక గదిలో నీ రోమాన్స్ కళ్ళారా చుసిన వాడిని అని చెప్పినా నాకేం తెలియదు నేను పతివ్రతా శిరోమణిని అనిఫోజులు ఎందుకు....ఇన్ని మాటలు నీకు అనవసరం. వాడు పిచ్చివాడు, అమాయకుడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి.
వాడి కళ్ళు గప్పి నువ్వు చేసే రంకులు నాకు తెలియవు అనుకోకు. నీ జాణతనం కట్టిపెట్టి మర్యాదగా నా కోరిక తీర్చు. ఇంతకాలం స్నేహితుని భార్య అని అలాంటి దృష్టితో నిన్ను చూడలేదు ! కానీ మహా జనానికి మరదలు పిల్లవి అయిన నీలో రోమాన్స్ తప్పు కాదు అందుకే నువ్వు నాకు కావాలి. కాదు కూడదు అని బుకాయించి ప్రయోజనం లేదు. లేదంటే నీ రంకుతనం నీ మొగుడికి చెప్పేస్తాను."
తనను గురించి అతనికి ఖచ్చితంగా తెలుసు కాబట్టే అంత ధీమాగా మాట్లాడగలుగుతున్నాడని స్వప్నకు అర్ధం అయింది.
తను ఏమాత్రం మొండికేసినా తనకే ప్రమాదం....
ఇంతవరకూ తను ఏది చెబితే అది నిజమని నమ్మే భర్తకు అనుమానం కలగకుండా వుండాలంటే సుందరం మాట వినక తప్పదు అనుకున్నది.
"సరే....! సాయంత్రం ఫస్ట్ షో టైం కు శైలజ దియేటర్ దగ్గరకు రా. ....అప్పుడు మాట్లాడుకుందాం" అన్నాడు స్వప్న.
ఆమె అంత త్వరగా ఒప్పుకుంటుందని ఊహించని సుందరం ఉబ్బి తబ్బిబ్బ అయిపోయాడు.
'అలాగే డార్లింగ్! సరిగ్గా ఆరు గంటలకు అక్కడ వుంటాను."
ఆనందంతో రంగురంగుల కళలు కంటూ వెళ్ళిపోయాడు సుందరం.
అతనిని గురించి ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నది స్వప్న.
* * *
"మేడమ్ .....ఎవరో అమ్మాయి కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చింది స్వయంగా మీకే ఇస్తానని పట్టు పడుతుంది" స్టేషన్ రైటర్ వచ్చి చెప్పడంతో నొసలు ఎగురవేసి క్షణం అలోచించి పంపమన్నట్లు సంజ్ఞ చేసింది ఇన్ స్పెక్టర్ ధీరజ.
బెరుగ్గా బెరుగ్గా ఇరవై ఐదేళ్ళ యువతి లోపలికి వచ్చింది.
వచ్చీ రావడంతోనే నమస్కారం పెట్టింది. సంస్కారం ఉట్టి పడుతున్న ముఖం. చక్కగా పొందికగా కట్టిన చీరకట్టు....ఆదర్శ గృహిణిలా అలంకరణ చూడగానే ఆమె పట్ల ధీరజకు సదభిప్రాయమే కలిగింది.
బహుశా అందుకేనేమో వెంటనే కూర్చోమని సీట్ ఆఫర్ చేసింది.
"ఫరవాలేదు మేడమ్ .....నిలబడే వుంటాను."
"కూర్చోమంటున్నానుగా ముందు కూర్చోండి."
ఆమె తడబడుతూనే కుర్చుని ఏదో చెప్పడాని కన్నట్టు ప్రయత్నం ,
కానీ, మాటలు పెగలి రావడం లేదు.
ధీరజ అది గమనించింది.
తనకోసం తెచ్చి వుంచిన మంచినీళ్ళ గ్లాసును ఆమె ముందుకు జరిపి త్రాగామన్నట్లు సైగ చేసింది ధీరజ. ఆ యువతి ఎమనుకున్నదో యేమో గ్లాసు అందుకుని గటగట తాగేసి, ఖాళీ గ్లాసు టేబుల్ పై వుంచింది.