పెళ్ళి అయిన ఆడది ఒక మొగ స్నేహితుడితో కలిసి అన్ని సినిమాలు చూసిందంటేనే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం వుందో రమణీ ఊహించింది. పైకి సంస్కారంగా కనిపించినంత మాత్రాన చాటుమాటుగా శృంగారం సాగించకూడదు అని రూలేం లేదుగా. అయినా అది ఆమె స్వవిషయం కాబట్టి తనకు ఎందుకులే అని పట్టించుకోలేదు.
"సారీ రమణిగారూ....! మీకు బోర్ కొట్టించినట్టున్నాను. ఒకే సీయూ ....లలితా...."
వెళ్ళడానికి అన్నట్టు లేచి నిలబడ్డాడు సునిల్.
"అప్పుడప్పుడూ వస్తుండు....." అన్నది లలిత.
"రమ్మని పిలిచిన తరువాత రాకుండా వుండగలనా?" చిలిపిగా నవ్వుతూ అన్నాడతను.
"చిలిపి జోకులు ఆపుతావా లేదా?"
"ఆపడం ఏం ఖర్మ----నేనే వెళ్ళిపోతుంటేనూ---"
చేతిలోని గాగుల్స్ ను గుండ్రంగా తిప్పుకుంటూ బయటకు వెళ్ళిన సునిల్ , తన బైక్ ను స్టార్ట్ చేసి కిస్ చేస్తూ వాళ్ళిద్దరి కేసి కన్నుగీటి .....హోండాను ముందుకు దూకించాడు.
ఊహించని అతని చర్యకు రమణి ఉలిక్కిపడింది.
రమణికి అది కొత్త కాబట్టి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బ అయిపొయింది.
అది గమనించిన లలిత దీర్ఘాలోచనలో పడింది.
* * *
విశాఖ బీచ్....
పరిసరాలలో వున్న ఖరీదయిన బార్.
ముగ్గురు వ్యక్తులు ఓ మూలగా వెలుతురు తక్కువగా వున్న టేబుల్ దగ్గర కూర్చుని మందు కొడుతున్నారు.
తంతే వెళ్ళి బూరెల బుట్టలో పడ్డట్టు నీ జాతకమే జతకంరా....నీకు మీ అమ్మా నాన్న సునీల్ అనే పేరు పొరపాటుగా పెట్టారు కానీ మన్మధరావు అనే పేరు సరిపోయేదీరా.....అన్నాడు ముగ్గురిలో ఒకడు.
అప్పటికే రెండు పెగ్గులు విస్కీ పూర్తీ కావడంతో మూడవ పెగ్ కు ఆర్డర్ ఇచ్చారు.
వాళ్ళముందు వున్న ప్లేట్లలోని ఐటమ్స్ ను రుచిచుస్తూ.....విస్కీ గుటకలు వేస్తూ ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడు కుంటున్నారు ఆ ముగ్గురు మిత్రులు.
"చాల్లేరా వూరుకో....." అన్నాడు సునీల్.
"అలాగే కానీ.....! అసలు అమ్మాయిలు నీ వలలో ఎలా పడతారు రా.... చూసిన వెంటనే చిటికెలో ఆ ఆడదాని పడకగదిలో దూరిపోతావు. నీ దగ్గర ఏదయినా వశీకరణ విద్య లాంటిది ఉన్నదా?" తన అనుమానాన్ని వెలిబుచ్చాడు సునీల్ మిత్రుడు రాజేష్.
'అవును సునీల్ ....ఆడపిల్లలను లొంగదీసుకునే కళ అందరికీ అలవడదు. ఎలా నేర్చుకున్నావో.... ఎక్కడ నేర్చుకున్నావో కానీ చాలామంది అమ్మాయిలు నీతో పడక సుఖం పంచుకున్నారో కదా. నీ చేతిలో ఉన్న కామ కళకు దాసోహం అని లొంగిపోయే ఆడపిల్లల సంఖ్యను లెక్కపెట్టడం మావల్ల అవుతుందా ఏమిటి?" అన్నాడు రెండవ మిత్రుడు ఆనంద్.
"పొగడ్తలు అపరా....నేను మధన కామరాజును కాదు....."
'అవును ....పొరపాటే ...ప్లే బాయ్ అంటే బాగుంటుంది కదూ...."
"ఒరే మాటలను కట్టిపెట్టి ముందు మందు కొట్టండిరా..." మిత్రులిద్దరినీ విసుక్కున్నాడు సునీల్.
రెండు చేతులా ఆర్జిస్తున్నప్పటికీ స్నేహాన్ని మరచిపోకుండా మాతో కలిసి ఇలా పార్టీలలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా వుంది సునీల్...." అన్నాడు రాజేష్.
"డబ్బుది ఏముంది ....ఇవ్వాళ వస్తుంది ..రేపు పోతుంది. అయినా చిరకాల స్నేహితులకు ఖర్చు పెట్టడంలో తప్పు లేదనుకుంటాను. అందులోనూ చాలా కలం తరువాత కలుసుకున్నాం మనం. ఒకప్పుడు మనం ఈ సిటీలో అల్లరి చిల్లరిగా తిరిగిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంటే ఆ అనందం తిరిగి రాదనిపిస్తుంది...." అన్నాడు సునీల్.
తరువాత వాళ్ళ మధ్య మాటలు కరువయ్యాయి.
పెగ్గు మీద పెగ్గు ఖాళీ చేయడంలో మునిగిపోయారు.
"సునీల్.....స్నేహాన్ని మరచిపోకుండా మాకు మందు పార్టీ ఇస్తున్నావు. చూస్తుంటే డబ్బు రెండు చేతులా సంపాదిస్తున్నట్టున్నావు. అలానే చాలా కాలం నుండి నిన్ను ఒక కోరిక కోరాలనుకుంటున్నాం...."అంటూ సంశాయంగా ఆగిపోయాడు ఆనంద్.
"అవునురా , వాడు చెప్పింది నిజమే.....చాలాసార్లు నోటి వరకూ వచ్చి కూడా అడగలేక పోయాం. మాకు ఒక కోరిక మిగిలిపోయిందిరా. అది నీ వల్లనే తీరుతుంది. అంటూ అందుకున్నాడు రాజేష్.
"ఏమిటో ముందు చెప్పండి."
"ఏమీ లేదురా.....నువ్వు ప్లే బోయ్ గా ఎందరి పడుచులతోనో పడక సుఖాన్ని పొందుతూ ఉంటావు కదా....అలానే మాకు కూడా వాళ్ళతో ఎవరో ఒకరిని పరిచయం చేసి ఆ సుఖాన్ని మాకు కూడా రుచి చూపిస్తావేమో నని నసుగుతూ అన్నాడు ఆనంద్.
సునీల్ కళ్ళలో ఎర్ర జీర ఏర్పడింది.
ముఖంలో రంగులు మారాయి.
వస్తున్నా కోపాన్ని అదిమి పట్టాడు.
వీళ్ళు తనను బ్రోకర్ అనుకుంటున్నారా?
తనను తను కంట్రోల్ చేసుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది.
"సారీ.....ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు"
"ఎందుకని...."
"సహజంగా అబ్బాయిలే అమ్మాయిల కోసం వెంపర్లాడడం అందరికీ తెలిసిందే. మగవాళ్ళకు వున్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ఎందరో పడుపువృత్తిని పొట్ట కూటి కోసం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే..... కానీ కాలమాన పరిస్థితులు మారిపోయినట్టు కొందరు ఆడవాళ్ళు ఆలోచనలు కూడా కొత్త పుంతలను తొక్కాయి.
'అలాంటి వాళ్ళ కోసమే స్టేట్స్ లో ప్లే బోయ్ లు ఎదురు చూస్తుంటారు. పెళ్ళయిన వాళ్ళు తమ సంసారంలో సెక్స్ వల్ల ఏదయినా అసంతృప్తి ఏర్పడినా....అలానే తీరని సెక్స్ కోరికలను తీర్చుకోవడానికి ప్లే బోయ్ లను ఆహ్వానించి తృప్తి పడడం మాములే.....ఆ సంస్కృతీ మన నగరాలకూ వ్యాపించింది.
"ఇలాంటివి రహస్యంగా జరగకపోతే కొంపలు అంటుకుంటాయి. తమ సంసారాలు కూలిపోతాయి. పతియే ప్రత్యక్ష దైవం అనీ....మరొక పురుషునితో సంబంధం వున్న ఆడదానిని చాలా చులకనంగా చూస్తారనే భయం వలననే కానీ.....అలాంటి వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేరు.
"సమాజంలో పేరువున్న వ్యక్తుల భార్యలు....భర్తల సంసార సుఖం లేని స్త్రీలు నాకోసం ఫోన్ చేసి వాళ్ళకు అనుకూలంగా వుండే సమయంలో రప్పించుకుంటుంటారు. అలాంటి వాళ్ళను మీకు పరిచయం చేస్తే వాళ్ళ సంసారాలు కూలిపోవూ....అయినా వాళ్ళు నేనేమ్తేనే మోజు పడ్డారు"
'అంటే నువ్వు మా అందరి కన్నా హేండ్ సమ్ అని దెప్పి పోడుస్తున్నావా?"
"సరేలేరా.....ఏదో మాటవరసకు అన్నాను. ఈ మాత్రానికే ఉడుక్కోవాలా?"
'అల్ రైట్......ఇప్పుడు ఆ విషయం ఎందుకు కాని నీ జీవితాన్ని తలుచుకుంటుంటేనే మాకు చాలా బాధగా వుంది....'ఆనంద్ గొంతులో విచారం తొంగి చూసింది.
'అవునురా....అసలు మన బాచ్ లో ఎలాంటి మచ్చా లేని ఏ దురలవాటుకి బానిస కాని ఏకైక వ్యక్తివి నువ్వు.....చదువు తప్ప మరొక లోకం తెలియని నువ్వు వున్న ఈ స్థితి చూస్తుంటే డబ్బు దండిగా సంపాదిస్తూ గొప్ప బిజినెస్ మగ్నయిట్ వయ్యావని ఆనందించాలో .....నీ జీవితం గాడి తప్పి]నందుకు విచారించాలో అర్ధం కావడం లేదు" బాధగా అన్నాడు రాజేష్.
"ఇప్పుడు జరిగిపోయిన ఆరోజులను గుర్తుకు తెచ్చి బాధ పెట్టకండిరా ఆరోజు మరచిపోవదానికే ఈ తాగుడు...."
బేరర్ బిల్లు తేవడంతో సునీల్ బిల్ పే చేశాడు.
ముగ్గురూ మిత్రులు బయటకు నడిచారు.
"ఒసే ఫ్రెండ్స్......తరువాత కలుద్దాం......ఇప్పుడు నాకు అపాయింట్ మెంట్ వుంది."
'అంటే గాళ్ ప్రెండ్ తోనేగా....అన్నాడు రాజేష్ కసి కొద్ది...."
"ఎస్...." అంటూ మారుతీ కారు స్టార్టు చేసుకుని వెళ్ళిపోయాడు సునీల్.
కనుమరుగు అవుతున్న సునీల్ కారు వేపు అసూయతో చూస్తుండిపోయాడు రాజేష్.
* * *
సునీల్ కారు ఆగిన ఆ బంగాళా ఒక ప్రముఖ వ్యాపారవేత్తది.
కారు ఆగిన చప్పుడుకు పై అంతస్థులోని కిటికీ తేర పక్కకి తొలగించి చూసింది ఆ ఇంటి ఇల్లాలు గీతాదేవి.
మరుక్షణం ఆమె కళ్ళు మిలమిలా మెరిసాయి....
అతనికోసమే ఎదురు చూస్తున్నది ఆమె.
సునీల్ చిరునవ్వుతో లోనికి నడిచాడు.
సరిగ్గా ఆ బంగ్లాకు వందగజాల దూరంలో ఆగింది మరొక కారు.
బ్రౌన్ కలర్ గ్లాసులు పూర్తిగా కవర్ చేసి వుండడం వలన లోపల ఎవరు ఉన్నదీ తెలిసే అవకాశం లేకపోయింది.
డ్రయివర్ వైపు గ్లాస్ కొద్దిగా కిందకు దిగింది.