Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 10

 

    నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ముందు తేల్చుకో, ఈలోపు నాపని పూర్తీ అవుతుంది." అని ఆమె ముఖం వైపు కూడా చూడకుండా తన పనిలో తను నిమగ్నమై పోయింది ధీరజ.
    గడియారంలోని ముళ్ళు అతి భారంగా కదులుతున్నాయి.
    ఆ యువతి గడియారం వేపే చూస్తూ కూర్చున్నది.
    "ఇకనైనా నువ్వు వచ్చినపని చెబుతావా?" ఉన్నట్టుండి ధీరజ ప్రశ్నించడంతో ఆమె ఉలిక్కిపడింది.
    తనలో ఉన్న తడబాటు, ఖంగారును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఆ యువతి.
    "ఫరవాలేదు. ధైర్యంగా అసలు విషయం చెప్పు."
    "మేడమ్..... మావారు నన్ను సరిగా చూడడం లేదు" యిప్పుడు కొండంత ధైర్యం తెచ్చుకుని అన్నది.
    ఆమె మాటలకు ధీరజ బిత్తరపోయింది.
    "అయితే , దానికి నేనేం చేసేది."
    "మీరే చేయగలరు.....మీ గురించి తెలుసుకునే వచ్చాను. మీరు మాత్రమే నాకు న్యాయం చేయగలరని నమ్మకం . ఈ కంప్లయింట్ చదవండి అసలు నా బాధ ఏమిటో మీకే అర్ధం అవుతుంది." అంటూ నాలుగు పేజీల కంప్లయింట్ ను అందించిందామె.
    ఆమె దీనగాధను చదవాలని అనిపించకపోయినా ఆమెను నిరుత్సాహ పరచడం ఇష్టం లేక మౌనంగా తీసుకుని పేజీలు  తిరగావేసింది.
    ఆమె పేరు సుశీల!
    కళ్ళకు కట్టినట్టుగా ఆమె తన మనస్సులోని ఆవేదనంతా ఆ కంప్లయింట్ లో కుదించింది.
    "చూడమ్మా సుశీలా....అది నా పరిధిలోనిది కాదు. నేను రైల్వే ఇన్ స్పెక్టరుని. నువ్వెళ్ళి టౌన్ లో రిపోర్టు చేస్తే వెంటనే ఏదో ఒక చర్యలు తీసుకుంటారు."
    "లేదు మేడమ్ . నా భర్త పెద్ద కాంట్రాక్టరు..... ఇక్కడ రైల్వే స్టేషన్ లో పని చేస్తున్నారు. అందుకే మీవద్దకు వచ్చాను. మీరు కలుగజేసుకుంటే...."
    "ఐసీ....అయితే మీ భర్తను పిలిపించి వార్నింగ్ ఇవ్వమంటావా? లేక కేసు పెట్టి కస్టడిలోకి తీసుకోమంటావా?" అన్నది సౌమ్యంగా.
    "వద్దు! అలా చేస్తే నా కాపురం కూలిపోతుంది. " ఖంగారుగా అన్నది సుశీల.
    "మరి, అలాంటప్పుడు నాదగ్గరకు రావడం ఎందుకు?" చిరాగ్గా వున్నది ధీరజకు.
    "మేడమ్ ....మీరు మానవత్వం వున్న పోలీస్ అధికారిగా చాలా మంది అనుకోగా మీ వద్దకు వచ్చానే తప్ప కంప్లయింట్ చేసి భర్తను వేధించిన భార్యగా నలుగురి చేత ముద్ర వేయించుకోవడానికి కాదు" ఆయాసంతో ఒక క్షణం ఆగిందామె.
    'చూడూ సుశీలా! అసలు నువ్వు ఎందుకు వచ్చావో తరువాత చెబుదువు గానీ, ముందు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలవా?"
    చేబుతానన్నట్లు తల వూపింది సుశీల.
    "మీకు పెళ్ళయి ఎంత కాలం అయింది?"
    "నాలుగేళ్ళు అవుతుంది."
    "ఇరవై ఒకటవ సంవత్సరంలో అయిందన్న మాట"
    "అవును"
    "అంటే చిన్న వయసులోనే వివాహబంధం ఎలా వుంటుందో చవి చూశారు. అంతే కదూ?"
    సుశీల తల వూపింది.
    "మీకు పిల్లలు ఎంతమంది?"
    "లేరు" నిర్లిప్తంగా జవాబిచ్చింది.
    "అదేమిటి?' ధీరజ ఆశ్చర్యపోయింది.
    "తోలికాన్పులో పుట్టవలసిన ఆడపిల్ల గర్బంలోనే చనిపోయింది. అప్పుడే గర్భ సంచి కూడా తొలగించారు. ఇక నాకు పిల్లలు కలిగే యోగం లేదు" ఒకింత బాధ ధ్వనించిందామె గొంతులో.
    "అది సరే , నువ్వు చాలా అందంగా ఉంటావు కదా! నీ అందాన్ని మీవారేప్పుడూ మేచ్చుకోరా?" టాపిక్ మారుస్తూ అడిగింది ధీరజ.
    "అవును మేడమ్ -----ఆ అందమే నా కొంప ముంచింది. పెళ్లి చూపులప్పుడు నన్ను చూసిన వెంటనే టక్కున ఒప్పేసుకుంటే నా అదృష్టానికి మురిసిపోయాను. కానీ శోభనం రోజు తెలిసింది. అయన నిజ స్వరూపం. అని ఒక క్షణం ఆగింది సుశీల.
    "ఫరవాలేదు చెప్పు. ఇక్కడ ఎవ్వరూ లేరు? ఎవ్వరూ రారు కూడా."
    "చెప్పడం కాదు మేడమ్ మీకు కొన్ని చూపించాలి"
    ఈసారి ఆశ్చర్యపోవడం ధీరజ వంతయింది.
    "మీరు ఏమనుకోకుండా వుంటే తలుపులు వేస్తాను మేడమ్ ! నేను కంప్లయింట్ లో వ్రాసిన నిజాలు మీకంటితో చూడవచ్చు.'
    ధీరజ ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే ఆమె తలుపులు వేసింది.
    "పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావించి ఎన్నో ఆశలతో , కొత్త వూహలతో భర్తతో ఏడడుగులు నడిచి శోభనం గదిలోకి సిగ్గుతో నడిచాను. కానీ ఆ రాత్రి జరిగినదాన్ని శోభనం అంటారని నేను అనుకోను. కానీ న మెడలో తాళికట్టి నన్ను భార్యగా పొందిన నా భర్త మాత్రం అది శోభనమే నన్నాడు. శోభనం అలానే వుంటుందనీ, తనకు అలా అయితేనే బాగుంటుందాని చెప్పాడు. అప్పటినుంచీ అతను కోరుకున్న రీతిలోనే సుఖాన్ని అందిస్తున్నాను.
    'అంటే, నీమాటలు నాకు అర్ధం కావడం లేదు."
    "మాటలు చెబితే అర్ధం కావు మేడమ్. నేను చూపిస్తానన్నది అందుకే" అంటూ చొరవగా బ్లౌజ్ బటన్స్ విప్పదీసింది సుశీల.
    ఆమె ఏం చేయ్యబోతున్నదో అర్ధం కాక ధీరజ తెల్లబోయింది.
    'చూడండి మేడమ్ , అయన నాకు ప్రేమతో ఇచ్చిన ముద్దులు ఇవి" అంటూ వక్షోజాలను చూపించింది.
    అమెది ఎర్రటి ఛాయ కావడంతో , వక్షోజాలపై నల్లని మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఏమిటో ధీరజకు అర్ధం కాలేదు.
    'అర్ధం కాలేదా మేడమ్. నాకు ఇచ్చిన ముద్దులంటే నిజంగా ముద్దులు కావు. పంటిగాట్లు, అంటే మామూలు గాట్లు అనుకుంటారేమో, రక్తం వచ్చేలా కోరకనిదే ఆయనకు అనందం కలగదట. ఒకో గాయం మానుతుంటే మరొక కొత్త గాయం చేస్తుంటారు. పేరుకి పాలపుంతలే అయినప్పటికీ అయన పుణ్యమా అని యివి ఎప్పుడూ నెత్తురు ఒడుతూనే వుంటాయి...."
    "మైగాడ్.....అంత రాక్షసంగా ప్రవర్తిస్తాడా?"
    "మీకు చూపించింది చిన్న శాంపిల్ మాత్రమే! ఇవి చూడండి" అంటూ పూర్తిగా బ్లౌజ్ విప్పదీసి చూపించింది సుశీల.
    ఒక్కచోట అని కాకుండా మెడ దగ్గర నుంచి నాభి వరకూ అన్నీ పంటి గాట్లే.....ఇంకా కొన్ని మానని గాయాలు కనిపిస్తూనే వున్నాయి. యెర్రని ఒంటిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి నల్లని మచ్చలు.
    "మేడమ్ .....శృంగారంలో తను డిగ్రీ పుచ్చుకున్నట్టు పడకగదిలో సెక్స్ కబుర్లు చెబుతాడు. అయన చెప్పినట్టల్లా వినకపోతే నరకం చూపెడతాడనే భయంతో ఎలా చెబితే అలా వినడం అలవాటు చేసుకున్నాను. పూర్తీ నగ్నంగా చేయడం మాత్రమే కాకుండా నోటితో చెప్పలేని విధంగా అసహ్యంగా ప్రవర్తిస్తుంటాడు.
    'అయినా కట్టుకున్న భర్త కాబట్టి భరిస్తున్నాను. ఒకోసారి నేను బాధగా మూలగకపొతే "ఏమిటి మౌనంగా వున్నావంటూ" ఎక్కడ దొరికితే అక్కడ కసుక్కున కొరికి రక్తాన్ని చిందిస్తాడు. ఆ బాధను భరించలేక నేను కెవ్వుమని అరిస్తే అది ఆతనికి పైశాచిక ఆనందాన్ని కలుగజేస్తుంది . అతనికి అనందం కలిగించే ప్రతిదానిలో నాకు నరకం కనిపిస్తుంది.
    "నేనూ ఒక మనిషేనని, నా ఒంట్లో రక్త మాంసాలతో పాటు కన్నీళ్లు కూడా వున్నాయని మరచి క్రూరంగా ప్రవర్తించే మృగం నా మొగుడు. కోటి ఆశలతో భర్త అనేవాడు ఎంత వున్నతంగా వుంటాడో, ఆర్తిగా అక్కున చేర్చుకుని ఎంతగా అలరిస్తాడోనని ఎదురుచూసిన నాకు క్షణ క్షణమూ ప్రత్యక్ష నరజాన్ని చవి చూపించే భర్త లభించాడు.
    ధీరజ మనసు ద్రవించిపోయింది.
    లోకంలో ఇలాంటి భర్తలు కూడా వుంటారని తొలిసారిగా అర్ధమయింది ధీరజకు. ఎప్పుడూ వినడమే తప్ప స్వయంగా చూడటం జరగలేదు. ఏదో చిలవలు పలవలు చేసి చెప్పుకుంటారులే అనుకునేది ఇంతవరకూ కానీ తన కంటి ఎదురుగా సజీవ సత్యం గోచరిస్తుంటే నమ్మకుండా ఎలా వుండగలదు?
    భార్య భర్తల మధ్య దాంపత్యం అంటే అన్యోన్యత అనురాగాల మేలు కలయిక వుండాలే తప్ప అపోహలు, మూర్ఖత్వంతో శాడిజం చోటు చేసుకోకూడదు.
    సుశీలలో ఏం తక్కువయిందని అతను అలా ప్రవర్తిస్తున్నాడని అనుకోవాలి....తనను గురించి అన్ని విషయాలు స్పష్టంగా తనకు ఇచ్చిన లేటరులో వ్రాసిందామె!
    అందం వుంది....అందానికి తగ్గ చదువు వున్నది.....చదువుకు తగ్గ అణకువ, సంస్కార లక్షణాలు ఆమెలో పుష్కలంగా వున్నాయి. పుట్టింటి వారి గౌరవానికి కొదవేమీ లేదు. కోరిన విధంగానే కానుకలిచ్చి పెళ్ళి చేశారు.
    అయినా సుశీల కాపురంలో అనందం వెల్లి విరియలేదు.
    అడుగడుగునా కాళరాత్రులే విషాన్ని చిలికించాయి.
    ఎందుకలా జరిగింది? ఎక్కడున్నాదా లోపం?
    పెళ్ళికి ముందే ఇరుపక్షాలూ కూలకుషంగా చర్చించుకునే సంబంధాలు కుదుర్చుకున్నారు. మంచి సంబంధం దొరుకినందుకు పొంగిపోయాడు కూడా. కానీ వాళ్ళ అనందం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.
    ఏడు అడుగులు నడిపించి, మూడు ముళ్ళు వేయించి పుట్టింటి నుంచి అత్తింటికి పంపి తమ బాధ్యతను భుజాల మీద నుంచి దించి వేసుకున్న ఆడపిల్ల కన్నతల్లి తండ్రులకు తాము చేసిన పెళ్ళి ఒక మధురమయిన స్వప్నం లా లేదానీ, రాక్షసత్వం మూర్తీభావించిన కిరాతకుని అరచేతిలో తన కన్నబిడ్డ ప్రాణాలను వదిలి వచ్చానని వూహించే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయరు.

 Previous Page Next Page