Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 9

 

    "ఇవాళ రామాలయంలో అర్చన చేయించాలి మయూరమ్మ! అందుకే పిలిపించాను. బాబు చల్లగా తిరిగి రావాలని దేవుడికి మొక్కుకుని అర్చన చేయించు" అంది. తల ఊపింది మయూర. యతి వుంటే ఇలాంటి వాటికి నవ్వేవాడు.
    "ఇది భలే మంచి బిజినెస్? ఒక రూపాయ టెంకాయ కొట్టి ఎక్కడలేని కోరికలూ కోరుకోవటం. ఆ దేవుడికి వేరే పనిలేదు. మీ కోరికలు వినటమూ, అవి తీర్చతమూ తప్ప" అనేవాడు. మొదటినుంచీ గుడికి వెళ్ళటం పూజలు చేయటం మొదలైనవి అలవాటుగా చేసుకున్నా , యతి వెటకారానికి భయపడి గుడికి వెళ్ళటం మానుకుంది మయూర. కానీ, కొడుకు కోసం దిగులుతో కుమిలిపోతూ , మంచంలో మూలుగుతున్న వృద్దురాలి కోరిక కాదనలేకపోయింది.
    పళ్ళెంలో కొబ్బరికాయ, తాంబూలం, హారతి కర్పూరం, దక్షిణ మొదలనవన్నీ సర్దుకుని బయలుదేరింది. రామాలయం ఆ ఊళ్ళో చాలా ప్రాచీనమైన దేవాలయం. ఊళ్ళో అందరికీ ఆ గుళ్ళో వెలసిన శ్రీరాముడంటే , అంతులేని నమ్మకం. అంచేత అక్కడి సీతారాములకు అర్చనలకూ ధూప దీప నైవేద్యాలకూ లోటు లేదు. మయూర వెళ్ళేసరికి జనం చాలా మందే వున్నారు.
    "అర్చనకు టికెట్ కొన్నారా? సహ్రాస్త నామార్చనా? అస్తోత్తరమా ?" అని అడుగుతున్నాడు అర్చకుడు. అక్కడ కూడా టిక్కెట్ పద్దరి ప్రారంభమయింది కాబోలు. సహస్ర నామర్చనకు టికెట్ కొని అర్చకుడి చేతి కందించింది మయూర. అలాంటి పది సహస్రనామాల టికెట్లు ఒక అర్చకుడూ, పది అష్టోత్తరాల టిక్కెట్లు మరొక అర్చకుడూ వసూలు చేసుకున్నారు. ఇద్దరూ చెరో వైపు నుండి స్తోత్రాలు చదివేస్తూ పూజలు ప్రారంబించేసారు. అంతా గోలగోలాగా వుంది. మయూర భరించలేక కళ్ళు మూసుకుని తన మనసులో భగవానుని దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానించటం ప్రారంభించింది. మనసు యేవో అలౌకిక దివ్య భావనలతో నిండిపోయి ఆ పరిసరాల నుంచి ఎక్కడికో ఎగిరిపోయింది. అంతటి అశాంతిలోనూ ఏదో శాంతి ఆవరించింది. "స్వామీ! నా యతిని నాకు దూరం చేయకు మమ్మల్ని వేరు చెయ్యకు" అని ప్రార్ధించింది. మనసు చల్లబడినట్లయింది. అర్చకుడు "కొబ్బరికాయ" అన్నాడు. తన లోకంలో తానున్న మయూర ఆ మాటలు వినిపించుకోలేదు. అర్చకుడు తనే పల్లెంలోని కొబ్బరికాయ అందుకొని కొట్టి ప్రసాదంగా ఒక చిప్ప కొన్ని పువ్వులు పసుము కుంకం పళ్ళెంలో పెట్టేసాడు. అర్చకుడు గంట మోగిస్తూ హారతి ఇస్తుండగా కళ్ళు తెరిచింది మయూర. రకరకాల కబుర్లు చెప్పుకొంటున్న ఆడవాళ్లనూ, ఎగిరెగిరి గంట కొట్టాలని ప్రయత్నిస్తున్న మొగ  పిల్లలనూ, ప్రసాదం కొబ్బరి చిప్పలు "చవగ్గా' కొనాలని చూసే వ్యాపారులనూ మ దేనినీ గమనించకుండా ఇంటికి వచ్చేసింది. సుబ్బాయమ్మ అర్చకుడిచ్చిన పువ్వులను కళ్ళ కద్దుకుని తలలో పెట్టుకుంది. అలా చెయ్యాలని కూడా మయూరకి తోచలేదు. ఆమె తనకే అర్ధం కానీ ఏదో పారవశ్యంలో వుంది. తన భారాన్నంతా సర్వాతీతమైన ఏదో మహత్తర శక్తి చేతుల్లో పెట్టి తానూ నిశ్చింతగా ఉన్నట్లు ఏ ఆందోళనలూ లేకుండా నిర్మలంగా వుంది.
    ఆ మరునాడు ఉదయమే ఇంటికి బయలుదేరింది . సాంబయ్య కూడా హుషారుగా వున్నట్లున్నాడు. ఏవో పదాలు పాడుతున్నాడు. బండి పల్లె దాటింది. బండి యేవో తోటల మధ్యగా మట్టి రోడ్డున పోతుంది. సాంబయ్య పాడే పల్లెపదాలన్నీ యేవో దివ్య గీతాలుగా తోస్తున్నాయి మయూరకి. ఆమె మనసులో భగవంతుని దివ్యమూర్తి తప్ప మరో ఆలోచన లేదు. అకస్మాత్తుగా సాంబయ్య పదాలు ఆగిపోయాయి. ఈ లోకంలో లేని మయూర ఏం జరుగుతుందో తెలుసుకుని బయటకు చుసేలోగానే, కళ్ళవరకూ నల్లని ముసుగు కప్పుకున్న వ్యక్తీ ఒక చేత్తో మయూర నోరునొక్కి బండి లోంచి క్రిందికి లాగేసాడు. సాంబయ్యను కూడా అలా నల్లని ముసుగు కప్పుకున్న వ్యక్తులే మరోవైపుకి లాక్కుపోతుండగా చూసింది మయూర. నోటిమీద మొరటు చెయ్యి క్షణక్షణానికీ బిగుసుకుపోతోంది. విడిపించుకోవటానికి ప్రయత్నించినా ఏవో "ఊ" "ఆ" అనే ధ్వనులు తప్ప మరే ధ్వనులు పైకి రాలేదు. ఆ కొద్ది పాటి ధ్వనులు వినగలిగే వాళ్ళెవరూ లేరక్కడ. ఆ ముసుగువ్యక్తి అతి చాకచక్యంగా మయూర నోరునొక్కి పెట్టుకుని మరో చేత్తో రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి  అతి దారుణంగా మానభంగం చేసాడు. ఆ షాకులో మయూర స్పృహ లేకుండా ఉన్న మయూరను ఆ దుండగులు అక్కడ వదిలి పారిపోయారు.
    మయూర జాడ తెలియని ఆమె తల్లిదండ్రులు వేదాంతయ్య, రాజ్యలక్ష్మి ఆందోళనతో వెతికి వెతికి పోలీసులకు తెలియజేసి వేడుకున్నారు.
    పోలీసులు గాలించి స్పృహ లేని స్థితిలో మయూరను కనుకోగాలిగారు. వెంటనే మయూరను తల్లి దండ్రులకు అప్పగించలేదు. పోలీసులు డాక్టరుకి అప్పగించారు. డాక్టర్ పరీక్షలో అతి దారుణంగా మాన భంగం జరిగినట్లు వెల్లడయింది. ఎంత అల్లరి కాకూదడను కున్నారో అంత అల్లరి అయింది. మయూరకు వంటిమీద తెలివి లేదు. డాక్టర్ నీడిల్ తో గ్లూకోజ్ ఇస్తున్నాడు. రాజ్యలక్ష్మి ఏడుస్తూ చెంచాతో పళ్ళ రసాలూ, పాలూ, నోట్లో పోస్తోంది. మయూరకు కొద్దిగా తెలివి రాగానే పోలీసులు ప్రశ్నలు ప్రారంభించారు. ఆ ప్రస్తావన తేగానే మయూర ఏదో భయంకర పిశాచాన్ని చూసినట్లు కేకవేసి వణికి పోవటంతో తమ ప్రయత్నాన్ని అప్పటికి వాయిదా వేసుకున్నారు.
    వేదాంతయ్యకు ఆలోచించే శక్తి నశించి పోతోంది. కాని ఇప్పుడ ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలడు? ఏం చేస్తే తన బిడ్డ బ్రతుకు బాగుపడుతుంది? ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆ కిరాతకుడ్ని పోలీసులు ఎలాగో పట్టుకోవచ్చు.   అతడికో ఏదో కఠిన శిక్ష విధించనూ వచ్చు. అంత మాత్రం చేత తన బిడ్డ బ్రతుకు బాగుపడుతుందా? ఏ పాపమూ చెయ్యకపోయినా, ఈ భయంకరమైన ముద్ర నెత్తిన వేసుకుని జీవితాంతమూ ఇలా కుమిలి పోవలసిందేనా?
    "వేదాంతయ్య గారి ఇల్లు ఇదేనా?" అంటూ లోపలకు ప్రవేశించాడు ప్రభాకర్.
    ఆరడుగులు భారీ విగ్రహం. నిగనిగలాడే చమన ఛాయా - ఖద్దరు పంచె - ఖద్దరు లాల్చీ- సౌమ్యమైన ముఖాకృతి. 

 Previous Page Next Page