Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 9

 
     ఇంక... 'లాస్ట్ బట్ నాట్ లీస్ట్' అన్నట్లు - మా 'యస్వీకృష్ణ' గురించి. ఆయన మంచి రచయిత. కథలు, నవలలు, వ్యాసాలు.... ఇలా ఎన్నో! ఇంచుమించు ప్రతి ప్రక్రియలోనూ అతి తరచుగా ఆయన రచనలు వస్తుంటాయి. ఇంత స్వల్ప వ్యవధిలో, ఇన్ని పత్రికలలో అన్ని రచనలు, ఎన్నో అవార్డులు, బహుమతులు సాధించిన 'యశస్వి' మరొకరు కనిపించరు.


     యస్వీకృష్ణతో నాకు పరిచయం కావడం నా సాహితీ జీవితంలో గొప్ప మలుపు.


     ఇంతకుముందు నేను ఎక్కువగా పుస్తకాలు వేయకపోవడానికి కారణం... .వాటికి కావలసిన సంబారాలను సమకూర్చడం, ముఖ్యంగా ప్రూపులు దిద్దడం వంటివి నేనే చూసుకోవాల్సిరావడం! యస్వీకృష్ణ వచ్చినప్పటినుంచి నాకు  ఈ బాధలు  తప్పిపోయాయి. డి. టి. పి. , స్కానింగ్, ప్రింటింగ్,  బైండింగ్ వంటి అన్ని పనులు సర్వమూ తానే  అయి  చూసుకుంటూ నాకు "ఆత్మభవుడు" అయ్యాడు.  నా పని కేవలం నా రచనలను ఆయనకి అందించడం. అతి స్వల్పకాలంలో అందమైన,  నిర్దుష్టమైన పుస్తకాన్ని నాకు అందించడం ఆయన వంతు. ఆయన పని ఎంత గొప్పగా వుంటుందో  చెప్పడానికి  ఈ 'హాస్యకథలు' పుస్తకంతోపాటు ఇంతకుముందు ఆయన ముద్రించిన  నా 'వైకుంఠపాళి' నవల, 'పిల్లల కథలు' పుస్తకం ప్రత్యక్ష సాక్ష్యాలు.


     యస్వీకృష్ణని చూస్తుంటే రామోజీరావుగారు అనే మాట జ్ఞాపకం వస్తుంటుంది -


     "యు కమ్ విత్ స్క్రిప్ట్. యు గో విత్ ఫినిష్ డ్ ఫిల్మ్!" అని  ఆయన చిత్ర నిర్మాతలను తన రామోజీ ఫిలింసిటీకి ఆహ్వానిస్తుంటారు.


    అలాగే యస్వీకృష్ణ కు మేటర్ ఇస్తే చాలు. పుస్తకం చేతికి వస్తుంది. ఆయన సహకారంతో నేను మరిన్ని  పుస్తకాలను త్వరత్వరగా పాఠకులకి అందించగలనని నమ్ముతున్నాను.


     ఆయనకి అన్నివిధాలా చేదోడువాదోడుగా వుంటుంది ఆయన భార్య కృష్ణ జయంతి. ఆమె కూడా మంచి రచయిత్రి.  'మేడ్ ఫర్ ఈచ్ అదర్' వంటి ఈ దంపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.


    ఇక... ఎంత బిజీగా వున్నా కూడా నా పని విషయంలో మాత్రం ప్రత్యేక   శ్రద్ద తీసుకుని అందరిచేతా 'ఔరా....' అనిపించే  అందమైన చిత్రాలను  వేసే ప్రఖ్యాత చిత్రకారుడు, ఈ పుస్తకానికి ముచ్చటైన ముఖచిత్రం వేసిన ఆత్మీయమిత్రుడు.... చంద్రకి  కృతజ్ఞతలు ఎలా చెప్పినా  తక్కువే!


       ఈ పుస్తకంలోని కథలన్నీ వేర్వేరు  పత్రికలలో ప్రచురితమైనవే. ఆయా పత్రికా సంపాదకులకు నా కృతజ్ఞతలు. కథలకు  అదనంగా బొమ్మలు వేసిన ప్రముఖ చిత్రకారుడు  ఇంద్రజిత్ గారికి, అచ్చయిన కథలకు స్వతహాగా బొమ్మలు వేసిన చిత్రకారులందరికీ నా కృతజ్ఞతల.  ఈ పుస్తకం ఇంత అందంగా రావడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగా కారణభూతులైన వారందరికీ  నా ధన్యవాదాలు.


                                                                                        హైదరాబాద్
                                                                                    ది: 15.8.2002    


                                                         కె. ఆర్. కె. మోహన్
    
                                                                   కథా క్రమం

 

                                                              హాస్య కథలు

 

    1. ఓ తాటిచెట్టు కథ
            
    2. ముప్పుతెచ్చిన మూడు ప్రశ్నలు
    
    3. బాలు భీషణ భాషణం

 

    4. ఓ ధృతరాష్ట్రుని కథ

 

    5.  సావిత్రమ్మగారి స్వర్గయాత్ర


    6. స్వ - పరం

 

    7. ఆవిష్కరణ

 

    8. మంత్రిగారి గారడి - మహ గొప్ప పేరడి

 

    9. ఊరగాయ నవ్వింది

 

    10. దశమ గ్రహ గ్రహణం

 

    11. అబద్దాల రజాకీయం

 

    12. పేరయ్య రాజంటా....!

 

    13. వ్రతం అయింది కానీ....

 

    14. విక్టోరియా శేషప్పయ్యర్

 

    15. అమాయకుడు

 

    16. కోటివిద్యలు

 

    17. దయ్యాన్ని పట్టిన మనిషి

 

    18. కంచికి వెళ్ళొచ్చిన కథ


    19. ఎవరు పిచ్చివాళ్ళు?

 

    20. పరమానందయ్యగారి ఆత్మ పరవశించింది

 

    21. వడ్లగింజలో బియ్యంగింజ

 

    22. చట్టాతీతులు

 

    23. గిరీశం మాస్టారు

 

    24. మారిన విలువలు


    25.  మదన విలాస్ లాడ్జి

 

    26. భయం గుప్పిట్లో

 

    27. ప్రమోషన్

 

    28. అసలు సంగతి

 

    29. చిలుక జోస్యం

 

    30. పాపం... సుబ్బారాయుడు!

 

    31. 'ప్రొడ్యూసర్' ని చేసిన ప్రొడ్యూసర్

 

    32. నాకు అందరూ తెలుసు

 

    33. ఆకాశరామన్న

 

    34. అదీ మన ఘనత!

 

    35. ప్రేమాయణం

 

    36. దొంగ దొరికాడు

 

    37. రాత్రి - పగలు

 

    38. ఉపాయం

 

    39. ఎరక్కపోయి ఇరుక్కున్నవాడు

 

    40.  ఏమి అభివృద్ది!

 

    41. మహిమ

 

    42. ఆయాసం - అనుభవం

 

    43. పుట్టిన రోజు

 

    44. తప్పెవరిది?

 

    45. పెళ్లిచూపులు

 

    46. యోగదర్శనం

 

    47. అపద్దర్మం

 

    48. రోగం కుదిరింది

 

    49. బూమరాంగ్

 

    50. కుల నిర్మూలన సంఘం

 

    51. కరెక్షన్

 

    52. డైరెక్టర్

 

    53. కొంటె కోణంగి

 

    54. ఉభయతారకం

 

    55.తనదాకా వస్తేనే...

.

    56. స్వయంకృతం

 

    57. అనుకోని అదృష్టం

 

    58. సంగీత విద్వాంసుడు

 

    59. నిలకడ నేర్చిన నీల

 

    60.  అలవాటు దోషం

 

    61. ధర్మ సంకటం

 

    62.  విదేశీ సహాయం

 

    63.  నీడకు ఎదురు తిరిగితే....!

 

    64.  సమయస్పూర్తి

 

    65.  రియాక్షన్

 

    66. రజ్జు - సర్పం

 

    67. విలియా

 

    68.అశోకహతుడు

 

    69. దొంగసొమ్ము - దొంగలపాలు

 

    70.  మొదటి క్లయింట్

 

    71. ఉపకారానికి పోతే....


    72.  తాను తవ్వుకున్న గోతిలో....

 

    73. పరస్పర  సహకారం

 

    74. నేరం చేసింది తాత - శిక్షించింది మనవణ్ణి!

 

    75.  అందితే జుట్టు

 

    76. ఎక్చేంజ్

 

    77.  దొంగ

 

    78.  చేసుకున్నందుకు. ...

 

    79. తెలుగువారి విందు - బహు పసందు


    
        నేను రాసిన ఎన్నో జోక్స్ వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇది హాస్య కథల పుస్తకం కనుక వాటిలో ఎంపిక చేసిన కొన్నింటిని అవకాశమున్నచోట ప్రచురించటం జరిగింది.


                                                                                    కె. ఆర్. కె. మోహన్.
    

 Previous Page Next Page