సోఫ్ స్టి కేటెడ్ ఫ్యామిలీలలోని విశృంఖలత్నిగురించి చాలా సహజంగా రాశాడు.
" ఈ కుర్రాడెవరో బాగా రాశాడు అనుకున్నారు. నిజాయితీ గల సాహిత్యవేత్తలు. కాని వాళ్ళెవరూ అతన్ని అభినందించలేదు. ఆ కథ చదివి బావుందని తృప్తిపడి వూరుకున్న్నారు.
సహజంగా , వాస్తవికంగా రాసేవాళ్ళ మనుగడ క్రమక్రమంగా తగ్గిపోవటానికి కారణమిదే. తమ్మర్షియల్ రచయితల పాఠకులసు తమ రియాక్షన్స్ తెలియచేసినట్లుగా వీళ్లు తెలియచెయ్యరు. చదివి మెదలకుండా వూరుకుంటారు. ఒక్క ప్రశంసావాక్యం కూడా మనస్ఫూర్తిగా చెప్పరు. చివరకా రచయిత విసిగి తన ధోరణి మార్చుకొంటే " యింకేముంది? సాహిత్యమంతా తగలబడిపోతోంది" అన్నట్లు అప్పుడు మాత్రం విరుచుకుపడతారు.
సూర్య చంద్ర కొంతవరకూ ఆశాభంగం చెందాడు. సినిమా స్టార్స్, క్రికెటీర్లంత కాకపోయినా రచయితలకు కూడా ఫ్యాన్స్ వుంటారని విని వున్నాడు కమ్మర్షయల్ రచయితలంటే పాఠకుల్లో చాలా క్రేజ్ వుంటుందని విన్నాడు.
అతనికెవరూ ఉత్తరాలు రాయలేదు.
ఫ్యాన్స్ లెటర్స్ రావటంకోసం అతను రచనలు చేస్తున్నాడని ఉద్దేశంకాదు. కాని తన రచన ఎలా వుందో తెలుసు కోవాలని ఓ రచయిత ఆశించిచటంలో తప్పులేదు.
ఒక రోజతనికి ఎక్కడ్నుంచో ఫోన్ వచ్చింది. ఆ సమయానికతను యింట్లో ఒక్కడే వున్నాడు. తనే రిసీవ్ చేసుకొన్నాడు.
అవతల్నుంచి ఎవరో అమ్మాయి. చాలా తియ్యటి గొంతు.
"మంజరిగారు కావాలి" అన్నదా అమ్మాయి. చాలా తియ్యటి గొంతు.
అతనికేం చెప్పాలో తెలీలేదు. ఒక్కక్షణం మౌనంగా వుండి " నేనే మాట్లాడుతున్నాను" అన్నాడు తడబడే కంఠంతో.
ఆశ్చర్యంతో మ్రాన్పిడినట్లు నాలుగయిదు సెకన్లు నిశ్శబ్దం.
తర్వాత " అదేమిటి? మిరు మొగవాళ్ళలా ఉన్నారే"
" అవును. నేను మొగవాడ్నే."
అవతల్నుంచి నవ్వు. " తెలుస్తూనే వుందిలెండి . నా ఉద్దేశం అదికాదు. మంజరి అంటే రచయిత్రి అనుకున్నాను."
"సారీ! మిమ్మల్ని డిజపాయింట్ చేసినట్లున్నాను."
"సారీ!మిమ్మల్ని డిజాపాయింట్ చేసినట్లున్నాను"
..సారీ ఏముందిలెండి. ఇదవరలో రచయితలు ఆడపేర్లతో రాసేవారని విన్నాను- అప్పుడు వాళ్ళకు డిమాండ్ వుండేది కాబట్టి. ఇప్పుడు మొగ రచయితనే డామినేట్ చేసి పారేస్తున్నారు. రచయిత్రుల పేర్లు చెబుతూనే పాఠకూలూ, పబ్లిషర్లూ ఆమడదూరం పారిపోతున్నారు. మరి మి రెందుకు ఆడపేరు పెట్టుకున్నారోగాని."
" విదికీ ఎదురీదుదామని."
" చాలా కష్టం నెగ్గుకురావటం,ఇప్పుడందరికీ ఫైటింగ్స్, రొమాన్స్ , సెక్స్, సస్పన్స్ క్రైమ్ యివే కావాలి యింత వాస్తవికంగా, అమాయకంగా రాస్తే ఎవరికి నచ్చుతుంది?"
" నా రచన మికు నచ్చలేదా ?"
" నా సంగతి వొదిలెయ్యండి."
" అలాకాదు. చెప్పండిప్లీజ్" అన్నాడు ఆతృతగా.
" నాకు నచ్చిందిలెండి... ?"
అతనికి చాలా సంతోషం కలిగింది. "నిజంగానా?"
" నిజమే. లేకపోతే యింత కష్టపడి మి నంబరుకనుక్కొని ఎందుకు ఫోన్ చేస్తాను?"
" నా నంబరెలా కనుక్కొన్నారు.?"
" అదంతా పెద్దరహస్యం."
" పోనీ చెప్పవద్దులెండి. నా కథ మికు నచ్చినందుకు థాంక్స్."
" మిరు సోఫిస్టికేటెడ్ సొసైటీ గురించి, ఎరిస్టోక్రస్ లోని బ్యూరో క్రస్ గురించి బాగా రాశారు. నాకూ ఆ హారిబుల్ రిచ్ నెస్, అందులోని ఆర్టిఫిషియరిటీ, షాల్స్ ప్రెస్టేజెస్, అవినీతి అంటే చప్పలేని ఆసహ్యం."
"మిరు...."
" నేనెవరో మికు చెప్పను."
" ఎందుకని?"
" చెప్పకూడదు కాబట్టి అని అనను. నా కిష్టంలేదు. కాబట్టి- అంటే సరిపోతుందేమో?"
" మి యిష్టం"
" నేను మాత్రం మి అభిమానిని. గుర్తుచుంకోండి. అంతేకాదు. ఈ వెర్రి మొర్రి సాహిత్య ప్రక్రియ.లూ, యిమిటేషన్ రచనలూ, నిజాతీయ దోరణులూ, లోపల జీవం తక్కువగా వున్నా పబ్లిసిటీ స్టింట్స్ తో తమని తాము ఎలివేట్ చేసుకొని రాసే రచయితలూ-యీ పద్ధతులంటే నా కసహ్యం."
ఆమెగొంతులో ఆవేదన తెలుస్తోంది.
అతను నిశ్శబ్దంగా వుండిపోయాడు.
" ఉంటాను" ఆమె రిసీవర్ పెట్టేసింది.
* * * *
ఆ రాత్రి పన్నెండు దాటినా అతనికి నిద్ర పట్టేలేదు.
ఒళ్ళో ఫైలు పెట్టుకుని ఏకదీక్షగా రాస్తున్నాడు.
సమాజంలో అరిస్డోక్రసీలోనే వికృతత్వం వుంది, ఇంకో తరగతుల్లో లేదు అనేది అతని ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు.
ఒక వ్యక్తి చదువుకొన్న వాడయినా, కాకపోయినా, ఏ తరగతికి చెందినవాడయినా- అతన్లో అవినీతి, స్వార్థం గూడూకట్టుకొని రాజ్యమేలుతోంది. సాడిజం, హింసాప్రవృత్తి, గూండాయిజం, కష్టపడి పని చెయ్యకుండా జీవితాన్ని గురించి అతిగా ఆశించటం, సోమరితనం, కేరక్టర్ మిద గౌరవం లేకపోవటం, అసలు తోటిమనిషి అంటే ప్రేమగానీ, గౌరవంగానీ లేకపోవటం...యీ లక్షణాలతో సమాజం కుళ్ళిపోతోంది.
అతన్లో , అతని ఆలోచనా దృక్పధంలో యింకా పరిపూర్ణత రాలేదు. కాన విఫరీతమైన నిజాయితీ, చిత్తశుద్ధి వుంది.
అవే బలంగా. వూపిరిగా అతని కలాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.