బయట కారాగిన చప్పుడయింది.అతను పట్టించుకోలేదు.
ఓ గంటపోయాక అలిసిపోయినట్లూ, ఫెటీగ్ వచ్చినట్లూ అనిపించింది. ఫైల్ ప్రక్కన పెట్టేసి లేచినిలబడ్డాడు.
అప్పుడు గుర్తొచ్చింది. తల్లీ, తండ్రీ యింకా యింటికి రాలేదని, ఇందాక కారాగినచప్పుడింది. ఇద్దర్లో ఎవపరో ఒకరు వచ్చి వుండవచ్చు.
గదిలోంచి బయటకు నడిచి హాల్లోకి వచ్చాడు.
తల్లి గదిలో లైటు వెసుగుతోంది.ఆమె యీమధ్య ఇంటికి చాలా ఆలశ్యంగా వస్తోంది. తండ్రి,ఆమె కలిసి వుడంటం,భార్యాభర్తల్లా సంచరిస్తూ వుడంటం- ఎప్పుడూ చూడలేదు. ఎవరిదార్న వాళ్లు జీవిస్తోన్నట్లుగా అనిపిస్తోంది.
తల్లిని పలకరించాలనిపించింది ఆమె గదిముందు నిలబడి క్షణంపాటు సంకోచించి, మెల్లగా తులపు తోశాడు.
డోర్ తెరుచుకుంది. గదిలో రమాదేవి వొంటరిగా లేదు.
సోఫాలో ఆమె ప్రక్కనే ఎవరో వ్యక్తి కూర్చుని వున్నాడు. ఇంచుమించు ఆనుకుని వున్నాడు.
అందులో అన్యభావనంగానీ, అసభ్యతకానీ ఏమి లేదు. ఇద్దరూ ఏదోసీరియస్ సబ్జక్టు గురించి చర్చించుకుంటున్నారు.
" రాచంద్రా" అన్నది కొడుకుని చూసి. " ఇతను..." అంటూ ఆ వ్యక్తిని పరిచయం చేసింది.
సూర్యచంద్ర వినిపించుకోలేదు. " నువ్వొచ్చావో లేదో అని...." అంటూ బయటకు వచ్చేశాడు.
తల్లి అలా వేళగాని వేళ పరాయి పురుషుడితో.....
ఏమిటంత రాచకార్యం?
మనసంతా వ్యాకులపాటుతో ,ఆందోళనతో నిండిపోయింది.
తన గదిలోకి వెళ్ళి లైటుతీసిప్రక్క మిదకు చేరి పడుకున్నాడు.
చాలా అసహనంగా వుండి, గుండె బరువెక్కిపోతోంది.
ఎప్పటికోగాని నిద్ర పట్టలేదు.
7
శకుంతలకి ఒక్కొక్క రోజూ ఒక్కో యుగంలా గడుస్తోంది.
ఒంటిమిద వున్న కాస్తబంగారం హరించుకుపోయింది.
పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి. చేతిలో చిల్లిగవ్వలేదు.
పిల్లలు వ్యాపకం లేకపోయేసరికి బడితెల్లా తయారవుతున్నారు. తల్లిని ఎంత పీడించినా డబ్బులు రాలేకపోయేసరికి పిల్లవాడు యింట్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు. అది పట్టుకొని సినిమాలు కెళ్ళటం, చిరుతిళ్లు తినుక్కుతినటం మొదలుపెట్టాడు. నరహరి జేబులో డబ్బులు మాయమవుతూ వుండటం మొదట్లో కనిపెట్టలేదు.తర్వాత తర్వాత గమనించి ఎవరు తీస్తున్నారా అని ఆలోచించటం మొదలుపెట్టాడు.అతని భార్యకి తెలీకుండా అతని జేబులోంచి డబ్బులు కాజేసి,తాను విడిగా దాచుకొంటూ వుండేది.అవి కొంతవరకూ ప్రోగాయక వాటిని యిరుగు పొరుగువాళ్ళకి చిన్న చిన్న మొత్తాలు పెద్ద పెద్ద వడ్డీలకు త్రిప్పేది.
సమాజంలోని ఆర్థికస్థితి. ఎంత భయంకరంగా వున్నదంటే అప్పు చెయ్యకుండా సామాన్య మానవుని మనుగడ అసాధ్యమైపోయింది . ఎంత సంపాదించినా, చెప్పుకోటానికి కనబడుతుందిగానీ, అనవసరాలకు సరిపోదు. అందుకని చిన్న చిన్న మొత్తాలు, పెద్దపెద్ద వడ్డీలకు-నూటికి పదిరూపాయల వడ్డీకికూడా తెచ్చుకుంటూ వుంటారు. సాధారణంగా అలా వడ్డీలకిచ్చేవాళ్లు యిళ్ళల్లో ఆడవాళ్లు,ఆఫీసుల్లో కొంచెం జబర్దస్తీగా వుండే గుమాస్తాలు. లేకపోతే అనేక చిన్న చిన్న వృత్తి లకిచ్చేవాళ్లు యిళ్ళల్లో ఆడవాళ్లు,ఆఫీసుల్లో కొంచెం జబర్దస్తీగావుండే గుమాస్తాలు. లేకపోతే అనేక చిన్న చిన్న వృత్తి వ్యాపారాల్లో వుండే- రౌడీలు- వాళ్లు యిచ్చిన డబ్బువసూలు చేసుకోవటంలో దయాదాక్షిణ్యం వుండదు. జీతాలిచ్చేరోజున ఆఫీసుల దగ్గర నిలబడి, అరిచీ, కేకలుపెట్టి, దౌర్జన్యంచేసి, చొక్కాలు పట్టుకు చింపీ, యాభయి రూపాయలు వసూలు చెయ్యటంకోసం నానా భీభత్సకరమైన దృశ్యలూ సృష్టిస్తారు. ఆ సమాయాల్లో వాళ్ళని చూస్తోంటే ప్రపంచంలో డబ్బు అనేది ఎంత విలయతాండవం చేస్తోందో భోధపడుతుంది.
నరహరి వారం పదిరోజులు కాపువేసి చివరకు దొంగను పట్టుకున్నాడు.
ఓ రోజు తెల్లవారుఝూమునే రఘు అతని జేబులో చెయ్యిపెట్టి తడుముతూ దొరికిపోయాడు.
" ఓర్ని! వేలెడు .ఇప్పట్నుంచీ నీకివేం బుద్ధులురా" అంటూ జుట్టు పట్టుకున్నాడు.
రముగాడు తప్పించుకొని పారిపోయే ప్రయత్నంచేసి చేతగాక- గింజుకుంటున్నాడు.
" ముప్పొద్దులా కంచడుకంచడు తింటున్నారు.అది చాలక యీ దొంగతనలా" అంటూ ఇష్టమొచ్చినట్లు చితకబాదేశాడు. పిల్లవాడు శోషవచ్చి పడిపోయేదాకా బాదిపారేశాడు.
శకుంతల జరిగేదంతా చూస్తూనే వుంది. అయినా అడ్డు పడలేదు. కన్నకడుపు తరుక్కుపోతూన్నా కొడుకుమిద వేసిన అసహ్యంవల్ల సహించి వూరుకొన్నది. ఆ రాత్రంతా ఆమె ఏ మి చెయ్యాలో తెలీని నిస్సహాయస్థితిలో వెక్కి వెక్కి ఏడుస్తూనే వుంది.
దానికితోడు తోడికోడలు సాధింపులు నిప్పుల వర్షం కురిసినట్లుగా శరీరాన్నీ, మనసునీ కాల్చి వేస్తూన్నాయి.
* * * *
ఇది జరిగిన కొన్నాళ్ళకు ప్రమిల తల్లికి సీరియస్ గా వుందని వైర్ వస్తే ఆమె అర్జంటుంగా బయల్దేరి వెళ్ళాల్సి వచ్చింది.
వయసులో వున్న తోడికోడల్ని యింట్లో వుంచి వెడుతున్నానే అని ఒక వంక మనసు పీకుతునే వుంది. తన మొగుడు యింతకుముందెప్పుడూ ఎలాంటి కోతి పనీ చేసినా దాఖలాలేమి లేవుగాని-వయసులో వున్న ఆడది వొంటరిగా దొరికితే- అమ్మా! మొగముండా కొడుకుల్ని నమ్మటానికి వీల్లేదు.
తన అనుమాలన్నీ లోపలనే త్రోసిపుచ్చి పైకి మాత్రం బింకంగా ' ఏమ్మో! నే ఊరెడుతున్నాగానీ, ఊరమ్మ పెత్తనాలు చెలాయించక ఇల్లు జాగ్రత్తగా చూసుకో. నా మొగుడు కూరల్లో. పచ్చళ్ళల్లో కారాలెక్కువ తింటాడు. మిరు తిన్నట్లు చప్పిడిచేస్తే ఆయనకు సహించదు. ఆయన బిందెలో నీళ్లుముంచి ఎప్పుడూ తీసుకొని ఎరగడు. ఆయనకేం కావాలో కాస్తకనిపెట్టి చూస్తూవుండు. అని ఆమె తో చెప్పవలసినవన్నీ చెప్పి నరహరినిచాటుకు పిలిచి " యిదిగో నేను వచ్చాక అలాంటిదేమన్నా జరిగినట్లు తెలిసిందా? మిమ్మిల్ని పొడిచి తర్వాత నేను వురేసుకు ఛస్తాను అని బెదిరించి, హడలి కొట్టి వెళ్ళింది.
కష్టాలలోవున్న స్త్ర్రీకి మొగడికన్న ఆడదే అసలు శత్రువు. మొగాడు కామంతో , వ్యామోహంతో , స్వార్థంతో వీరవిహారం చేస్తూ వుంటాడు.ఆడది అసూయతో , ద్వేషంతో భగ్గుమంటూ వుంటుంది.
శకుంతల కూడా చాలావరకూ ముభావంగా వుంటూ, అతని కాఫీ, టీఫిన్, భోజన సొకర్యాలు ఆ వేళల ప్రకారం చేసి పెడుతోంది.