Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 7

    నిర్మలకు ఏం చెప్పాలో తెలియలేదు.
    ఈలోగా చంచాల్రావు విదితలుపువేసి వచ్చాడు.
    అప్పుడు నిర్మల బాగాభయపడింది ఆమె శరీరంతో సన్నని  వణుకుప్రారంభమయింది.
    చంచల్రావామెను సమీపించి చేయిపట్టుకున్నాడు.
    "వదులు-" అన్నదామె.
    "ఈస్పర్శ ఎంత బాగుంది?" అన్నాడు చంచల్రావు మనసులో అతడికి ఆనందంగావుంది నిర్మల వదలమనిఅందికానీ చేయివదిలించుకోలేదు.
    "వదులు-" అంది నిర్మల మళ్ళి.
    "వదులు...." అంటూ చంచల్రావామెను దగ్గరగాలాక్కున్నాడు.
    "ఏమిటిది?" అంది నిర్మల భయంగా.
    "మనం ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి...."
    నిర్మల అతన్ని దూరంగా తోసి "వెళ్ళు! అంది.
    నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్ళిచేసుకుంటాను" అన్నాడు చంచల్రావు.
    "అవేమి నాకు తెలియవు....వెళ్ళు...." అంది నిర్మల.
    "నాకు  స్వంతకారుంది. పెళ్ళికాగానే మనం స్వంతకార్లోతిరుగుదాం-" అన్నాడు చంచల్రావు.
    "అలాగే- ఇప్పుడు వెళ్ళిపో" అంది నిర్మల.
    "భయంగా వుందా? అంటూ చంచల్రావామెను సమీపించడు.
    "నువ్వు దూరంగావుండు దగ్గరగావస్తేనే భయమేస్తోంది."
    "మనం ఒకరికొకరు దగ్గరకానిదే- ఒకరినొకరు ఎలా అర్ధంచేసుకోగలం?" అన్నాడు చంచల్రావు.
    "అర్ధం చేసుకోకపోయినా ఫరవాలేదు" అంటూ నిర్మల అతడికి దూరంగా వెళ్ళింది.
    "నాపొజిషన్  నీకుతెలియడంలేదు. నాతో పెళ్ళిజరిగితే నీ జీవితం మరిపోతుంది. నేను లక్షాధికారిణి. నీకు ఏడువారాల నగలు చేయిస్తాను ఖరిదైన సిరలు కోటాను, అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తాను"
    "అలాగే చేద్దువుగాని ప్రస్తుతానికి దూరంగావుండు...." అందినిర్మల.
    "నన్ను పెళ్ళిచేసుకోవడం నీకిష్టమేనా?"
    "అంతా అమ్మానాన్నల యిష్టం!" అంది నిర్మల.
    చంచల్రావామెకు తన గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఆమెలోంగడంలేదు.
    కాసేపటికి గోడ గడియారం నాలుగు గంటలు కొట్టింది.
    "ప్లీజ్ -నువ్వెళ్ళిపో-నాకు చాలా పనులున్నాయి..." అంది నిర్మల
    "నీ పనులకు నేనడ్డురాను...."
    "నువ్వుంటే నాపనులకడ్డు...."
    "నేను వెళ్ళాను...."అన్నాడు చంచల్రావు.
    "అయితే అరిచి నలుగుర్నిపిలిచి  చెబుతాను...."అన్నాడు చంచల్రావు.
    నిర్మల మనసులో భయపడింది. ప్తెకి మాత్రం- "పోనీ- అలాగే చెప్పు నాకుచెడ్డపెరోచ్చినా బాధలేదు నువ్వు దూరంగావుంటేచాలు...."అంది.
    వ్యవహారం బెడిసికొడుతోందని చంచల్రావుకి అర్ధంమైంది. ఆమెతనను ద్వేషించాకూడదు అందుకని నెమ్మదిగా - "నువ్వు నన్ను తప్పగా  అర్ధంచేసుకున్నావు. నీ అనుమానం పోగొట్టడానికి  ముందు తలుపులు తిసివస్తానుండు-" అన్నాడు అతడు తలుపులుతీసేసరికి పక్కింటివాళ్ళబ్బాయి గోపి లోపలకు వచ్చాడు. వాడికి ఎనిమిదేళ్ళు.
    "ఎవర్నువ్వు?" అన్నాడు చంచల్రావు.
    "నువ్వెవరు?" అన్నాడు గోపి.
    "గోపి-యిలారా!" అంది నిర్మల వాడు పరుగున ఆమెను సమీపించగానే- "అప్పడే స్కూలు వదిలేశారా?" అంది.
    "ఊ"అని- అక్క-ఈ బట్టల్లో ఎంత బాగున్నావో -ఎప్పడూ వేసుకోలేదేం?" అన్నాడు గోపి.
    నిర్మల కంగారుగా- నన్నీబట్టల్లో చూసినట్లు మా అమ్మకు చెప్పకేం? వాళ్ళు సినిమాకు వెళ్ళారు ....."అంది .
    "అర్ధమయిందిలే - ఇవి వల్లి అక్క బట్టలా?" అన్నాడు గోపి.
    "ఇష్!" అంది నిర్మల చంచల్రావు వింటాడన్నట్లు.
    "ఆయనేవరక్కా?" అన్నాడు గోపి.
    "మా నాన్నగారికోసం వచ్చారు...." అని నువ్వయనతో కబుర్లు చేబుతూవుండు నేను పనులు చేసుకోవాలి" అంది నిర్మల.
    "అయ్యో !నీతో కబుర్లు చెబుదామని వచ్చాను...."అన్నాడు.
    "నాతోనా-ఎందుకు?"
    "స్కూల్నించి రాగానే అమ్మ చెప్పింది పాపం- నిర్మలక్క ఒక్కతే ఇంటిలోవుంది. ఏమైనా కబుర్లు చెప్పిరావెళ్ళి....అని అమ్మ అనగానే తొందరగా టిఫిన్ తిని  ఇలావచ్చాను...." అన్నాడు గోపి.
    అంటే గోపి తల్లి చంచల్రావు తనింటికి రావడం చూసి ఉంటుందని నిర్మల ఊహించింది ఆమె ఏమనుకుందో?
    గోపి తల్లి చాముండి. ఆమెవయసు ఇరవైఆరు. గోపి తర్వత నాలుగేళ్ళ వేణి  ఆమెకూతురు భర్తకు  బ్యాంకులో ఉద్యోగం ఆమెకు నిర్మలంటే ఎంతో యిష్టం. మాణిక్యాంబకు వంటకాలు చేసి గోపిద్వారా పపుతూంటుంది. గోపికూడా నిర్మలకూ చాముండికి మధ్యవారధిలా పనిచేయడమేకాక ఇద్దరి రహస్యాన్ని దస్తున్నాడుకూడా.
    నిర్మల చాలా గుట్టుమనిషి అయితే చాముండికామే తనగోడు కొంత వరకూ చెప్పుకుంది వాళ్ళిద్దరూ  ఎక్కువగా కలిసిమాట్లాడుకునే అవకాశం వరకూ చెప్పుకుంది. వాల్లిదారూ  ఎక్కువగా కలిసిమాట్లాడుకునే అవకాశం లేదు. తనులేనప్పుడేరైనా వచ్చి నిర్మలతో మాట్లాడివెళ్ళినట్లు తేలిస్తే మాణిక్యాంబ చాలా రభసచేస్తుంది. గోపి చిన్నకుర్రాడు కాబట్టి ఫరవాలేదు.
    చంచల్రావు వెంటనే వెళ్ళిపోలేదు అతడు గోపితోకూర్చుని నిర్మల గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టాడు.
    ఈలోగా నిర్మల బట్టలు మార్చుకుంది ఇంటిపనులు ప్రారంభించింది.
    గోపి చంచల్రావుకు నిర్మలపడే కష్టాలుచెప్పడం మొదలుపెట్టాడు. అవి వింటూంటే చంచల్రావు మనసు కరగలేదు. అన్నికష్టాల్లో ఉన్న మనిషిని తానాశాపెట్టి లోంగాదిసుకోవడం సులభమని  సంతోషించాడు.
    "అక్కకు మంచిబట్టలు లేవు. అన్ని వల్లీకే ఉంటాయి. వల్లిబట్టలేప్పడైనా రహస్యంగా వేసుకుని సంతోషిస్తూంతుందక్క!" అన్నాడు గోపి.

 Previous Page Next Page